Monthly Archives: September 2009

పిల్లల్లో మానసిక ఒత్తిడి

– తుమ్మల వరూధిని ఒత్తిడి, స్ట్రెస్, ఈ రోజులలో పిన్నల నుండి పెద్దల దాకా అందరిని పట్టి పీడిస్తున్న సమస్య. ఒత్తిడికి ముఖ్యకారణం ఆందోళన. ఈ ఆందోళనకి ముఖ్య కారణం మనం చేయాలనుకునే దానికి, చేసేదానికి మధ్య పొంతన లేకపోవటం. ఏదైనా పని చేసే ముందు ప్రతి ఒక్కరూ ఎంతో కొంత ఆందోళనకు గురికావడం సహజం. … Continue reading

Posted in వ్యాసం | Tagged | 3 Comments

తడి

-స్వాతీ శ్రీపాద రాయలసీమ ప్రాకృతిక లక్షణం కరవు. ఇక్కడి మనుషుల స్వాభావిక లక్షణం కరకుదనం. ఈ రెండింటి మధ్య గల కార్య కారణ సంబంధం సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన “తడి” కథలో స్పష్టమౌతుంది. ఇది కొత్త దుప్పటి కథాసంపుటిలోని ఆరవ కథ. కుటుంబ కలహాలు, తిండి కోసం పాడి పశువుల అవస్థలు, ఎండిపోయి వానకు కుళ్ళి … Continue reading

Posted in వ్యాసం | Tagged , | 8 Comments

2009 ఆగస్టు గడి పరిష్కారాలు – ఫలితాలు

-కొవ్వలి సత్యసాయి అగస్టు 09 గడి … వివరణలు ఈసారి గడిని 11 మంది నింపి పంపారు. వారు జ్యోతి, అలకనంద, హిమజా వేమూరి, కంది శంకరయ్య, కోడీహళ్ళి మురళీమోహన్, శ్రీలు, భమిడిపాటి సూర్యలక్ష్మి, మైత్రి, కల్పన, వల్లూరు శ్రీరామ ప్రసాదు మరియు పట్రాయని సుధారాణి గార్లు. వారందరికీ అభినందనలు. వీరిలో కంది శంకరయ్యగారు మరియు … Continue reading

Posted in గడి | Tagged | 4 Comments

2009 సెప్టెంబరు గడిపై మీమాట

2009 సెప్టెంబరు గడిపై మీ అభిప్రాయాలను ఇక్కడ రాయండి. ———————————-

Posted in గడి | Tagged | 4 Comments

రెండు అరిచేతుల పుప్పొడి రాగం

-పసునూరు శ్రీధర్ బాబు దేహంలో ధూపంలా వంకీలు తిరిగే పంచప్రాణాలు ఆ అరిచేతుల్లో ఏకమై మంచు ఖండాలుగా మారి నను నిమిరినప్పుడు నేను ఘనీభవించిన అగ్నికీలల పర్వతాన్నయ్యాను- ఆ రెండు అరిచేతుల్లో పూసిన పుప్పొడిలో కన్నీటి బిందువునై రాలి నలుదిక్కులకూ ఎగిరిపోయాను- ఆ రెండు అరిచేతులూ ఓ సాయం సంధ్య వేళ నన్ను పావురంలా పొదివి … Continue reading

Posted in కవిత్వం | 9 Comments

మృతజీవులు – 27

-కొడవటిగంటి కుటుంబరావు ఏడవ ప్రకరణం ప్రయాసపడి దీర్ఘ ప్రయాణం చేసి; దారిలో చలీ, వానా, బురదా, మజిలీల్లో అధికార్లను నిద్రలేవగొట్టటమూ, మువ్వల మోతలూ, మరమ్మత్తులూ, తగాదాలూ, బళ్లు తోలేవాళ్లూ, కమ్మరులూ, ఇతర మోసగాళ్లూ వీటితో వేగిన ప్రయాణీకుడు చిట్టచివరకు స్వగృహాన్ని చేరవచ్చేటప్పుడు ఎంతైనా ఆనందం పొందుతాడు. అతని మనోనేత్రం ముందు ఇంటి లోపలిభాగాలూ, సంతోషంగా అరుస్తూ … Continue reading

Posted in కథ | Tagged , | Comments Off on మృతజీవులు – 27

నీ పై ప్రేమతో…

– బొల్లోజు బాబా ఇక్కడ నిను నేను ప్రేమిస్తున్నాను. పైన్ వనాల చీకట్లలో గాలి స్వేచ్ఛప్రకటించుకొంది. నీటి అలలపై చందమామ భాస్వరమై వెలుగుతోంది. అన్నీ ఒకేలా ఉండే రోజులు, ఒకదానినొకటి వెంబడించుకొంటున్నాయి. పొగమంచు అస్ఫష్ట రూపాలతో నర్తిస్తోంది. ఓ వెండికొంగ ఎక్కడినుంచో వచ్చి వాలింది మరొకటి తారలదాకా ఎగురుకొంటో సాగింది. ఒకోసారి తొందరగా మెలుకువొచ్చేస్తుంది. నా … Continue reading

Posted in కవిత్వం | Tagged | 3 Comments

తామస విరోధి – తొమ్మిదవ భాగం

స్వాతి: దిగులు దిగులుగా ఉంటుంది పాత జ్ఞాపకాల ఈదురుగాలి ఉండుండి సన్నగా కోస్తుంది. అంటూ చలిపొద్దుని దుప్పటి ముసుగు తీసి చూపించిన రవి శంకర్ గారూ! మరి వసంతోదయాలు ఎలా ఉంటాయో మీ శైలి లో చెప్తారా! నేటి కాలపు కవిత్వం తీరుతెన్నుల్ని విసుగనుకోకుండా విశ్లేషించగల భూషణ్ గారు వచన కవిత ఒకదాన్ని రాసి ఈ … Continue reading

Posted in కవిత్వం | Tagged , | Comments Off on తామస విరోధి – తొమ్మిదవ భాగం

నెరా నెరా నెరబండి

కార్యాలయాల్లో సామాన్యమైపోయిన అవినీతిపై ఓ సామాన్యుని ధర్మాగ్రహం. Continue reading

Posted in కథ | Tagged , , | 10 Comments