అతీంద్రియశక్తులూ, ఆటవిక మనస్తత్వం

– డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

అతీంద్రియ శక్తుల గురించిన భావనల్లో ప్రతివారికీ భౌతిక శరీరంతోబాటుగా, దానికి భిన్నమైన ఒక ఆత్మ వంటిది ఉంటుందన్న నమ్మకం ప్రధానమైనది. శరీరం భౌతికంగా నశించిపోయిన తరవాత కూడా ఆత్మకు అస్తిత్వం ఉంటుందని చాలామంది నమ్ముతారు. మానవచరిత్రను పరిశీలిస్తే ఇటువంటి నమ్మకాలు ఆటవికదశలోనే రూపొందినట్టు తెలుస్తుంది. నిద్రలో కలలు కంటున్నప్పుడు ఆత్మ శరీరం నుంచి వేరయి, లోకమంతా కలయదిరుగుతున్నట్టు అనిపిస్తుంది. చావుకూ, నిద్రకూ పోలికలున్నట్టు ఆదిమానవులు భావించారంటే విడ్డూరం లేదు. “దీర్ఘనిద్ర” తరవాతకూడా ఆత్మ స్వేచ్ఛగా తిరుగుతూనే ఉండాలి. దానికి చావు ఉండదు.
నిరూపణ అవసరంలేని ఇలాంటి “నిరపాయకరమైన” నమ్మకాలు ఎవరినీ బాధించవు సరికదా, కొంత ఊరటను కూడా ఇస్తాయి. అభ్యంతరమేదీ లేకపోవడంతో ఆనాటి ప్రజలు తమ శరీరాల్లో నశించలేనిదేదో ఉందనీ, అది భౌతిక శరీరంతో సంబంధంలేని పదార్థమనీ నమ్మసాగారు. ఈ ఆత్మ అనేది శరీరాన్ని శాసించి, నియంత్రించగలదు. నిద్రలోనూ, మెలకువగా ఉన్నప్పుడూ కూడా అద్భుతాలు సాధించగలదు. మన తెలివితేటలకూ, జ్ఞానానికీ అదే కారణం. అందుచేతనే కాటికి కాళ్ళు చాచుకున్న వృద్ధులు కూడా వివేకంతో మాట్లాడతారు. మరికొద్ది రోజుల్లోనే వారు చనిపోతారన్నమాటే గాని, మరి వారి అనుభవమూ, జ్ఞానసంపదా “ఎక్కడికి పోతాయి”? ఎక్కడికీ పోవు. వారి తరవాత కూడా ఆత్మ రూపంలో కొనసాగుతాయి. వడిలి, జబ్బులతోనూ, వయస్సుతోనూ కృశించి, శిథిలమైపోయిన వారి శరీరాలు మిగలవు కాని ఆత్మ సంగతి వేరు. దానికి వయస్సుతోనూ, చావుతోనూ నిమిత్తంలేదు.
మనుషులు ఒకచోటినుంచి మరొకచోటికి వలసపోవడం ఆదిమానవులకు తెలుసు కనక ఎన్నో ఏళ్ళుగా “అలవాటుపడ్డ” శరీరాన్ని వదిలి వెళ్ళవలసిన అవసరం ఆత్మకు కూడా ఏదో ఒకనాడు కలుగుతుందనేది వారికి సహజంగానే అనిపించి ఉంటుంది. అదొక మహాప్రస్థానం. బాల్యం, యవ్వనం, వార్థక్యం వగైరాలలాగే జీవితంలో అది మరొకదశ. ఎటొచ్చీ అది “ఇహలోకానికి” సంబంధించినది కాదు. ముసలితనంలో పోనుపోను ఆప్యాయతలూ, అనురాగాలూ తగ్గుతాయి. జీవితంలో రకరకాల అనుభవాలు పొందినవారికి ఇలా తమవారికి దూరమవడం తెలిసిన విషయమే. ఈనాటికీ మత బోధకులూ, ప్రవచనాలు చేసేవారూ ఇదేరకం ఇమేజరీ ఉపయోగించి ఆధ్యాత్మిక భావాలను ప్రచారం చేస్తారు. వారికి మరణానంతర అనుభవమేదీ లేకపోయినా “అన్ని బంధనాలూ తెంచుకున్న” ఆత్మను గురించి నమ్మబలుకుతూ వారు నెలల తరబడి ఉపన్యాసాలిస్తారు. వినేవాడెవడూ “నీకిదంతా ఎలా తెలుసు నాయనా” అని అడిగిన పాపాన పోడు.
నిద్ర అనేది ఏమిటో, నిద్రలోనూ, మెలకువగా ఉన్నప్పుడూ మన మెదడు ఎలా పనిచేస్తుందో, ఆలోచనలకూ, ఊహలకూ, భావాలకూ, కలలకూ ఎటువంటి సంబంధం ఉంటుందో ఈనాటికీ చాలా మందికి తెలియదు కనక ఇవన్నీ కలగలిసిపోయి ఆత్మ, ప్రేతాత్మ వగైరాల గురించిన అమాయకమైన అపోహలు అందరిలోనూ కనబడతాయి. బాహ్యప్రపంచంతో ఏమాత్రమూ సంబంధం లేనట్టు అనిపించే కలల ప్రపంచం మనలో “మరేదో” లోకంలో భ్రమిస్తున్న భావనను కలిగిస్తుంది. మన దేవుళ్ళందరూ సామాన్యంగా మనకు కలల్లోనే “సాక్షాత్కరిస్తూ” ఉంటారు. పరలోకాన్ని దాదాపు కళ్ళారా చూస్తున్నట్టే మన కనిపిస్తుంది. ఇది శ్రుతిమించి రాగాన పడ్డప్పుడు నిజంగా కనబడుతున్నదంతా మాయ అనీ, కలల ప్రపంచమే నిజమైనదనీ ప్రతిపాదనలు మొదలవుతాయి.
ఆదిమయుగంలో మనుషులు ఇంతగా అనుకోలేదు కాని ప్రేతాలనూ, భూతాలనూ నమ్మారు. వీటికి ఉనికి అంటూ ఉండదు. విచ్చలవిడిగా సంచరిస్తూ బతికున్నవారిని ఇబ్బందిపెడతాయి. వీటికి “శాంతులు” చేయించటానికి పెద్ద తతంగం అవసరమయింది. తరవాతి కాలంలో మతాలకు దారితీసిన పూజలకూ, తంతులకూ అదే మూలకారణం. ఈ ప్రేతాత్మలను “ప్రార్థిస్తే” కొంత ఉపయోగం ఉంటుందని భావించేవారు. గణాచారులూ, పూజారులూ, కులపెద్దలూ నాయకత్వం వహించి ఆటవికులకు “దారి” చూపిన ఆ కాలంలో మతమన్నా, గారడీ అన్నా, చేతబడి అన్నా, సైన్స్‌ అన్నా అంతా ఒక్కటిగానే ఉండేది. ఇందులో వ్యక్తిపరమైన స్వార్థంకన్నా తమ తెగకు మొత్తంగా మంచి జరగాలనే కోరికే ఎక్కువగా ఉండేది.

