మృతజీవులు – 25

-కొడవటిగంటి కుటుంబరావు

అయితే ఒకప్పుడీ మనిషి ఎస్టేటును చాలా శ్రద్ధగా నిర్వహించినవాడు! ఆయనకు పెళ్ళి అయింది, పిల్లలున్నారు, చుట్టుపక్కల వాళ్ళు ఆయన ఇంటికి అతిధులుగా వచ్చి ఎస్టేట్లను పొదుపుగా నిర్వహించే పద్ధతులు తెలుసుకునేవారు. పని అంతా చురుకుగా సాగిపోయేది. ఏదీ క్రమంతప్పేది కాదు; మిల్లులూ, నేతపనీ, బట్టల ఫ్యాక్టరీలూ, వడ్రంగి కార్ఖానాలూ, నూలుతియ్యటమూ చురుకుగా సాగేవి. యజమాని అన్నిటినీ వెయ్యికళ్ళతో జాగ్రత్తగా కనిపెట్టుతూ గూటిని చూసుకునే సాలీడులాగా అటూ ఇటూ పరిగెడుతూ ఎంతో సమర్థత చూపేవాడు. ఆయన మొహంలో తీవ్రమైన భావోద్రేకం ఉండేది కాదు, కళ్ళలో తెలివి ఉండేది. ఆయన సంభాషణలు అనుభవమూ ప్రపంచజ్ఞానమూ ఉట్టిపడేవి, ఆ సంభాషణ విని అతిధులు ఆనందించేవారు, ఇంటావిడ కూడా చక్కగా మాట్లాడే మనిషి. అతిధి సత్కారంలో ఆవిడకు పెట్టినది పేరు.

వారి కుమార్తెలిద్దరూ విచ్చిన గులాబీల్లా ఉండి, అతిధులకు స్వాగతం చెప్పటానికి వచ్చేవాళ్ళు. కొడుకొకడుండేవాడు, వాడికి నదురూ బెదురూ లేదు. పరిగెత్తుకుంటూ వచ్చి ఆవతలివాళ్ళకి తనమీద ముద్దో కాదో ఆలోచించకుండా అందరికీ ముద్దులిచ్చేవాడు. కిటికీలన్నీ తెరచిఉండేవి. కింది అంతస్తుకూ, పై అంతస్తుకూ మధ్య ఉండే అంతస్తులో ఫ్రెంచి చెప్పే ట్యూటరు గదులుండేవి. అతను గడ్డాన్ని ఎంతో నున్నగా చేసుకునేవాడు, అతనికి వేటాడటం చాలా సరదా. అతను దాదాపు ప్రతిరోజూ ఆడవి కోడినో, అడవి బాతునో కొట్టి వండటానికి తెచ్చేవాడు. అయితే ఒక్కొక్కసారి పిచ్చికల గుడ్లు మాత్రమే తెచ్చి వాటిని తానే అట్టువేసుకుని తినేవాడు. ఎందుచేతనంటే వాటిని మరెవరూ అంటుకునేవారు కారు. అతని సహోద్యోగస్తురాలు, ఆడపిల్లలకు చదువు చెప్పే ఆమె కూడా ఈ మధ్య అంతస్తులోనే నివసించేది.

