సౌమ్య టాక్స్

-స్వాతి కుమారి

తాను చదివిన పుస్తకాల వివరాలూ, రివ్యూలు, నచ్చిన సినిమా పాటల విశేషాలే కాకుండా ఇతర భాషా కథల అనువాదాలూ, సొంత రచనా ప్రయోగాలూ అన్నిటినీ Sowmya writes అంటూ తన బ్లాగులోనూ, వెబ్ పత్రికల్లోనూ కుమ్మరించే వి.బి.సౌమ్య ఇప్పుడు కొన్ని సరదా కబుర్లని కూడా మనతో పంచుకుంటుంది.

అంటే, నాకు అప్పుడప్పుడూ తిక్కరేగుతూ ఉంటుంది. అప్పట్లో అంతా ఏం చేయాలో తోచేది కాదు. ఈ మధ్యే 2009 మొదట్లో ఓ మార్గం కనిపెట్టాను. అదే ఈ నిశ్యాలోచనాపథం. నాలో నేను కోల్పోడానికీ, నన్ను నేనే తప్పించేయడానికీ, నా ఆలోచనల ఉచ్చులో చిక్కి, నేనే గిలగిలా కొట్టుకుని, తర్వాత చదువరుల ప్రాణాలు తోడటానికీ ఇంతకంటే ఉత్తమమైన మార్గం లేదనిపించింది. 🙂 నాలోని సాడిస్టుకి ఈ టపాల వల్ల చదువరులు పడే హింస ఆక్సిజన్ వంటిది. ఎటొచ్చీ, చదువరులు పారిపోయారనుకుంటా…సాడిస్టుకు ఊపిరి అందట్లేదు.

స్వాతి: హాయ్ సౌమ్యా! ఏమిటో నిశ్యాలోచనా పథంలో దీర్ఘంగా ప్రయాణిస్తున్నట్టున్నావ్. ఎప్పట్నుంచి ఈ ‘చీకటి ఆలోచనలు ‘?

సౌమ్య: అంటే, నాకు అప్పుడప్పుడూ తిక్కరేగుతూ ఉంటుంది. అప్పట్లో అంతా ఏం చేయాలో తోచేది కాదు. ఈ మధ్యే 2009 మొదట్లో ఓ మార్గం కనిపెట్టాను. అదే ఈ నిశ్యాలోచనాపథం. నాలో నేను కోల్పోడానికీ, నన్ను నేనే తప్పించేయడానికీ, నా ఆలోచనల ఉచ్చులో చిక్కి, నేనే గిలగిలా కొట్టుకుని, తర్వాత చదువరుల ప్రాణాలు తోడటానికీ ఇంతకంటే ఉత్తమమైన మార్గం లేదనిపించింది. 🙂 నాలోని సాడిస్టుకి ఈ టపాల వల్ల చదువరులు పడే హింస ఆక్సిజన్ వంటిది. ఎటొచ్చీ, చదువరులు పారిపోయారనుకుంటా…సాడిస్టుకు ఊపిరి అందట్లేదు. అది వేరే విషయం.

స్వాతి: ఐతే చదువు, పుస్తకాల నుంచి.. పెళ్ళీ, పని(ఉద్యోగం) లోకి ఒకేసారి మారిపోతే ఎలా ఉంది?

సౌమ్య: ఏడ్చి మొహం కడుక్కున్నట్లు, తరువాత వెంటనే పగలబడి నవ్వి కడుపు పట్టుకున్నట్లు, పాత ఏడ్పుల్ని తలుచుకుని ఇప్పుడు నవ్వుతున్నట్లూ, పాత నవ్వుల్ని తలుచుకుని ఇప్పుడు ఏడుస్తున్నట్లూ, కొత్త నవ్వుల్ని ఎగబడి సృష్టించుకుంటూ, కొత్త ఏడుపుల్ని తరిమి తరిమి కొట్టే ప్రయత్నంలో ఒంటిపై దెబ్బలు తగిలించుకుంటూ – వావ్! మహా రుచిగా ఉంది జీవితం, ఉగాది పచ్చడిలా.

