పాత గడుల లింకులు:జనవరి '09, ఫిబ్రవరి'09, మార్చి '09, ఏప్రిల్ '09,మే'09, జూన్ '09,జూలై '09, ఆగస్టు '09, సెప్టెంబరు'09, అక్టోబరు '09
Tab ను నొక్కడం ద్వారా పక్కగడికి వెళ్ళవచ్చు. బాణాల కీల ద్వారా కూడా గళ్ళ మధ్య ప్రయాణించవచ్చు. మీ మౌసును అంకె ఉన్న గడిలోకి తీసుకు వెళ్ళగానే సదరు గడికి సంబంధించిన ఆధారం ప్రత్యక్షమయ్యే ఏర్పాటు కూడా ఉంది.
  

XXX
XX
XXXX
XXXX
XX
XXXXXX
XXXX
XXXX
XXXX
XXX
XXXXX
XXఆధారాలు (గడి)
అడ్డం నిలువు
2ఈ జమానా విక్రమార్కుడిదా, శాలివాహనుడిదా? ఎవరిదైనా ఒకటే (2)
3మామూలు కూర్చోవడమేనా .. పనయ్యేదాకా కదలకుండా హఠం చేయడం (4)
6మేళకర్తలు ఇతనే చక్రాలలో ఉన్నాయి హై (2)
8పప్పులో ఊరు మిరపకాయ ఇలాగే తింటారు (3)
9ఈ రావు నల్లావే (3)
10యాత్రజేసొచ్చి రాసే లాగు (4)
12పెళ్ళయిన కొన్నాళ్ళకే మోజెస్ కి పెళ్ళాం మీద పోతుందా ఇది (2)
14వెంటనే తాగ్కపోతే టీ మీద ఇవొచ్చేస్తాయి జాగ్రత్త (3)
15తల్లిపుట్టుక తెలిసినవాడా.. (2)
17వానరులైతే రాక్షసులని చంపాలి కానీ మంగళూరు మగువల్నా (4)
20వాన కాదు తిరుగులేని ఆజ్ఞ (4)
21అనేక సినిమాల్లో తల్లిపాత్రలు వేసి మనసులని రంజింపజేసినామె (4)
22ఇద్దరు మనుషుల మధ్య ఉండేదే కానీ మన యాంకర్ల నోట్లో నాని బందయి పోయింది. (2)
24ఇది మార్చినంత సులువుగా విలువల్ని మార్చగలరు కొందరు (3)
26అలహాబాదు లాంటిదే కానీ అలకనందా భాగీరథుల సమాగమప్రదేశం. (5)
29వేలం వేయకపోయినా పాడచ్చు (2)
31గుడ్ బై లవ్ ఇన్ టోక్యో (4)
32ఇంగ్లీష్ కోయిల (2)
34మేలైన రాయి (4)
36సీత భావనలో రావణుడి విలువింతే (2)
37రట్లాం రచయితల సంఘం (3)
39సోదరి లేక పోతే ఈయన కీర్తనే కాదు (4)
41ఈరంగు సరిగ్గా చూస్తే అంతవికారంగా ఉండదనుకుంటా (2)
42పక్షులు కట్టేది (2)
43డా.ఈశ్వర్ ముస్లిం కాకపోయినా చంద్రముఖి నయనతారని ఇలా పిలుచేవాడు (2)
44దేవతల వరం వల్ల ప్రతాపవంతుడయ్యాడీ గోలకొండాధిపతి (9)
1వెనుతిరిగినా పంత్ హిందీ కవిత్వం బాగా నే రాస్తాడు (5)
2దుర్యోధనుడు తన మాఁవని పిలిచే తీరిదేనా (5)
3ఈమధ్యే లింగాన్ని కూడా మింగేసిన డబల్ రాజు (9)
4గజేంద్రుడికి తప్పిన డబల్ A3 సైజ్ కాగితం (2)
5పులి తోడిదే – ఇందులో కుట్రేమీలేదు (2)
6ఆంజనేయుడు దీన్నే పండనుకున్నాడట – బాలుడుకదా (5)
7బైరాగులు తినేధాన్యమా (3)
9ఎంత మోకరిల్లినా మొలక పైకే పెరుగుతుంది (2)
11వెతకడంలో బాధ తప్పదు (2)
13వరి పొలాలు కాదు అలాంటివే –కంకులు కింద నుండిపైకే పెరుగుతాయి ! (4)
16మనిషి తనవంతు ఇది చేయకపోతే దేవుడుమాత్రం ఏంచేస్తాడు? (6)
18పాట గాడు, నటుడు, 21 అడ్డంలో ఉన్నావిడతో నామమాత్రసంబంధం ఉన్నవాడు (2)
19తమలపాకుని ఇలాఎందుకనకూడదు. మనం చేసేదదేగా మరి (5)
23తానం కాదు- మాయే అది (3)
25అంత పెద్ద శేషశాయి ఇంత చిన్నాకు మీద పడతాడు (2)
27ఈరసం పిల్లలకి పట్టిస్తే వాగుడు వస్తుందంటారు (4)
28చనిపోయిన ప్రిన్స్ ఛార్లెస్ భార్య చివరన విరిగి హీరోయినయిందిట (2)
30ఈ వర్మ గారు 'చిత్ర' రాజ్యాల నేలాడు (4)
32సూర్యుడు ఇటు పైకి ఉదయిస్తాడా ఎప్పుడైనా? (5)
33పాండవుల గురువు దీంట్లో పుట్టాడట (2)
35అరకాసు కోసం ఇంత తిరక మరక వేషాలా (4)
36పాపం ఎడారిలో మృగానికి దాహం తీరేదే కాదు (2)
38మొత్తం తేడాఅంతా అంతరంగనాధుడిలోనేనా ..(3)
40ఈమధ్యే చనిపోయిన ఈ రావుగారు కన్నడనుండి తెలుగుకి అనువాద సాహిత్యానికి చాలా సేవ చేసారు (3)
42నెహ్రూగారికీ, క్రికెటర్ శ్రీనాధ్ కీ ఉమ్మడిగాఉన్న వడీ, వేగాలు (2)