Monthly Archives: January 2010

ఉత్పరివర్తనం

“ఆకస్మికముగా సంభవించే గుణాత్మక వైవిధ్యములను ఉత్పరివర్తనములు అందురు..” నిశ్శబ్దంగా ఉన్న క్లాసు రూములో ఖంగుమంటోంది మధు సార్ గా పిలవబడే రాజా మధుసూదన వరప్రసాద రావు గొంతు. పల్లెకి ఎక్కువ, పట్టణానికి తక్కువగా ఉన్న ఆ ఊరి ఎయిడెడ్ స్కూల్లో ఏడో తరగతి లోకి అడుగు పెట్టబోతున్న పిల్లలంతా తల వంచుకుని శ్రద్ధగా నోట్సు రాసుకుంటున్నారు. … Continue reading

Posted in కథ | 20 Comments

చివ్వరి చరణం

– శ్రీరమణ “ఇట్నించి పొద్దున ఫ్లైట్ లేదు. అట్నించి మర్నాడు సాయంత్రం గాని లేదు. సో, ప్రయాణంలో రెండ్రోజులు. . . అంటే యిక్కడ కనీసం పది రికార్డింగులు ఆగిపోతాయి. పైగా అక్కడ గాలిమార్పు, తిండిమార్పు, స్ట్రెయిను సరే సరి. మీరేమో యీ అంకెకే ‘అమ్మో’ అంటున్నారు. అంతకు తగ్గితే నాకు వర్కౌట్ కాదు,” రికార్డింగ్ … Continue reading

Posted in కథ | 3 Comments

మృతజీవులు – 31

-కొడవటిగంటి కుటుంబరావు తొమ్మిదవ ప్రకరణం ఉదయాన, ఆ నగరంలో ఒకరినొకరు చూడబోవటానికి ఏర్పాటై ఉన్న వేళ ఇంకా కాకముందే, ఒక స్త్రీ పసందయిన గళ్ళ పైదుస్తు కప్పుకుని, నీలం రంగు గల స్తంభాలూ, వంగపండు రంగు పూతా కలిగిన ఒక ఇంట్లో నుంచి గబగబా వెలువడింది. ఆమె వెంట ఒక బంట్రోతు ఉన్నాడు, వాడి టోపీకి … Continue reading

Posted in కథ | Tagged | Comments Off on మృతజీవులు – 31

అద్వైతం

మూలా సుబ్రహ్మణ్యం ౧. అద్వైతం పౌర్ణమి నాడు పరిపూర్ణతనొందే రాత్రి ఆత్మ అమావాస్య నాడు శూన్యంలోకి అదృశ్యమౌతుంది ఏం ఏకత్వాన్ని దర్శించిందో ఒకేలా ఎగసిపడుతూ పిచ్చి సముద్రం! ౨. నక్షత్రాల దుఃఖం ప్రయాణించి ప్రయాణించి ఒక్క కన్నీటిబొట్టు లోతుల్లోకి చేరుకుంటాను మంచుబొట్టు తాకిడికే ముడుచుకుపోయే అత్తిపత్తి ఆకుల నిశ్శబ్దం నాలో ప్రవేశిస్తుంది రాత్రంతా దుఃఖించే నదీ … Continue reading

Posted in కవిత్వం | Tagged | 11 Comments

డిసెంబరు 2009 గడి ఫలితాలు – వివరణలు

ఈసారి 23 మంది నుంచి 27 పరిష్కారాలు అందాయి. చాలామంది (దాదాపు) అన్నీ సరిగా పూరించినా నిలువు 4 ఆధారంలోని అనాగ్రామ్ ను గుర్తించలేక తడబడ్డారు. అందువల్లేనేమో ఈసారి గడి సులభంగానే ఉన్నా అన్నీ సరిగా పూరించినవారెవరూ లేరు! అడ్డం 7లో వీరనారి కూడా చాలా మందిని తిప్పలు పెట్టింది. ఒక తప్పుతో పూరించినవారు భమిడిపాటి … Continue reading

Posted in గడి | Tagged | Comments Off on డిసెంబరు 2009 గడి ఫలితాలు – వివరణలు

2010 జనవరి గడిపై మీమాట

2010 జనవరి గడిపై మీ అభిప్రాయాలను, సూచనలను ఇక్కడ రాయండి.

Posted in గడి | Tagged | 3 Comments

కాళ్లు పరాంకుశం

నా రాజమండ్రి ప్రయాణానికి మా ఇంట్లో పాత, కొత్త సామెతల మేలు కలయిక రివాజు. ”పని లేని బార్బర్‌కి పిల్లి తల. నీకు రాజమండ్రి” అంది బామ్మ. ”పుల్లయ్యకి వేమవరం. నీకు రాజమండ్రి. అన్నట్ల వేమవరం రాజమండ్రికి దగ్గిరే కదా! పని లేకపోవడంలో పని లేకపోవడంగా ఓ సారి వేమవరం కూడ వెళ్లొచ్చేయ్‌” అంది అమ్మ. … Continue reading

Posted in కథ | 5 Comments

శ్రీ రమణీయ చానెల్- రెండవ భాగం

ప్రతి మనిషికీ తను పుట్టి పెరిగిన ఊరు, బాల్యం లోని సంఘటనలు, వ్యక్తులు – వీటన్నిటి ప్రభావం తర్వాతి జీవితం లోని అభిరుచులూ, అలోచనా విధానం పై తప్పక ఉంటుంది. అదీ రచయితల విషయం లో ఐతే ఆ చిన్నతనపు జ్ఞాపకాలు ఎప్పటికీ తరిగిపోని ప్రేరణా, పెన్నిధీ కూడా. అటువంటి తమ పా’తలపోతల్ని’ మనతో కలబోసుకుని … Continue reading

Posted in వ్యాసం | Tagged , | 14 Comments

శ్రీ రమణీయ చానెల్ – మొదటి భాగం

ఆయన కథలు… శ్రావణ మాసపు నోముల్లో ఆది దంపతులు పోటీలు పడి పంచుకు తిన్న తాలింపు శనగలంత కమ్మగా ఉంటాయి. కవితల్నీ వచనాల్నీ ఆత్మలోకంటా చదివేసి పారడీ చేస్తే అసలు రచయితలు పెన్నులు తడుముకునేలాగుంటాయి. కొంటెగా చమత్కార చమక్ తారల్ని నిశ్శబ్దపు చీకట్ల మీద చల్లితే, నవ్వుల వెన్నెల్ని ఆరబోయించే చెకుముకి పత్రికా ఫీచర్లూ నడిపారాయన. … Continue reading

Posted in వ్యాసం | Tagged , | 17 Comments

2009 డిసెంబరు గడిపై మీమాట

2009 డిసెంబరు గడిపై మీ అభిప్రాయాలను ఇక్కడ రాయండి. ———————————-

Posted in గడి | Tagged | 5 Comments