painting

తమ పరిసరాలమీదా, వాతావరణంమీదా ఆధారపడి, వాటి “అనుగ్రహానికి” లోబడి జీవిస్తున్న ఆనాటి ప్రజలకు వానలూ, వరదలూ, వాటంతటవే తగలబడే అడవులూ ఒక్కొక్కప్పుడు ప్రాణాంతకంగా ఉండేవి. అందుచేత “మేజిక్‌” వంటి తాంత్రిక శక్తులద్వారా “గారడీ” చేసి, ప్రకృతితో సంబంధం నెరిపి, దాన్ని లోబరుచుకునేందుకు ఆదిమానవ సముదాయాలు ప్రయత్నించాయి. ఈ తంతులన్నీ రోజువారీ జీవితాలకి పనికొస్తాయనే వారు భావించారు. ఇందులో అప్పటికి “ఆధ్యాత్మికత” ఏమీ ఉండేదికాదు. చేసిన కర్మకాండకు ఫలితం ఉంటుందని నమ్మి అందరూ పాల్గొనేవారు. సామూహికంగా అందరూ “గట్టిగా” కలిసి కోరుకుంటే ఏదైనా జరుగుతుందని నమ్మేవారు. వానలు పడక క్షామం వచ్చినప్పుడు అమెరికాలోని ఆటవికులు “వానాట” ఆడేవారు. తామంతా కుండపోతగా కురుస్తున్న వర్షంలో తడిసి ముద్దవుతున్నట్టు తలమీద కప్పుకుని పరిగెత్తి ప్రకృతిని “ఫూల్‌” చేసేవారు. అంత మంది నమ్మకంగా వానొచ్చినట్టు పరిగెత్తుతూ ఉంటే నిజంగానే వర్షం పడకపోతుందా అని వారి ఉద్దేశమేమో. అలాగే తమకు తెలిసిన జంతువుల రూపాల్లోనూ, మనుషుల రూపాల్లోనూ బొమ్మలు చేసి వాటికి పూజలు చేసేవారు. తమకు కావలసినవి జరిగేదాకా వాటిని ప్రార్థించి, అవసరమైతే తిట్టి, కొట్టి, బతిమాలి ఎలాగో అలా అవస్థలు పడుతూ ఉండేవారు.
గుహల్లో నివసిస్తూ ఏ అడవిదున్ననో వేటాడి పొట్టపోసుకునే దశలో అడవిదున్న దొరకక పోవడం వారికీ, వారి తెగకూ చావుబతుకుల సమస్యగా పరిణమించేది. అలాంటి పరిస్థితుల్లో అడవిదున్న తమపై “కరుణించి” తమకు ఆహారం అయిందన్న కృతజ్ఞతాభావంతో వారు దున్నకు పూజలు చేసేవారు. చచ్చిన దున్న తోలు కప్పుకుని ఒకడు నృత్యం చేస్తే తక్కినవారు మళ్ళీ దాన్ని వేటాడినట్టు అభినయించేవారు. తామూ, తమ పశుసంపదా కలకాలం పచ్చగా ఉండాలని కోరుకునే సామాన్యమైన కోరికలు ఋగ్వేదం ప్రారంభంలో ఉన్నాయట.
ఇలా అడుగడుగునా కష్టాలుపడి బతికేరోజుల్లో వారి కళ్ళకి ప్రకృతిశక్తుల వెనక ఏదో “అదృశ్య హస్తం” కనబడేది. ప్రతి చెట్టులోనూ, సెలయేరులోనూ ఏవేవో శక్తులూ, భూతాలూ ఉండి తమ జీవితాలకు మంచినీ, చెడునీ చేస్తున్నాయని వారు భావించారు. వాటిని తమకు అనుకూలం చేసుకోవడానికి ఎంతో శ్రమపడి మంత్రతంత్రాల వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఇదంతా చేసినప్పటికీ ప్రకృతిశక్తులు అనుకూలించనప్పుడూ, అవి తమకు అర్థంకాక, తమ చెప్పుచేతలలో లేనట్టుగా అనిపించినప్పుడూ మతపరమైన వివరణలు ఇవ్వప్రయత్నించేవారు. దేవతలకు మనుషుల మీద “కోపం” వచ్చిందని