Monthly Archives: October 2009

మతాలకు పాలకుల మద్దతు

– కొడవటిగంటి రోహిణీప్రసాద్ నేటి పాశ్చాత్య దేశాల్లోని మతాధిపత్యం కేవలం కొన్ని సామాజిక సమస్యలకు పరిష్కారాలు సూచించడం తప్ప, ఏమీ చెయ్యటంలేదు. పైగా తమ మతాధికారుల్లోనే లైంగికహింసకూ, ఇతర నేరాలకూ పాల్పడేవారు పట్టుబడుతున్న నేపథ్యంలో మింగలేక, కక్కలేక అవస్థలు పడుతోంది. మతవిశ్వాసాలు కలిగినవారికి సామాన్యంగా వాటికి రాజకీయాలతో ప్రమేయం లేదని అనిపిస్తూ ఉంటుంది. స్వతహాగా మంచి … Continue reading

Posted in వ్యాసం | Tagged | 6 Comments

దాపుడు కోక

— కేతు విశ్వనాథ రెడ్డి గత జనవరిలో కేతు విశ్వనాథరెడ్డి గారికి అజో-విభొ ప్రతిభామూర్తి పురస్కార ప్రదానోత్సవం జరిగిన సందర్భంగా పొద్దులో కేతు దంపతులతో ఇంటర్వ్యూ ప్రచురించిన విషయం పాఠకులకు గుర్తుండే ఉంటుంది. విశ్వనాథరెడ్డి గారి కథల్లో తనకు బాగా నచ్చిన కథ దాపుడుకోక అని శ్రీమతి కేతు పద్మావతి గారు ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. … Continue reading

Posted in కథ | Tagged | 8 Comments

2009 అక్టోబరు గడిపై మీమాట

2009 అక్టోబరు గడిపై మీ అభిప్రాయాలను ఇక్కడ రాయండి. ———————————-

Posted in గడి | Tagged | 7 Comments

2009 సెప్టెంబరు గడి పరిష్కారాలు – ఫలితాలు

నా విద్యార్ధులు నన్నెప్పుడూ ఆశ్చర్య పరుస్తోండేవారు… సులభంగా ప్రశ్నలిచ్చాననుకుంటే రాయలేక, కష్టంగా ఇస్తే బ్రహ్మాండంగా రాసి. గడి పూరకులు కూడా అలాగే ఆశ్చర్య పరుస్తున్నారు. ఈసారి గడిని ఎవ్వరూ సరిగా నింపలేకపోయారు. అలా అని కష్టంగా ఉందని కూడా ఎవరూ అన్నట్లు లేదు. కానీ తక్కువ తప్పులతో నింపినది మైత్రేయి గారు, కోడీహళ్ళి మురళీమోహన్ గారు. … Continue reading

Posted in గడి | Tagged | Comments Off on 2009 సెప్టెంబరు గడి పరిష్కారాలు – ఫలితాలు

మృతజీవులు – 28

-కొడవటిగంటి కుటుంబరావు ఏడవ ప్రకరణం ముసలాయన కళ్లుపైకెత్తి , తాపీగా, “క్రయదస్తావేజుల తాలూకు దరఖాస్తులు తీసుకునేది ఇక్కడకాదు,” అన్నాడు. “మరెక్కడ?” “క్రయశాఖలో.” “ఆ క్రయశాఖ ఎక్కడున్నది?” “ఇవాన్ అంతో నవిచ్ బల్ల దగ్గిర.” “ఇవాన్ అంతో నవిచ్ ఎక్కడ?” ముసలాయన మరొక మూలగా వేలు విసిరాడు. చిచీకవ్, మానిలవ్ లు ఇవాన్ అంతోనవిచ్ దగ్గిరికి వెళ్లారు. … Continue reading

Posted in కథ | Tagged , | Comments Off on మృతజీవులు – 28

బతుకు బండి

-పాలగిరి విశ్వప్రసాద్ బ్రతిమాలడం విడిచి పెట్టినాడు. క్షణమాలస్యం చేయకుండా జేబులోని ‘బటన్‌ నైఫ్‌’ ఒత్తినాడు. రౌడీ మాదిరి కనబడే ఆ యువకుని చేతిలో చాకు ప్రత్యక్షమయేసరికి…. ఆ వ్యక్తి వెనక్కు తగ్గడం – అంతమయిపోతోన్న ప్లాట్‌ఫారమ్‌ మీద నుండి సారధి కంపార్ట్‌మెంట్‌లోకి లంఘించడం ఒకే క్షణంలో జరిగిపోయింది. దాదర్‌ ఎక్స్‌ప్రెస్‌ అప్పుడే కదుల్తా ఉంది. ఉరుకులు, … Continue reading

Posted in కథ | Tagged , , , | 1 Comment