ఇంటి యజమాని భోజనానికి వచ్చేటప్పుడు పాతదైనా శుభ్రంగా ఉండే ఫ్రాక్ కోటు ధరించేవాడు, దానికి మోచేతుల వద్ద చిరుగులుగాని, ఎక్కడా మాసికలుగాని ఉండేవికావు. కాని సాధ్వి అయిన ఇల్లాలు కాస్తా మరణించింది, తాళపు చెవులతో బాటు ఇంటి బాధ్యతలు కూడా ఆయన చేతికి వచ్చాయి. ఫ్ల్యూష్కిన్ కు ఆదుర్దా హెచ్చింది. భార్యలను పోగొట్టుకున్న వారందరిలాగే ఆయనా అనుమానం మనిషిగానూ, పిసినారిగానూ తయారయాడు. ఆయన తన పెద్దకూతురు అలెగ్జాంద్రస్తిపానావ్న మీద అంతగా ఆధారపడలేదు, అలా చేయటం మంచిదే అయింది కూడాను. ఎందుకంటే త్వరలోనే ఆమె ఒక అశ్వికదళానికి చెందిన అధికారితో లేచిపోయి, ఏ పల్లెటూరి చర్చిలోనో ఆదరాబాదరా పెళ్లాడేసింది. తన తండ్రికి సైనికాధికారులంటే ఇష్టం లేదనీ, ఆయన దృష్టిలో వాళ్ళందరూ జూదరులూ, దుబారామనుషులూ అనీ ఆమెకు తెలుసు. తండ్రి ఆమెను శపించి ఊరుకున్నాడేగాని ఆమె వెంటపడలేదు. ఇల్లు మరింత చిన్నబోయింది. అంతకంతకు పిసినిగొట్టుతనం ఆయన ప్రధాన లక్షణంగా తయారై, నెత్తిమీద బిరుసుజుట్టు తెల్లబడుతున్నకొద్దీ అదికూడ అభివృద్ధి కాసాగింది. తెల్లజుట్టుకూ, పిసినిగొట్టుతనానికీ సఖ్యత జాస్తి.

గడ్డీ, ధాన్యమూ మురిగిపోసాగాయి. కొట్లలో ఉన్న నిలువలూ, కుప్పలూ ఎరువుగా మారాయి. అవి కాబేజీ మొక్కలకు బలం చెయ్యటానికి తప్ప మరెందుకూ పనికిరాకుండా పోయాయి. కొట్లలో పిండి గట్టిగా రాయిలాగా పేరుకుపోయి గొడ్డళ్ళతో పగలగొట్టవలసిన స్థితికి వచ్చింది. బట్టలనూ, నేతగుడ్డనూ ముట్టుకుంటే పొడిపొడి అవుతాయనిపించింది. ఇప్పుడాయనకు తన వద్ద ఏది ఎంత ఉన్నదో ఏమీ తెలీదు. ఆయనకు జ్ఞాపకం ఉండేదల్లా చెక్కల అరలో తాను గాజుజాడీలో, ఎవరైనా కాజేసిపోతారని గుర్తుపెట్టి మరీ ఉంచిన, లక్కముక్కా, ఈకలూ పెట్టినచోటూ మాత్రమే.

కొడుకు ఉద్యోగంలో ప్రవేశించే సమయానికి ఫ్రెంచి ట్యూటరుకు ఉద్వాసన చెప్పారు. అలెగ్జాంద్రస్తిపానావ్న లేచిపోయిన సందర్భంలో పంతులమ్మ ప్రవర్తన సక్రమంగా లేనట్టు కనపడినందున ఆమెను వెళ్ళగొట్టారు. తన కొడుకు న్యాయశాఖలో పనిచేస్తే బాగుంటుందని తండ్రి అభిప్రాయం, అందుకని వాణ్ణి రాష్ట్ర రాజధానికి పంపితే, వాడు కాస్తా సైనికోద్యోగానికి దరఖాస్తు పెట్టి, ఉద్యోగం వచ్చినాక సరంజామా అంతా కొనుక్కోవటానికి డబ్బు పంపమని తండ్రికి రాశాడు అయితే వాడికి తిట్లు తప్ప ఇంకేమీ రాలేదు. చిట్ట చివరకు తండ్రివెంట ఉండిన రెండో కుమార్తె కూడా చనిపోవటంతో ఆయన తన ఆస్థికి ఏకైక రక్షకుడూ, హక్కుదారూ, బాధ్యుడూ అయాడు. ఆయన ఒంటరి జీవితం పిసినిగొట్టుతనాన్ని బాగా ప్రకోపింపజేసింది; ఈ దుర్గుణానికి తిన్నకొద్దీ, తోడేలులాగా ఆకలెక్కువ, దాని దాహం తీరుతున్నకొద్దీ రెచ్చిపోతుంది, ఈ సంగతి అందరికీ తెలుసు. అసలే అంతంతమాత్రంగా ఉండే ఆపేక్ష, అంతఃకరణలు అంతకంతకూ తరిగిపోయాయి, రోజులు గడుస్తున్నకొద్దీ ఆయన మరింత మోడు కాసాగాడు. సైనికాధికారులంటే ఆయనకుండే దురభిప్రాయాన్ని రుజువు చెయ్యటానికా అన్నట్టుగా ఆయన కొడుకు ఈ సమయంలోనే జూదమాడి డబ్బు పోగొట్టుకోవటం జరిగింది; ఆయన హృదయపూర్వకంగా వాడికి తండ్రి శాపం అందజేసి, ఆ తరవాత వాడు చచ్చాడో, బతికాడో కూడా విచారించటం మానేశాడు.