చెప్పేవారు. ఇదేమీ ఆధునికయుగంలో హాస్యాస్పదంగా అనుకోనక్కర్లేదు. ప్రకృతిని “ఏదో పవరు” నడిపిస్తుందనీ, “అహంభావాన్ని” విడనాడి “ఆ సర్వేశ్వరుడికి” తలవంచాలనీ చెప్పే ఆధునికప్రవక్తలు ఏ ఉద్దేశంతో చెప్పినప్పటికీ ఆదిమయుగం దాటి ముందుకు వచ్చినట్టుగా అనిపించరు. మనకి తెలియని విషయాలకు “అదృశ్యహస్తమే” కారణమని అనుకోవడంలో వీరంతా ఆటవికులే. జ్ఞానమూ, విజ్ఞానమూ లోపించిన ప్రతి చోటునూ మతవిశ్వాసాలు ఆక్రమించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి.
ఇదంతా నమ్మకాలున్నవారిని వెక్కిరించడానికో, కించపరచడానికో రాసిన విషయంకాదు. మానవజాతి శైశవదశలో ఉన్నప్పుడు వారి బుద్ధీ, ఆలోచనలూ కూడా శైశవదశలోనే ఉండేవని కొందరు శాస్త్రవేత్తల ఉద్దేశం. కాలికి బల్ల తగిలి బాధ కలిగితే చిన్నపిల్లలు బల్ల సజీవమైనదయినట్టూ, తమను బుద్ధిపూర్వకంగా బాధించినట్టూ ఊహించుకుంటారు. పెద్దవాళ్ళు కూడా అందుకు అనుకూలంగా బల్లను తిరిగి కొట్టి దానికి ‘బుద్ధి’ చెప్పినప్పుడే పిల్లలకు ఉపశమనం కలుగుతుంది. అడవుల్లో రేగిన కార్చిచ్చులూ, కష్టాలపాలు చేసే తుఫానులూ అన్నీ ఎవరో తమను బాధించడానికే చేస్తున్న పనులనీ, తమకు ఆహారం అయిన దున్న తమను ‘కరుణించిందనీ’ భావించిన ఆదిమానవుల భావనలే మతాలకు పునాదులు అయాయి. ఈ రోజుల్లో చాలా ఉదాత్తస్థాయిలో మతబోధ చేస్తున్నామనుకుంటున్నవారి మనస్తత్వం, అవన్నీ నిజమనుకునేవారి వైఖరీ ఆనాటి ఆదిమలక్షణాలని అధిగమించలేనేదు. అసమానతలు పెచ్చుపెరిగిన సమాజ పరిస్థితుల వల్లనూ, తమ మెదళ్ళలో శారీరకంగా తలెత్తే గందరగోళంవల్లనూ అయోమయానికి గురయే కోట్లాది సామాన్యులను ప్రపంచ వ్యాప్తంగా తప్పుదారులు పట్టించే మతాలన్నీ ఇటువంటివే.

—————–

కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు సంగీతమ్మీద ఆసక్తితో హిందూస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని, కర్ణాటక సంగీతాన్ని మథించి దేశవిదేశాల్లో అనేక ప్రదర్శనలివ్వడమేగాక ఎన్నో ప్రదర్శనలకు సంగీత దర్శకత్వం వహించారు. తండ్రి (కొడవటిగంటి కుటుంబరావు) వద్దనుంచి వారసత్వంగా వచ్చిన రచనాసక్తితో సైన్సు గురించి, సంగీతం గురించి తెలుగులో సరళమైన రచనలెన్నో చేశారు. కొన్ని పత్రికల్లో శీర్షికలు కూడా నిర్వహించారు. ఇవన్నీ అలా ఉంచి వృత్తిరీత్యా ఆయన అణుధార్మిక శాస్త్రవేత్త! చాన్నాళ్ళ కిందటే తెలుగులో బ్లాగులు(http://rohiniprasadk.blogspot.com, http://rohiniprasadkscience.blogspot.com) రాయడం మొదలుపెట్టారు.

