2009 ఫిబ్రవరి గడి ఫలితాలు

– కొవ్వలి సత్యసాయి

ఈనెల గడికి 17 మంది నుండి 24 సమాధానాలు రావడం ఆనందకరంగా ఉంది. సాధారణంగా అక్టోబరు – డిసెంబరుల మధ్య 9-10 మంది పంపించారు. జనవరి గడికి 13 మంది పంపించారు. స్లిప్పుల సర్వీసు బాగా ప్రోత్సాహకరంగా ఉన్నట్లు తోస్తోంది. ఈవిషయంలో సుగాత్రి గారికీ, జ్యోతి గారికీ కృతజ్ఞతాభినందనలు. గడి నింపి పంపిన వారికి అభినందనలు. నేను గమనించినదేమిటంటే స్లిప్పుల సర్వీసు లో అత్యుత్సాహంగా పాల్గొన్నవాళ్లందరూ గడి నింపి పంపట్లేదు. అలా పంపితే గడిచ్చేవాళ్ళకి మరికాస్త ఉత్సాహంగా ఉంటుంది. పూరించిన గడిని యధాతథంగా భద్రపరచుకోగలిగితే ఎక్కువమంది పాల్గొంటారేమో. ఈ సందర్భంలో మన పొద్దు గడి ఆన్లైను లో ఉన్న ఏకైక గడి అని అందరికీ గుర్తు చేస్తూ, దీని గురించి పదిమందికీ తెలిపితే బాగుంటుందనుకుంటున్నా. ఈగడి సంస్కృతి గురించి ఇంకోసారి మాట్లాడుకుందాం. .

గడిని నింపి పంపినవారు: సర్వశ్రీ
నేస్తం, రాఘవ, వికటకవి, అలకనంద, ఆదిత్య, ఎల్లంకి భాస్కరనాయుడు,
కంది శంకరయ్య, కామేశ్వర రావు, కృష్ణుడు, జ్యోతి, దైవానిక, పంతుల సుధారాణి,
పరిమళం, మురళీ మోహన్ కోడిహళ్లి, శ్రీలు, వెన్నెల మరియు సుధాంశు.

ఇందులో కామేశ్వర రావు గారు, ఆదిత్యగారూ కేవలం ఒక్క తప్పుతో పూరించారు. కామేశ్వరరావు గారిది తప్పు అనే కన్నా వర్ణక్రమ దోషమనచ్చు (స్పెల్లింగు దోషం). కానీ మా దగ్గరనున్న సమాధానాలతో సరిపోలినవే సరియైన సమాధానాలుగా పరిగణించడం వల్ల మాత్రమే అది తప్పుగా భావించాం. మిగిలిన వారిలో కూడా, తప్పయిన సమాధానాలలో స్పెల్లింగు దోషాలే ఎక్కువ.

1 దన్

2 శ

కం

3 బై

4 ఠా

యిం

5 పు

6 బా

7 రా

8 నం

జు

కు

9 క

ర్రా

వు

10 ట్రా

11 వె

లా

గు

త్రా

ని

12 మో

జు

13 లు

14 త

ర్క

లు

మి

15 మా

16 మా

17 రా

18 మ

సే

19 న

బిం

20 సు

గ్రీ

వా

21 మ

నో

22 బం

23 దం

లిం

24 వ

లు

25 వ

26 దే

27 వ

ప్ర

28 యా

29 పా

30 రా

31 స

నా

రా

32 కు

కు

33 ద్రో

34 జా

35 తి

త్నం

జు

36 తృ

ణం

37 ర

సం

38 అం

39 శ్యా

కృ

ష్ణ

40 భా

41 వి

కా

42 జ

43 ద

ర్గ

44 సు

రం

ప్ర

తా

రె

డ్డి

వి

అడ్డం

2 శకం. జమానా అంటే శకం అని. విక్రమార్క శకం, శాలివాహన శకం అంటాం కదా. ఎవరిదైనా ఒకటే అంటే ఎవరి పేరు తర్వాత పెట్టినా ఓకేయని.

3 బైఠాయింపు. ఎవరైనా పనయ్యేదాకా మన ముందే కూర్చుని హఠం చేస్తే బైఠాయించారంటాం. హఠం అని వాడి ఠ అన్న అక్షరం (ట కాదు) అని సూచించాం.

6 బారా. వేంకటమఖి రాగాలని 72 మేళకర్తలు (జనక రాగాలు) గా వర్గీకరించాడు. వీటిని 12 చక్రాలుగా విభజించాడు. మిగిలిన రాగాలన్నీ వీటినుండి వచ్చినవి లేదా జన్య రాగాలు. హిందీ పదాలు వాడి హిందీ సంఖ్య రాయాలని సూచించాం.

