2009 మార్చి గడిపై మీమాట

2009 మార్చి గడిపై మీ అభిప్రాయం ఇక్కడ రాయండి

పాత గడులు

———————————-

This entry was posted in గడి and tagged . Bookmark the permalink.

24 Responses to 2009 మార్చి గడిపై మీమాట

  1. కంది శంకరయ్య says:

    మార్చి గడి చాలా సులభంగా ఉందనుకున్నా. అన్నీ నింపాను. కాని 19 అడ్డం, 19 నిలువు, 26 నిలువు మాత్రం మిగిలాయి. బాబ్బాబు…. ఎవరైనా క్లూ ఇస్తారా.. పుణ్యముంటుంది.

  2. కంది శంకరయ్య says:

    తొందరపడి 19 అడ్డం, నిలువు రావడం లేదన్నాను. చాలా ఈజీ. 26 నిలువు మాత్రం ఇబ్బంది పెడుతోంది. ఇంట్లో మొగుడిగా నేను మౌనంగా ఉండడం మా ఆవిడ విపరీతంగా నోరు చేసికొనడం నాకు అనుభవమే. అయినా క్లూ దొరకడం లేదు.ఇంకా చాలా టైం ఉందికదా. చూద్దాం.

  3. ఒక

    ఒకటి అడ్డం మూడు నిలువు రావడంలేదు. ఎవరైనా కొంచెం క్లూ ఇవ్వండి ప్లేస్.

  4. కంది శంకరయ్య says:

    26 నిలువు కూడా వచ్చేసింది. మొగుడు మౌనంగా ఉండడమంటే ( నా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని) పెళ్ళాం గయ్యాళి అనుకున్నా.నిజానికి ఈసారి గడి చాలా సులభంగా ఉంది. నిన్ననే పూర్తిచేసి పంపడం జరిగింది.

  5. కంది శంకరయ్య says:

    భాస్కరనాయుడు గారూ,ఒకటి అడ్డానికి సినారె లాంటి సినీకవిని ఊహించుకోండి. మూడు నిలువుకు పంచతంత్రంలొని కరటక దమనకుల వంటి పురాణ సోదరులను ఊహించుకోండి.

  6. కంది శంకరయ్య says:

    భాస్కర నాయుడు గారూ, మీరు 1అడ్దం, 3నిలువు రావడం లేదు, ఎవరైనా క్లూ ఇవ్వండి అన్నారు. బాగుంది. కాని మీకంటె ముందుగా నేను 26 నిలువు రావడం లేదన్నాను. అది మీకు తెలిసిందే కదా. దాని క్లూ నాకెందుకు ఇవ్వలేదు? తెలిసినదాని క్లూ ఇవ్వకుండా మీకు తెలియనిదాని క్లూ అడగడం న్యాయమేనా? ఏదో మాటవరసకు అడిగాను. ఏమీ అనుకోకండి.

  7. శంకరయ్యగారు….
    నిజానికి ౨౬ అడ్డం నాకింకా రాలేదు. అన్నిటికి క్లు అడిగితే బాగుండదాని అడగలేదు.
    ఒకటి అడ్డం రాలేదనుకున్న ఐదునిముశాలల్లో వచ్చెసింది.మీరు వెంటనే స్పందించినందుకు నెనర్లు. మొత్తానికి ఇంకా నాకు నాలుగింటికి సమాదానాలు రావాల్సివుంది. అవి ౯, ౧౩,౩౮ మరియు ౩౯ చూద్దాం. కొంచెం కూడ శ్రమపడకుండా ఉంటె మజా ఉంటుందా… ఇంకా సమయం ఉంది కదా,,..

  8. కంది శంకరయ్య says:

    నాయుడు గారూ, ఎలాగూ సమయం ఉంది, ప్రయత్నిస్తానన్నారు కదా. అందుకే క్లూలు ఇవ్వడం లేదు. అన్నట్టు మీ సందేశంలో తెలుగు సంఖ్యలు ఎలా వచ్చాయి? లేఖినిలో నాకు రావడం లేదు. మీరు ఏ ఫాంటును, ఎలా ఉపయోగిస్తున్నారు? తెలియజేస్తే ధన్యుణ్ణి.

