పాత గడులు:మార్చి '07, ఏప్రిల్ '07, మే'07, జూన్ '07,జూలై '07, ఆగస్టు '07,సెప్టెంబరు'07, అక్టోబరు '07, నవంబరు '07, డిసెంబరు '07
Tab ను నొక్కడం ద్వారా పక్కగడికి వెళ్ళవచ్చు. బాణాల కీల ద్వారా కూడా గళ్ళ మధ్య ప్రయాణించవచ్చు. మీ మౌసును అంకె ఉన్న గడిలోకి తీసుకు వెళ్ళగానే సదరు గడికి సంబంధించిన ఆధారం ప్రత్యక్షమయ్యే ఏర్పాటు కూడా ఉంది.
  

XX
XXXX
XXX
XXX
XXX
XXX
XXXXX
XXX
XXXX
XXX
XXXX
XXX


ఆధారాలు (గడి)
అడ్డం నిలువు
1శంకరాభరణానికి శివుడి వాహనాన్ని జోడిస్తే నిజంగా సరాగమే (5)
6అందమైన అమ్మాయి మెడలా ఉండాలా - మరైతే ఐదులోంచి పుట్టించు మురారీ? (4)
9రోజును రమ్మంటే వీపు చూపింది (3)
10శ్మశానంలో చక్కర్లు కొట్టేవానితో ఉంటేగింటే శివుడి కుండాలి గాని అనుబంధం మధ్యలో రాముడికేంటి? (3)
11ఇదెత్తుకొచ్చిన గడుసుపిల్లడు - కనబడితే నాకొళ్ళు తెలవదు అని నాయిక పరవశం (2)
12దండకం కమలడం పద్యంతో మొదలు (3)
14నిద్రలో లభించిన పెన్నిధి, పోయిందనా అంత కంగారు? (4)
18బుడుతడు నడువగ అడుగులు పడెనిలా... (4)
20ఉత్తరాదివాళ్ళ మజ్జిగపులుసు (2)
21ఆకాశం చెప్పేది ఆలకించు (2)
22తికమకపడకుండా పోయిరా (2)
23ముఖానికి రంగులేసుకొని మరీ నాటకాలాడే మొగుడికి ముద్దుపేరు ఏంపెడతారు? (4)
25క భాషలో తలతెగిన పాము తినదగినదే (3)
26అయోధ్యే! (4)
28చొక్కా పొట్టిదైపోయింది (2)
29ఎండుటాకులు మాత్రమే తిన్నదీ అన్నపూర్ణ (3)
30పున్నమి చంద్రుడితో రాక్షసి (3)
33బిర్లా వారి కంపెనీ సరిచేస్తే మామూలైపోదా? (3)
35శ్రీకృష్ణుడి ప్రేమధారలో తడిసి తరించింది (2)
37సీసన్యాయం సరిగా లేదు. ఆశ్రమవాసిని పిలవండి (3)
40శ్రద్ధగ వినుడీ మాట (2)
42బౌద్ధ భిక్షువు పాపం ఎంత కష్టపడ్డా కణమైనా రాలలేదు గాబోలు (4)
44ఈ రమణీయ లహరిలో పడితే మునగడమే తప్ప తేలడముండదు (4)
45రంగమెళ్ళారా? వెనక్కి రండి (2)
46అక్కడ నొక్కి పలికినా అర్థం మారదు (2)
47ఏలినవారి దర్పం (3)
48చేతసాయం కుదరకపోతే, మాటసాయానికైనా నిలవరూ? (3)
49వాదాలకు దారితీసే వికటించిన గుంపులు(4)
50మనోవ్యాధికి సగం మందు? (3)
51దొరబిడ్డను పొదివిపట్టుకున్న పెద్దమ్మ (2)
1నారాయణా వేసిన బాణాలు చాలు (4)
2ప్రియురాలితో రాజీపడ్డ జగదేకవీరుడు ప్రేయసినుంచి కోరిందేమిటో? (2)
3అంత ఎద్దు పావురంతో కలసి సింహాసనమెక్కితే కొండవీటిలో పూజలందుకొన్న కత్తికటారి (4,4)
4స్త్రీలింగం ఆకాశాన్నంటి భేషజాన్ని వదిలేసింది (5)
5రాజముద్రికకు సైతం ఏనాడూ లేని గౌరవం దీనికి దక్కింది – మరదే చెప్పుకో చూదాం (3)
7ఈ కారం పడకపోతే వ్యాసుడు శ్లోకం చెప్పలేడని కాళిదాసు వ్యంగ్యోక్తి - సంస్కృతంలో కంజంక్షన్ (3)
8ముదిరితే గాలివాన (2)
13సరళంగా ఉండేవి వణుకు పుట్టిస్తాయా? (2)
15చెదిరిన నుదుటిబొట్టు? (3)
16దిక్కు తెలియని వేగం (2)
17కొండదారిలో కాకైనా కదలని రోజు (3)
19దుకాణం కట్టేశాం. దొడ్డిదారిన ప్రయత్నించండి (3)
21చెవి తెగిన పాండవజ్ఞాతి? (3)
22ఇందువదనకి ముందు చేరగల మరో విశేషణమే (2)
24ఢిల్లీలో ఇల్లద్దెకి కావాలంటే ముదుపుకోసం తలపాగా తాకట్టు పెట్టొచ్చు (3)
25పాపం చిన్నది (2)
26దక్షిణాదివాళ్ళ జీవనది పేర్లో మొదటక్షరం నీవైతే? (3)
27పంచపాషాణాల్లో తెనాలి రామలింగని పద్యం నిండా ఇదే కదా? (2)
29ఒకరిమీద మరొకరు ఆధారపడి చిలకాగోరింకల్లా ఉంటే తప్పా? (5,2)
31తనికెళ్ళ భరణికి పేరు తెచ్చింది (2)
32సన్-డ్రీమ్-క్లాత్ (6)
34వాతావరణం కంగితే కొంపలంటుకోవచ్చు (5)
36చలిలో నెలరోజులు ఎక్కుపెట్టొచ్చు (4)
38దొరలొచ్చేది ఇక్కడనుంచే (2)
39పెద్దమ్మ బిడ్డ (4)
41పూర్వకాలంలో అయ్యవార్ల అరుగులమీద నడిచేది, ఇప్పుడు పెరటి దోవ పట్టింది (2)
43కింది నుంచి చదివినా పైనున్నదే...చిన్నబోయిన పాత కరెన్సీ (2)
48దొడ్డి దారా? (2)