పాత గడులు:ఫిబ్రవరి '08, మార్చి '08, ఏప్రిల్ '08, మే '08, జూన్ '08, జూలై '08, ఆగస్టు '08, సెప్టెంబరు '08, అక్టోబరు '08, నవంబరు '08, డిసెంబరు '08
Tab ను నొక్కడం ద్వారా పక్కగడికి వెళ్ళవచ్చు. బాణాల కీల ద్వారా కూడా గళ్ళ మధ్య ప్రయాణించవచ్చు. మీ మౌసును అంకె ఉన్న గడిలోకి తీసుకు వెళ్ళగానే సదరు గడికి సంబంధించిన ఆధారం ప్రత్యక్షమయ్యే ఏర్పాటు కూడా ఉంది.
  

XX
XXXX
XXXX
XXX
XXXXX
XXXX
XXXX
XXX
XXXX
XXX
XXX
XXXXXఆధారాలు (గడి)
అడ్డం నిలువు
1పొద్దుకొచ్చి పొద్దుపోయిందంటారేమిటి గొల్లపూడి గిరీశం గారు! (6)
5అంజి kingdom పేరు ఒక oxymoronలా లేదూ? (2, 2)
7ఇది పడుద్దనడం అతనికో తుత్తి (2)
8తిన్నది తాపీగా అరిగించుకోండి (3)
10బుద్ధాజీ వెళ్ళిపోయాడు! (2)
11దంతంలేని ఏనుగు బాధ సూర్యచంద్రులుకూడా తట్టుకో లేరట! (3)
12స్వరముల నరమిదే (3)
13కామునిలో దాగిన మోక్షగామి (2)
15అరగజం దూరంలో, అదిగో పెద్ద కొండచిలువ! (4)
17ఆరుద్ర కుమార్తె కలం పేరు కూడా సార్థకమే! (2)
18జల్లుమనిపించే షాయరీ (2)
20పేకముక్క రౌతు (2)
21శీతల పానీయాల ఉచిత పంపిణీ కేంద్రం (4)
24స్రవించే రాజులు రాజ్యముల్ కలుగవే! (2)
28గంగాళం కాదు. సన్నని గొంతుగల తేనీటి చెంబు (4)
30శతపత్ర సుందరిలో ఎంత సిగ్గు దాగుందో! (2)
32అచ్చ తెలుగు మంజీర నాదాన్ని వినాలంటే సప్తగిరులని దర్శించాలి (3, 3)
34పాపమీ లాయరుగారికి ఒకటే తాళంచెవి మిగిలింది (2)
35వేసవి వాన కురిపించినవాడే నేటి కవిత్వానికి పెట్టనికోట (4)
37కమల్ దాదా భాయ్ డబ్బులు లాగడంలో కాస్త తడబడ్డాడేమిటి? (3, 2)
40సమస్త్యములో ఎక్కువైనదిదే (3)
42వైణిక బాబు గట్టివాడే! (4)
43అబ్బా! ఎటు చూసినా ఈ పురుగుల గోల తొలిచేస్తోంది! (5)
4548 తో కలిస్తే చోటు దొరుకుతుంది (1)
46భానుమతి మన లారెల్ ఎండ్ హార్దీ ని చెయ్యమన్న పని (3)
1*రాజొకడూరలేడ*ని చెప్పినా వినని రాకుమారుని గాథ (5, 3)
2మోహనుబాబు యముడైతే మరి ఎన్.టీ.ఆరు? (2, 2)
3కర్పూరవసంతరాయలి ప్రేయసిదే కులమయితే నేమి? (3)
4దివ్యమైన నిర్వాణముతో సమానమీ ప్రభుత్వ కొలువు (4)
5మహత్వాన్ని కోల్పోయిన ముత్తాత (3)
6అద్వైతం లక్ష్మణుడికి విశిష్టంగా తెలుసునే! (4)
9నువ్వేం తలుచుకుంటే అదైపోవాలా! ఇదేం న్యాయం? (3, 3)
14ఇది రెండింతలైతే మేను మెఱుపు గనిగా మారదూ! (2)
16లావొక్కింతయు లేని ఎన్.టి.ఆర్ తొలిప్రేయసి (2)
1717 అడ్డంలో పేరుకిమాత్రం కనిపించే రసం (2)
19ఈ నాయిక కాటుక తిరగేసి పెట్టుకుందేవిటి దేవా? (2)
22వద్దని తెలుగులో చెప్పొచ్చు కదా తంబీ! (2)
2345 తో కలిసే గొప్ప ప్రయత్నం చెయ్యి (1)
25చంద్రలత సాహితీ క్షేత్రంలో జల్లిన వాటి మధ్యలో మీరు చూస్తున్నది ఇరుక్కుపోయింది (3, 3)
26చిల్లిగవ్వ, ఆద్యంతం యుద్ధాలకి కారణం! (2)
27రాజులు చేసేవి పోలిటిక్సయితే మరి రసికులు చేసేవి? (5)
29అడిగానంటున్నావు సరే. అదేదో తిన్నగా చెయ్యొచ్చుగా (3)
31ఇండెక్సు(4)
32ఈ మధ్యనే ఈ బాదు కాంగ్రుస్సుకి మణిమయంగా మారింది (5)
33వేయికళ్ళ వయ్యారి తిరగబడింది (2)
36చాటాలంటే వెయ్యాల్సింది (2)
38పనికిరానట్టు కనిపించినా, వేళ్ళూనుకుంటే ఎంత చల్లదనమిస్తాయో! (2)
39ప్రత్యుత్తరాలలో ఉత్తరాలు వెతికి పట్టుకోడమే ఇక మీ ఉద్యోగాలు, ఒకే? (3)
41మధ్యలో కాస్త సాగదీస్తే, 34 అడ్డంలో వాళ్ళు పుచ్చుకొనేదే (3)
44దీని పదును తెలియాలంటే బ్లాగ్వనంలో కుటీరాన్ని దర్శించాల్సిందే! (2)
4823 ని ముందు పెట్టుకుని యుద్ధం చెయ్యి (2)