2009 అక్టోబరు గడి ఫలితాలు

ఈసారి గడికి అపూర్వ స్పందన లభించింది. గడువు 25 రోజులే ఇచ్చినా ఏకంగా 31 పరిష్కారాలు అందాయి. వాటిలో ఆల్ కరెక్టు పరిష్కారాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. గడి పట్ల పాఠకుల్లో ఆసక్తి, అవగాహన పెరుగుతున్నందున గడిని ఎప్పటికప్పుడు కొత్తపుంతలు తొక్కించడానికి కృషిచేస్తున్నాం.

ఈసారి ఆల్ కరెక్ట్ సమాధానాలు పంపినవారు:
భైరవభట్ల కామేశ్వరరావు, కోడీహళ్లి మురళీమోహన్, వల్లీ సునీత, సుజాత (మనసులో మాట), భమిడిపాటి సూర్యలక్ష్మి, జ్యోతి, వేణు, కంది శంకరయ్య, సుధాంశు పట్రాయని, కామేశ్వరీ దేవి, ఆదిత్య, కిరణ్ కుమార్ మండవ, రామారావు, సుభద్ర.

పాల్గొన్నవారందరికీ అభినందనలు!

-త్రివిక్రమ్

1

ధు

2రా

3

రి

4లో

X

5తే

6గీ

7తి

రీ

X

8

ది

X

X

9పా

వు

10లు

X

11

12చి

13లు

ము

X

14

ము

X

15కా

16సు

X

X

17

లా

X

18

X

X

ద్ర

X

19టు

గా

20

21మం

X

22

23

దే

24శం

X

25ప్రా

X

26త్రి

27

ము

ము

X

28పా

29నీ

30ము

X

31

పా

సే

X

నం

X

32

కా

పు

రి

X

33

లు

34తు

35

X

36వి

X

37వా

యు

38సే

X

39హి

40

X

X

41పా

డు

X

విం

X

X

42మా

X

43

44

ము

X

45కం

చు

46

47ము

X

రా

X

48

తి

49తి

X

X

50చు

క్క

లం

X

51లు

ప్త

ము

X

52

రు

త్మం

తు

డు

X

అడ్డం

1. తలలేదు విధురా! మరి నగలో? సరిగా చూస్తే యమునాతీరంలో. (7)
తలలేదు – మొదటి అక్షరం లేకుండా
విధురా! మరి నగలో? – అనాగ్రాం
సరిగా చూస్తే – అనాగ్రాం సూచన
యమునాతీరంలో – యమునాతీరంలో గల మథురా నగరం
సమాధానం: “మధురానగరిలో”
5. ఒక్కోసారి సీసం వెంట తిన్నగా వచ్చేది కోనలేని కోతి గీతే (4)
సీస పద్యం తర్వాత విధిగా ఆటవెలది లేదా తేటగీతి పద్యం వస్తుంది.
తిన్నగా – అనాగ్రాం సూచన
కో,న లేని కోతి గీతేట – తేటగీతి
8. నాలుగు గోడలు, ఒక కప్పు (2)
గది
9. పాలిచ్చే ఆవు తల, తోకలు పట్టుకుని ఆడించవచ్చు (3)
తల, తోక – మొదటి, చివరి అక్షరాలు
పావులు
11. శిరస్సు కోసం పెనదిరిగిన లత (2)
తల
12. చిన్న ములుకులో ఇనుమును హరించేది (3)
చిలుము
14. మొండికి తోడు సులభంగా పగలని కుండ (3)
ఘటము అంటే కుండ. మొండిఘటం అని వాడుక
15. రూక కోసం తల తాకట్టు పెట్టే తిరకాసు (2)
కాసు అంటే రూక. తల – పదంలోని మొదటిభాగం. తాకట్టుపెట్టడం – వదిలిపెట్టడం.
కాసు
17. మధ్యలో తిరిగిచూస్తే అలా కరిగిపోయేది ఊహేనా?
లాక – అనాగ్రాం
కలా
19. పదాల మధ్య సరిగా ఒద్దిక కూర్చే మంగ గాటు పెట్టింది (4)
