Monthly Archives: October 2011

సమస్యాపూరణములో అర్థశక్త్యుద్భవధ్వని చర్చ

“ధ్వని సిద్ధాంతములో అవివక్షితవాచ్యధ్వని అని ఒకటి ఉన్నది. వాచ్యార్థముచేత మాత్రమే కాక లక్ష్యార్థము వల్ల అర్థాంతర స్ఫూర్తి కలిగితే అది అవివక్షితవాచ్యధ్వని అంటారు(ట). అది రెండు విధాలు…” -అంతర్జాల కవిసమ్మేళనం నేపథ్యంలో ’ధ్వని’ మీద జరిగిన ఒక అర్థవంతమైన చర్చను పొద్దు పాఠకులకోసం సమర్పిస్తున్నాం. Continue reading

Posted in కవిత్వం | Tagged , | 2 Comments

దివ్య దీపావళి

నీ ఈవికి గుర్తుగా ఇలలోన గొప్ప పండుగ చేస్తారు. దీపావళి పేరున వెలిగింతురు దీపాల వరుసలెన్నో – నీ కన్నీటి చినుకులే దీప కళికలై వెలిగి ఇంటింట! చీకట్లు తొలగించి కాంతిని వెలయించును జగాన !! – దీపావళి కవిత, మీకోసం. Continue reading

Posted in కవిత్వం | Tagged , | 1 Comment

మృతజీవులు – 33

“మూడునాలుగు రోజులు తాళి, అతను కమిటీకివెళ్ళి, డైరెక్టరునుచూసి, ‘తమరు నాకేం సహాయం చెయ్యబోతున్నారో తెలుసుకునేందుకు వచ్చాను, నాకు చేసిన జబ్బులూ, తగిలిన గాయాలూ మూలాన రక్తం ధారపోశానన్నమాట…” – పోస్టుమాస్టరు రసవత్తరంగా చెబుతున్న కెప్టెన్ కపేయ్కిన్ కథ మృతజీవులు పదో ప్రకరణంలో చదవండి. Continue reading

Posted in కథ | Tagged | Comments Off on మృతజీవులు – 33

శారదా విజయోల్లాసము – 2

శ్రీఖర విజయదశమికి పొద్దు నిర్వహించిన పద్యకవి సమ్మేళనం విశేషాలు – రెండవ భాగంలో బాపు బొమ్మను వర్ణిస్తూ కవులు చెప్పిన పద్యాలు చదవండి. అలాగే ఇంట్లో కరెంటు పోయినపుడు టీవీ సీరియల్ చూసే వనితల హృదయవిదారకమైన వేదన కూడా కవుల వర్ణనలో చదవండి. Continue reading

Posted in కవిత్వం | Tagged , | 2 Comments

మీ కందం – పారిజాతాపహరణములోని యొకకందము

తెలుగుపద్యాలలో కందానికి ఒక ప్రత్యేక స్థానము ఉన్నది. క్రొత్తగా కవితలు, పద్యాలు అల్లేవారిని కాస్తోకూస్తో బెంబేలెత్తించేటట్టు కనబడే లక్షణాలు కందానికి ఉన్నాయి. ఆ భయాన్ని వీడి ముందుకు సాగితే కందాల్ని సులభంగా అల్లుకుపోవచ్చు. – మీకు నచ్చిన కంద పద్యం వ్యాసాల వరుసలో లంక గిరిధర్ గారికి నచ్చిన కంద పద్యం గురించి చదవండి. Continue reading

Posted in వ్యాసం | Tagged | 2 Comments

శారదా విజయోల్లాసము – 1

శ్రీఖర విజయదశమికి పొద్దు నిర్వహించిన పద్యకవి సమ్మేళనం విశేషాల మొదటి భాగమిది. ప్రార్థనతో పాటు మరో మూడు సమస్యల పూరణలను ఈ భాగంలో సమర్పిస్తున్నాము. అవధరించండి. Continue reading

Posted in కవిత్వం | Tagged , | Comments Off on శారదా విజయోల్లాసము – 1

శారదా విజయోల్లాసము

శ్రీఖర సంవత్సర విజయదశమి సందర్భంగా పద్య కవుల సమ్మేళనం “శారదా విజయోల్లాసము” నిర్వహించాం. 12 మంది పద్యకవులు పాల్గొన్న కవితాగోష్ఠి సెప్టెంబరు 17 న మొదలై, అక్టోబరు 1 వ తేదీ శనివారం నాడు జరిగిన ప్రత్యక్ష సభతో విజయంతంగా ముగిసింది. అనేక గంటలపాటు రసోల్లాసంగా జరిగిన ఈ సభ విశేషాలను తెలిపే వ్యాసాలను ఈ వ్యాసంతో మొదలుపెడుతున్నాం. Continue reading

Posted in కవిత్వం | Tagged , | 2 Comments

మీ కందం

కందం గురించి తెలుఁగు పద్యకవులకు చెప్పడమంటే తెలుగువాడికి గోంగూరపచ్చడి గురించి చెప్పడమన్నంత దోషం. తెలుగు సాహిత్యంలో మీకు నచ్చిన కందపద్యం ఒకదాని గురించి చెప్పి, ఆ పద్యం ఎందుకు నచ్చింది? ఆ వెనుక కథాక్రమంబెట్టిది? మొదలైన వివరాలను అందించండి. మరిన్ని వివరాల కోసం ఈ వ్యాసం చదవండి. Continue reading

Posted in వ్యాసం | Tagged , | 2 Comments

సత్యప్రభ – 1

“ఈ భ్రమ వల్ల వానికి కొత్త ఉత్సాహం పుట్టింది, వాని శిరసు మిన్నుని అంటింది, వాని భుజస్కంధాలు ఉబికాయి, వాని వక్షో దేశం విశాలమయింది. వాని కండ్లలో భావతరంగాలకు మితిలేక పోయింది. వాడు పూర్తిగా కామునికి వశమైపోయాడు. కాని ఆ సంగతిని వాడు గ్రహించి ఉండలేదు. తన ఎదుట నిలబడి ఉన్న సుందరి తనను ప్రేమిస్తోందనే భావం మాత్రమే వానికి గోచరిస్తూంది.” – సత్యప్రభ చారిత్రిక నవల మొదటి భాగం చదవండి. Continue reading

Posted in కథ | Tagged , | 6 Comments