అంటే, రజనీకాంత్ బాబా భాషలో చెప్పాలంటే “మాయా మాయ..అంతా మాయ” అనేసి వేళ్ళు అలా చూపించాలని ఉంది. మానవభాషలో అయితే – కొంచెం ఇష్టం, కొంచెం కష్టం. పుస్తకాలకీ, క్యాంపస్ జీవితానికి కొంత దూరంగా వెళ్ళడం కాస్త కష్టంగానే ఉంది… నా గుప్తుల కాలం గత మూడేళ్ళూనూ. అయితే, ఇప్పుడంతా మనమే రాజూ రాణీ మంత్రీ పోలీస్ దొంగా కనుక, ఇది వేరు.

అంటే, రజనీకాంత్ బాబా భాషలో చెప్పాలంటే “మాయా మాయ..అంతా మాయ” అనేసి వేళ్ళు అలా చూపించాలని ఉంది. మానవభాషలో అయితే – కొంచెం ఇష్టం, కొంచెం కష్టం. పుస్తకాలకీ, క్యాంపస్ జీవితానికి కొంత దూరంగా వెళ్ళడం కాస్త కష్టంగానే ఉంది… నా గుప్తుల కాలం గత మూడేళ్ళూనూ. అయితే, ఇప్పుడంతా మనమే రాజూ రాణీ మంత్రీ పోలీస్ దొంగా కనుక, ఇది వేరు.

స్వాతి: అవున్నీకు బెంగాలీ వచ్చా? ఆ మధ్య కాలంలో సత్యజిత్ రాయ్ కథల్నిఅనువదించి అవతల పడేసే దానివి. ఇంతకీ ఆయనెలా పట్టుకున్నాడు నిన్ను.. ఎప్పట్నుంచీ?

సౌమ్య: బెంగాలీ వచ్చా! ఇంకా నయ్యం! అమీ బంగ్లా జానో నా! అనడం తప్ప ఇంకేదీ రాదు. అయితే, బెంగాలి రచయితలు చాలా మంది మీద అభిమానం ఉంది. టాగోర్, బిభూతి భూషణ్, కొన్ని నవలల్లో శరత్, ఒక మోస్తరులో బంకిం చంద్ర, “కలకత్తాకు దగ్గరిలో”, “ఛౌరింఘీ” – వంటి నవలలూ – నేను చదివిన బెంగాలీ నవలల అనువాదాల్లో 90 శాతం నాకు నచ్చాయి. ఇక సత్యజిత్ రాయ్.. పది పదకొండేళ్ళప్పుడు “ఫతిక్ చంద్” అన్న పిల్లల నవల ద్వారా పట్టుకున్నాడు.

తరువాత ఓ పదేళ్ళదాకా కనబళ్ళేదు. ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ లో థ్రిల్లర్ కథలతో నా జీవితంలో అడుగుపెట్టాడు. తరువాత ఎమ్మెస్ చేస్తున్నప్పుడు – ఆయన లాంగ్ టర్మ్ అభిమాని అయి, ఆయన రాసిన 35 ఫెలూదా నవలికలూ, ప్రొఫెసర్ షంకు సీరీస్, ఆయన చిన్నప్పటి కబుర్లూ, సినిమా వ్యాసాల సంకలనాలూ – ఇలా దొరికినవి దొరికినట్లు చదవడం మొదలుపెట్టాను. చాలామటుకు గోపా మజుందార్ అనువాదాలే నాకు సత్యజిత్ రాయ్ ఆక్సిజెన్. ఆయన సొంత అనువాదాలు, ఒకటీ అరా ఇతరులవీ కూడా చదివాను – “ఫతిక్ చంద్” ఒకటే తెలుగులో చదివాను. మిగితా అన్నీ ఆంగ్లం లోనే. బెంగాలీ వచ్చుంటే బాగుండేదని ఎంత అనుకుంటూ ఉంటానో ఇప్పటికీ…

స్వాతి: ఇంకెవరైనా ఇలా నీతో తెగ చదివించిన రచయితలున్నారా? కళ్ళు టపటపా తెరిపించిన వాళ్ళూ.

