’రమల్’ ప్రశ్నశాస్త్రం – 5

రమల్ మూర్తుల  మధ్య  మైత్రీ  సంబంధాలు, దృష్టి  సంపర్కాలు, స్త్రీ  పురుష  నపుంసక  సంఙ్ఞలు, వర్ణాలు, బలాబలాలు , ప్రశ్న  భేధనకి  సహకరించే  ఉపకరణాలు ఉన్నాయి. ముందుగా  వాటిని  గురించి  తెలుసుకోనిదే, ఈ ప్రశ్న  శాస్త్ర  అధ్యయనం  కష్టం.


మైత్రీ సంబంధాలు : మిత్ర , శతృ , సమ  అని  మూడు రకాల సంబంధాలు ,ఈ రమల్  మూర్తుల మధ్య ఉన్నాయి. అవి వాటి  తత్వాన్ని  బట్టి  ఏర్పడ్డాయి. తత్వాలు ఈ విధంగా చెప్పడం జరిగింది

 

1 . అగ్నితత్వ మూర్తులు ( షకల్ లు ): నాలుగు : లహ్యాన్ / వాగ్మి ; అతవే ఖారీజ్ / చక్ర ; నుస్రుతుల్ ఖారీజ్ / ఉష్ణగు ; కబ్జుల్ ఖారీజ్ / పాత్.  ఇవి తూర్పు  దిశలో  బలీయమవుతాయి, పీత వర్ణాన్ని  కలిగి ఉంటాయి.

2 .వాయు తత్వ మూర్తులు ( షకల్ లు ): నాలుగు : హుమరా / లోహిత్ ; అతవే దాఖిల్ / కవి ; ఫరహా / దైత్యగురు ; ఇజ్జతమా / బోధన్. ఇవి పశ్చిమ దిశలో బలీయమవుతాయి, రక్త వర్ణాన్ని కలిగి ఉంటాయి.

3 . జల తత్వ మూర్తులు ( షకల్ లు ): నాలుగు : తరీఖా / శీతాంశు ; బయాజ్ / విధు ; నకీ / ఆర్ ; నుసృతుల్ దాఖిల్ /సూరి. ఇవి ఉత్తర దిశలో బలీయమైనవి, శ్వేత వర్ణాన్ని కలిగి ఉంటాయి.

4 . పృథ్వీ తత్వ మూర్తులు ( షకల్ లు ): నాలుగు : కబ్జుల్ దాఖిల్ / తీక్ష్ణాంశు; అంకీశ్ /శౌరి ; ఉకలా / మందగ్ ; జమాత్ / సౌమ్య్ .ఇవి దక్షిణ దిశలో బలీయమైనవి, శ్యామ వర్ణాన్ని క్లిగి ఉంటాయి.


వీటిని  ఈ దిగువన  ఇచ్చిన ఛార్టు  ద్వారా సులువుగా  అర్థం  చేసుకోవచ్చు.

౦      లహ్యాన్ లేదా          
___  వాగ్మి.తూర్పు దిశ

__     పీత వర్ణము.

__

౦  అతవే ఖారీజ్  లేదా

౦  చక్ర. తూర్పు దిశ

౦   పీత వర్ణము.

__

౦ నుసృతుల్ ఖారీజ్

౦ లేదా  ఉష్ణగు. తూర్పు

__ దిశ. పీత వర్ణము.

__

౦   కబ్జల్ ఖారీజ్ లేదా

__  పాత్. తూర్పు

౦   దిశ. పీత వర్ణము.

__

__  హుమరా లేదా

౦   లోహిత్  పశ్చిమ .

___ దిశ .రక్త వర్ణము

__

__ అతవేదాఖిల్ లేదా

౦   కవి, పశ్చిమ దిశ

౦   రక్త వర్ణము

౦   ఫరహా లేదా

౦  దైత్య గురు. పశ్చిమ

__ దిశ, రక్త వర్ణము

__  ఇజ్జతమా  లేదా

౦   బోధన్ .పశ్చిమదిశ.

౦   రక్త వర్ణము.

__

౦  తరీఖా లేదా

0   శీతాంశు. ఉత్తర

౦ దిశ. శ్వేత వర్ణము

0

__  బయాజ్ లేదా విధు.

__  ఉత్తర  దిశ . శ్వేత

౦     వర్ణము

__

౦   నకీ  లేదా  ఆర్

__  ఉత్తర దిశ. శ్వేత

౦  వర్ణము.

