పాత గడులు:ఫిబ్రవరి '08, మార్చి '08, ఏప్రిల్ '08, మే '08, జూన్ '08, జూలై '08, ఆగస్టు '08, సెప్టెంబరు '08, అక్టోబరు '08, నవంబరు '08, డిసెంబరు '08
Tab ను నొక్కడం ద్వారా పక్కగడికి వెళ్ళవచ్చు. బాణాల కీల ద్వారా కూడా గళ్ళ మధ్య ప్రయాణించవచ్చు. మీ మౌసును అంకె ఉన్న గడిలోకి తీసుకు వెళ్ళగానే సదరు గడికి సంబంధించిన ఆధారం ప్రత్యక్షమయ్యే ఏర్పాటు కూడా ఉంది.
  

X
XXXXXX
XXX
XXXXX
XX
XXXXXX
XXX
XXXXX
XX
XXX
XXX
XXXXఆధారాలు (గడి)
అడ్డం నిలువు
1అర్జునుని అడ్రసు (7)
6కంప్యూటరును ముందు పెట్టుకుని లోభంలో పడ్డ స్త్రీ. పురుషుడు కూడా కావచ్చు (4)
8నులి, మెలి, పురి, …? తివిరి తిరిగి చూడండి (2)
9జూదశాలలో తిరగని చెయ్యి పాకశాలలో తిరిగెనా చక్రవర్తీ? ఎందువలన? (2)
10కృష్ణానదీ తీరంలో ఒక పల్లి … విధివక్రిస్తే ఇదివక్రించి పామై కరుస్తుందని నానుడి(2)
11తడబడుతూ, మధ్యలో వగస్తూ … ఎచటికిపోతా వీ రాత్రి, శ్రీశ్రీ? (6)
16దంత్యములలో ఒక మహాప్రాణి ఒక అల్పప్రాణి (2)
17నిలువు 13తో కలిస్తే కలిగే పట్టరాని ఆత్రుత (2)
18తొలి తెలుగు కవయిత్రి అవతరించిన పాక? (2)
19సూర్యకిరీటానివా, చంద్రసుమానివా నీవంటూ అతడా వాత్సాయన వనవాసిని నేమని పిలిచాడయ్యా? (6)
20తాపీగా అగస్త్యుడరగించుకొన్న కామరూపవిద్యాపారీణుడు. (3)
21సప్తస్వరాల మెట్లెక్కి దిగేటప్పుడు వినిపించే పుంభావము (2)
22ఇందులో దూకి ఎదురురీదడం కంటే మునకే సుఖమన్నాడో అనుభవజ్ఞుడు. (2)
24కుడి ఎడమైన పరివారంలోనే ఆపద దాగివుంది (3)
25తెలుగులో గుడ్డు మార్నింగు (5)
27తలుగు విప్పినా తలుపు తీసినా తగులుకొనే వున్నాయి రెండక్షరాలు అక్రమంగా (2)
28నిను బ్రోచువాడు బ్రహ్మదేవునికోసం అటునుంచీ తధాగతుడై తపస్సుచేస్తున్నాడు. (2)
29యెహె - చి గాదూ.. అంటూ ఘంటసాల చిరాగ్గా వున్నాడు! మరేమిటో? (3)
30నిలువు 14లోని పెద్దాయన 1942లో చేసిన ప్రయాణం (4)
32దప్పిగొని నీళ్లడుగుతాడెవడైనా. వీడెవడో చారు కావాలంటున్నాడు, వీణ్ణేమనాలి! (5)
36చురుకుదనం, నిర్లక్ష్యం, లౌక్యం, ధైర్యం, తెలివిడీ కలిసిన సరిత్ప్రవాహం లాంటి నడవడి (7)
37అది స్వప్నపాఠశాల. అక్కడి విద్యార్థులు ఒకరినొకరు ఎట్లా కొట్టుకుంటారో తెలుసా? (4)
39పైనున్నది కప్పు. మరి దాని కిందున్నదేమిటి? (3)
40సైన్సు తెలిసిన పెద్దమనిషి (2)
41కారాలున్నాయ్, గారాలున్నాయ్, రెండూ ఒకచోటున్నాయ్, రారంమంది. అకటగటా! ఏమీ తికమగ! (4)
42అఆలు దిద్దుకోరా అంటే ఆవులు తిరుగుతున్నాయంటావా, ఏవీ ఎక్కడ? (2)
1మొదట్నుంచీ వీఐపీ హోదా కలిగిన ఒక బాపనయ్యే. (3)
2ఇంద్రజితుడు కాకపోవచ్చు కానీ జితేంద్రియుడు. (2)
3ఫలానా బోడి అంటారుగానీ, నిజంగానే బోడి అయితే ఈ అలంకరణ అసాధ్యమే. (2)
4సలిలం కాదు, అమృతమేనట ఆ ఐదు రాగాల పాట (12)
5అటునుంచి వస్తే కొత్తదనం చూపే తోట (3)
7లేదు! (2)
11సంస్కృతంలో నా కనుగాననితనం - మధ్యలో సాగి, కొవ్వెక్కించి, తిరగబడేలా చేసింది. (4)
12ఈవిధముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవుగదా … ఆరోహణ! (5)
13శతృవు… ఈయన కాలిమంట నెత్తికెక్కుతుందంట (2)
14పక్కనే తిరుపతి వున్నా కాస్త ప్రత్యేకంగా కాశీయాత్ర చేసిన వేంకటేశుడు (9)
15లేదు లేదని యెందుకు నీలో వున్నది దాస్తావు? అంటున్నాడు ఆత్రేయ. ఏమిటో ఆ అభేద్యం? (4)
18తాతను తలచుకోండి… ఇప్పుడు పిలవండి వస్తాడేమో! (2)
23క్షామపీడిత జీవితాల్లోని ఆర్ధ్రతను పైకిచూపిన సన్నపురెడ్డి కథ. (2)
24పైకెగసిన చలువ (3)
26పండుముసలోళ్లిద్దరు ఎదురెదురై తమలోతాము ఇలా నవ్వుకుంటున్నారు(4)
27పలురీతులు శీర్షాసనం వేస్తే? (5)
31స్టాలినిస్టు చరిత్ర… సగము దొరికింది… పైకి చదువుకో. అందులోనూ మధ్యాక్షరం మాయం. (4)
33సరిసమానంగా పంచాలంటే బేసిగ్గా మానం వుండకూడదా!? (3)
34ఇతరులెవరూ లేరండీ, అంతా మనవాళ్లే. తాతలూ తండ్రులూనూ! (4)
35దీనికి ముగింపునిస్తే బతుకు (2)
38భీమసేనునికేదో బకాయిపడ్డాడు కాబట్టే ఈ అసురుని ఊబకాయం నుండి మొండెం వేరయింది. (2)
40జబరుదస్తీ చేస్తే … మంత్రిగారి వియ్యంకుడు అంత్యప్రాసతో ఏదో చేస్తాడంట (2)