సౌమ్య: Hmm… ఉన్నారు. తెలుగులో అయితే, మహీధర నళినీమోహన్ మొదటగా ఉంటారు ఈ జాబితాలో. ఎంత జ్ఞానం పొందానంటే “బెబ్బెబ్బె” కానీ, ఆ పుస్తకాలు నాపై చాలా ప్రభావం చూపాయి. 2006 లో నవీన్ వి దొరికినవి దొరికినట్లు చదివా కానీ, కళ్ళు తెరిపించేంత ప్రభావమేమీ లేదు ఆయనది నాపై. కొ.కు, శ్రీపాద – ఇద్దరి కథలూ అయితే కొన్నాళ్ళ క్రితం తెగ చదివేదాన్ని. విశ్వనాథ వారిని గత ఏడాదిలో సుమారుగా చదివాను. ఆ ప్రభావం బానే పడింది నాపై. అలాగే, పోయినేడు గోపీచంద్ కూడా బాగా ప్రభావితం చేసాడు – పోస్టు చేయని ఉత్తరాలు, తత్వవేత్తలు, పరమేశ్వర శాస్త్రి వీలునామాలతో. “సలాం హైదరాబాద్” నా మదిలో కొన్నాళ్ళలా నిలిచిపోయింది. అలాగే నవీన్ “కాలరేఖలు” ట్రైలజీ. శ్రీశ్రీ అనువాద కథలు ఇటీవల చదివిన వాటిలో బాగా ప్రభావం చూపింది. భానుమతి గారి ఆత్మకథా, అత్తగారి కథలూ మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉంటాను తరుచుగా.

ఆంగ్లం: Fritjof Capra ప్రధానంగా ప్రభావితం చేసిన మనిషి. Richard Dawkins, Dominique Lapierre, Malcolm Gladwell, – ఎక్కువగా చదవకపోయినా వీరంతా ఎంతో కొంత ప్రభావితం చేసారు. మన దేశం వారిలో Palagummi Sainath, Kuldip Nayar, R.K.Narayan, Amartya Sen, of course.. Tagore and Ray – మీరన్న కళ్ళు తెరిపించిన వారు.. నాకు వీరే. రష్యన్ కథకుడు ఆంటన్ చెహోవ్ కథల ప్రభావం కూడా చాలా ఉంది. మీరు నమ్మినా నమ్మకున్నా నేను చదివేది తక్కువే. నాకు తెలిసిన వాళ్ళలోనే నాతో పోలిస్తే విపరీతంగా చదివేవారు ఉన్నారు. ఇలాంటి ప్రశ్న వారెవర్నైనా అడగాలేమో.

స్వాతి: రాయ్ కథల్లో నీకు అంతగా నచ్చిందేమిటి?

సౌమ్య:నా అభిప్రాయం చెబుతాను… అందరికీ రాయ్ కథలు నచ్చకపోవచ్చు. ప్రధానంగా నాకు ఎందుకు నచ్చాయంటే, వాటిలోని వైవిధ్యానికీ, ఆ ఆలోచనల్లో ఉన్న ఒక విధమైన wild imagination కీ. ఉదాహరణకు, Shonku కథల్ని తీసుకుంటే, ఒక్కో కథలో imagination ఏ రేంజిలో ఉంటుందంటే, అవి అలా వెంటాడతాయి. ఊహించుకుంటూ ఉంటేనే ఓ కొత్త ప్రపంచం ఆవిష్కృతమౌతుంది నాకు. ఫెలూదా కథల్లో ఇలాంటి అనుభవం కాదు కానీ, Time pass బాగా అవుతుంది.

ప్రధానంగా నాకు ఎందుకు నచ్చాయంటే, వాటిలోని వైవిధ్యానికీ, ఆ ఆలోచనల్లో ఉన్న ఒక విధమైన wild imagination కీ. ఉదాహరణకు, Shonku కథల్ని తీసుకుంటే, ఒక్కో కథలో imagination ఏ రేంజిలో ఉంటుందంటే, అవి అలా వెంటాడతాయి. ఊహించుకుంటూ ఉంటేనే ఓ కొత్త ప్రపంచం ఆవిష్కృతమౌతుంది నాకు. ఫెలూదా కథల్లో ఇలాంటి అనుభవం కాదు కానీ, Time pass బాగా అవుతుంది.

