పాత గడులు:మార్చి '07, ఏప్రిల్ '07, మే'07, జూన్ '07,జూలై '07, ఆగస్టు '07,సెప్టెంబరు'07, అక్టోబరు '07, నవంబరు '07, డిసెంబరు '07
Tab ను నొక్కడం ద్వారా పక్కగడికి వెళ్ళవచ్చు. బాణాల కీల ద్వారా కూడా గళ్ళ మధ్య ప్రయాణించవచ్చు. మీ మౌసును అంకె ఉన్న గడిలోకి తీసుకు వెళ్ళగానే సదరు గడికి సంబంధించిన ఆధారం ప్రత్యక్షమయ్యే ఏర్పాటు కూడా ఉంది.
  

X
XXX
XXXX
XXX
XXXXXX
XXX
XXX
XXXX
XXXX
XXXX
XX
XXX


ఆధారాలు (గడి)
అడ్డం నిలువు
1కకారాలతో కూడిన తాప-త్రయాలు (2-2-3)
6మతి ఉందని తెలుస్తూనే ఉంది. మరి బహువచనం ఇలాగేనా రాసేది? (4)
9ద్రవిడ ప్రాణాయామ పద్ధతిలో అన్నగారు (2)
10ఊహల్లో తేలితే కటి పగలక ఏమౌతుంది? (3+2)
12జగన్నాథరథచక్రాల కింద పడితే ఎవరైనా అంతే...ఎట్నుంచి పడ్డారో కూడా తెలియదు (2)
13ఫలకంమీద కస్తూరితిలకం
14భూమాతకు జామాత? (3)
16పాడమని అలాగేనా అడగడం? (2)
18ఈ నది పాముల పుట్టా? (4)
20ఉత్తరదేశం వాళ్ళతో గొడవపడకుండా తినండి (3)
21నాటకాలు ఆడీ ఆడీ పాపం కాలు పోయింది (2)
22నలుగురిమధ్య దృష్టి పెట్టండి (2)
24తురకల వాలకం మారితే మిరుమిట్లు గొలపడం ఖాయం (4+3)
28మొద్దుబారిన పిల్ల గాలి (3)
29కర్ణుడు ఇందులో ఒకడిగా పెరిగాడు (4)
30గారనొదిలించుకున్న గాలిమర (2)
32గాలికి చెల్లాచెదురైంది ఆయన కొడుకే (5)
33వెనుదిరిగిన ఈ మహర్షి వ్యాసపుత్రుడు (2)
35తలాతోకా లేని పద్మపురాణం (2)
36రక్త ధారలతో తడిసిన రణ భూమిని గుర్తుంచుకోండి (3)
37తిరుగుడుచీల (2)
38ఆసరా కోసం చేసే వాకబు (2)
39కోతి దేవుడు (2)
40బేహారులు ఈ రోజుల్లో చిరునవ్వులో సైతం పైకాన్ని చూస్తారు (5)
42వరస తప్పిన రాక్షసుడు (4)
44అభిమాన ధనుడు, అసహాయ శూరుడు (5)
47పాపం బావురుమంటోందట, నావకు చెప్పారో లేదో!! (2)
48సరుగుడు చెట్లలో తిరుగుడు చక్రవర్తి (4)
49తెలుగులో ఇంగ్లీషు... కొంత సంగతి ఎవడిక్కావాలి? (2)
1వనితకు కీడు చెయ్యొద్దన్నా వినడు (4)
2అట్నుంచి పడే బాధ (2)
3టక్కరి సూకట పత్ర నాధా! నీ భాగోతం చాలించు (3+3+4)
4పర్వత, హారం, నవ్వగ! (2)
5...శుక్రవారము గడియలేడింట అన్నమయ్య (2)
6అబలలము అనుకోకండి. మాలో ఇది చూసి అల కూడా అణగి తీరుతుంది (3)
7నుగ్గు చేయబూనిన వానిపై మమకారం చూపిస్తే ఇదే అవుద్ది (2)
8బంతినూరడం చూస్తే నోరూరుతుందా? (5)
11వరాళి అనుకుని పొరబడకండి. ఇది భయంకరమైనది (3)
15తికమకపడ్డ రామానుజుడు (4)
17క్షీరంకుమ్మి సూర్యుడు పెద్ద కథకుడయ్యేడు (4+4)
19వసనంబొక్కటి వాగొని ఈ కష్టమేల? (4)
23తికమక పెట్టకుండా ఉంటే శత్రునగరాన్ని ఎటునుండైనా చేరుకోగలిగే వాళ్ళమే (4)
25వ్యవసాయదారుడు బైతైతే గుణింతాలెలా వస్తాయి? (2)
26కరిగిన లక్కను నొక్కకండి, అతుక్కుంటే కష్టం (3)
27లకారాలు లోటెక్కువై తల్లకిందులైనాయి (2)
28అసలే నత్తి, పైగా తిరగేసి పలకాలట. ఇక వత్తులేం పలుకుతాయి? (2)
31మొసలి తిరుగుడు పండగ (3+3)
34సిద్ధార్థా -మాయాదేవి మొగుడెవరో తెలుసుకోవాలంటే డబ్బుని బాగా శుద్ధి చెయ్యి (5)
37గొప్ప మాయ అంటే ఏమిటో అనుకున్నాను, ఇది కనబడని మాయన్నమాట! (2)
38రమ్ము సేవించిన శరీరానికి అందిన మన్నన (3)
39హ..నువ్వలా చెంప చెళ్ళు మనిపిస్తావా? (3)
41పో-గొట్టుకున్న తెలంగాణ గుంటడు (2)
43ఉదయించే కువలయానందకరుడు (2)
44గుణింతంలో వరస మారినా రెండక్షరాలూ మంచి ఒద్దికతో ఉండేవే (2)
45షడ్దర్శనాల్లో ఒకటి: మానవాళికి మనమిచ్చిన కానుక (2)
46ఆ యుగం పోయినా ఆ మంత్రి నేటికీ స్మరణీయుడే (2)