Monthly Archives: July 2009

తామస విరోధి – ఎనిమిదవ భాగం

ఇప్పుడో నది కావాలి
ఉప్పెనలా ఊళ్ళను తుడిచి పెట్టే నదికాదు
మూలం వేళ్ళను తడిసి
పచ్చదనం చిగురింపచేసే నది
నగరం నడి బొడ్డున
ఫౌంటెన్ లా ఎగజిమ్మి అందాలు పంచే నది కాదు
భూమి మొహాన ఇన్ని నీళ్ళు కొట్టి
అన్నం పంచే నది
ఎండిన చెట్లను అక్కున చేర్చుకునే నది… Continue reading

Posted in కవిత్వం | Tagged , | Comments Off on తామస విరోధి – ఎనిమిదవ భాగం

మృతజీవులు – 25

అయితే ఒకప్పుడీ మనిషి ఎస్టేటును చాలా శ్రద్ధగా నిర్వహించినవాడు! ఆయనకు పెళ్ళి అయింది, పిల్లలున్నారు, చుట్టుపక్కల వాళ్ళు ఆయన ఇంటికి అతిధులుగా వచ్చి ఎస్టేట్లను పొదుపుగా నిర్వహించే పద్ధతులు తెలుసుకునేవారు. Continue reading

Posted in కథ | Tagged | 1 Comment

జూలై గడిపై మీమాట

సౌష్ఠవ (సిమెట్రికల్) గడి కావాలని గతంలో కొందరు గడి ప్రియులు సూచించారు. అలా ఇవ్వడానికి బేసి సంఖ్య గళ్ళు అయితేనే బావుంటుందని భావించిన కామేశ్వరరావు గారు ఈ సారి చాలావరకూ (అంటే మొదటి 11 కాలమ్స్) సౌష్ఠవంగా ఉండేట్టు ఇచ్చారు. అంతేకాకుండా స్లిప్పువీరుల ఉత్సాహం గమనించి ఈసారి గడిలో ప్రత్యేకించి వారికోసమే అన్నట్లుగా టెంకాయలు రాశులు … Continue reading

Posted in గడి | Tagged | 1 Comment

జూన్ గడి పరిష్కారాలు – ఫలితాలు

– రానారె వాసకసజ్జిక (45 అడ్డం) చాలా మందికి చిక్కలేదు. కొందరు మకురం బదులు ముకురం అని పూరించారు. దాంతో డమరుకము డమురుకము అయింది. ఈ రెంటినీ కలిపి ఒకే తప్పుగా పరిగణించడమైనది. అలాగే మొదటి వరుస పదకొండో గడిలో ‘ర’కు దీర్ఘం లోపించడంతో రాధ కాస్తా రధ, రామ కాస్తా రమ అయ్యారు. రెంటినీ … Continue reading

Posted in గడి | Tagged | 3 Comments

ఆవృతం

బాల్కనీ రెయిలింగ్ మీద రెండు చేతులూ ఆన్చి, నిలబడి చూస్తూ ఉంటే చక్కగా తీర్చిదిద్దిన వెనకింటివాళ్ల తోట కనిపిస్తూంది. సాయంకాలపు నీరెండలో ఆ తోటలో విరిసిన పూవులన్నీ మెరుస్తూ గాలి తెమ్మెరలు వచ్చినప్పుడల్లా తలలు ఊపుతున్నాయి. Continue reading

Posted in కథ | 15 Comments

వానా వానా వల్లప్పా!

-వెంపటి హేమ చుట్టూ ఉన్న నేల బంగన బయలు కావడంతో, ఎండపడి బొగులు బొగులుమంటూ నిప్పులు చెరుగుతోంది అప్పుడే! ఆ ఎండలో దూరాన ఏదో తెల్లగా మెరుస్తూ తన దృష్టిని ఆకర్షించడంతో తాత చెయ్యి విడిపించుకుని సిద్దూ ముందుకు పరుగెత్తాడు. అలవాటుగా చెయ్యి ఓరజేసుకుని, తల పైకెత్తి ఆకాశాన్ని పరికించి చూసి, గాఢంగా నిట్టూర్చాడు బంగారప్ప.

Posted in కథ | Tagged | 3 Comments

సౌమ్య టాక్స్

-స్వాతి కుమారి తాను చదివిన పుస్తకాల వివరాలూ, రివ్యూలు, నచ్చిన సినిమా పాటల విశేషాలే కాకుండా ఇతర భాషా కథల అనువాదాలూ, సొంత రచనా ప్రయోగాలూ అన్నిటినీ Sowmya writes అంటూ తన బ్లాగులోనూ, వెబ్ పత్రికల్లోనూ కుమ్మరించే వి.బి.సౌమ్య ఇప్పుడు కొన్ని సరదా కబుర్లని కూడా మనతో పంచుకుంటుంది.

Posted in వ్యాసం | Tagged | 11 Comments