అలాగే, అతని థ్రిల్లర్ కథలు కలిగించే అనుభూతి వేరు. పిల్లల కోసం చెప్పేటప్పుడు విధానం మళ్ళీ వేరుగా ఉంటుంది. పిల్లల కథలు కూడా నేను సమానంగా ఎంజాయ్ చేసాననుకోండి, అది వేరే విషయం. అయితే, ప్రస్తుతం నేనాయన వ్యాసాలపై ఎక్కువ దృష్టి పెట్టాను. వ్యాసాలు కూడా, పిల్లల కోసం రాసినదానికీ, పెద్దలకోసం రాసినదానికి మధ్య Transition చాలా సరళంగా సాగిపోయినట్లు అనిపిస్తుంది. అవి కూడా నేను సమానంగా అనుభవించి చదవగలుగుతున్నాను. ఆయన versatility కి నేను ఏసీని 🙂

స్వాతి: బ్లాగటం, చదవటం కాకుండా ఇంకా ఎక్కువగా ఏమి చేస్తుంటావు?

సౌమ్య: ఇప్పుడు మీతో మాట్లాడుతున్నానే – ఇలా స్నేహితులతో కబుర్లు చెబుతూ ఉంటాను… బాగానే ఆట్లాడుతూ ఉండేదాన్ని స్కూల్లో. కాలేజీ రోజుల్లో కూడా పర్లేదు…. ఇప్పుడు సున్నా! కిలోమీటర్లకి కిలోమీటర్లు నడవడం, ట్రెకింగ్ అంటే చాలా ఆసక్తి. వాటిలో దొరికిన అవకాశాలు పోగొట్టుకోను. ఆలోచనల్లో మునిగి…లిప్తపాటైనా ఉనికిని కోల్పోడం ఇష్టం. పాటలు వినడం… ఆకాశాన్నీ, మేఘాల్ని చూడటం… ఊహల్లో బ్రతకడం… దిక్కుమాలిన పరిస్థితిలో కూడా ఆశని బ్రతికించుకునే ప్రయత్నం చేయడం… అమ్మని విసిగించి తిట్టించుకోడం – ఇవి చేస్తూ ఉంటాను. 🙂

స్వాతి: మనసులోకి వచ్చిన ప్రతిదీ బ్లాగులోకి తెస్తావనుకుంటా? నీ బ్లాగు నీ ఆలోచనా స్రవంతికి ప్రతిరూపమా?ఎందుకంత మమేకమైపోయావ్ బ్లాగుతో?

సౌమ్య: తేను. ప్రతీదీ నేను బ్లాగులో రాయను. నా బ్లాగు నా డైరీ కావడం మీద నాకు ఆసక్తి లేదు. నా బ్లాగు నా ఆలోచనాస్రవంతిలోని ఓ భాగానికి ప్రతిరూపం. ఎటొచ్చీ, అప్పుడప్పుడూ ఆలోచనల్లో నేను కొట్టుకుపోకుండా బ్లాగే నన్ను కాపాడింది కనుక, నేను దానితో మమేకమైనట్లు మీకనిపించిందేమో కానీ, అదొక బ్లాగు. అంతే. నా బ్లాగులోని At Random విభాగానికి తప్ప ఇక దేనికీ నేను “మమేకమైపోయావ్” అన్న పదాన్ని ఆపాదించలేను నిజానికి. నన్ను గానీ, కనీసం నేను రాసే పరిధిగానీ – మొత్తంగా అదేమీ చూపదు. చూపనివ్వను. 🙂 వెబ్ లో మిగితా సైట్లను కూడా ఉద్ధరించాలా వద్దా? 😉

ప్రతీదీ నేను బ్లాగులో రాయను. నా బ్లాగు నా డైరీ కావడం మీద నాకు ఆసక్తి లేదు. నా బ్లాగు నా ఆలోచనాస్రవంతిలోని ఓ భాగానికి ప్రతిరూపం. ఎటొచ్చీ, అప్పుడప్పుడూ ఆలోచనల్లో నేను కొట్టుకుపోకుండా బ్లాగే నన్ను కాపాడింది కనుక, నేను దానితో మమేకమైనట్లు మీకనిపించిందేమో కానీ, అదొక బ్లాగు. అంతే. నా బ్లాగులోని At Random విభాగానికి తప్ప ఇక దేనికీ నేను “మమేకమైపోయావ్” అన్న పదాన్ని ఆపాదించలేను నిజానికి. నన్ను గానీ, కనీసం నేను రాసే పరిధిగానీ – మొత్తంగా అదేమీ చూపదు. చూపనివ్వను.