ఆయేటి కాయేడు మరికొన్ని కిటికీలు మూసేశారు, చివరకు రెండే మిగిలాయి; అందులో ఒక దానిమీద కాగితం అంటించి ఉన్న సంగతి పాఠకుడు అదివరకే చూశాడు. ఒక్కొక్క ఏడే గడుస్తున్న కొద్దీ ఆయనలో నిర్వహణ దక్షత కొంచెం కొంచెమే క్షీణించింది. రానురాను ఆయన ఆదుర్దా తన గదిలో కనిపించే కాగితం తుంపుల మీదా, ఈకల మీద కేంద్రీకరించుకున్నది. తనవద్ద సరుకులు కొనటానికి వచ్చే వర్తకుల విషయంలో ఆయన అంతకంతకు మూర్ఖం పట్టసాగాడు, వారు ఆయనతో బేరమాడి, ఆడి ప్రాణం విసిగి, “నువు మనిషివి కాదు, రాక్షసుడివి” అని తిట్టి రావటం మానేశారు. గడ్డీ, ధాన్యమూ మురిగిపోసాగాయి. కొట్లలో ఉన్న నిలువలూ, కుప్పలూ ఎరువుగా మారాయి. అవి కాబేజీ మొక్కలకు బలం చెయ్యటానికి తప్ప మరెందుకూ పనికిరాకుండా పోయాయి. కొట్లలో పిండి గట్టిగా రాయిలాగా పేరుకుపోయి గొడ్డళ్ళతో పగలగొట్టవలసిన స్థితికి వచ్చింది. బట్టలనూ, నేతగుడ్డనూ ముట్టుకుంటే పొడిపొడి అవుతాయనిపించింది. ఇప్పుడాయనకు తన వద్ద ఏది ఎంత ఉన్నదో ఏమీ తెలీదు. ఆయనకు జ్ఞాపకం ఉండేదల్లా చెక్కల అరలో తాను గాజుజాడీలో, ఎవరైనా కాజేసిపోతారని గుర్తుపెట్టి మరీ ఉంచిన, లక్కముక్కా, ఈకలూ పెట్టినచోటూ మాత్రమే.