8 నంజుకు. పప్పులో ఊరు మిరపకాయే కాదు, ఏదైనా సరే, ఒక ఆహార పదార్థంలో అన్య పదార్థం కొద్ది మొత్తం కలిపి తినడాన్ని నంజుకు తినడమంటారు.

9 కర్రావు. నల్ల ఆవులని కఱ్ఱియావులంటారని ఆవువ్యాసం బట్టీ కొట్టిన మనందరికీ తెలిసినదే కదా. కాస్త కుసంధిచేసి కర్రి, రావులని కలిపాం.

10 ట్రావెలాగు. ఈలాగు ట్రావెలాగు అని వేరే చెప్పక్కర్లేదనుకుంటా.

12 మోజు. పెళ్ళాం మీద పోతుందా మోజు. మోజెస్ అన్న పేరు వాడి తిన్నగా సూచించాం.

14 తర్కలు. టీ ఇవ్వగానే తాగకుండా కాసేపుంచితే దానిమీద తరకలు కడతాయి. తాగ్కపోతే అని వాడి తరకలు ని కుదించాలని సూచించాం.

15 మామా. తల్లిపుట్టుక మేనమామకి ఎరుక అని వినే ఉంటారుగా

17 రామసేన. రామసేన అంటే వానరులే కదా. మంగళూరులో పబ్బులో అమ్మాయిలని కొట్టింది రామసేన వాళ్ళేకదా.

20 సుగ్రీవాన. సుగ్రీవుని ఆజ్ఞ తిరుగులేనిదంటారు.

21 మనోరమ. మనసులని రంజింప చేసేది మనోరమ.

22 బందం. ఇద్దరు మనుషుల మధ్య ఉండేది బంధం ఈమధ్య బందం అని కాకుండా వత్తులతో ఎవరైనా పలుకుతున్నారా?

24 వలువ. విలువ లాగే అనిపించే వలువ (బట్ట) సమాధానం.

26 దేవప్రయాగ. మందాకినీ భాగీరథుల సమాగమప్రదేశం దేవప్రయాగ. ప్రయాగ అంటే నదీ సంగమ స్థానం.

29 పాట. వేలం వేయడాన్ని పాట అంటాం కదా.

31 సయనారా. సయనారా అన్న పాట లవ్ ఇన్ టోక్యో సినిమాలోది. గుడ్ బై అని అర్థం.

32 కుకు. కుకు పక్షి పేరు వినే ఉంటారు. కొంతమంది కకూ అని కూడా అంటారు. కానీ కూతని బట్టి కుకు అని రాసా.

34 జాతిరత్నం. మేలైన రాయి అంటే జాతి రత్నం అంటారు.

36 తృణం. సీత రావణుడితో తిన్నగా కాక, మధ్యలో గడ్డి పోచని పెట్టుకుని మాట్లాడిందట. “తృణముకన్న రావణుడే హీనమన” అని సుందరదాసు ఎమ్మెస్ రామారావు గారి పాదం.

37 రరసం. రచయితల సంఘాలు పొట్టి పేర్లు పెట్టుకోవడం ఒకప్పటి రివాజు – విరసం, ఇరసం వగైరా…

39 శ్యామకృష్ణ. శ్యామకృష్ణ సోదరి అన్న అంకిత ముద్ర శ్యామశాస్త్రి గారిది.

41 వికా. వికా ని సరిగ్గా చూస్తే కావి. అదొక రంగు.

42 జత. పక్షులు కట్టేది. గూడు కడతాయి కానీ, అది కట్టడం జత కట్టాకే.

43 దర్గ. చంద్రముఖి సినిమాలో రజనీ కాంత్ (సినిమాలో ఈశ్వర్) నయనతారని దర్గా అని పిలుస్తాడు.

44 సురవరం ప్రతాపరెడ్డి. దేవతల (సుర) వరం వల్ల ప్రతాపవంతుడయ్యాడీ గోలకొండ పత్రికని నడిపినాయన – సురవరం ప్రతాపరెడ్డి

నిలువు

1 దన్ నం త్రామిసు. సుమిత్రానందన్ పంత్ హిందీ కవి – వెనక్కి తిరిగి అంటే కిందనుంచి పైకి రాయాలని తెలుసుగా

2 శకునిమావా. దుర్యోధనుడి మామ శకుని. ఆధారంలో మాఁవ అని ఇచ్చాం కాబట్టి – శకునిమావా అని రాయాలి.

