పాత గడుల లింకులు:జనవరి '09, ఫిబ్రవరి'09, మార్చి '09, ఏప్రిల్ '09,మే'09, జూన్ '09,జూలై '09, ఆగస్టు '09, సెప్టెంబరు'09, అక్టోబరు '09
Tab ను నొక్కడం ద్వారా పక్కగడికి వెళ్ళవచ్చు. బాణాల కీల ద్వారా కూడా గళ్ళ మధ్య ప్రయాణించవచ్చు. మీ మౌసును అంకె ఉన్న గడిలోకి తీసుకు వెళ్ళగానే సదరు గడికి సంబంధించిన ఆధారం ప్రత్యక్షమయ్యే ఏర్పాటు కూడా ఉంది.
  

X
XXXX
XXXX
XXXX
XXX
XX
XXX
XXX
XXXXX
XX
XXXX
XXXఆధారాలు (గడి)
అడ్డం నిలువు
1దినములు కాసను మౌనసజ్జనులు మొదట నసపెడతారా? (7)
5గుర్రం గురగుర ఆవలింతలా నిశ్శబ్దం గా ఉండదు(4)
8కత్తులు చాలా పదును పెట్టాలంటే వద్దనలేదుగా (2)
9హనుమంతుడికి, ఒక మధుర పదార్థానికీ, కుంకానికీ లంకె(3)
11ఆంగ్ల పిత (2)
12యుధ్ధానికీ, శృంగారానికీ సంధానం (3)
14గురుచంద్రుల జన్మతిథి ఈరోజే (3)
15ఈగాడిద వెనక్కాళ్ళతో తంతే కళ్ళముందు మెరుపేగా(2)
17కృష్ణుడు చంపిన చంద్రగుప్తుడి తల్లి (2)
19తొమ్మిది ప్రాకారాల ఆవలనున్న దేవి నివాసం . చుట్టూ నీళ్ళేనా అవి (4)
22భాషలు మారిన భోజనాల పండుగ (5)
26దుప్పటి పరవమంటే అస్తవ్యస్తంగా చేసె (3)
27ఇంగ్లీషు వాడి ఇంకు పీల్చే కాగితం (4)
28కలిగింది హర్షమే కానీ అంత తబ్బిబ్బవాలా (4)
31ఇది లేకుండా కూరలూ, సరుకులూ ఇంటికెలా వస్తాయి (2)
32అక్కలుండని కోటలో అక్కలకీ, అన్నలకీ దిక్కయ్యే సామర్థ్యం ఉన్న ఈ పెద్దాయనుంటాడు (5)
33అడ్డంగా నిలువు గీత ఉందే (2)
34మర తిరగ్గా తిరగ్గా రామమయమైనట్లు ఇది తిరగ్గా తిరగ్గా గలగలలే గలగలలు (2)
36కన్నడావాళ్ళు అతిథులకిచ్చేదిదేనా(3)
37కారం చేడు వాళ్ళే కాదు చాలామంది తెలుగువాళ్ళు అజీర్తికి మందులా మొదటన్నంలో తినేది (4)
39మత ప్రమేయం ఉన్నా సమానత్వానికి తక్కువ కాదు (3)
41మునుపొచ్చిన కుళ్ళే మళ్ళీ వస్తే ఓనిద్ర లాగించొచ్చా (2)
42మామిడి తోరణాలు కడితే మీకూ అందమే (3)
43ఏదైనా పోతే ఇవొదిలేసిట్లే (3)
45పూలబాల చేసినా ప్రియమణి చేసినా హారం హారమే (4)
48జముకుల కథనుకుని వెళ్తే తమ కులపోళ్ళ కథ వినిపించారు దాసుగారు (4)
5011 అడ్డం లాగే … కానీ తెలుగాయన (2)
51సాయంత్రాలే కాదు 24 గంటలూ కార్మికుల చేతిలో నలగ్గలవి (3)
52రాధాగోపాలీయుడు ఈమధ్యన స్వాతితో ఆడుకున్నది .. బ్రహ్మచారీ శతమర్కటః ..సంసారీ ఏకమర్కటా అఅని నిరూపించాడు (5)
1రసపట్టులో తర్కం కూడదని ఉందికానీ రచయితల సంఘం ఉండకూడదని లేదే (4)
2ఈచెరువులో దిగితే కారం పెడుతుందా? (3)
3రోజుని తలపింపచేసే సంగీత దర్శకుడు (2)
4కంటిచూపుతో చంపగల హీరోలు లుక్కేసి కేన్సరు తెప్పించలేరా మియాజాన్ (4)
5ప్రియుడు సంగీతమైతే ఈనాలుగింటి తర్వాత ప్రియురాలు నాట్యం చేస్తే వచ్చేవి గాజుల గలగలలే కదా (4)
6ఎన్నిరాశుల పుణ్య ఫలమో ఈ గుడ్మేన్ ఒక అమ్మాయి (2)
7ఇత్తడి, తడిక, పుత్తడి, అతడిలోని చివరి పార్శ్వాన్ని తడిమాయి (2)
13యంత్రంతో నడిచే బోటు లో విహరించే తెలుంగ్లీష్ ప్రక్రియ (4)
16కొండ భూమికి భారమా అని పాడడానికి ముందు బాగానే ఉంది కానీ చివరికి భారమేననిపిస్తోంది ఈమార్పులు చూస్తే (3)
18గంధకం అనడం చేతకాక గనదగం అనడం ఫేషన్ అయిపోయింది. ఇంగ్లీషులో కూడా దీన్నలాగే పలుకుతారా (3)
2019 అడ్డంలో తిరగడాన్ని ఇలాగే అంటారు మరి (5)
21మగ ఆడ కట్టు బట్ట పక్క పక్క (4)
23బికారి కాదు సత్యసాయి ... నాదారి ఎడారీ కాదు (3)
24ఇది మిథ్య, అది మిథ్య .. పైది, కిందదీ కూడా. వెరసి తాఅం మిథ్య (4)
25మొదలంతా ఊరుకుని మళ్ళీ పెళ్ళా అని పెళ్ళి ముహూర్తానికి చివరొచ్చి తడబడతావేం (5)
27తెలుగింటి కూడలి (7)
29కోపం వచ్చి ఇది రెండు సార్లాడితే పంది అరుపులా వినిపిస్తుందిట (2)
30సగం ధనం (3)
32ముత్యాలు కురిసే వాన చినుకులు (6)
35గమన సంగీతం వినడంలో తమకం కలిగించే వణుకు(3)
3810 చిన్నమెత్తు బంగారం ఇవ్వడానికి అలా కాకి గోల చేస్తావేంటి రమణి (3)
40కాల్గేట్ వాడినా కూడా నమిలే పళ్ళ వెనుక దాక్కుని ఉంటుందా ఇది .... (4)
41కదలకుండా నడవవో అంటే కులుకులాడి ఊరుకుంటుందా.. అయినా చెప్పి చూద్దాం (4)
44ఇంగ్లీషు దొరసాని ప్రేమలో పడితే జీవితం తలకిందుల్చేసేస్తుంది (2)
46ముని మాపు వేళిచ్చి పగలిమ్మంటే మీరేం చేస్తారు మాపిచ్చిగానీ (3)
47తెన్నేటి బంగారు తీగె చిన్నగా ఇలా కిందికి పాకింది (2)
49ఈరోజు ఏంటి .. విదియా, తదియా అని అడిగితే ఈరోజుదా అని అలా తలకిందులై తెల్లబోతావేంటి? (2)