కాని ఎస్టేటు మీది రాబడి ఏమో మామూలు ప్రకారం వస్తూనే ఉన్నది. రైతులు చెల్లించేదేమో చెల్లిస్తూనే ఉన్నారు. ఆడవాళ్లు ఇంత అని పప్పులూ, నేసిన బట్టలూ ఇచ్చుకుంటున్నారు. ఇదంతా కొట్లలోనే చీకిపోతున్నది. అసలు ఆయనే చీకిపోయిన మానవత్వంలాగా తయారయాడు, అలెగ్జాంద్రస్తిపానవ్న తండ్రి దగ్గిర సహాయం పొందుదామనే సంకల్పంతో తన కొడుకును వెంట బెట్టుకొని ఒకటి రెండుసార్లు వచ్చింది. ఎప్పుడూ డ్యూటీలో ఉండే సైనికాధికారితో సంసారం చెయ్యటం ఆమెకు పెళ్ళికి పూర్వం అనిపించినంత ఆకర్షవంతంగా లేనట్టుంన్నది. అయినా ప్ల్యూష్కిన్ ఆమెను క్షమించటమేగాక, తన మనవడు ఆడుకునేటందుకు బల్లమీద ఉన్న గుండీ ఒకటి ఇచ్చాడు కూడా, ఆమెకు డబ్బు మటుకు ఇచ్చాడు కాదు. ఇంకోసారి అలెగ్జాంద్రస్థిపానవ్న తన ఇద్దరు పిల్లలతో వస్తూ, తన తండ్రికోసం టీతో తినే ఒక కేకూ,కొత్త డ్రెసింగ్ గౌనూ తెచ్చింది. ఎందుకంటే ఆమె తండ్రి వేసుకునేవి ఘోరంగా ఉండటమేగాక, చూడటానికి సిగ్గేసేలాగున్నది. ప్ల్యూష్కిన్ తన మనవల్నిద్దర్నీ ముద్దు చేశాడు, ఒకణ్ణి కుడి మోకాలు మీదా, ఇంకొకణ్ణి ఎడమ మోకాలు మీదా ఎక్కించుకుని, గుర్రం సవారీలాగా ఎగరవేశాడు. ఆయన కేకూ, డ్రెసింగ్ గౌనూ స్వీకరించాడు, కాని కూతురికి ఏమీ ఇవ్వలేదు. అంతటితో అలెగ్జాంద్రస్తిపానవ్న వెళ్ళి పోయింది.

చిచీకవ్‌కు ఎదురుగా నిలబడిన భూస్వామి ఇలాటి వ్యక్తి! ప్రతి మనిషీ తన జీవితాన్ని పెంచుకోవటానికే తప్ప ముడుచుకుపోవటానికి ప్రయత్నించని రష్యాలో ఇతను ఒక వింతమనిషేనని చెప్పాలి. చిత్రమేమిటంటే ఇక్కడికి దగ్గరలోనే ఉన్న మరొక భూస్వామి పాతకాలపు కమతగాళ్ళదారులాగా విశృంఖలంగా డబ్బు తగలేసి “దీపం” లాగా జీవిస్తున్నవాడు. దారేపొయ్యేవాళ్లు ఆయన నివాసం చూసి, అనామకులైన భూస్వాముల మధ్య ఎవరో మహారాజు వెలిశాడనుకుని ఆశ్చర్యపడుతూ నిలబడిపోయేవారు. అంతులేని పొగగొట్టాలూ, బురుజులూ కలిగిన తెల్లని భవంతీ, దాని చుట్టూ అనేక చిల్లర గృహాలు, అతిధుల బసలూ, అన్నీ కలిసి ఏదో రాజభవనం లాగుండేది. దేనికీ లోటు లేదు, నాటకాలూ, నృత్యాలూ ఉండేవి. ప్రతిరాత్రీ ఉద్యానమంతా దీపాలతోనూ, లాంతర్లతోనూ, కళకళలాడుతూ, సంగీతంతో మారుమోగేది. రాష్ట్రంలోని సగం మంది వ్యక్తులు మంచి మంచి దుస్తులు ధరించి చెట్లకింద పచార్లు చేసేవారు. నల్లని చెట్లగుంపునుంచి ఒక కొమ్మ, ఎవరో కావాలని పెట్టినట్టు, వెలుగులోకి పొడుచుకు వస్తే అదిచూసి ఎవరూ భయవిస్మయాలు చెందేవారు కారు. ఆ కొమ్మకుండవలసిన సహజమైన ఆకుపచ్చ రంగు కనిపించేది కాదు, ఆ కొమ్మలో నుంచి చూస్తే రాత్రి ఆకాశం మరింత నల్లగానూ, ఇరవై రెట్లు భయానకంగానూ కనబడేది. చెట్ల తలలు కళ్లు పొడుచుకున్నా కనిపించని అంధకారంలోకి చొచ్చుకుపోయి, కింది భాగాలను ప్రకాశింప జేసే వెలుగును నిరసించుతున్నట్టుగా ఉండేవి.