About కొడవటిగంటి రోహిణీ ప్రసాద్

కొడవటిగంటి రోహిణీ ప్రసాద్, 1949లో, మద్రాసులో కొడవటిగంటి వరూధిని, కుటుంబరావు దంపతులకు జన్మించారు. మద్రాసు, ఆంధ్ర విశ్వవిద్యాలయాల్లో విద్యాభ్యాసం (ఎం.ఎస్‌సి న్యూక్లియర్ ఫిజిక్స్) తరువాత భాభా అణుకేంద్రం, బొంబాయిలో ఉద్యోగం చేసారు. ముంబయి విశ్వవిద్యాలయం లో పి.ఎచ్‌డి చేసారు. రోహిణీ ప్రసాద్ 2012 సెప్టెంబరు 8 న ముంబై లో మరణించారు.

వ్యాపకాలు:
హిందూస్తానీ శాస్త్రీయ సంగీతం, సితార్ వాదన, ఆర్కెస్ట్రాతో లలిత సంగీత కార్యక్రమాల నిర్వహణ, సులభశైలిలో సంగీతం గురించిన సోదాహరణ ప్రసంగాలు, సంగీతం మీద మల్టీమీడియా వ్యాసాలు.
ఇండియాలో, అమెరికాలో (4పర్యటనలు, వంద కచేరీలు) సితార్ సోలో, సరోద్, వేణువులతో జుగల్‌బందీలు, కర్నాటక వీణతో జుగల్‌బందీ కచేరీలు. రాజేశ్వరరావు తదితరుల సినీ, ప్రైవేట్ రికార్డింగ్‌లలో సితార్ వాదన, పి.సుశీల, తదితరులతో మద్రాసులోనూ, అమెరికాలోనూ సితార్ వాదన.

కీబోర్డ్ సహాయంతో డజన్ల కొద్దీ లలిత సంగీతం ఆర్కెస్ట్రా ప్రోగ్రాముల నిర్వహణ, 1993 తానా ప్రపంచ తెలుగు మహాసభలకు (న్యూయార్క్), 1994 ఆటా, 2001 సిలికానాంధ్ర సభలకు ప్రారంభ సంగీత ప్రదర్శన, ఆధునిక తెలుగు కవుల గేయాల స్వరరచనతో ఆర్కెస్ట్రా ప్రదర్శనలు, కూచిపూడి శైలిలో కుమార సంభవం నృత్యనాటకానికి సంగీత నిర్వహణ, కృష్ణపారిజాతం నృత్యనాటికకు అదనపు అంకానికి సంగీతరచన.
Times of India తో సహా ఇంగ్లీష్, తెలుగు భాషల పత్రికల్లో, ఇంటర్నెట్ సైట్లలో శాస్త్ర విజ్ఞాన రచనలు, పాప్యులర్ సైన్సు వ్యాసాలు.

సైన్స్ వ్యాసాల సంపుటి:
జీవశాస్త్రవిజ్ఞానం, సమాజంజనసాహితిప్రచురించింది.
విశ్వాంతరాళం(స్వేచ్ఛాసాహితి ప్రచురణ)
మానవపరిణామం(స్వేచ్ఛాసాహితి ప్రచురణ)
1995 నుంచి కాలనిర్ణయ్ తెలుగు ఎడిషన్ సంపాదకుడు.
1997లో ముంబయిలో జరిగిన పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఆలిండియా తెలుగు మహాసభల సావనీర్ సంపాదకత్వం
హిందీనుంచి తెలుగులోకి డబ్ చేసిన అనేక టివీ సీరియల్ ప్రోగ్రాములకు మాటలు, పాటల రచన, అనేక ఆడియో రికార్డింగ్‌ల డబ్బింగ్ రచనలు
మరాఠీ విజ్ఞాన పరిషత్తువారి సెంటర్ ఫర్ నేషనల్ సైన్స్ కమ్యూనికేటర్స్‌లో తెలుగుకు ప్రాతినిధ్యం

This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

17 Responses to అతీంద్రియశక్తులూ, ఆటవిక మనస్తత్వం

  1. parimalam says:

    సర్ !అతీంద్రియ శక్తులూ ఆటవిక మనస్తత్వం వ్యాసం మొదటి నుండి చివరి వరకూ చాలా ఆసక్తి కరంగా ఉంది .నిరపాయ కరమైన నమ్మకాలు అన్నారు నిజమే ….ఇప్పటి విద్యావంతులమని చెప్పుకుంటూ ఉంగరాలకూ ,రంగు రాళ్లకూ ,దొంగ బాబాలకూ వేల కు వేలు తగలేసే మూఢ నమ్మకాలంటే వారి నమ్మకాలు నిజంగా నిరపాయకరమైనవే .ఇక ఆత్మను గురించిన వారి నమ్మకం భగవద్గీతలో కృష్ణ పరమాత్మునిచే చెప్పబడినదని (ఆత్మ నాశనం లేనిదని ) ఇప్పటికీ అందరూ నమ్మే నమ్మకం .అప్పట్లో ఆటవికులు మనుషులు ,జంతువుల బొమ్మలకూ ,చెట్లకూ చేసిన పూజల ద్వారానే బహుశా నేటి మనం పూజించే దేవుళ్ళ రూపాలు ఏర్పడ్డాయేమో అనిపిస్తుంది . పూర్వం ఆటవికులు వర్షాలకోసం ….జంతుబలులూ ఇచ్చేవారని విన్నాను .అదే ఇప్పటికీ గ్రామదేవతలకు బలులిచ్చే ఆచారంగా ఉండిపోయిందని విన్నాను .అలాగే పూర్వం యజ్ఞయాగాదులలో కూడా జంతు బలి ఆచారంగా ఉండేదట .అతీంద్రియ శక్తుల కోసం ఆటవికులనుండి ,ఆధునిక మానవుని వరకూ సాగిస్తున్న (నిజమైతే ) ఈ బలుల గురించి మీరు ప్రస్తావించలేదు .మరో టపాలో ఆశిస్తున్నాము .మూఢ నమ్మకాల పట్ల చక్కని అవగాహన కలిగించే వ్యాసాన్ని పరిచయం చేశారు .ధన్యవాదాలు సర్ .

  2. Rohiniprasad says:

    బలులనేవి మనుషులు తినడానికే. మనవాళ్ళు ఈ రోజుల్లో నాజూగ్గా పెట్టే నైవేద్యాలకు అదొక పూర్వరూపం. మనం ఏదైనా మంచి వస్తువు తినేముందు మనకు మంచి చేస్తున్న అదృశ్యశక్తులకు వాటిని సమర్పించినట్టు నటించడం ఒక ప్రాచీనసంప్రదాయం. తొలి ఆర్యులు నిర్వహించిన తంతుల్లో అగ్నిహోత్రమూ, అందులో వివిధ దేవతల పేరున బలులిచ్చి వారిని ఆవాహన చెయ్యడమూ ముఖ్యమైన అంశాలు. అయితే బలులనేవి ప్రాచీమమతాలన్నిటిలోనూ ఉండేవి. మనకన్నా పురాతనమైన సుమేరియన్, ఈజిప్ట్ నాగరికతల్లో ఇవి సామాన్యమే. బడుగు ప్రజలు సమర్పించుకున్న నైవేద్యాలను పూజారులు ఆరగించడం క్రీస్తుకు 3 వేల ఏళ్ళ క్రితమే మొదలయింది. మతాలు ఎలా మొదలయాయో, అవి ఎందుకు బలపడ్డాయో వివరించే వ్యాసాలు పాఠకులకూ, సంపాదకులకూ ఆసక్తి ఉన్నట్టయితే పంపగలను.

    • Manohar says:

      toli aryulu evarani mee uddesyam?
      aa siddantam tappu ani nirupana cheyyabadindi kadaa.
      archeology and anthropology proved it.

  3. parimalam says:

    మన గురించి మనం తెలుసుకోవడం ఎప్పుడూ ఆసక్తి దాయకమే .ధన్యవాదాలు సర్ !

  4. I think language has caused several problems for the mankind. Scientists use a different language to refer to the same thing the spiritual people would refer to. While Darwin said the evolution of mankind has taken the form from the fish (life in water),the turtle (life in water and land), the pig. etc and then there is monkey which derived into man. The religeous people in India say that Lord Vishnu has taken ten incarnations starting from the Fish (matsyavatara), the tortoise (kurmavatara), the boar (varahavatara), etc. on to the neanderthal avataras like vamana,Sri Rama and Sri Krishna etc. Language has not been matured enough to be able to communicate properly. Today anything we speak is being misunderstood by several people. The problem is the untruth (lies). When somebody says some event has happened, there are very less chances that we are willing to beleive him. Today each newspaper is also biased in giving the same information. When we see a vision (a dream or imagination in our language) we have coined a word imagination and began using it. The untruth has thus become part and parcel of our life. Our ancestors did not have the concept of imagination and visualization.
    Whatever vision they had, they believed it is true. To understand truth, we must be closer to truth.
    Darwin received the same vision as the religious seers did. Truth can only be discovered by a meditative person. To me there is no such thing as imagination. Imagination is a word coined by the modern man who believed in the concept of lies.
    Even the bigbang theory has the same equivalent in religion called brahmandam.
    The Advaita Vedanta proposed by Sri Adisankaracharya is also the same beleived by the modern scientists today. Until microscope was invented, we could not see micro organisms. So for us, microorganism is not truth before. When the capacity of microscope was increased due to modern science, we are able to see further smaller particles called protons, electrons and neutrons. Scientists are now clear that the world is made up of the same particle that Sri Adisankaracharya was speaking about.
    Until the language matures into something, we must be meditative to understand and experience the truth as it is. How many of us know how we are breathing and how our heart is beating. Are we doing it? If we are doing it, can we stop them? If we can not stop our heart from beating, how can we say that we own our body? While scientific research must continue, care must be taken to understand the language used by our ancient religious people.
    Talk to the person living in sixth century about the telephone device that is developed in future and he would not believe it.