౦  నుసృతుల్ ఖారీజ్

౦  లేదా  ఉష్ణగు. శ్వేత

__ వర్ణము

__

__  కబ్జుల్  దాఖిల్

౦  లేదా తీక్ష్ణాంశు.

__ దక్షిణ  దిశ , శ్యామ

౦ వర్ణము.

__  అంకీశ్  లేదా సౌరి.

__  దక్షిణ దిశ.

__  శ్యామ వర్ణము.

౦   ఉకలా  లేదా

__  మందగ్ దక్షిణ  దిశ.

__  శ్యామ  వర్ణము.

__  జమాత్ లేదా

__   సౌమ్య. దక్షిణ

__   దిశ. శ్యామ

__   వర్ణము.


ఇప్పుడు ఈ తత్వాల  మధ్య  మైత్రీ  సంబంధాలు  తెలుసుకొందాం.
 

సంబంధము తత్వము తత్వము
మిత్రులు అగ్ని, వాయువు జలము, పృథ్వి
శతృవులు అగ్ని, జలము వాయువు, పృథ్వి
సములు అగ్ని, పృథ్వి జలము, వాయువు


స్త్రీ , పురుష , నపుంసక  సంఙ్ఞలు , శుభా  శుభ  సామయిక  బలాలు :


లహ్యాన్, అతవే ఖారీజ్, నుసృతుల్ ఖారీజ్, కబ్జుల్ ఖారీజ్  యీ  నాలుగు ‘ఖారీజ్ ’మూర్తులు  పగలు బలం గలవి, పురుష  సంఙ్ఞ  గలవి. (వీటి  సంస్కృతం పేర్లు వరుస  క్రమంగా  వాగ్మి, చక్ర, పాత్ , తీక్ష్ణాంశు,) వీటిలో  లహ్యాన్, నుసృతుల్ ఖారిజ్  శుభమైనవి. తక్కిన రెండూ  అంటే అతవే ఖారీజ్ ,కబ్జుల్ ఖారీజ్  అశుభ మైనవి.


అంకీశ్, అతవే  దాఖిల్, కబ్జుల్ దాఖిల్, నుసృతుల్ దాఖిల్ యీ  నాలుగు ‘ దాఖిల్ ’మూర్తులు రాత్రి  బలం గలవి, స్త్రీ సంఙ్ఞ గలవి. (వీటి  సంస్కృతం పేర్లు  వరుసగా సౌరి, కవి, తీక్ష్ణాంశు, సూరి,)   వీటిలో  అంకీశ్ మాత్రమే శుభమైనది. తక్కిన  అతవే దాఖిల్, కబ్జుల దాఖిల్, నుసృతుల్ దాఖిల్ అశుభమైనవి.


జమాత్, ఇజ్జతమా, హుమరా, బయాజ్  యీ  నాలుగు‘ సాబిత్ ’  మూర్తులు  సంధ్యా సమయంలో బలమైనవి. వీటిలో  మొదటి రెండు అంటే జమాత్, ఇజ్జతమా  నపుంసక  సంఙ్ఞ గలవి మరియు  మద్యమ బలం గలవి. హుమరా  అశుభ మైనది, బయాజ్  శుభ మైనది. (వీటి సంస్కృత శబ్దాలు వరుసగా సౌమ్య, లోహిత్, విధు, బోధన్ )


తరీఖా, ఫరహా, ఉకలా, నకీ, యీ నాలుగు, ‘ మున్కలీబ్’ మూర్తులు కూడా సంధ్యా సమయంలో  బలమైనవి. (వీటి సంస్కృత శబ్దాలు వరుసగా శీతాంశు, దైత్య గురు, మందగ్, ఆర్,) ఇవి కూడా సంధ్యా సమయం లోనే బలీయమైనవి. వీటిలో తరీఖా, ఫరహా శుభమైనవి. తక్కిన  రెండూ  ఉకలా, నకీ అశుభమైనవి. ఇందులో ఫరహా  పురుష సంఙ్ఞ కలది, మరియు  స్వల్ప బలమైనది. తరీఖా, ఉకలా, నకీ యీ మూడూ  నపుంసకలే  సంఙ్ఞలే అయినా  స్త్రీ స్వభావం గలవి. ! ఈ విధంగా ఆరు పురుష, అయిదు స్త్రీ, అయిదు నపుంసక  సంఙ్ఞలు  కలవి. వాటిని ఈ దిగువ పట్టికద్వారా  సులువుగా  అర్థం చేసుకోవచ్చు.
 