తెలుగు సంధుల్లో పదాల మధ్య ఒద్దిక కూర్చేవి ఆగమాలు: నుగాగమం, టుగాగమం, మొ.
సరిగా – అనాగ్రాం సూచన
మంగగాటు – అనాగ్రాం
టుగాగమం
22. దేవన యశం కోరి మారిన ఏథెన్స్ రాజ్యం (5)
గ్రీసు రాజధాని ఏథెన్స్. ఏథెన్స్ రాజ్యం – గ్రీసు (యవన)దేశం.
దేవన యశం – అనాగ్రాం
మారిన – అనాగ్రాం సూచన
యవనదేశం
26. శ్రీరామ విజయం గురించి కలగన్న విశ్రవసు మనవరాలు (3)
అశోకవనంలో సీతకు కాపలాగా ఉన్న రాక్షసస్త్రీలలో త్రిజటకు రాముడు లంకను జయించినట్లు కలవస్తుంది. ఆమె విశ్రవసు కుమారుడైన విభీషణుడి కూతురని అంటారు.
త్రిజట
27. ముదము ఆ విధముగా జారుటకు కారణము (4)
జారుటకు కారణము ఆముదము.
ముదము ఆ – అనాగ్రాం
28. ద్వైపాయమునీ! సేవించండి (4)
సేవించునది పానీయము – అనాగ్రాం
31. సున్నా ఒకటి సున్నా (2)
వపా గా ప్రసిద్ధుడైన చిత్రకారుడు వడ్డాది పాపయ్య సంతకం రెండు వృత్తాల మధ్య ఒక నిలువుగీతతో 010 లా ఉంటుంది.
వపా
32. ఉత్తరాన అలరి కాపు గాసే యక్షుడి నగరం (5)
అష్టదిక్పాలకుల్లో ఉత్తరదిక్కుకు అధిపతైన కుబేరుడు ఒక యక్షుడు. ఆయన నగరం అలకాపురి.
అలరి కాపు – అనాగ్రాం
33. ద ఒకటైతే తక్కువ, ఎన్నైనా ఎక్కువకావు (2)
ఒకటి కంటే ఎక్కువ ‘ద’లు – దలు
34. మొదలు చివరయేందుకు తల మారిస్తే తోక రాలిపోయింది (2)
మొదలు అనే పదంలో చివరి అక్షరం (తోక) తొలగించి, చివర అని అర్థం వచ్చేలా మొదటి అక్షరం (తల) మార్చాలి.
తుద
36. ఒక వనిత. 52 అడ్డం కన్నతల్లి (3)
అనూరుడు, గరుత్మంతుల కన్నతల్లి వినత.
వనిత – అనాగ్రాం
vinata
37. పైనుంచి దాడి సేయు వాన (4)
సేయు వాన – అనాగ్రాం
వాయుసేన
39. మహికి మనుమరాలు (3)
హిమజ – హిమవంతుడి కూతురు.
41. ఛీ …! షండుడికి తలాతోకా లేవు. పాషండుడి తల తగిలించండి (2)
‘ఛీ పాడు!’ లో చుక్కల స్థానంలో లోపించినది ‘పాడు’.
షండుడిలోని మధ్యాక్షరానికి ముందు ‘పా’ చేర్చగా వచ్చేది పాడు
42. చాలు తప్పిన వనమా మనిషికి సంబంధించినది ? (3)
వనమా – అనాగ్రాం
చాలు తప్పిన- అనాగ్రాం సూచన
మనిషికి సంబంధించినది – మానవ
43. సరిగా వాడుకుంటే మునగకొయ్యే కొండంత! (3)
మునగ – అనాగ్రాం
సరిగా – అనాగ్రాం సూచన
కొండ – నగము
45. కుబుసం పాము తొడుక్కునే లోహపు రవికా? (4)
కంచుకము = కుబుసం, రవిక.
కంచు – లోహమిశ్రమం
48. తిరపతిలో దారితప్పిన మన్మథుడు (4)
తిరపతి – అనాగ్రాం
దారితప్పిన – అనాగ్రాం సూచన
రతిపతి – మన్మథుడు
50. చక్కని బిందువు (2)
బిందువుకు సమానార్థకం చుక్క. అని అందమైన అమ్మాయిని చక్కని చుక్క అంటాం.
చుక్క
51. క్లుప్తములో లోపించినది (3)
లుప్తము
52. 36 అడ్డం కొడుకు (5)
గరుత్మంతుడు