స్వాతి: పుస్తకం.నెట్ లో నీ పాత్ర ఏమిటి. అసలు దాని వెనక ముందు కథ ఏమిటి?

సౌమ్య: నా పాత్రంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు లెండి. ఎవరన్నా ఖర్మకొద్దీ నా ముందు బుక్ అనగానే.. పుస్తకం.నెట్ అనేసి మార్కెటింగ్ చేస్తూ ఉంటాను. అలాగే, సైటులో ప్రూఫ్ రీడ్ చేసి పోస్టు చేయడం, ఇతర సైట్లతోనో, మరెవరితోనో ఈ సైటు గురించి చెప్పి, బ్రతిమాలో, బెదిరించో వాళ్ళ చేత రాయించడం – ఇలాంటివి చేస్తూ, నేను కూడా వీలున్నప్పుడు ఏమన్నా రాసేందుకు ప్రయత్నిస్తూ ఉంటాను. ముందూ వెనుకా నా కథైతే ఇంతే. 🙂 మిగితా కథ నడిపేది పూర్ణిమ.

స్వాతి: నువ్వు కొన్ని కథలూ, సాహిత్య వ్యాసాలూ, ఒకటో అరో కవిత రాసినట్టు గుర్తు? నీకు వీటిల్లో ఏది రాయటం తేలిక.. ఏది ఇష్టం? నీ రచనల్లో అంతర్లీనంగా ఉండే ఫిలోసఫీ ఏమిటి? శైలి, శిల్పం, సందేశం ఈ విషయాలపై నీ అభిప్రాయం?

సౌమ్య: ఆ… మీరు పైన చెప్పిన వాటన్నింటిలోనూ వేలు దూర్చాను. ఏ రకమైనవీ కానీ వ్యాసాలు కూడా రాసుకున్నాను. సినిమా గురించి కూడా రాసుకున్నాను. ఏది తేలిక – కవిత ఐతే నాకు తేలిక, చిన్నది కనుక. ఎటొచ్చీ, అవతలి మనుషులకి అర్థం కాదు 😉 కథల్రాయడం నాకు ఇష్టం – కానీ, టైం ఉండదు. వ్యాసాలు రాయకుంటే తోచదు. అందుకని రాయకుండా ఉండలేను. (ఖళ్ ఖళ్ ఖళ్)

అంతర్లీన ఫిలాసఫీ…. :))) అసలు నన్ను…అలా ఎలా … ఈ ప్రశ్న అడగాలనిపించింది మీకు? దానికి జవాబు చెబితే దీనికి జవాబు చెబుతాను. ఇంతకీ, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే అర్హత నాకు లేదు. (ప్రస్తుతానికి… జీవితాంతం ఇలాగే అనర్హురాలిగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు…) ఇక శైలి, శిల్పం, సందేశం – సందేశం ప్రతి రచనకూ కంపల్సరీ అన్న పట్టుదల నాకేమీ లేదు. ఎటొచ్చీ, మిగితా రెండు… తప్పనిసరి అని నాకనిపిస్తుంది. శైలి సరిగా లేకుంటే అది ఎంత గొప్ప కథైనా, ఎంత సందేశాన్నిచ్చినా, బహుశా ఇవ్వాల్సినంత ఎఫెక్ట్ ఇవదేమో. మంచి కథని చెత్త దర్శకత్వం చేస్తే ఎలా ఉంటుందో అలా అన్నమాట.

స్వాతి: అనువాద రచనలకి సంబంధించి నీక్కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలున్నాయనుకుంటా! ఇతర భాషల రచనల్ను తెలుగులోకి అనువదించేప్పుడు నువ్వు ఏ నియమాలకి కట్టుబడి ఉంటావు?