ప్ల్యూష్కిన్ చాలాసేపు మాటా పలుకూ లేకుండా నిలబడి ఉన్నప్పటికీ చిచీకవ్, ఈ భూస్వామి యొక్క అవతారమూ, తాను చూసిన గదీ మూలాన దిమ్మరపోయి, సంభాషణకు ఎలా ఉపక్రమించ వలసినదీ తెలుసుకోలేక పోయాడు. తాను వచ్చిన పని ఎలాటి మాటలలో వ్యక్తం చెయ్యాలో నిర్ణయించటానికి అతనికి చాలాకాలం పట్టింది. “తమ గుణగణాలూ, ఆధ్యాత్మిక సంపదా గురించి పదిమందీ చెప్పగా విని, తమ దర్శనం చేసుకోవటం కర్తవ్యంగా భావించి ఇలా చక్కా వచ్చాను” అందామా అనుకున్నాడుగాని, మోతాదు శ్రుతిమించుతుందని పస్తాయించాడు. గదిని మరొక్కసారి క్రీగంట కలయజూసిన మీదట “గుణగణాలు”, “ఆధ్యాత్మిక సంపద” అనటానికి బదులు “పొదుపు”, “నిర్వహణ దక్షత” అంటే బాగుంటుందని తోచింది. అందుచేత అతను ఉపోద్ఘాతాన్ని ఆ విధంగా మార్చి తాను ఆయన పొదుపు గురించీ, ఎస్టేటు నిర్వహించటంలో ఆయనకు గల దక్షతను గురించీ విని ఆయన పరిచయ భాగ్యంకోసం వచ్చానని చెప్పుకున్నాడు. ఇంతకంటే కూడా మంచివంక ఏదైనా దొరికేదేమో గాని, ఆ సమయానికి మరేదీ అతనికి తట్టలేదు.

ఈ మాటలకు సమాధానంగా ప్ల్యూష్కిన్ పెదవుల సందుగా ఏదో గొణిగాడు- ఆయనకు దంతాలు లేవు- కాని ఆ గొణుగుడు స్పష్టంగా లేదు; బహుషా, “నువూ, నీ దర్శనము అహోరించిందిలే!” అని ఆయన తాత్పర్యం కావచ్చు. అయినా మాకు అతిధి సత్కారం విధ్యుక్తధర్మం గనక, ఎంత పిసినిగొట్టు కూడా దానిని దాట వీలులేదు గనక, ఆయన ఇంకొంచెం స్పష్టంగా మాట్లాడుతూ, “కూచోండి!” అన్నాడు.

“మా ఇంటికి ఎవరైనా వచ్చి చాలాకాలమయింది. నిజానికి నేను వాళ్ళకోసం వాచిపోనుకూడా. ఒకరినొకరు చూడబోవటం ఒక జబ్బుగా తయారయింది. పనులు పాడుచేసుకుంటూ… ఆ వచ్చిన వాళ్ళ గుర్రాలకి ఎండుగడ్డి కూడా వేసి చావాలి! నా భోజనం అయిపోయి చాలాసేపయింది. మా వంటశాల చెప్పుకోదగినది కాదు, చాలా అల్పమైనది. పొగగొట్టం పూర్తిగా పడిపోయింది. స్టవ్ మండించడానికి ప్రయత్నిస్తే ఇల్లంతా అంటుకుంటుంది.”

‘అదా సంగతీ? ఇంకానయం, నేను సబాకివిచ్ ఇంట సుష్టుగా భోంచెయ్యటం మంచిదయింది,’ అనుకున్నాడు చిచీకవ్.

“అదీగాక ఎక్కడా ఒక మోపెడు ఎండుగడ్డి కూడా లేకపోవటం చావొచ్చింది, ఎలా ఉంటుందీ? నాకున్నదే బెత్తెడు పొలం, కమతగాళ్లు చూడబోతే సోమరిపోతులు. వాళ్ళ కెంతసేపూ సారాదుకాణానికి పోదామనేగాని, పనిచేద్దామని ఉండదు… జాగర్తపడకపోయానంటే వృద్ధాప్యంలో చిప్ప తీసుకుని ముష్టెత్తుకోవలసిందే!” అన్నాడు ప్లూష్కిన్.

