పాత గడులు:మార్చి '07, ఏప్రిల్ '07, మే'07, జూన్ '07,జూలై '07, ఆగస్టు '07,సెప్టెంబరు'07, అక్టోబరు '07, నవంబరు '07, డిసెంబరు '07
Tab ను నొక్కడం ద్వారా పక్కగడికి వెళ్ళవచ్చు. బాణాల కీల ద్వారా కూడా గళ్ళ మధ్య ప్రయాణించవచ్చు. మీ మౌసును అంకె ఉన్న గడిలోకి తీసుకు వెళ్ళగానే సదరు గడికి సంబంధించిన ఆధారం ప్రత్యక్షమయ్యే ఏర్పాటు కూడా ఉంది.
  

XXXXXXX
XX
XXXXXXX
XXXX
XXXXXX
XXXXXXX
XXXX
XXXX
XXXXXX
XX


ఆధారాలు (గడి)
అడ్డం నిలువు
1రసికాగ్రేసరా! మాకాపాటి రసికత లేదా? (5+5+2)
6అడ్డం తిరిగిన అమ్ములపొది (3)
7ఇది చిన్నప్పుడు ఆడుకున్న ఆట. …గుర్తున్నదా? అని గుర్తుచేస్తుందొక సినిమా పాట(6)
10జట్టిజాములోని పూర్వార్థానికి ప్రకృతి(2)
11వికీపీడియనులకందిస్తుందిది తోడ్పాటు(2)
12రంగస్థలమ్మీద నూటపాతికేళ్ళ అమృతధార(3)
15కోటలో వెయ్యబోతే తోక కత్తిరించి పంపారు!(2)
17పాత చందమామలను డిజిటైస్ చేస్తున్నది (4+4+4)
20కినిసిన సినిమా పత్రిక కునుకేసింది శాశ్వతంగా(3)
22సగం కూల్‌డ్రింకు, సగం విషం కలిసి సృష్టించిన కలకలం (4)
26పేరలుకంజెందిన లలనామణి కోపాన్ని తగ్గించే మార్గం (3)
28ఏమీ లేనప్పుడు మొదట చూడ్డం ఎందుకే? (2)
32పానుగంటివారి సాక్షిగా ఈ ఉపన్యాసకర్త వాగ్ధాటికి ఎదురులేదు (5)
33ఇందులేనిదెందుగలదు? (5)
1తాంబూలాదులు ఈమె తెచ్చి ఇస్తేగానీ రాసేమూడ్ రాదట పెద్దన్నగారికి (8)
2ఈ రాళ్ళు బరువెక్కువై తిరగబడ్డాయి (3)
3ఇదుంటే జ్వరమంత సుఖంలేదు(5)
4అస్పష్టంగా వినిపించే ఆమ్రేడితాలు (5)
5కకావికలైనా చెదరని రంగు (2)
8చూడ నల్లగుండు గుండ్రముగా నుండు (2)
9మనకున్నదే..మా భాభి షానం కూ ఉంది (5)
13చంద్ర (2)
14గురువుగారూ! పొరబడకండి. అది కంకరనేల (3)
15దీన్ని తలాపిడికెడు పంచబోతే చెల్లాచెదరైంది (4)
16బలాఢ్యులుపయోగించిన పూర్వకాలపు ఆయుధమే! (2)
18కులమా? కాదు. అటుదిటైన ఈ దేవి మంచి నర్తకి (3)
19జాగ్రత్త, వివాదాలం మేం! తలగొరిగి, సాచిన చేతులు నరికేస్తే వదుల్తామా? (3)
21సుఖమెరుగని అవస్థ (2)
22కోనంగీ! ఈ చోటికి వెళ్ళదలిస్తే చొక్కా విప్పి వెళ్ళు! (2)
23కలం పట్టిన చెయ్యి ఇది పట్టడం కష్టమే!(2)
24ఈ దేశం మసిలేనిదయా(4)
25సమాజం ఎలా నడచుకొన్నా దీని నడక మాత్రం చక్కనిది (3)
27తలతిరిగి పూలు పూసింది! (2)
29ఆహారంలో మాంసం కానిది పైకి పెరుగుతుంది (2)
30దానమిచ్చింది అవి కాదు, ఇవి కాదు (2)
31ఉన్నదున్నట్లు పీకాలనుకుంటే తలతిప్పండి (2)