నిలువు

1. మకరీ! చిన్నబోకు, అవి నీళ్ళు కాదు (4)
నీళ్ళు లేకపోయినా ఉన్నట్లు కనిపించేది మరీచిక లేక ఎండమావి.
మకరీ! చి – అనాగ్రాం

2. వార్ధక్యాన్ని వదిలించుకుని సర్దుకున్న ముదిగారము కర్ణపేయము (3)
వార్ధక్యం – ముది(మి)
రాగము
3. దినచర్యలో ఎదురేగిన ప్రవాహం (2)
నది
4. మహర్షి పాముద్రలో సహధర్మచారిణి (4)
లోపాముద్ర – అగస్త్య మహర్షి భార్య
5. విషప్పురుగు కాలుమీటుతే నొప్పి భరించలేం (4)
తేలుకాటు
6. రాతతో రైము కలిపే రేఖ గురించి పార్థసారథి చెప్పాడు (2)
రేఖ, భగవద్గీత అనే రెండు అర్థాల్లో వాడే పదం గీత.
7. అలతిగా దానమియ్యొచ్చు, నీళ్ళలో కలపొచ్చు (2)
తిలలు (తిలదానం, తిలోదకాల గురించి ప్రస్తావన)
13. యములాలు ఎక్కి తిరిగేది (4)
లులాయము అంటే దున్నపోతు. యముడి వాహనం.
16. స్లిప్పుల బ్లాగరి ఏమయ్యారో శాలీనుడినడగాలి! (3)
పొద్దు గడికి తన బ్లాగులో చాలాకాలం స్లిప్పులు అందించారు సుగాత్రి. కళాపూర్ణోదయంలోని సుగాత్రి – శాలీనుల కథ ప్రసిద్ధం.
18. యమున వడ్డున గల తోట (3)
మునవ – అనాగ్రాం
వనము
20. వనజ గదను సవరిస్తే వినాయకుడు ప్రత్యక్షం (5)
వనజ గద – అనాగ్రాం
గజవదన
21. అగ్గిపాలైన కట్టడాలు (4)
మంటపాలు!
23. రుణుడి వడ నంది తలలు కలిసిన ముఖం (3)
వదనం (తలలు – మొదటి అక్షరాలు)
24. తొడపాశం సరే! అందగత్తె తిరగబడి తలపాశం పెడుతుందట! (4)
తలపాశం అనాగ్రాం శంపాలత. అంటే మెరుపుతీగె.
25. యువకుడు కోమలాంగి ప్రాపు బాయడు (5)
ప్రాయపువాడు
27. సిమాచలం తుహినమయమా? ఆసే ఉంది గానీ దేశమంతా వెదికినా సినమామయ లేడు (7)
‘సిమాచలం తుహినమయమా? ఆసే’ లో సి,న,మా,మ,య అనే అక్షరాలు తొలగించి సర్దగా వచ్చేది ఆసేతుహిమాచలం. అంటే భారతదేశమంతటా అని.
29. తిరగబడ్డ పాత డబ్బు నాకు కాదు. మరి …? (2)
నీకా? (పాతకాలపు కరెన్సీ ‘కానీ’)
30. మరియకు కొమ్ములు మొలిచినంత సంతోషం (3)
మురియు
32. వరస మార్చి వ్యర్థంగా పేర్చితే వరస అనము (6)
వ్యర్థం అంటే అనవసరం. వరస అనము – అనాగ్రాం
వరస మార్చి – అనాగ్రాం సూచన.
అనవసరము
35. గతి తప్పిన మతి నీదని అణచిపెట్టిన నీతి (3)
గతి తప్పి – అనాగ్రాం సూచన
న మతి నీద – అనాగ్రాం
అణచివేసే నీతి – దమననీతి
38. సేవ తరువాత ఇంచుకైనా తాగాలిలే (3)
సేవించు
40. వజ్రాలు సరళంగా రాసిపోసినంత! (4)
వజ్రాలరాశి జవరాలు 🙂
41. జ్ఞాపకశక్తి లేనిదానికి ప్రతీకారేచ్ఛ అంటగట్టడం పాపముగదా! (4)
పాపముగ – అనాగ్రాం
పాముపగ
44. ఖతి సరి గమనం (2)
సరి – సరి (2,4) స్థానాల్లోని అక్షరాలు: గ,తి
గమనం – గతి
46. జవరాలి ప్రేమను తిరస్కరించు కడు కఠినాత్ముడు (3)
జవరాలి (దేవయాని) ప్రేమను తిరస్కరించినవాడు కచుడు.
చుకడు – అనాగ్రాం
47. ముసలినక్కకు కావలసిందేమిటో దాన్ని చుట్టుకునే ఉంది (2)
ముక్క
49. శ్రీ (2)
తిరు