“కాని మీకింద వెయ్యిమందికి పైగా కమతగాళ్లున్నారని విన్నానే!” అన్నాడు చిచీకవ్.

“ఎవరా అన్నదీ? ఆమాట అన్నవాళ్ల మొహంమీద మీరు ఊసిఉండవలసిందయ్యా! వాడేదో వేళాకోళానికి మీతో హాస్యంగా అని ఉంటాడు. ఇప్పుడు మీరు వెయ్యిమంది కమతగాళ్లన్నారు గదా, వెళ్లి లెక్కపెట్టి చూడండి, అదేమీ ఉండదు! గత మూడేళ్లలోనూ దిక్కుమాలిన జ్వరాలొచ్చి నా కమతగాళ్లందర్నీ పట్టుకుపోయాయి!”

“అలాగాండీ! చాలా మంది చచ్చారేం?” అన్నాడు చిచీకవ్ సానునయంగా.

“అవును, చాలామందిని పాతేశాం.”

“మీ కభ్యంతరరం లేకపోతే ఎంతమందో చెబుతారా?”

“ఎనభైమంది.”

“సాహసించి అడుగుతున్నందుకు ఏమీ అనుకోకండీ, మీ ఉద్దేశమేమిటి? మీరు ఏటా వాళ్లకివ్వటానికి ఒప్పుకున్న సొమ్ము నాకు పంపిస్తారా, పన్నులు వసూలు చేసే వాళ్లను పంపిస్తారా?” అని అడిగాడు.

“అందుకుగాను ఒక పని చేద్దాం; వాళ్లు బతికి ఉన్నట్టుగానే, వాళ్ల అమ్మకం పత్రం రాసుకుందాం- వాళ్లను మీరు నాకు అమ్ముతున్నట్టన్న మాట.”

“ఆఁ హాఁ?”

“మీతో అబద్ధం చెబుతానుటండయా?”

“ఇంకొకటి కూడా దయచేసి చెప్పండి; వీళ్లంతా జనాభా లెక్కలు తీసుకున్నాక పోయిన వాళ్ళేనా?”

“అలా అయితే లేనిదేం? ఆ లెక్కలు తీసుకున్నాక నూట ఇరవైమంది పోయారు.”

“నిజంగానా! నూట ఇరవైమందా?” అన్నాడు చిచీకవ్ ఆశ్చర్యంతో నోరు తెరచి.

“పెద్దవాణ్ణి, తమతో అబద్ధం చెప్పను. నాకు డెబ్భై దాటాయి!” అన్నాడు ప్ల్యూష్కిన్. చిచీకవ్ ప్రదర్శించిన ఆనందాశ్చర్యాలు ఆయనకు చిరాకు కలిగించినట్టున్నది. అవతలివాడి కష్టం చూసి సానుభూతి ప్రదర్శించకపోవటం భావ్యంకాదని గ్రహించి చిచీకవ్ ఒక్క నిట్టూర్పు విడిచి, తాను చాలా విచారిస్తున్నట్లు తెలిపాడు.

“పరామర్శలతో జేబులు నిండుతాయా? ఈ పక్కనే ఒక కాప్టెన్ వుంటున్నాడు, ఎక్కడికినుంచి వచ్చాడో తెలీదు, బంధువునంటాడు, ‘మామా, మామా’ అంటాడు అస్తమానం, చెయ్యి తీసుకుని ముద్దు పెట్టుకుంటాడు. ఇక పరామర్శించటం మొదలు పెడితే ఎంత శోకం పెడతాడంటే, చెవులు మూసుకోవలసిందే. అతని మొహం కందగడ్డలా వుంటుంది. బ్రాంది తెగ తాగుతాడు గామాలు. సైనికాధికారిగా, డబ్బంతా ధ్యంసం చేసుకుని వుంటాడు, లేక ఏ నాటకాల దాన్నయినా మరిగి వుంటాడు, అందుకని ఇప్పుడు పరామర్శలో పడ్డాడు,” అన్నాడు ప్ల్యూష్కిన్.