సౌమ్య: ఉన్నాయి. అందుకే అవతలి మనిషి ఎంతవారైనా నాకు ఆ అనువాదం నచ్చకపోతే దాన్ని చెప్పుకునేందుకు వెనుకాడను. సాధారణంగా నేను అనువదించేటప్పుడు – (మరి నాకు అనుభవం లేదనీ, నాకు తెలిసినంతలో చేస్తాను అనీ.. ముందే విన్నవించేసి ఈ మాట అంటున్నాను :)) భాష వీలైనంత వరకూ డబ్బింగ్ సినిమా ఫీలింగ్ ఇవ్వకుండా ఉండాలి అన్న ఒకే ఒక్క నియమం పెట్టుకుంటాను. ఒక్కో వాక్యాన్నీ తీసుకుని దాని అర్థాన్ని పూర్తిగా తెలియజేసేలా అనువాదం చేయాలి అని అనుకుంటాను కానీ, పదానికి పదం అనువదించడానికి కాదు. అలా చేసేందుకు ఓ Dictionary based machine translation వాడితే సరిపోతుంది. మనిషెందుకూ?

ఇంకా, కొన్ని ఆ భాషకే ప్రత్యేకమైన పదాలూ అవీ ఉంటాయి…అవి ఎలా అనువదిస్తారో? అన్నది నాకు ఇంకా అంత స్పష్టమైన అభిప్రాయం లేని అంశం. కొన్నేమో సాంకేతికపదాలో, లేక ఇతరత్రా… ఆంగ్ల పదాలే అలాగే వాడుకలో ఉంటాయి. అలాంటప్పుడు మనమో కొత్త పదం తెలుగులో కనిపెట్టాలా? అవి అలానే ఉంచేయాలా? అని మళ్ళీ అనుమానం. ఆ మధ్య చావా కిరణ్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఇదే అంటే, ఆయనేమో, కొత్త పదం రాసి బ్రాకెట్లలో ఆంగ్ల పదం రాస్తే, ఈ కొత్త పదానికి ప్రచారం ఉంటుంది కదా..అన్నారు. బహుశా, అది మంచి మార్గమే ఏమో అని అనిపిస్తుంది నాకు.

స్వాతి: నువ్వు ఇదివరలో రాసిన కథలు వేటికన్నా సీక్వెల్స్ రాసే ఆలోచనలు ఉన్నాయా?

సౌమ్య: సీక్వెల్స్ రాసే తరహా కథలు నేనెక్కడ రాసానూ? 🙂 అయితే, ఎప్పుడో, భవిష్యత్తులో ఒక సిరీస్ లాగ కథలు రాయాలి అని కోరిక ఉంది. అంత వివరంగా ఇంకా ప్లాన్ చేస్కోలేదు. ఇవన్నీ కోరికలు మాత్రమే. మింగ మెతుకులేదు మీసాలకు సంపెంగ నూనె వంటి సామెతలు గుర్తుతెచ్చుకోకండేం?

స్వాతి: ఇంకా ఎటువంటివి రాయాలని, ప్రయోగాలు చేయాలనీ నీ కోరిక?
సౌమ్య: నాకు ఈమధ్య సైన్సు ఫిక్షన్ కథలు రాయాలి అనిపిస్తోంది. బహుశా రీసెర్చి ఆలోచనలు ముదిరి ఇలా అనిపిస్తోందేమో మరి.. తెలీదు. మూణ్ణాలుగు ఆలోచనలు నోట్ చేసి పెట్టుకున్నా కానీ ఎప్పటికి రాస్తానో తెలీదు. 🙂

—————–
స్వాతి కుమారి పొద్దు సంపాదకవర్గ సభ్యులు.

About స్వాతికుమారి

స్వాతికుమారి పొద్దు సంపాదకవర్గ సభ్యురాలు.

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

11 Responses to సౌమ్య టాక్స్

  1. 🙂 చాలా బాగుంది ఇంటర్వూ. సౌమ్యా, స్వాతీ, – ఇద్దరికీ అభినందనలు.