  5. హరి దోర్నాల says:

    @శ్రీకాత్ గార్లపాటి

    “వేదాల్లో అన్నీ ఉన్నాయష” అని సామాన్యంగా అనుకునే విషయాన్నే మీరు మరో విధంగా చెపుతున్నారు. దశావతారాల గురించి మన వారు చెప్పింది శాస్త్రీయత అనలేం. విష్ణువు మత్స్యావతారం ఎత్తినపుడు ఇతర దేవతలే కాదు, మనుషులు కూడా ఉంటారు. అలాంటప్పుడు అది పరిణమ మెలా అవుతుంది? ఇక డార్వినేమో జీవ పణామాన్ని శాస్త్రీయంగా పరిశోధించి సిద్ధాంతీకరించాడు.

    అలాగే బ్రహ్మాండం. తల ఎత్తి ఆకాశం లోకి చుస్తే అంతరాళం మొత్తం ఒక పెద్ద అండంలా కనపడుతుంది. ఆ కాలం లోని ఆలోచనా పరులెవరైనా (ఈ విషయంలో శంకరుడు) బ్రహ్మాండమని సంభోధించంలో పెద్ద వింతేమీ లేదు. బిగ్ బ్యాంగ్ థియరీని దానితో జోడించడం అంతే సైన్సు విజయాలను తక్కువ చెసే ప్రయత్నం తప్ప మరోటి కాదు.

    ఆరో శతాబ్దం మనిషికి ఆరొ శతాబ్దం మనిషే చెప్పగలడు. అప్పుడు టెలిఫొన్ గురించి ఎవరైనా ఊహించినా అది ఊహాజనితమె అవితుంది కాని సశాస్త్రీయం కాదు. కాబట్టి ఆ కాలం లోని వారు టెలిఫోన్ ఉందంటే నమ్మాల్సిన అవసరం లేదు. అలాగే ఈ కాలంలో నిరూపణ లేకుండా ఎవరేమి చెప్పినా భవిష్యత్తులో నిజమౌతుందెమో, నమ్మితే అపాయమేమీ లేదు కదా అని నమ్మడం సరయిన విషయం కాదు.

  6. శ్రీకాంత్ గార్లపాటి says:

    To understand a few things the plane of thought must be the same between us. Otherwise proving would have no meaning. I would say that the entire mathematics has come from hypothesis (concepts). It starts when we have taken into acceptance numbers exist. There was a time in this world when people did not know about 0 (zero). The mathematics of that age is different. If you take geometry, we believe that there is a division of line for shapes like rectangle, square, circle etc to occur. Suppose our house is of square shape and there is a wall preventing our neighbour’s space from us. The wall however thin it might be, must occupy either completely my space, completely his space or equal space. When we are saying there is a division, why is the space involved in that? Even if the wall were having the thickness of the size of atom, it would still be occupying some space. Great efforts have been taken to find out the value of pi (see http://en.wikipedia.org/wiki/Pi ) that helps in formulae for circle shape.

  7. శ్రీకాంత్ గార్లపాటి says:

    “నిరూపణ లేకుండా ఎవరేమి చెప్పినా భవిష్యత్తులో నిజమౌతుందెమో, నమ్మితే అపాయమేమీ లేదు కదా అని నమ్మడం సరయిన విషయం కాదు”
    నేను మీతో ఈ విషయము లో ఏకీభవిస్తున్నాను. స్వామి వివేకానందుడు కూడా ప్రతి విషయమును అనుభవపూర్వకముగా తెలిసికొన్నారు.
    నా విషయములో నేను కూడా అంతే. అనుభవపూర్వకముగా భగవంతుని తెలిసికొనుట జరిగింది. నేను భగవంతుని గురించిన అనుభవపూర్వకముగా తెలిసికొననంతవరకు నేను కూడా నమ్మలేదు. స్పష్టమయిన అవగాహన నాకు వచ్చినది కాబట్టి నేను సంతోషముగా వున్నాను. స్పష్టత గురించి ప్రయత్నం చేయండి.
    ఎలా నిరూపిస్తే ‘సశాస్త్రీయంగా నిరూపణ’ అని మీరు భావిస్తారో అలాగే నిరూపణ కోసం ప్రయత్నం చేయండి.

  8. Rohiniprasad says:

    శ్రీకాంత్ గారూ, భగవంతుడి సంగతి వదిలేస్తే, ముందుగా అనుభవం అంటే ఏమిటో, తెలుసుకోవడం అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి. ఇటువంటి సంగతుల గురించి నా వ్యాసాల్లో చర్చించాను. ఇది కాస్మిక్ యుగం. ఏ ప్రాణి గురించి ఆలోచించినా, జీవరాశి విషయంలోనైనా విశ్వం పరిణామాన్నంతటినీ దృష్టిలో ఉంచుకోనివారు ఆధునికులనిపించుకోరు. ఇది చాలా ముఖ్యవిషయం.