తన సానుభూతి కాప్టెన్ సానుభూతి లాటిది కాదనీ, బొల్లి మాటలు కాకుండా తాను ఆచరణలో ఆ విషయం రుజువు చేయటానికి సిద్ధంగా ఉన్నానని చెబుతూ చిచీకవ్ వెంటనే అసలు విషయానికి వచ్చి; అన్యాయంగా చచ్చిపోయిన ఆయన కమతగాళ్ళందరికీ తాను పన్ను కట్టటానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేశాడు. ఈ మాటలు విని ప్ల్యూష్కిన్ నిర్ఘాంతపోయాడు. ఆయన కళ్ళు పెద్దవి చేసి చూసి చివరకు, “అయ్యా, మీరుగాని సైనికోద్యోగంలో లేరుగదా?” అని అడిగాడు.

“లేదు, సివిల్ సర్వీసులో ఉండేవాణ్ణి” అన్నాడు చిచీకవ్ కొంచెం యుక్తిగా.

“సివిల్ సర్వీసు”, అంటూ ప్ల్యూష్కిన్ ఏదో తింటున్నవాడల్లే పెదవులు ఆడించి, “అయితే మీ ఉద్దేశమేమిటి? మీకు నష్టంగదా?” అన్నాడు.

“మిమ్మల్ని సంతోష పెట్టటానికని నష్టపడటానికి సిద్ధంగా ఉన్నాను.”

“ఆహా, ఎంత మంచివారండీ! నాకెంత ఉపకారం చేస్తున్నారండీ!” అని ప్ల్యూష్కిన్ ఆనందపడ్డాడు. ఆ ఉత్సాహంలో ఆయన తన ముక్కులోనుంచి పొడుం కాఫీ పొడిలాగా, జుగుప్సాకరంగా బయటికి తొంగి చూస్తున్న సంగతిగాని, ఆయన చొక్కా పైకిలేచి, ఇతరుల కంటబడటానికి అర్హంగాని లోదుస్తులు కనిపిస్తున్న సంగతి గాని గమనించను కూడా లేదు.”ఈ ముసలి వాడికి ఎంత సంతోషం కలిగించుతున్నారు! ఓరి భగవంతుడా! ఓయీ సుతుల్లారా!…” అంటూ ఆయన మరి మాట్లాడలేక పోయాడు. కాని ఒక్క నిమిషమన్నా గడవకుండానే ఆయన చెక్కమొహంలోకి ఆనందం ఎలా వచ్చిందో అలాగే మాయమయింది, తుడిచేసినట్టుగా; ఆ తరువాత ఆయన మొహంలో ఆదుర్దా కనిపించింది. ఆయన చేతిరుమాలుతో మొహమంతా తుడుచుకుని, దాన్ని ఉండజుట్టి పై పెదవి తుడుచుకుంటూ, “సాహసించి అడుగుతున్నందుకు ఏమీ అనుకోకండీ, మీ ఉద్దేశమేమిటి? మీరు ఏటా వాళ్లకివ్వటానికి ఒప్పుకున్న సొమ్ము నాకు పంపిస్తారా, పన్నులు వసూలు చేసే వాళ్లను పంపిస్తారా?” అని అడిగాడు.

“అందుకుగాను ఒక పని చేద్దాం; వాళ్లు బతికి ఉన్నట్టుగానే, వాళ్ల అమ్మకం పత్రం రాసుకుందాం- వాళ్లను మీరు నాకు అమ్ముతున్నట్టన్న మాట.”

