పాత గడులు:మార్చి '07, ఏప్రిల్ '07, మే'07, జూన్ '07,జూలై '07, ఆగస్టు '07,సెప్టెంబరు'07, అక్టోబరు '07, నవంబరు '07, డిసెంబరు '07
Tab ను నొక్కడం ద్వారా పక్కగడికి వెళ్ళవచ్చు. బాణాల కీల ద్వారా కూడా గళ్ళ మధ్య ప్రయాణించవచ్చు. మీ మౌసును అంకె ఉన్న గడిలోకి తీసుకు వెళ్ళగానే సదరు గడికి సంబంధించిన ఆధారం ప్రత్యక్షమయ్యే ఏర్పాటు కూడా ఉంది.
  

XXX
XXX
XX
XXXX
XXXXXX
X
XXXXX
XXXXXX
XXX
XXXX
XXXXX
XX


ఆధారాలు (గడి)
అడ్డం నిలువు
1బుచ్చీ - ఆఖరికేం బావుకొన్నావయ్యా బాబు? (4+4)
8కుసింత కలాపోసనుండాలేగానీ, మడిసిలో ఇది కనుక్కోలేమా? (2)
9మేనిదా? (హా! దానిదే!!) (4)
10సవ్యమైనదీ, ఆగేదీ ఐతే సరే! రెండూ కానిదాన్ని తలనరకబోతే తోకతెగింది (3)
12చీటికీ మాటికీ ముఖం మాడ్చుకుంటే ఇలాగే సగంసగం వినబడుతుంది (2)
13కానివ్వు, కొలతలేసే ఉద్యోగం గదా మరి! (3)
14లెక్ఖల భారము హాయిగ మోసే వయసు కాదే! తేడా వచ్చినా కాస్త చూసుకుని పొండి (4)
16ఈ ఇంటిపేరు పెట్టెకున్న మన అమాత్యవర్యులు ఓ కుమారిగారు (2)
17బాణం దూసుకుపోవాలంటే.. ఇలా అయితేనే (5)
18ఎన్నో వేలున్నట్టు చెబుతున్నారు, ఉన్నదొకటే అయినా (2)
20లేతభామా? (2)
21జీర్ణమంత్రం మూకదొరా దండాలయ్యా (3+4+3)
25చేపను చేతపట్టి వదిలేస్తే ఇక మిగిలేదేంటి? (2)
26తిరగబడిన పదను (2)
28బద్దెన చెప్పిన వంశతిలకుని లక్షణం (3)
32టిప్పణి (2)
33ఋజు మార్గమున (3)
34పులియబెట్టిన అన్నరసం – తరుణీ – ఒంటికి చాలా మంచిది (4)
36ఈ రాక్షసుడు కాలాంతకుడు (4)
37పొట్టిగా మొదలైన వట్టి మంత్రం (2)
39చందమామకు మామ పెట్టిన శాపం (2)
40ఇదో రకం రోటి (2)
41యువ చిత్రకారుడు (2)
43తాత్వికులూహించే భూతల స్వర్గం (4)
44సినారె మనసు మల్లెపూవై తేలిందట - వీటిపై (3+3)
1ఈవిడగారు సాక్షాత్తూ పుస్తకాల పురుగు (3)
2వడేసి పిండినా వాడనిది (2)
3ఎత్తి కుదేస్తే మూడు కాళ్ళ చెవులపిల్లి మొదటి కాలు కుంటిదైంది (3)
4మినహాయించావు బానే ఉంది, కానీ దీంట్లోనే సగం మినహాయింపులా? (3)
5చుక్క లేని ఆకాశం పైకే పోయింది (2)
6అక్కర్లేని చోట ఒత్తి, పైగా లేదా నెప్పి అంటావా? (2+2)
7భూలోక నరకము లేవో? (5)
10ఉర్వినిగల వినయశీలి (3)
11.. ఆ.. అదే .. ముగ్ధ విడిచిన మాలే - సంస్కృతీకరిస్తే పంచమహాకావ్యాల్లో ఒకటి (3+3)
12రత్నాల వీణ దండె, తిలక్ రాసిన ఓ కథ పేరు (2+3)
13ఖద్దరు ధరిస్తే ఏంటంటా అని మహీధర రామ మోహనరావు గారి ప్రశ్న - మీకేమైనా తెలుసా? (3+3+2)
15మహానుభావురాలు! భామ, రావులు -ఇద్దరినీ గెంటేసింది (2)
18వేమన పద్యాల్లో దీని ప్రస్తావన ఉంది (2)
19క్రికెట్ మాచాతురాణాం __, న నిద్ర. (1+2)
22జనకుడు (2)
23భవుని రాణి (3)
24ఇది కూడా ఉంటేనే చేసే ఆర్భాటానికి విలువ! (2)
27కలతో కలిసి అన్నీ (3)
29ఈ వంశతిలకునికి జుత్తంత అభిమానం (2)
30మాగతువ అని అడ్డగోలుగా అంటే మాకేం బాధ? (4)
3142 నిలువులోంచి వచ్చింది; భాషలు మారితే ఎవరు రావాలి? అని అడుగుతుంది. (2)
32ఔను మరి, వేడిగా ఉంటే కాఫీ అయినా కాలుద్ది (3)
34నాగవంశంలోని వాడే రాయిగా మారితే విశ్వవిద్యాలయం ప్రత్యక్షం (4)
35ఇంకా నయం! స్వయంగా ఆయనే నడిపాడు కాబట్టి సరిపోయింది, వేరే ఎవరైనా అయితే ఆ స్పీడుకు భయం పుట్టేదికాదూ!? (2)
38చిన్న ఈక...రాయంచదైతే రాజుల పరుపు తయారు (౩)
40తిరుపతిలోని ప్రభుత్వాసుపత్రి (2)
41గాలించి పట్టే సాధనం. ఆమ్రేడిస్తే విలాపం (2)
42కాచుకోవడానికీ, పంచుకోవడానికీ కూడా ఇవే! (2)