  2. Purnima says:

    Typo in the title! Expected: Sowmya Rocks!! Isn’t it? 🙂

  3. చాలా బావుంది. తన రచనల్లోనూ బ్లాగులోనూ ఎక్కడో అరుదుగాకానీ కనబడని సౌమ్యని మాకు చూపించారు.
    సౌమ్య, మీ నిశ్యాలోచన పథం అభిమానుల్లో నేనూ ఒకణ్ణి, ప్రతిదానిలోనూ వ్యాఖ్య రాయకపోయినా. నిజానికి బ్లాగు రచన అంటే అలాగా ఉండాలని కూడా అనిపించింది నాకు. ఇది మీలోని శాడిస్టుకి కొద్దిగా ఊపిరిస్తుందని ఆశిస్తున్నా.

  4. మేధ says:

    ఎందుకో తెలియదు కానీ, సౌమ్య బ్లాగు చదివినప్పుడు చాలా సీరియస్ అనిపించేది! కానీ ఇది చదివిన తరువాత లేదు మామూలే అనిపిస్తోంది 🙂
    మీ నిశ్యాలోచనపధానికి నేనూ అభిమానినే, కాకపోతే ఆ ఆలోచనల ప్రవాహం లో కొట్టుకుపోతూ, వ్యాఖ్యలు రాయనంతే..!

  5. Malakpet Rowdy says:

    “Sowmya Rocks” –

    Yep I agree!

  6. Swathy says:

    Beautiful…. Sowmya Rocks !! 🙂 అందులో అనుమానం లేదు .

    స్వాతి గారికి అభినందనలు 🙂 …

  7. సౌమ్యగారు సరదాగా మాట్లాడుతున్నట్టే చెప్పిన సీరియస్ ముచ్చట్లు చాలా ఆహ్లాదకరంగా వున్నాయి. స్వాతిగారికి ధన్యవాదాలు.

  8. vinay chakravarthi says:

    naaku koncham arthamina first post(meedi)……………nijam ga chebutunnanu mee nishyalochanapadham ent alane poddulo raasina konni stories em artham kaaledu………maa oxigen teesesi meeru batukutunnaru………..but i saw one gud post from u,in technical side.naaku mee way of writinf asalu artham kaadu………….ofcourse artham kavalane rule ledanuko………..

    as u said ” అవతలి మనిషి ఎంతవారైనా నాకు ఆ అనువాదం నచ్చకపోతే దాన్ని చెప్పుకునేందుకు వెనుకాడను”

    anduke cheppanu………baagundi ani naaku mee suvvi suvvi post ki matrame anipinchindi.

  9. “Spwmya writes” లాగే “Sowmya talks” కూడా బావుంది.
    సౌమ్య గారికీ, స్వాతి గారికీ అభినందనలు.
    మేధ గారన్నట్టు మీ నిశ్యాలోచనాపథం చదివాకా నేను కూడా అదో లోకంలోకి వెళ్లినట్టనిపిస్తుంది. అప్పుడసలు ఏమి వ్యాఖ్య రాయాలో కూడా తెలీదు 🙁
    Sowmya rocks 🙂

  10. ఆలోచింప చేసె సరదా కబుర్లు బాగున్నాయ్… ఇరువురికి అభినందనలు.
    మీ నిశ్యాలోచనాపధం క్రమం తప్పకుండా నేను కూడా చదువుతాను కానీ “ఏవిటో అమెరికా జోకులు అర్ధం అయితే కానీ నవ్వలేం !!” అని అన్నపూర్ణమ్మ గారన్నట్లు… కొన్ని సార్లు “ఏవిటో కొందరి ఆలోచనలు అర్ధం చేసుకోడానికి మన ఐక్యూ సరిపోదేమో…” అనిపిస్తుటుంది అ అయోమయం లో అసలు కామెంట్ రాయాలని గుర్తే రాదు 🙂
    Purnima is right, title should be Sowmya Rocks

  11. Sowmya says:

    వ్యాఖ్యలు రాసిన అందరికీ నా ధన్యవాదాలు.
    ఈ సంభాషణ నడిపినందుకు స్వాతి గారికి కూడానూ 🙂

Comments are closed.