పురుష సంఙ్ఞ  మూర్తులు. స్త్రీ సంఙ్ఞ  మూర్తులు. నపుంసక  సంఙ్ఞ  మూర్తులు.
౦     ౦     ౦     ___       ౦          ౦

__   ___    ౦     ౦        ౦         ౦

__    ౦    __    __     __       __     ౦     __    ౦    ___     __      __

__    __    ___       ___        ___

౦    ___   ___      ___          ౦

__   ___     ౦        ౦           ౦

౦    ౦      ___       ౦             ౦

___   ౦      ౦   ___    ౦

___   ___   ___    ౦     ౦

___   ___    ౦     ౦      ౦

___     ౦     ౦    ___     ౦


మూర్తుల  గ్రహ సంబంధములు, వాటి స్థానములు, అవధి గురించి యీ దిగువ పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు.
 

నెంబరు మూర్తుల పేర్లు స్వామి గ్రహం స్వస్థానము పగటి  అవధి రాత్రి  అవధి
1 ఉష్ణగు+తీక్ష్ణాంశు సూర్యుడు నాల్గవ స్థానం రవి వారం గురువారం
2 దైత్యగురు+కవి శుక్రుడు రెండవ స్థానం శుక్ర వారం మంగళ వారం
3 సౌమ్య + బోధన్ బుధుడు మూడవ స్థానం బుధ వారం రవి వారం
4 విధు + శీతాంశు చంద్రుడు మొదటి స్థానం సోమవారం శుక్ర వారందీ
5 మందగ్ +సౌరి శని ఏడవ స్థానం శని వారం బుధవారం
6 వాగ్మి +సూరి బృహస్పతి ఆరవ స్థానం గురువారం సోమవారం
7 లోహిత్+ఆర్ మంగళ్ (కుజుడు) అయిదవ స్థానం మంగళవారం రవివారం
8 పాత్ +చక్ర రాహు, కేతు స్థానం లేదు శనివారం మంగళవారం


ప్రశ్న భేదనకి ఉపయోగపడే ఉపకరణాలు:
ప్రశ్న చెప్పడానికి ఉపయోగపడే ఉపకరాణాలు ఆరు రకాలు. 1. ఇన్కిలాబ్ 2. బలాబల్  3. మరతీబ్ 4 ఇమ్తిజాజ్, 5 తసీర్, 6. తకరార్. వీటిలో  రెండవదైన, ‘బలాబలములు’ గురించి సూచన ప్రాయంగా చెప్పడం జరిగింది. సందర్భాన్ని బట్టి, వివరంగా చెప్పుకోవచ్చు. పోతే ఇన్కిలాబ్ గురించి తెలుసుకొందాం.


ఇన్కిలాబ్ : పాచికల ద్వారా గాని, లేదా తదితర ప్రత్నామ్యాయాల ద్వారా గాని, ’ప్రస్తారం’ లేదా ’జాయచా’ వేసుకొన్నాక ఆ ప్రస్తారం నుండి ‘ఇన్కిలాబ్’ని తయారు చేసుకోవాలి. ఇన్కిలాబ్  వేయనిదే ప్రశ్నకి జవాబు సరిగా చెప్పడం కుదరదు ! దీనిని తయారు చేసుకొనే విధానం ఏమిటంటే ? ప్రస్తారంలోని  మెదటి, ఖానాలోని మూర్తిని అయిదవ ఖానా లోని మూర్తితోను, రెండవ ఖానా లోని మూర్తిని ఆరవ ఖానా లోని మూర్తితోను, మూడవ ఖానా లోని మూర్తిని ఏడవ ఖానా లోని మూర్తితోను, నాలుగవ ఖానా లోని మూర్తిని ఎనిమిదవ ఖానా లోని మూర్తితోను గుణకారించి, (1 ఇంటు 5, 2 ఇంటూ 6,  3 ఇంటూ 7, 4 ఇంటూ 8)  అలా వచ్చే నాలుగు మూర్తులని, ‘మాతృ పంక్తి ( ఉమాహంత్ )’ లోని మూర్తులుగా భావించి, మరొక ప్రస్తారం తయారు చేసుకోవాలి. దీనినే  ఇన్కిలాబ్ అంటారు. ప్రశ్నకి జవాబు చెప్పేటప్పుడు, మూల ప్రస్తారాన్నీ, దాని ఇన్కిలాబ్ ప్రస్తారాన్నీ విడివిడిగా శోధించి రెండింటి ద్వారా లభించిన జవాబుని విశ్లేషించిన తరువాతనే ఫలితం చెప్పాలి.


