పాత గడులు:మార్చి '07, ఏప్రిల్ '07, మే'07, జూన్ '07,జూలై '07, ఆగస్టు '07,సెప్టెంబరు'07, అక్టోబరు '07, నవంబరు '07, డిసెంబరు '07
Tab ను నొక్కడం ద్వారా పక్కగడికి వెళ్ళవచ్చు. బాణాల కీల ద్వారా కూడా గళ్ళ మధ్య ప్రయాణించవచ్చు. మీ మౌసును అంకె ఉన్న గడిలోకి తీసుకు వెళ్ళగానే సదరు గడికి సంబంధించిన ఆధారం ప్రత్యక్షమయ్యే ఏర్పాటు కూడా ఉంది.
  

XX
XXXXXX
XXX
XXXX
XXX
XXXX
XXXXXXX
X
XXXXXXX
XXX
XXXX
XXXXX


ఆధారాలు (గడి)
అడ్డం నిలువు
1గుళ్ళల్లో బూతుబొమ్మలెందుకూ అని ప్రశ్నించిన ఈ పెద్దమనిషి, ఇళ్ళు కట్టే పని చేస్తాడా ? (4)
3ఈ కాకర్ల వంశోద్భవుడికి మహానుభావులెంతమందో లెక్క తేలిందా ? (3)
5నారదుడు జనాల మధ్య పెట్టేవి – తెలియక పోతే, బుర్ర తలుపులు తీసి మరీ ఆలోచించండి. (3)
76 నిలువులోని జంతువుకి ఎంత వేడుకున్నా వేడుక పుడుతుంది గానీ ఇది పుడుతుందా? జాలీగా తినెయ్యదూ? (2)
8ఈ స్వీటు పేరు విని బాగుందని సరిపెట్టుకోనక్ఖర్లేదు. తిని చూడొచ్చు (3)
10కులాన్ని పొమ్మని ఇంగ్లీషువాడు ఎంత తరిమినా పోకుండా ఇక్కడ తిష్టవేసినట్లుంది(3)
11ఊరికే వెళ్ళిపోక అటూ ఇటూ చూసి దంపుడుపన్యాసాలా? (2)
14కరి, అల్లమూ కనబడ్డం లేదా? వాళ్ళే ఎత్తుకెళ్ళి ఉంటారు. వెతకండి. (5)
15మేమడిగింది చిన్నమెత్తు బంగారమే! తిరకాసేం లేదు. లెక్క తేడా రాకూడదు మరి (4)
16అమ్మని కుమారి అని సంబోధించచ్చా? ఈసగం ఇంగ్లీషు నీలకంఠ అలాగే చేసాడు. (3)
17రోట్లో తల పెట్టాకా, 36 అడ్డాలు తప్పవు మరి. (3)
18ఒకేఒక్కడు, అదీ అర్జునుడు, తన మీద ఓపాట పాడగానే, అటూఇటూ ఊగిపోయిందీ సింహపురి నేర్పరిది. (4)
21ముందు కోసి తర్వాత సాగదీస్తే చేమ దురద పోతుందా? (2)
22మణిరత్నం చేతిలో పడితే గులాబీ లాంటి కృష్ణుడి పట్టమహిషి పేరైనా ఇలా అయిపోతుంది. (4)
23శక్తంతా హరించుకుపోయిందని శ్రీ బి. పోతన గారు ధైర్యంలేకపోయినా భలే చెప్పాడే. (7)
27దుస్సల మేనమామ పుట్టిల్లు తాలిబానుకెరుక (3)
28ఈ ఏకాదశావతారం నండూరి రామ్మోహనరావు గారి సృష్టి. (5)
32తల మధ్యలో మొదటి హల్లా ? అంతా తెలుగు కన్ఫ్యూజన్. దెబ్బకి, ఈ పదం కూడా కన్ఫ్యూజయిపోయింది. (3)
33పెళ్ళాంలో భూదేవి గుణముండాలా- ఏజమానాలో ఉన్నావ యా? అది సంస్కృతం మాట్లాడే రోజుల్లో. (3)
34కామినీ తైలమా, ఏమి నీ రుచమా వహ్వ- వహ్వ. ప్రాస కుదిరే లోపు నూనె కాస్తా ఒలికి అటూనిటూ అయిపోయింది. (3)
35పల్లెలో మృగరాజా? ఛా. అక్కడుండేదేమిటో మాకు తెలుసులే. (4)
36పన్నుకైనను, వెన్నుకైనను తప్పునే ఇది ఎవరికైనను. (2)
1ఈమె బిడ్డని కని రెండే రోజులయిందా? అయ్యో, తెలియక శీర్షాసనం వేయించానే. (3)
2తాగితే ఎక్కకుండా ఉంటుందా. (2)
3ఈమూడూ తెలిసికొని గొప్పవాళ్ళై పోదామనుకుంటే, ముఖం మాడచ్చు. మాయలోడు బాబూమోహన్ కి అలాగే అయింది మరి. (3,3,2)
4రోజూ తగూలుంటే సంసారమ్మీద పుట్టేదిదే. (2)
5ఈవాయిద్యం తయారీకి బొబ్బిలిలానే, ఈవూరు కూడా ప్రసిధ్ధి. (4,2)
6జంతువులకి ఎయిడ్స్ వస్తుందా? (2)
9పుచ్చ కాయలు తినిపారేయకుండా ఇంటి లో పెట్టుకుని, ఎర్రజెండా పట్టాడీ అందమైన అయ్య (4)
11కల ని ఎంత వత్తినా అబద్ధ మే (2)
12కవిసమ్రాట్ ఇద్దరువీరుల కథను రాసి పేరెందుకలా పెట్టాడో (4)
13మనుషులిలా ఉంటే ఏదేశమైనా ఎలా బాగుపడుతుంది ? (3)
14మాక్సింగోర్కీ అయినా, ఆయన బాబైనా తెలుగు తల్లిని ఇలాగే పిలుస్తారు. (2)
18తమాషాగా మేంగోడ్రింక్ తలకిందులుగా తాగిన అల్లుడిలో తల్లిని చూడచ్చా? (3)
19త్వమేవాహం అని ఆయనరాసిస్తే మాత్రం నువ్వూ ఆయనా ఒకటైపోతారా ? ఆయనకి పెద్దగడ్డం ఉంది. పైగా ఓ స్టారు కూడాను. (3,3)
20ఈవిడా కృష్ణుడి సగం పెళ్ళామా? 22 అడ్డానికి సవితా? (2)
21శిలలపై శిల్పాలు చెక్కినారు.. . అబ్బే, వాళ్ళు చెక్కలేదు. ప్రభువులు ______________ (5)
24మహాప్రళయం వచ్చే సమయం (4)
25చైనా వాళ్ళు శివసేన సుప్రీమో పేరు పిలవగానే, ఆయన పాపం కకావికలైపోయాడు. ఎందుకా? చైనా వాళ్ళు ర్ ని ల్ చేసి పాడేస్తారు కదా. (3)
26దురద - చెడు అలవాటు (5)
29తారకనామ - దశరథ పుత్ర (2)
30ఆగ్రా మీదుగా వెళ్ళడమే కామోద్దీపకమా? (3)
31హనుమంతుడి బొట్టది, తిరగేసి పెట్టద్దూ అని చెప్పినా, అలానే పెట్టావా? (3)