సమానత్వం

– చావా కిరణ్

నిద్ర పోతున్న మారాజు మేల్కొంటాడు
కొలువు దీరి కలతలన్ని బాపుతాడు.

బీయీడీలు యంయీడీలు అయినా ఖాలీగున్నాం
పదయింది, పన్నెండయింది తరువాత ఏంటి?
బీడుభూములన్ని ఆవురావురమంటున్నాయి
శమంతకముంది గాని స్వర్ణమే నిలవడంలేదు.

నిద్ర పోతున్న మారాజు మేల్కొంటాడు
కొలువు దీరి కలతలన్ని బాపుతాడు.

బీయీడీలకు యంయీడీలకు ఉజ్జోగాలిత్తాడు
పదికి పన్నెండుకు విజ్ఞాన్నిస్తాడు
బీడు భూములకు నీళ్లిస్తాడు
శమంతకం పట్టి స్వర్ణం నిలుపుతాడు.

నిద్ర పోతున్న మారాజు మేల్కొంటాడు
కొలువు దీరి కలతలన్ని బాపుతాడు.

ఎండకు వానకు నే మగ్గుతుంటే
ఆ రాజ్యపోడికి తాటాకు గుడిసెలు
అయోమయాన నే నిలబడితే
వాడేమో పరుగెడతాడా.

నిద్ర పోతున్న మారాజు మేల్కొంటాడు
కొలువు దీరి కలతలన్ని బాపుతాడు.

వాడి గుడిసె పీకి
నాకు పందిరేస్తాడు
వాడి కాళ్లిరిచి
సమానత్వం తెస్తాడు.

నిద్ర పోతున్న మారాజు మేల్కొంటాడు
కొలువు దీరి కలతలన్ని బాపుతాడు.

This entry was posted in కవిత్వం. Bookmark the permalink.

6 Responses to సమానత్వం

  1. తెలంగాణా యోధుడు says:

    గుడిసె దగ్గరికెల్లిన మారాజు
    లోన చూసి అయినాడు బేజారు
    గుడిసె లో వుంది కొత్త బెంజి కారు
    గుడిసె లో వుంది ప్లాస్మా టీవీ
    షేర్ల దొంతరలు, డబ్బు పాతరలు
    ఏడ జూసిన పసిడి రాసులే

  2. chavakiran says:

    మారాజు ఇంకా నిద్ర లేలేదు కదా, గుడిసె దగ్గరకెళ్లడానికి !

  3. తెలంగాణాయోథుడు గారూ
    మీరు తెలుగు సినిమాలు చూడటం మానుకోరా?

  4. anigalla says:

    కిరణ్, ఇంతకీ ఆ నిద్ర లేచిన మారాజు ఎవరు? 🙂
    ఆ ఉద్యమం లో ఉన్న రాజకీయ నాయకులు అందరూ నా? లేక KCR ఆ ?
    ఎవడైనా కానీ, కవిత బాగుంది.

  5. chavakiran says:

    నిద్రపోతున్న మారాజు అనేది యూరోప్ జానపదంలో ఒక కథ, అయితే కొన్ని సమాజాలు మారాజు ఎప్పటికైనా నిద్రలేచి మా సమస్యలు తీరుస్తాడు అని అన్ని సమస్యలూ పోస్ట్ పోన్ చేసుకోసాగారు. దానితో వెనకబడిపొయ్యారు.

    ఇక్కడ నిద్రపోతున్న మారాజు వస్తుందో రాదో తెలీని తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం

Comments are closed.