ఇన్కిలాబ్ వెయ్యకుండా చెప్తే, సరి అయిన ఫలితాన్ని చెప్పినట్లు అవదు ! అయితే ఎంతో అనుభవం సంపాదించిన ‘రమలఙ్ఞులకి’ ఇన్కిలాబ్ వెయ్యవలసిన  అవసరం లేదు. ఇంకా మూక ప్రశ్నలకీ, ముష్టిగత వస్తు ప్రశ్నలకీ, అవధి గురించి వేసే ప్రశ్నలకీ ,దొంగ పేరు  తెలుసు కోవాలని అడిగే ప్రశ్నలకీ,‘ ఇన్కిలాబ్’ వెయ్య వలసిన అవసరం లేదు. ఇన్కిలాబులో పదిహేనవ ఖానాలోని మూర్తి  ఎప్పుడూ ,‘జమాత్’ మాత్రమే వస్తుంది. (జమాత్  నాలుగు  రేఖలతో ఏర్పడే  మూర్తి). ఈ జమాత్  శుభ మూర్తుల గుణకారం వల్ల ఏర్పడితే  శుభ ఫలితాన్నీ, ఆశుభ మూర్తులని గుణించగా ఏర్పడినట్లయితే, అశుభ ఫలితాన్నీ  సూచిస్తుంది. మిశ్రమ  మూర్తులతో  ఏర్పడితే మిశ్రమ ఫలితాన్నీ చెప్పాలి.


మరాతివ్ : మరాతివ్ ఉపకరణంలో  అయిదు బేధాలు చెప్పబడ్డాయి. 1. నాలుగు బిందువులు  ఉండే మూర్తులని ‘ ‘రువాయీ’ లని అంటారు. 2. అయిదు బిందువులుండే మూర్తులని ‘ ఖుమాసీ’ లని అంటారు. 3. ఆరు బిందువులుండే మూర్తులని, ‘ సుదాసీ’ అని అంటారు. 4. ఏడు బిందువులుండే మూర్తులని ,’ సువాయీ’ అని అంటారు. 5.ఎనిమిది బిందువులుండే మూర్తులని, ‘ సమానీ’ లని అంటారు. వీటి  పేర్లలోనే  వీటి శుభాశుభ ఫలితాలు దాగి ఉన్నాయి. వీటిలో సుదాసీ, సువాయూలు శుభ ఫలితాలనీ, సమానీ మిశ్రమ ఫలితాన్నీ.రువాయూ, ఖుమాసీలు అశుభ ఫలితాల్నీ  ఇస్తాయి..


ఈ వివరణ విన్నాక, సహజంగానే సందేహం కలుగుతుంది. ఒకే  ఒక మూర్తిలో నాలుగు బిందువులు ఉన్నాయి కదా, మరి 5, 6, 7, 8 బిందువులు ఎక్కడినుంచి వచ్చాయి ? అని. దీనికి ‘రమల్’ ఇచ్చే సమాధానం ఏమిటంటే ‘ రేఖ’ రెండు బిందువులద్వారా  ఏర్పడుతుందని ! అందు వల్ల  5, 6, 7, 8 బిందువులుండే  మూర్తులు కూడా ఉంటాయి అని.


దీనిని పట్టిక ద్వారా తెలుసుకొందాం. 5, 6, 7, 8 బిందువులండే మూర్తులు, వరుసగా చూపబడ్డాయి.

