పాత గడులు:ఫిబ్రవరి '08, మార్చి '08, ఏప్రిల్ '08, మే '08, జూన్ '08, జూలై '08, ఆగస్టు '08, సెప్టెంబరు '08, అక్టోబరు '08, నవంబరు '08, డిసెంబరు '08
Tab ను నొక్కడం ద్వారా పక్కగడికి వెళ్ళవచ్చు. బాణాల కీల ద్వారా కూడా గళ్ళ మధ్య ప్రయాణించవచ్చు. మీ మౌసును అంకె ఉన్న గడిలోకి తీసుకు వెళ్ళగానే సదరు గడికి సంబంధించిన ఆధారం ప్రత్యక్షమయ్యే ఏర్పాటు కూడా ఉంది.
  

X
XXXX
XXXX
XXXX
XXXXX
XXXX
XXXX
XXX
XXXX
XXXX
XXXX
XXXఆధారాలు (గడి)
అడ్డం నిలువు
1శ్షనివారం పూట వెంకన్నదర్షనానికిపోతే తూగులయ్యకు ఎదురయిన తిరస్కారం (4)
4ఎవ రేమన్నా ఈ శంచరీ తెలుగువాడే చెయ్యగలడు (7)
8నాతి రయమున రమ్మని పిలువ, బాస చేసి రావేల మదనగోపాలా? (6)
9కడగొట్టుది (3)
10కార్మికుడితో శృతికలిపిన ధన్యాత్ముడు (4)
12శ్రీకాకుళంలోని ఈ పట్టణం ముంగిట ఢంకా మోగిస్తే ఒక జూదం (3)
13ఎద్దులబండిని నడపాలంటే యిక్కడే కూర్చోవాలి. (2)
15కప్పీ (3)
18సర్వసంగపరిత్యాగి ఆచ్ఛాదనలో ఆంగ్ల పంచితం (2)
20గోవుబిడ్డల అర్రులరగదీసినది యజమానులు కాదట (5)
23మంచు మౌంటెనబాబు గారి సతీమణి గత నెల లేదట. నిజమేనా? (2)
24సత్యం చెప్పమన్నారు పెద్దలు. చెప్పిందేచెప్పి విసుగెత్తించారు సదరు పోతు రాజావారు. (3)
26కూర్చుండ మాయింట కురిచీలు కలవు __ తోడ నేనల్లించి యుంటి (2)
28తెగుళ్లు తగుల్తాయిగానీ పుడతాయా? ఏమో ఆ పుట్టించేవానికే తెలుసు! (2)
30ఆడది, నోట్లో నాలుకలేనిది. మాటలు రానిది. (3)
32రాలు గుత్తుల్లో గుండ్రని తృణధాన్యాలు (3)
33యుద్ధానికి ముందు కీ యిస్తే చాలు చీకట్లను తరమగలదీ ఋజువర్తని (3)
34ఏడుపు (2)
36నెత్తీనోరూ బాదుకోవడం కూడా సగమే చేస్తానంటే ఎలా? (2)
37ఇలామంతునాయుడుగారు కన్నడిగుడా? మునుపెన్నడో రైతని విన్నాను! (7)
40తెలంగాణ వ్యవహారంలో మొరటోడు (3)
43కోపమొస్తే బలరాముడు దీన్ని తిరగేసి ఒహటిచ్చుకుంటాడని పురాణం (3)
44చివర దబాయిస్తారనుకుంటే మరీ అంతపరుషమా? (2)
45మధ్యమాగ్రజునికి సింగపు నడుముందన్నారు సరే, నకనకలాడితే నక్కకడుపోడనక మరేదో అన్నారే! (5)
46గాలికంటే వేగవంతమైనవారు వాళ్లెవరో ఎందుకౌతారు? తిరగేస్తే బెంగళూరెవరిది? (2)
47అందరూ మిమ్మల్నలా పిలుస్తూవుంటే అనుమానమొచ్చింది, మీరు ఘాటైన కిళ్లీకథలుగానీ చెబుతుంటారా మాస్టారూ? (2)
1అన్యధాభావము లేని పుణ్యవతి (2)
2చెయ్యీకాలూ సక్రమంగా వుండగనే ఈ నటుని పీచు లాగి తిరగేసినారా! (7)
3మూడు మూలు, సాగదియ్యకుండా (3)
4విడుదలకై వేడుకొను తీరునుగనవే (6)
5మిషను తిరిగితేనే లక్ష్మీకటాక్షం (2)
6అడ్డదిడ్డంగా పాతరేస్తే నిక్షేపంగా వుంటుందా? (4)
7పాత కాలంలో …. (2)
9నోటి కుహరపు పైకప్పా? ఐతేమాత్రం, లాగి వదిల్తే అలాగే ఉంటుందా? (3)
11ఆ పని కానిచ్చేస్తే పోలా? అదేదో ఖూనీ అన్నట్టు భయపడతావే? (2)
14కాలేజీలో లెక్కలు చెప్పే బిందాస్ విశారదుడీ మేస్త్రీ (2)
16కాడు రమ్మనేదాకా కడుపుకింత __ కావలసిందే కదా!(2)
17అంతర్జాలాంధ్రుల ప్రేమపూర్వక కృతజ్ఞత (3)
19పాలకోసం పరిగెత్తిన కవివీరుడీ క్షీరజధవుడు. ఎక్కడివాడో! (4)
21మా గతం నుంచి వచ్చిన ఒక మహర్షి (3)
22విలువైనవివేనట. వలవలా ఏడ్చి తలకిందులైతే సగం నిలిచాయట. (2)
25భయం కాదు. దాన్ని మించినదే. (2)
26తల్లి తన బరువు దించుకోగానే బిడ్డ తెంచుకొనేదీబంధాన్నే! (2)
27మొదట్నుండీ అనేకదంతములు తుదవరకూ. ఒక వరుసలో వుంటేనా!? (5)
29కిందనుంచి పైకి పోవద్దన్న ఏరుతల్లి (3)
31స్వర్గమే ఆకాశము (3)
32కార్పొరేటు కళాశాలలు మా బడికిరా అని పిలిచేదిందుకోసమే (3)
35గమనించి చూస్తే మీకో మెలికల దారి కనబడకపోదు (4)
36హన్నన్నా! పేరుకు పెద్ద నలుడే, మరి ఫీల్డు మారినంత మాత్రాన తలమునకలైతే ఎలా? (3)
38ముందు, వెనక చూడం అంటారా? చెయ్యడమే కదా కావలసింది! (3)
39ఏమీ ___ లింగా? (3)
40అదరగొట్టడం ఇదరగొట్టడం ఊరకనే శ్రమ. పొమ్మనలేక పొగబెట్టాలంటే కావలసిందిదే (2)
41నోరూరే సిక్సర్లు, ఛీరులీడర్ల జోరు - స్టేడియమున పారెనాంగ్ల హోరు (2)
42ఏఁవయ్యా పీనాసి బసవయ్యా, తలాడించడంలోనూ పొదుపేనా!(2)