ఎదురు చూపు

-రవి వీరెల్లి

నీ తలపు
ఎక్కడో పచ్చికబయల్లో పారేసుకున్న మన పాత గురుతులని
ఎదకు ఎరగా వేసి పద పదమని పరుగు పెట్టిస్తుంది

నీ ద్యాస
స్మృతుల శ్రుతిలో స్వరాలాపన చేస్తున్న నా హృదయ లయను
గమకాల అంచుల్లో తమకాల ఉయ్యాలలూపుతుంది

నీ ఊహ
మొగ్గలాముడుచుకున్న జ్ఞాపకాలని బుగ్గరించి విరబూయించి
అనుభవాల రెక్కల చిరుజల్లుగా చిలకరిస్తుంది

నువ్వొస్తావన్న ఆశ

నిశ్చల నీలి సంద్రంలా నిద్దరోతున్న నా మదిని
ఊరించే కోరికల పెను ఉప్పనలో ముంచెత్తుతుంది

ఇదిగో, కాలం వదిలివెళ్ళిన జ్ఞాపకాల నీడల్లో
నీకై ప్రతీక్షించే నాకు వృద్దాప్యం వచ్చిన అలికిడే వినిపించలేదు
నీ ప్రేమే ప్రేరణై
నీ తలపే ప్రాణమై
నీ ఊసే ఉపలాలితమై
తన ప్రతీ స్పందనలో నీకై పరితపించే నా గుండెకు
ఇంకా ఆశల కొనఊపిరిలూదుతూనే ఉన్నా

—————

రవి వీరెల్లి, ఐ.టి ఆర్కిటెక్ట్ గా పనిచేస్తూ రోనోక్, వర్జీనియాలో నివసిస్తున్నారు. తెలుగంటే ప్రాణం, అందులోనూ కవితలంటే మరీ ఇష్టం.

రైతుబిడ్డగా పుట్టిన ఆయనకు ఎప్పటికైనా సొంతఊరు (ఆముదాలపల్లి)  వెళ్లి వ్యవసాయం చేస్తూ రైతుగా బ్రతకాలని కోరిక!

This entry was posted in కవిత్వం and tagged . Bookmark the permalink.

9 Responses to ఎదురు చూపు

  1. padmarpita says:

    చాలా బాగుందండి!

  2. manju says:

    baagundi mee eduruchupulu kavita…

  3. డా.పులిపాటి గురుస్వామి says:

    రవి, బాగా రాశావ్ …..
    ఇంకా వృద్ధాప్యం రానట్టుంది కదా/…..
    ఉపలాలితం ……నచ్చింది.

  4. Chakkati aalochana.

  5. harikrishna says:

    కవిత bagundhi,
    yeppatikyna vevasayam cheyalandam enka bagundhi..

    meku తెలుగంటే ప్రాణం ani epude chadivanu
    enka enka bagundhi….

    memu telugu bhasa rakshana lo baganga
    తెలుగు రక్షణ వేదిక.ORG arpatu chesam..
    salahalu suchanalu pampandi…

  6. Dr Prakash says:

    Mee eduruchoopuku prathiphalamu thappakunda athi thvandaralone andaalanee, anduthundanee korukuntoo, meeku naa abhinandanalu!

  7. ramnarsimha putluri says:

    Sir,

    Your poem is very excellent..

    RPUTLURI@YAHOO.COM

  8. ramnarsimha putluri says:

    Harikrishna garu.. I am also a big fan of MOTHER-

    TONGUE..

    Plz kindly inform abt yr activities..

    ..8099991076

    RPUTLURI@YAHOO.COM

  9. ఉష says:

    “నువ్వు” ఉన్నావన్న వాస్తవం ఎన్ని రకాలుగా హృదయాన్ని ఎదురుచూపులో నిలపగలదో అన్నీ చెప్పేసారు, ఒక్కటి తప్పా.. అదే ‘కల’ – ఎదురుచూపులో జారే నిదురలోనూ కల తప్పదు, ఆ కలలోనూ తప్పనిది మళ్ళీ “ఎదురుచూపు.” ఈ ప్లేన్ లో మనగలిగితే తప్పా అర్థం కాని ఎమోషన్స్ చక్కగా వెలువరిమ్చారు.

Comments are closed.