__      ౦      ౦        ౦

౦      __      ౦        ౦

౦       ౦     __        ౦

౦       ౦      ౦       __

__     ౦        ___      ౦

__     ౦         ౦      ___

౦     ___        ౦      ___

౦     ___       ___      ౦

__     ౦         ___    ___

__     ___         ౦    ___

__     ___       ___     ౦

౦     ___        ___    __

___

___

___

___


ఇమ్తిజాజ్: రెండు మూర్తుల గుణకారం చేత ఏర్పడిన మూర్తినే ‘ఇమ్తిజాజ్ ’ అంటారు. ఈ ఇమ్తిజాజ్  శుభ మూర్తుల గుణకారం వల్ల ఏర్పడితే  శుభ ఫలితాన్నీ, ఆశుభ మూర్తులని గుణించగా ఏర్పడినట్లయితే, అశుభ ఫలితాన్నీ

సూచిస్తుంది. మిశ్రమ  మూర్తులతో  ఏర్పడితే మిశ్రమ ఫలితాన్నీ చెప్పాలి

 

తసీర్: ఇది ఉపకరణాలన్నిటి లోనూ  ప్రధానమైనది. దీనిని తెలుసుకొంటేనే గాని ప్రశ్న ఫలితాన్ని చెప్పలేము. ప్రస్తారంలో మెదటీ ఖానా ఎప్పుడు  ప్రశ్న కర్త ( పృఛ్చకుణ్ని) సూచిస్తూంది. అతని  వ్యక్తిగత ప్రశ్నలన్నింటికే దానినే ప్రధానంగా అంటే లగ్నంగా  భావించి ఫలితాలు చెప్పాలి. అతని బంధు వర్గానికి సంబంధించిన ప్రశ్నల  కోసం లగ్నం మారి పోతుంది.

ఉదాహరణకి ఒక  వ్యక్తి  వచ్చి, తన కుమారుని బావమరిదికి ధన లాభం కలుగుతుందా లేదా , అని అడిగాడని అనుకొందాం.

మెదటి ఖానా ప్రశ్న కర్తని, అక్కడినుండి పంచమ స్థానం అతని కుమారుణ్నీ, అక్కడినుండి  ఏడవ స్థానం పుత్ర వధువునీ, అక్కడినుండి తృతీయ  స్ఠానం  ఆమె తమ్ముణ్నీ (బావమరిదిని) సూచిస్తుంది. అంటే 13 వ ఖానా బావమరది అయింది (1నుండి 5 అంటే 5 అక్కడ నుండి 7 అంటే 11 అక్కడనుండి 3 అంటే  13) బావమరిది యొక్క ధన స్థానం  13 నుండి 2 అంటే  14 వ ఖానా అవుతుంది ! ఈ విధంగా మానవ  సంబంధాలనీ, అవసరాలనీ ప్రశ్నకి అనుకూలంగా మార్చుకోవడమే ‘తసీర్’.

 

తకరార్: ఒక ఖానా లోని మూర్తి మరొక స్థానంలో  తిరిగి రావచ్చు. అలా  ఎన్ని సార్లైనా రావచ్చు. దీనినే  తకరార్ అంటారు. శుభ ఫలితాన్ని ఇచ్చే మూర్తి  ఎన్ని సార్లు  పునరుక్తి (తకరార్) అవుతే అంత మంచిది అని భావించాలి. ఆశుభ మూర్తుల విషయానికి వస్తే తకరార్ మంచిది కాదు !


కొస మెరుపు: ఒక రమలఙ్ఞుడు  నదిలో స్నానం చేసి, ఒడ్డున ఇసుకలో  ఎండ కాగుతూ, ఆ రోజు తన దగ్గరకు  ఎంత మంది  ప్రశ్నకర్తలు (పృఛ్ఛకులు ) వస్తారో  తెలుసుకొందామని, చేతిలో  పాచికలు లేని కారణంగా, ఆ ఇసక మీదనే, నూరులో  నాలుగు సంఖ్యలు తలచుకొని వాటిని పదహారు చేత భాగించి వచ్చిన  శేష సంఖ్యలతో  జాయచా (ప్రస్తారం) వేసాడు !


ఆ ప్రస్తారంలో ఎన్ని మూర్తులు స్వగృహంలో  ఉన్నాయో  అంత మంది వస్తారనీ, వాటిలో స్త్రీ పురుష సంఙ్ఞలను బట్టి  వచ్చేవారి లింగ భేదాన్ని తెలుసుకొన్నాడు. ఈ ప్రశ్నకి ఉదాహరణ అవసరం లేదు, కేవలం స్థానం, సంఙ్ఞల గుర్తింపు కోసం చెప్పడం జరిగింది. పాఠకులు స్వయంగా పరిశీలించ వచ్చు. (దీనికి  ఇన్కిలాబ్ వేయాల్సిన అవసరం లేదు)

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.