పాత గడులు:మార్చి '07, ఏప్రిల్ '07, మే'07, జూన్ '07,జూలై '07, ఆగస్టు '07,సెప్టెంబరు'07, అక్టోబరు '07, నవంబరు '07, డిసెంబరు '07
Tab ను నొక్కడం ద్వారా పక్కగడికి వెళ్ళవచ్చు. బాణాల కీల ద్వారా కూడా గళ్ళ మధ్య ప్రయాణించవచ్చు. మీ మౌసును అంకె ఉన్న గడిలోకి తీసుకు వెళ్ళగానే సదరు గడికి సంబంధించిన ఆధారం ప్రత్యక్షమయ్యే ఏర్పాటు కూడా ఉంది.
  

XXX
XXX
XXXXXX
XXXX
XXXXXXX
X
XXXXX
XXX
XXXX
XXXX
XXXXX
XXX


ఆధారాలు (గడి)
అడ్డం నిలువు
1కవీ– కకారాలు ఎక్కువై నీ సాహిత్యం అంతా అస్తవ్యస్తమైపోయింది (5)
4నాలుగు కోతులు తలదాచుకొన్నచోటు మునులగుంపెలా అవుతుందీ? (4)
7రెండు చివర్లా నువ్వు చూసి పాతకొయ్య నుంచి రాలుతున్నదేమిటో చెప్పు (2)
8చీరమడతలు కుట్టే దారిలో నోబెల్ సాహిత్య పురస్కార గ్రహీత దాంకొన్నాడు, వెతికి పట్టుకోండి (3)
9అతివ ఇలాకాకూడదని కాబోలు పురషాహంకారెవడో పదాన్ని కూడా కలగాపులగం చేసినట్టున్నాడు (3)
12మంచు కాదు నలగ్గొట్టడానికి. రోకలి తీసుకో (2)
15క్షమించండి, వెనక దారితో కలిసినా తోటి ప్రయాణికుడినే. (4)
18ఎప్పటికీ తెరుచుకోని కనుల కొలత నేను చెప్పినంత (5+2+4)
24సైగల్ – నీ పాట ఇప్పుడెవరికీ అక్కర్లేదు. అందువల్ల.. ఇంటికి పోయి పడుకో. (2)
25ఇదే (2)
27శునకమైనంత మాత్రాన సిగ్గెందుకూ... ఇంద్రుడి దూతి కదా? (3)
29కవులైతే కోతలు కోస్తారు, కానివారు ఐతే కోసుకొని కూరొండుకోవచ్చు. (2)
31నినినీ, పదనీ అనుకుంటూ ఈ పని మాత్రం చేయకండి (4)
32గాలిసోకితే కాలిపోయేను. గొంతులో దాచుకోండి (3)
34శంకర్- అంతలా డబ్బా కొట్టకు. మొదట్లో మెత్తబడినా, చివర్లో తాళం తప్పినా – దీని ధ్వనిమాత్రం అందరికీ ఎరికే. (3)
35మరపున్నచోట ఇది ఉన్నా లేనట్టే!! (2)
36అమావాస్య దగ్గర పడి చంద్రుడు గోవు కొమ్ము రూపంలోకి వచ్చేడేమో – వెన్నెలకి కూడా మూడొంతుల ముసలి తనం పట్టినట్టుంది (3)
37మీ గోడు వీరితో చెప్పుకుంటే మిగిలేది కంఠశోషే (2)
40పదవే అని తొందరపెడుతున్న మోహనాంగి నడుం కంటికి కనబడదు? (2)
42అంత తొందరపడితే తిరగబడేరు జాగర్త!! (2)
43రాముడికన్నా ముందే అర్జునుడు రావణుడిని ఓడించేడు – నమ్మకపోతే వెయ్యి చేతులతో ఒట్టు.(7)
1చివరి కట్టు గొడవపెట్టకుండా విప్పండి (4)
2నా మాట విను - ఇది ఎగిరే దారేకాని, నడిచే దారి కాదు (4)
3పగ బట్టేక ఆడ రాక్షసి ఐతే మాత్రం ఊరుకొంటాడా – తల తెగ్గోసేడు. (2)
4సత్యవతి కొడుకు పుణ్యమా అని వేరుపడ్డ వేదకుటుంబానికి పెద్దదిక్కు (3)
5ఆ ... సౌధంబుదాపల మందారవనం (2)
6చెల్లెలని కనికరించేడు, ఫలితంగా – దారుణంగా చచ్చేడు (2)
10సముద్రుడికి కూడా ఉంది ఎసిడిటీ – అదే కడుపులో మంట (4)
11ఇంటిపేర్లో కంటకాలున్నా – సాహిత్యంలో హాస్యం పండించిన అందగాడు (4)
13ఒరలో కరవాలాన్ని కోస్తే బొడ్లో పెట్టుకోవచ్చు(2)
14ఇవి వస్తే కావిళ్ళలో సారె పంపడం ఆనవాయితీ(3)
16ఇంగ్లీషువాడి వారాంతం దాపురించింది (3)
17పాదాలొత్తే అత్తకి రాగాల్తీసే కోడలు (2+4)
19లొడలొడా మాట్లాడే సెలయేరు (2)
20ఏ కళనైనా సరే, ఒడిలోకి లాక్కొంటే మచ్చ మిగులుతుంది (3)
21ఈయన వదిలిస చుట్టపొగ వాయులీనం అయినా, రాసిన కథల్లో సొగసు మాత్రం శాశ్వతం (2)
22డబ్బులకి బట్టలుతికే బాపతునుకొని పొరపడకండి – పైసలిస్తే ప్రాణాలు తీస్తారు సుమా (5)
23ఎప్పుడూ జుట్లు పట్టుకొని దెబ్బలాడుకొనే సవతుల గోత్ర నామం? (4+2)
26పొట్టిదైపోయిన పొడుగు పాపం సిగ్గుతో శీర్షాశనం వేసింది (2)
27భామా – పది మందిలో మన్ననలందుకొనేలా నడచుకో (5)
28తలలు తెగి పడిన యుద్ధం కాదు, తలతెగిన యుద్ధమే (2)
30గసడదవాదేశ సంధిలో గసా, ఇదీ ఎదురెదురు. అందుకే ఆ గడబిడ (2)
33బలవంతుడు పిడికిలి బిగించేడు, వెనక్కి తిరిగి పరిగెడదామా? (4)
38ఆమెప్పుడూ ఇంతే! ఆన్నీ అడ్డదిడ్డంగానే చేస్తుంది (3)
39వృద్ధిపొందిన చంద్రకళ రాకపోయేనా? (2)
40ఆనవాలు లేకుండా తుడిచేయ్యండి (2)
41అక్రమంగా ప్రవర్తించిన ఒక రాజు. తెగ్గోస్తే కదా పృథువు పుట్టేది? (2)