3 బైర్రాజు రామలింగరాజు. బైర్రాజు రామలింగరాజు గారి గురించి వేరే చెప్పక్కర్లేదు. ఆయన పేరులో లింగం, రెండు సార్లు రాజు అని వస్తుంది.

4 ఠావు. మాకు ఏ 4 సైజు తెలిసేది కాదు. మాకు ఎప్పుడూ ఠావు సైజు కాగితాలే. ఠావుల్ తప్పెన్, ధైర్యము విలోలంబయెన్ అన్న పోతన పద్యం నుంచి.

5 పుట్రా. పులి తోడిదే – ఇందులో కుట్రేమీలేదు (2)

6 బాలార్కబింబం. “బాలార్క బింబము ఫలమని తలచిన ఆరడి చేష్టల హనుమంతా” అని అన్నమయ్య కీర్తించినది ఆంజనేయుడి గురించే.

7 రాగులు. బైరాగులు – ఈ పదంలోనే తినే ధాన్యం పేరుందిగా.

9 . కమో. ఎంత మోకరిల్లినా మొలక పైకే పెరుగుతుంది (2)

11 వెత. వెతకడంలో వెతఉంది గమనించండి.

13 లుసేరవ. వరి పొలాలని వరిసేలు అంటారు. వరలు కూడా ఓరకం ధాన్యమే. వరసేలు అని కిందినుంచి రాయాలి.

16 మానవ ప్రయత్నం. మనిషి తనవంతు చేసేది మానవ ప్రయత్నం

18 మనో. మనో – పాట గాడు, నటుడు, 21 అడ్డంలో ఉన్న మనోరమ తో పేరు లోమాత్రం సంబంధం ఉన్నవాడు

19 నమలుపాకు. తమలపాకుని నమలుతాం కదా – అందుకని నమలుపాకు అన్నాం.

23 దందన. దందన అంటే మాయ. దందన దందన అన్న శబ్దాలని తానంలో వాడతాం.

25 వట. శేషశాయి వటపత్ర శాయి కాదా.

27 వసరసం. వస పోస్తే వాగుడు వస్తుందంటారు

28 యానా. చనిపోయిన డయానా ప్రిన్స్ ఛార్లెస్ భార్య. యానా సినీ నటి పేరు.

30 రాజారవి. రాజా రవివర్మ గారు గొప్ప చిత్రకారుడని తెలుసుగా

32 కురమడప. సూర్యుడు పడమరకు ఉదయించడు. పైకి అన్నాం కాబట్టి తిరగేసాం.

33 ద్రోణం. పాండవుల గురువు ద్రోణుడు కుండ (ద్రోణం) లోంచి పుట్టాడు కాబట్టి ఆ పేరొచ్చిందిట.

35 తిరకాసు. తిరక మరకగా చేస్తే తిరకాసంటాం కదా

36 తృష్ణ. ఎడారిలో ఎండమావులు దాహం తీర్చేవి కావు. మృగం అని ఇచ్చి సూచనిచ్చాం.

38 అంతరం. మొత్తం తేడా అంతా అంతరంగనాధుడిలోనేనా ..(3)

40 భార్గవి. జన్మతః కన్నడిగ అయిన భార్గవీరావు గారు కన్నడనుండి తెలుగుకి అనువాద సాహిత్యానికి చాలా సేవ చేసారు. ఆంగ్లభాషాచార్యులుగా చేసేవారు. ఈమధ్యనే పరమపదించారు.

42 జవ. నెహ్రూగారికీ, క్రికెటర్ శ్రీనాథ్ కీ తమ పేర్లలో ఉమ్మడిగా ఉన్నది ‘జవ’ అంటే వడీ, వేగం అని అర్థం.

This entry was posted in గడి and tagged . Bookmark the permalink.

2 Responses to 2009 ఫిబ్రవరి గడి ఫలితాలు

  1. నేను పంపినది అందనే లేదా 🙁 నాకైతే అందినట్లు మెయిల్ వచ్చింది మరి.

  2. వికటకవిగారూ,

    పొరబాటు నావల్లనే జరిగింది. పొద్దుకు వచ్చిన పరిష్కారాలను ప్రొఫెసరు గారికి పంపేటప్పుడు అన్నిటికంటే ముందు వచ్చిన రెండు పరిష్కారాలు (మీది, రాఘవ గారిది) నా మెయిల్ బాక్సులో తర్వాతి పేజీలో ఉండడం వల్ల నేను చూసుకోలేదు. క్షమించగలరు. ఇప్పుడు చేర్చాను.

    -త్రివిక్రమ్

Comments are closed.