  9. శంకరయ్య గారు…………….
    తెలుగులో అంకెల గురించి……. నేను నా యంత్రంలో బరహ ఐమ్ఇ అనే దాన్ని పొందు పరచాను. దాంతో అక్శరాలతోబాతు అంకెలుగూడ తెలుగులోనె
    వస్తాయి. ఇది అన్ని భారత భాసలలొనూ వుంది. మీరూ ప్రయత్నించండి.
    నాకు ఇంకా నాలుగింటికి సమాదానాలు రావాలి. సమాదానాలు వచ్చిన వాటిలో
    మూడింటి సమాదానాలు అనుమానంగా వుంది. ఎలాగంటె ౧౯ నిలువు కు సమాదానం వచ్చింది గాని అందులో చివరి అక్శరం అడ్డం సమాదానానికి సరి పోవడం లేదు. ఇంకా సమయం వుంది గదా అప్పుడు క్లులు అడగదామను కుంటున్నాను. మీరిచ్చిన క్లు కి నెనర్లు. కాని నాకు సమాదానం తట్ట లేదు.

  10. కంది శంకరయ్య says:

    భాస్కర నాయుడు గారూ, మీకూ, పొద్దు సంపాదకులకు, పాఠకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఏమిటీ విచిత్రం? ఈసారి గడికి సంబంధించిన చర్చలో కేవలం మనమిద్దరమే పాల్గొన్నాం. ఇంకెవరూ గడిని పూరించలేదా? పూరించినా, వాళ్ళెవరికీ గడి చర్చలో పాల్గొనే ఉత్సాహం లేదా? మీరు ఇంకా నాలుగింటికి క్లూలు దొరకడం లేదన్నారు. ఎలాగూ నెలాఖరు. అందుకని క్లూలు ఇస్తున్నాను.
    ౯ (అడ్డం)- దోసెడు రక్తం మాత్రమే విరాళం – పదాద్యక్షరాలు.
    ౧౩ (అడ్డం)- దేనిని ఎన్నకుండా అపకారికి ఉపకారము చేసినవాడు నేర్పరి అవుతాడు?
    ౩౮ (అడ్డం)- హెడ్ లో ఏవి చేరితే కొరగడమే బెస్ట్ మందు?
    ౩౯ (అడ్డం)- ప్రథమావిభక్తి ప్రత్యయాలు …

  11. కంది శంకరయ్య says:

    నాయుడు గారూ, ౩౪ (అడ్డం) ప్రథమా విభక్తి ప్రత్యయాలలో రెండవది.

  12. శంకరయ్య గారు…. మీకు ఉగాది శుభాకాంక్శలు.
    మీరన్నట్టు ఈసారి మనిద్దరమే ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. వీరికింకేం పని లేదనుకుంటారేమోనని కాక్కోంచెం ‘గిలి’ గా వుంది. అయినా అడుగుతున్నా.. ౧౬ అడ్డం ౩౩ నిలువు కు కొంచెం క్లు ఇవ్వండి దయచేసి.

  13. కంది శంకరయ్య says:

    నాయుడు గారూ,
    ౧౬ (అడ్డం) – తకారం లోపించివ చిరంజీవి రెండక్షరాల చిత్రం. మీరు సుంతైనా ఆలోచించారా?
    ౩౩ (నిలువు) – కరుణ లేని శ్రీదయానిధి కనిపిస్తాడా?

  14. నాకు రెండు సందేహాస్పదంగాను, రెండు పూర్తి గాను రావడంలేదు. ఎవరైనా కొంచెం క్లూ ఇస్తారని ఆసిస్తున్నాను. అవి. ౩౭ , ౧౬ // అడ్డం ౧౩, ౨౬ నిలువు.

  15. Srilu says:

    26 నిలువు ,
    21 నిలువు ఏది నిండితే ఉగాది?
    12 నిలువు,
    29 నిలువు పంచకం అయితే 34 అడ్డానికి సరిపోవటం లేదు 🙁

    శంకరయ్య గారు ,భాస్కర్ గారు మీలో ఎవరికైనా ఈ క్లూలు తెలిస్తే చెప్పరా ప్లీజ్ !

  16. శ్రీలు గారు…………….౨౬ నిలువు నాకూ రాలేదు.శంకరయ్య గాఅరె మనల్ను ఆదుకుంటారు. ౨౧ నిలువుకు సమాదానం మీప్రశ్నలోనె చివర్లో వుంది గద.
    ౧౨ నిలువు సమాదానం గడికిచ్చిన క్లూ లోనె తిరిగివుంది.౨౯ నిలువు కు సమాదానం చివర్లో ’కం”కాదనుకుంత గోవు నడగండి. మరి నా సొదేహాలకు క్లూ లివ్వరా. అవి ఏవంటె చిరన్జీవి సినిమా, వారి వెంట్రుకలు ఏవి, పెళ్ళాం ఏమౌతుంది? ఛౌకె పె …ఏమిటో? సమయమం ఆసన్నమైంది. త్వారగా ప్లేస్.