  9. శ్రీకాంత్ గార్లపాటి says:

    ఆత్మల గురించిన విషయాన్నే తీసుకుంటే అది నేను స్పష్టముగా చూచుట జరిగింది. చూడనంతవరకు నాకది అసత్యము కాదు గాని, తెలియని విషయమే. సత్యాన్ని తెలుసుకోవాలన్న తపన చేతనే నాకది సాధ్యమయినది.
    మీ రచనలు మీ అద్భుతమయిన అవగాహనా శక్తిని తెలియజేస్తున్నవి.
    సత్యము అందరికిని సమానమే.
    అద్వయిత సిద్దాంతాన్ని ప్రతిపాదించిన ఆదిశంకరాచార్యులు గారు, ఎవల్యూషన్ గురించి ప్రతిపాదించిన చార్లెస్ డార్విన్, ఇద్దరూ ఒకే విషయం గురించి ప్రస్తావించారు. ఇద్దరివి కూడా వారి వారి వ్యక్తిగత అభిప్రాయంగా భావించే వీలుంది.
    సూర్యుడు తూర్పునకు వస్తున్నాడని అంతవరకు అభిప్రాయపడిన ప్రజలు భూమి గురించిన సత్యాన్ని తెలుసుకొన్నంత మాత్రము చేతనే సూర్యుడు కదలటం లేదని వారి అభిప్రాయమును మార్చుకొన్నారు.
    links:
    http://www.darwins-theory-of-evolution.com/
    http://en.wikipedia.org/wiki/Advaita

    • rathnamsjcc says:

      ఓo
      శ్రీ సద్గురవే నమః
      అచల పరిపూర్ణ రాజయోగ సిద్ధాం .ఆత్మ లోఎరుక చైతన్యం .లేని స్ధానంలేదు

      ఈ మనస్సు ఎక్కడ నుంచి వచ్చింది అక్క డై మనస్సునిలిచి , నీ నిజస్వరూ పం బట్టబయలుగ అనుభూతి.కాగలదు. సూక్ష్మ చైతన్య..కంటికి కనిపించదు.అనుభవపూర్వకంగ గ్రహించాల్సిం చూడ చూడ కలుగును సూక్ష్మ చైతన్య.సాధన ద్వారా తెలుస్తుంది సూక్ష్మచైతన్యం ఎందెందు వెతికినా అందందే గలదు ఎలా బ్రహ్మం భావన సూక్ష్మతత్వం క్షణాన్ని ఎవరూ ఆలోచించలేదు -కొంతసమయాన్ని క్షణముగా గుర్తించినను మరో క్షణములుగా ముందుకు వెళ్లుతున్నారే గాని క్షణము తెలియక గడిచిన గత కాలమెంతో నేటికి తెలియుటలేదు సూక్ష్మదృష్టితో గాంచిన తానన్నా, జగమన్నా, బ్రహ్మమన్నా ఒక్కటే. తానుంటేనే జగమనేది ఉంటుంది. తాను లేనపుడు జగం లేదు సూక్ష్మతత్త్వము కాబట్టి. కాళిదాసు ఈ ప్రపంచంలో జరిగే అన్ని అన్యాయాలకు, అక్రమాలకు, అనర్ధాలకు మనస్సు ” మూలం. కనుక మానవుడు ముందుగా ఆత్మ “జ్ఞానం” సంపాదించాలి..ఆత్మసత్యమైన జ్ఞానము ఆత్మ జ్ఞానమే అంటే తనను తాను తెలుసుకోవడమే, తనలోని అంతరాత్మను గురించి … సూక్ష్మచైతన్యం.సాధనల యొక్క అత్యున్నత లక్ష్యం ఈ .సమాధి.. మన మనస్సుని ఆత్మలోనికి తిప్పితే అప్పుడు మన మనస్సు ఆత్మలో కలిసి పోతుంది.

      మనస్సునిలిపి మనస్సు తన జన్మస్థానము(ఆత్మ) నకు వెళ్ళడం అసలయిన నమస్కరం. అంటే తనను తాను తెలుసుకోవడమే, తనలోని అంతరాత్మను గురించి .మన సాధనతో గురువు యొక్క అనుగ్రహం కలుగును, గురువు యొక్క అనుగ్రహంతో ఆత్మ అనుగ్రహం కలుగును.

      నీ నిజస్వరూ పం బట్టబయలుగ అనుభూతి.కాగలదు.