“అవును, విక్రయదస్తావేజు” అన్నాడు ప్ల్యూష్కిన్. ఆయన ఆలోచనలో పడి మళ్ళీ పెదవులాడించసాగాడు. “కాని విక్రయ దస్తావేజుకు ఖర్చులవుతాయి. ఈ గుమాస్తాలకు అంతరాత్మ అన్నది లేదు. వెనుకటి రోజుల్లో ఒక అర్ధరూబుల్ చేతిలో పెట్టి ఒక పిండిమూట ముట్టజెప్పితే సరిపోయేది, ఇప్పుడు చాటెడు ధాన్యం పంపించి, పైన ఒక ఎర్రనోటు చేతిలో పెట్టాలి, వాళ్ల ధనాశ అలాటిది. ఇదంతా ఎవ్వరూ పట్టించుకోరెందుకో నాకు తెలియకుండా ఉంది. వాళ్ళను కనీసం గట్టిగా కేకలు వేసినా బాగుండును. ఎన్నయినా చెప్పండి మాట మనిషికి తగులుతుంది, గట్టిగా తిడితే ఊరికేపోదు.”

‘నువు మహా లక్ష్యపెట్టేట్టు!’ అని తనలో అనుకుని చిచీకవ్, ఆయన పైన గల గౌరవం కొద్దీ దస్తావేజు ఖర్చులన్నీ తానే భరిస్తానని మనవి చేశాడు.

తన అతిధి ఈ పని చేస్తానని ఎప్పుడైతే అన్నాడో, అతను వట్టి మూఢుడై ఉండాలనీ, సివిల్ సర్వీసులో ఉండినట్టు బొంకాడనీ, నిజంగా సైన్యంలో పనిచేసి వేషాలు వేసే ఆడవాళ్ళ వెంటపడి ఉండవచ్చుననీ ప్ల్యూష్కిన్ రూఢి చేసుకున్నాడు. అయినప్పటికీ ఆయన తన ఆనందాన్ని దాచిపెట్టుకోలేక చిచీకవ్‌ను ఎన్నోవిధాల దీవించాడు. అతనికి పెళ్లి అయిందో లేదో విచారించకుండా అతని పిల్లలను కూడా దీవించాడు. ఆయన కిటికీ వద్దకువెళ్లి అద్దంమీద కొట్టి, “ఒరేయ్, ప్రోష్క!” అని కేక పెట్టాడు. ఒక నిమిషానికి హాలులోకి ఎవరో అతివేగంగా పరిగెత్తుకుంటూ వస్తున్న చప్పుడు వినిపించింది, అక్కడ చాలాసేపు బూట్లచప్పుడు అయినాక తలుపు తెరుచుకుని పదమూడేళ్ల వయసుగల ప్రోష్క లోపలికి వచ్చాడు. వాడి కాళ్ళకున్న బూట్లు ఎంత పెద్దవంటే వాడు అడుగుతీసి అడుగు పెట్టినప్పుడల్లా అవి కాలినుంచి ఎగిరిపోయినంత పనిచేస్తున్నాయి. ప్రోష్క అంత పెద్దబూట్లు ఎందుకు వేసుకున్నదీ పాఠకుడికి ఇప్పుడే చెప్పెయ్యటం మంచిది. ప్ల్యూష్కిన్ తన ఇంటి చాకర్లు ఎంతమంది ఉంటే అంతమందికీ ఒక్క జత బూట్లే ఏర్పరిచాడు. అవి ఎప్పుడూ హాలులోనే ఉంటాయి. యజమాని కేక పెడితే ఏ నౌకరుగాని బయటినుంచి ఉత్తకాళ్లతో వచ్చి, బూట్లు తొడుక్కుని హాలుదాటి యజమాని గదివాకిలి దగ్గిర హాజరు కావాలి. వెళ్లిపొయ్యేటప్పుడు బూట్లను హాలులో వదిలేసి ఉత్తకాళ్లతో బయటికి పోవాలి. చలికాలంలో, ముఖ్యంగా మంచు కురవటం ఆరంభమయే రోజుల్లో ఎవరైనా కిటికీలోనుంచి బయటికి చూస్తే, ఇంటి నౌకర్లు గెంతే గెంతులు స్టేజిమీద నృత్యాలు చేసేవాళ్లకి కూడా అసాధ్యంగా ఉన్నట్టుంటాయన్నమాట.

This entry was posted in కథ and tagged . Bookmark the permalink.

One Response to మృతజీవులు – 25

  1. this is very nice i like ko.ku

Comments are closed.