  17. Srilu says:

    ధన్యవాదములు భాస్కర్ గారు క్లూ లు ఇచ్చినందుకు 🙂
    చిరంజీవి తో ఊర్వశి నటించిన రెండు అక్షరాల చిత్రం లో ఒత్తు తీసేస్తే ఒస్తుంది.

    అల్రెడీ మీకు 13 అడ్డం ,19 అడ్దం వచ్చేసి ఉంటాయి కాబట్టి పైన ఇచ్చిన క్లూని బట్టి వారి వెంట్రుకలు ఏవో ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.

    26 నిలువు భార్య ఏమౌతుంది అనేది నాకు సరిగ్గ తెలియటం లేదు ఎక్కువగా మాట్లాడుతుందా?
    37 అడ్డం చౌకేపె నాకూ తెలియదండి 🙁

  18. కంది శంకరయ్య says:

    ౩౭ (అడ్డం) – క్రికెట్ లో ఫోర్లు, సిక్సర్లు కొట్టే యోధుడు – వాని ధోరణి ఆదే.
    నాయుడు గారూ! శ్రీలు గారూ! ఇవిగో క్లూలు ఇస్తున్నాను. బెస్ట్ ఆఫ్ లక్!
    ౧౬ (అడ్డం) – అపరాధ ఫీజు … ఆలస్య ఫీజు … మీరు సుంత ఈ వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే చాలు.
    ౧౩ (నిలువు) – శ్రీకాకుళాంధ్ర దేవుడు వైఖానసోక్తికి వంచన రాకుండా ఇవి చూపించాడట! ఆ దేవుని నెనరులు మనపై ఉంటే సరి.
    ౨౬ (నిలువు) – మౌనంగా ఉండేవాని భార్య. ఆరుంధతి ఎవరు? ఆనసూయ ఎవరు?
    ౨౧ (నిలువు) – రైతుకు ఇది నిండితేనే పండగ – గారెలు దినడం (పదాద్యక్షరాలు)
    ౧౨ (నిలువు) – ఈమె కొడుకులు కనుకనే రాక్షసులు దైత్యులయ్యారు. ఇది తినరాదంటే చూడరా?
    ౨౯ (నిలువు) – ఆస్తిని పంచి తండ్రి పోయాడట! మధ్యలో వెదుక్కో.

  19. అయ్యో…టైమయిపోతోంది….గోవునడిగితే తెలిసింది కానీ,అడ్డంగా వాదిస్తే తేరు చివరకు ఎలా చేరుతుందో..తెలియడం లేదు..చెప్పేద్దురూ ప్లీజ్..ఎవరికయినా తెలిస్తే…

  20. కంది శంకరయ్య says:

    సుధారాణి గారూ,
    34(అడ్డం) – వితండమునందు వికారంబు లోపించిన గుంపు దృష్టిగోచరంబగు.
    35(నిలువు) – కడతేరులో రథం పోగా మిగిలిన రెండక్షరాలు శీర్షాసనం వేసాయి.

  21. కృతజ్ఞతలు శంకరయ్యగారూ…వి ఎందుకు లోపించాలో అర్థంకాక గుంపుకనిపించలేదు.మీరు చెప్పిందే రాసి పంపిస్తా..

  22. swarupkrishna says:

    10 niluvuku klus plz

  23. కంది శంకరయ్య says:

    స్వరూప్ కృష్ణ గారూ,
    10(నిలువు) – మామా యిది తగునా (పదాల అపక్రమం). ఇప్పటికీ తెలియకపోతే రాముడు-భీముడు చిత్రంలో రమణారెడ్డి “పో పో పొమ్ము పొమ్మికన్ – నా గృహంబునకు రావలదు, రాతగదు” అంటూ వెళ్ళగొడితే రేలంగి ఏమని పాడాడో గుర్తుకు తెచ్చుకుంటె సరి.
    రానారె గారూ,
    మరీ సులభమైన క్లూలు ఇస్తున్నందుకు మీకు కోపం రావడం లేదు కదా. వస్తే క్షంతవ్యుణ్ణి.

  24. మార్చి గడి సమాదానాలు ప్రచురించారా…..నాకెక్కడా కనబళ్ళెదె?

Comments are closed.