పొద్దు

 |  సంపాదకీయం |  కథలు |  కవితలు  |   గడి  |   జాలవీక్షణం  |   వ్యాసాలు  | 
Jan 21

ఆ నవ్వు

chavakiran.bmpచావా కిరణ్! పరిచయమక్ఖర్లేని ప్రముఖ తెలుగు నెజ్జనుడు. ఎంతో మంది తెలుగుబ్లాగరుల ప్రేరకుడు, మార్గదర్శి. చావా కిరణ్ కు ఇంటర్నెట్లో సొంత పత్రిక నడిపిన అనుభవం కూడా ఉంది. పొద్దు కోసం అతను రాసిచ్చిన ఈ చిరుకవిత మీ కోసం:

—————————————-

ఆ నవ్వులో

నిన్నటి దిగులు లేదు

రేపటి బాధ లేదు

ఆ నవ్వు

హిమానీనదం అంత స్వచ్ఛంగా

హిమాలయాలంత అందంగా

ఆ నవ్వు

నిన్నని మరిపిస్తూ

రేపటిని తలపకు రానీకుండా

నేడు నా ముందు నిలచింది సాకారమై

ఆ నవ్వును

ముందెన్నడూ చూడలేదు

ముందెన్నడూ అనుభవించలేదు

ఆ నవ్వు

మనసును మారుస్తూ , మాయచేస్తూ

వేసవిలో చల్ల గాలిలా హాయిగొలుపుతూ

నా ముందు నిలచింది సాకారమై.

- చావా కిరణ్ (http://oremuna.com/blog)

“ఆ నవ్వు” కి 5 వ్యాఖ్యలున్నాయి

  1. 1
    రానారె ఇలా అన్నారు:

    చాలా బాగుంది. మీ ముందు స+ఆకారమై నిలిచిన ఆ నవ్వు ఎవరిదో… :)

  2. 2
    jyothi ఇలా అన్నారు:

    నాకు తేలుసు

  3. 3
    valluri ఇలా అన్నారు:

    “ఆ నవ్వును

    ముందెన్నడూ చూడలేదు

    ముందెన్నడూ అనుభవించలేదు”

    మ౦చి ప్రయోగము. చాలా బాగు౦ది. ఇ౦కా ఇలా౦టి మ౦చి కవితలు మరిన్ని వదల౦డి.

  4. 4
    radhika ఇలా అన్నారు:

    ాలా చక్కగా వు౦ది.మంచి విషయం పై అందం గా,భావయుక్తం గా రాసారు.ఒక ఆంగ్ల సామెత ఎక్కడో చదివాను…అది…”అందం గా లేని నవ్వుతున్న మొహాన్ని నేను ఎప్పుడూ,ఎక్కడా చూడలేదు.” మీ కవిత కూడా నవ్వే మోము లా అందం గా వుంది.

  5. 5
    ప్రసాద్ ఇలా అన్నారు:

    అయితే ఇక కవితా ఝరి ప్రవహించనుంది చావా కలం నుండీ!
    –ప్రసాద్
    http://blog.charasala.com

మీ స్పందన ఇక్కడ తెలపండి

© 2010 పొద్దు | Entries (RSS) and Comments (RSS)

GPS Reviews and news from GPS Gazettewordpress logo