పాత గడులు:ఫిబ్రవరి '08, మార్చి '08, ఏప్రిల్ '08, మే '08, జూన్ '08, జూలై '08, ఆగస్టు '08, సెప్టెంబరు '08, అక్టోబరు '08, నవంబరు '08, డిసెంబరు '08
Tab ను నొక్కడం ద్వారా పక్కగడికి వెళ్ళవచ్చు. బాణాల కీల ద్వారా కూడా గళ్ళ మధ్య ప్రయాణించవచ్చు. మీ మౌసును అంకె ఉన్న గడిలోకి తీసుకు వెళ్ళగానే సదరు గడికి సంబంధించిన ఆధారం ప్రత్యక్షమయ్యే ఏర్పాటు కూడా ఉంది.
  

XX
XXXX
XXXX
XXX
XXXXX
XXX
XXXX
XXX
XXXX
XX
XXXX
XXXఆధారాలు (గడి)
అడ్డం నిలువు
1ఇంకెత్తుకుంటే ఎంచక్కా మందుకొట్టొచ్చు (2)
2పొక్కిలిపాపడి పనే ఇది (2)
4కవిత్వపు తోటని దున్నడంలో అబ్బూరివారి కెంత తహతహో. అందుకే కాబోలు నాగలి కాస్తా వంగి పోయింది! (3, 3)
7ఆంధ్ర శాకంబరీ దేవి ప్రసాదమే ఇదీను. ఒక్కసారి తింటే ఏడదిపాటు తిన్నట్టే (3,3)
9ఆ! సలికాలంలో నీళ్ళు గావాల్నా? (3)
10ఏ సతి వహ్నిలోన జనియించెను జన్నమొనర్చు వేళ? (4)
12Dreamని stop చేసి చూడండి. ప్రవరుడు అటజని కాంచినది కనిపిస్తుంది. (3)
13ఆండాళ్ళూ... ఆండాళ్ళూ... మార్గశిరంలో పాడుకుందాం ఈ పాటలు. (4)
15వేటూరి I love you చెప్పిన మందగమన (3)
18గిరిజ, అందాల అక్కినేనికి అందిచే మిఠాయి (2)
20పేరుకి చిన్నపిల్లాడిలా ఊడలు పట్టుకుని ఊగుతాడు కానీ, మాంచి శృంగార కవితలల్లుతాడు. (5)
23వెంకటేశం ఇంట్లోవాళ్ళు ఇలాటి పీపులని గిరీశం అనుమానిస్తాడు. (3)
24పోరా అని ఇంత మర్యాదగా చెప్పాలా! (3)
26దువ్వూరి వారు నిర్..మింషిన... షాల... (2)
28ఈ రాజు విష్ణుమూర్తి ఆజ్ఞ వినలేదేమోనని మరో రాజు గారి సందేహం (2)
30అల్లసానివారిది గజిబిజిగా చేసారుట! (3)
32అచ్చటకు ఇంకా short-cutలో వెళ్ళొచ్చు (3)
33ఎక్కడికి, రాయలసీమకా? (3)
3410 అడ్డంలో సతిని అవమానించిన వాడి ఆయువుపట్టు. అటూ ఇటూ అయ్యింది (2)
36ఈ పిల్లని మనం కళ్ళల్లో పెట్టుకు కాపాడుకుంటాం.(2)
37నిప్పురాయి మొహం చెక్కుకు పోయింది (2)
39శిశుపాల్ ఇతడు. దుష్ట నిర్ణయుడు, బాలుడు అని భీష్మ ఉవాచ (3, 4)
42నీ మొహానికి హిందీ కూడానా! (3)
44చీర చుట్టుకున్న ఆకాంక్ష (3)
4534 అడ్డాన్ని భగ్నం చేసింది ఇదేగదా (2)
46నవీనమైన ఆంతరంగిక ఆలోచనా ధార. అనంతంగా కారుతూనే ఉంటుంది (5)
47జాగ్రత్త, చూసుకోండి! తేలు తోకతో వెనకనుంచే కుడుతుంది. (2)
48మొత్తం ఇవెన్నున్నా, చంద్రునికున్నవి మాత్రం అందులో పావువంతే (2)
1ఈ పంజాబీ ఆయనకి హెల్తు బాలేదా?(2)
2జిత్తులమారి నక్క, వల్లో పడదు. గాలానికి మాత్రం చిక్కుకుంది (3)
3ఏంటలా కిందనుంచి మీదకి చూస్తావ్, వికృతపు చూపు! (2)
4తెలుగులో కుబేరాక్షి అచ్చముగ ఈ కాయేనట. కాకపోతే కాస్త పరుషంగా మారింది. (2)
5జోరుమీదున్న భార్యని వేయించుకు తింటే, వరేవ క్యా బాత్ హై! (4)
6మిగతా సగం ఏది బాలా? శివుడు మింగేసాడు హలా! (2)
7ఉలికి పడే పిరికి పక్షి. ఊరికెందుకో దూరం? (4, 2)
8అగ్గిపాలు చెయ్యడం ఇతనికెందుకంత ప్రీతిపాత్రమో? (5)
9ఖర్చులేకుండా దొరికేది. మధ్యలో అలా సాగదియ్యాలా? (3)
11చాసోలా ఎంగ్లీషులో అలా చెప్పు (2)
14ముందు వెళ్ళమంటావ్, తరవాత రమ్మంటావ్. నీ సాంకేతిక భాష నాకేం అర్థం కావటం లేదు! (2)
16కన్నెపిల్ల చెప్పే అబద్ధం (2)
17ఓ భామా! ఇతణ్ణి గెలవడం కష్టమే సుమా! బహు పరాక్! (3)
18కో అంటూ పాడే వంత సాంగు (2,2)
1926 అడ్డం అసలు ఓనర్ (2, 3)
21కత్తులని తిరగేసి దూసితే వచ్చేది రక్తం కాదు. కానీ అలాగే ఎర్రగా ఉంటుంది (3)
22పిచ్చి మళ్ళీ తిరగబెట్టిందిరోయ్! (2)
2536 నిలువులోవే. నిజానికి ఇవెప్పుడూ జంటగానే ఉంటాయి, తిరగేసి మరగేసినా (2)
27అసలు కరటకశాస్త్రి అన్నదమ్ముడు. తోడు లేక తడబడినట్లున్నాడు (5)
29ఘడియ ఘడియకీ ఇక్కడికి వస్తున్నారే మీరు! (3)
31అప్పుడప్పుడూ సగంలో ఆగిపోయి దడ పడకండి (3)
32ఆకులైనా తినకుండా ఆ తపస్సేమిటమ్మా! (3)
35పొద్దెక్కకుండా కుయ్యాల్సింది, ఈ ప్రపంచంలో పొద్దెక్కాక కూస్తుందేమిటి చెప్మ? (2,2)
36కనకపు సింహాసనమున కూర్చోడమే కాదు రాజ్యం కూడా ఏలింది (..ఏలాయి) (3)
40మంధరగిరి, చిలికి చిలికి చివర అరిగిపోయిందా వెంకమాంబ గారూ! (3)
41నువ్వు గొంతుకలిపితే, ఈ గీతం పాడగలం (3)
42రష్యాలో రగులుతున్న చిచ్చుకి మొదలేది?
43రాధామాధవం ఎంత చక్కని జంట. మధ్యలో స్వరహీనమైతే మాత్రం మిగిలేది పెద్ద అరుపే! (2)