This entry was posted in గడి and tagged . Bookmark the permalink.

5 Responses to 2009 అక్టోబరు గడి ఫలితాలు

  1. Srilu says:

    నేను అన్నీ కరెక్టుగానే రాసినట్టున్నా. 27 నిలువు ఒక్కటే ‘ఆసేతుహిమాచల ‘ అని రాశాను ఇది మీరు తప్పుగా పరిగణించారా?

  2. aparanji says:

    అన్ని సరిగా వ్రాసిన వారి జాబితా తొ పాటు, స్థలాభావ సమస్య లెకపొతే కనీసం 3 తప్పులు వ్రాసిన వారి జాబితా కూడా ప్రచురిస్తే బాగుంటుందేమో ఆలొచించండి. ఇందులొ నా స్వార్ఢం కూడా వుందండో నేను 34 అడ్డం మరియు 35 నిలువు మాత్రమే తప్పు వ్రాసాను.

  3. pantulajogarao says:

    గడి నుడి బాగా తయారు చేసారు. ఆధారాలు కొంత జటిలంగానే ఉన్నాయి.

  4. వేణు says:

    త్రివిక్రమ్ గారూ,

    ఈ గడిలో రెండిటికి సంబంధించి నాకు సందేహాలున్నాయండీ. (మీ ‘కీ’తో సరిపోయేలా పదాలు రాసినప్పటికీ).

    అడ్డం – 39. మహికి మనుమరాలు. హిమజ.. ఎలా?
    నిలువు- 40. వజ్రాలు సరళంగా రాసిపోసినంత!… మీరు ‘రాశి’పోసినంత అని కాకుండా, ‘రాసిపోసినంత’ అన్నారు. ఇంతకీ, ‘జవరాలు’ జవాబు ఎలా సరిపోయింది? కాస్త వివరించండి !

  5. శ్రీలు గారూ,

    సమాధానాలు సరిచూసేటప్పుడే అనిపించింది ‘అరెరే, అన్నీ సరిగా రాసిన శ్రీలు గారు చివరి దాకా వచ్చి భారతదేశయాత్రను అసంపూర్తిగా ముగించేశారే!’ అని.

    అపరంజి గారూ,

    స్థలాభావం ఎంతమాత్రమూ సమస్య కాదు. గడి కష్టంగా ఇచ్చినప్పుడు రెండు మూడు తప్పులతో పూరించినవారి పేర్లు, మరీ కష్టంగా ఇచ్చినప్పుడు పరిష్కారాలు పంపినవారందరి పేర్లూ కూడా ప్రచురిస్తాం. 🙂

    జోగారావు గారూ,

    నెనర్లు.

    వేణుగారూ,

    భూమి నుంచి పుట్టినవి పర్వతాలు – హిమవంతుడితో సహా. కాబట్టి హిమవంతుడి కూతురు హిమజ భూమి (మహి)కి మనుమరాలౌతుంది.

    ఇక జవరాలి గురించి:

    వజ్రాలు సరళంగా (సంయుక్తాక్షరాలు లేకుండా) – వజరాలు
    సరళంగా అనేది ఇక్కడ అనాగ్రాం సూచన కూడా.
    జవరాలు వజ్రాల రాశి కాదంటారా?

    ‘రాశి’పోసినంత అని కాకుండా, ‘రాసిపోసినంత’ అన్నారు.

    సంస్కృత, తత్సమ పదాలతో వచ్చినప్పుడు ‘రాశి’; తద్భవ, అచ్చ తెలుగు పదాల గురించి చెప్పేటప్పుడు ‘రాసి’.

    – త్రివిక్రమ్

Comments are closed.