      మనస్సునిలిపి సాధన ఆలోచనలు నెమ్మది,నెమ్మదిగా కట్టడిచేయబడి, చివరకుమనస్సులోఆలోచనలు కలుగనిస్థితిఏర్పడుతుంది. మనస్సునిలిపి నిశ్చల స్థితికి చేరుకుంటాయి ఈ .సమాధి.. ఈ విషయం మన మనస్సులో క్షణకాలం తెలుస్తుంది. ఇది సంధి స్థితి. అంటే, ‘తెలిసే స్థితి’ నుంచి ‘ఏమీ .సమాధిస్థితి తెలియని స్థితి’ – లేదా సమాధిస్థితి” కి చేరే సమయం. ఒకసారి సూక్ష్మచైతన్యం క్షణముస్థితిలోకి వెళ్తే, ఎంతసేపో చెప్పలేంకాబట్టి, క్షణకాలం మనం సమాధిస్థితిలో వుంటాం. ఆ సమాధిస్థితినుంచి బయటకు వచ్చినప్పుడు, జాగృతావస్థలో, మన మనసుకు ఏదో తెలియని ఆనందం పొందినట్లుగా తెలుస్తుంది బ్రహ్మంసూక్ష్మచైతన్యం క్షణముపోందుతాము.
      నిద్రలో మనస్సులేదు దేహ స్మృతిలేదు. ఆ స్ధితిలోమనస్సు నీవు సూక్ష్మనిరాకార చైతన్యమై యున్నావు. తమను నిరాకారంగ భావించలేని వారలు నిరాకారముగ దైవమును ధ్యానించలేరు. పాలలోని వెన్నకు ప్రత్యేక నామరూపములు లేనట్లు సర్వత్ర అంతర్లీనముగనున్న సర్వేశ భగవత్ స్ధితికి నామరూపములు లేవని తెలియాలి. నామ రూపములున్నవాడు దేవుడు కాడు. రూపమున్నపుడే నామము ఏర్పడును. పూర్ణత్వమును పరిచ్చిన్నము చేస్తేనేగాని రూపం ఏర్పడదు. నామ రూపములు కేవలం వ్యవహారికం మాత్రమే. జీవుడు దేవునికి వేరుగ బయట ఉండుటకు వీలులేదని బోధించెను శరీరం, ప్రపంచం, భగవంతుడు సర్వాత్మనుండి ఉద్భవించి అందే లయించుచున్నవి. నేను అనగా శరీర కాదు. నేను అనగా ఆత్మ నేనే సర్వాత్మనుండి ఉద్భవించి ఆత్మ ఒక్కటే.అంటే అందరం ఒకట్టే.కాబట్టి ఫిరియాదు చెయ్యడానికి ఇద్దరు లేరు.”పరమాత్మ ఒక్కటే నిజము, ఈ లోకము అనేది ఒక మాయ; మరల ఈ లోకమంతా పరమాత్మ యొక్క చిత్రము గా చెప్పబడినది. అప్పుడు మనకు ఒక సందేహము కలుగవచ్చు : ఫై చెప్పబడిన రెండు వాక్యములు ఒకదానికి మరొకటి ఎలా న్యాయం చెయ్యగలవు? సాధకుడి దశలో ఉన్నప్పుడు, నీవు ఈ లోకము మాయ అని చెప్తావు. ఎందుకంటే తాను ఆత్మ సత్యమైన, శాస్వతమైన పరమాత్మ అని మరచి, తనను తాను ఎన్నో తాత్కాలిక దేహములతో నిండి ఉన్న ఈ లోకములో ఒక దేహము గా భావించి, అదే ఆలోచనలో జీవిస్తూ ఉన్న మనిషికి ఈ లోకము ఒక మాయ అని గుర్తు చెయ్యాలి. ఎందుకు? ఎందుకంటే అతని చూపు ఆత్మను మరచి, బాహ్య ప్రపంచపు పనులలో లీనమయిపొయింది. ఒకసారి ఆ మనిషి ఆత్మజ్ఞానము సాధిచిన ఎడల, ఆత్మ తప్ప ఇతరమైనవి అన్ని నిజము కాదు అని తెలుసుకున్న ఎడల, అప్పుడు ఆ మనిషి ఈ లోకాన్ని పరమాత్మ యొక్క చిత్రం గా చూస్తాడు. ఆత్మ లేక ఈ లోకము లేదు. తనను తాను మరిచి ఈ లోకపు పనులలో నిమగ్నమైన వారికి ఈ లోకము ఒక మాయ అని తెలియజేయాలి. వేరొక మార్గము లేదు.
      శరీరం లో ఉన్నప్పుడు మనస్సు‘బుద్ధి జీవుడు అహంకారము ఆత్మరకరకాలుగా చెప్పుకోవచ్చు బుద్ధి ని చెడు మార్గాలు లోకి వెల్లకండ చూసుకుంటూ,ఫలితం లేకుండా పని చెయ్యడం గురువు ద్వారా జయించవచ్చు మనకి ముక్తి వస్తుంది.

      మనస్సు ఆత్మలో లీనమయిపొయింది తనను తాను చూపు తనను తాను ఈ లోకము లేదు. అనుభూతి.కాగలదు

      \

      1 .ఆత్మ లోఎరుక చైతన్యం .లేని స్ధానంలేదు. ఆత్మ లో ఎరుక చైతన్యం.లేని వస్తువు లేదు. ఆత్మ లో ఎరుక చైతన్యం.లేని జగము లేదు. ఆత్మ లో ఎరుక చైతన్యంలేని జీవము లేదు. ఆత్మ లో ఎరుక చైతన్యం లేని దైవం లేదు. ఆత్మ లో ఎరుక చైతన్యం.లేని ఏ నేనే సమస్త ఆత్మ లో ఎరుక చైతన్యం నేనే సర్వాధారం. అట్టి నన్ను తెలుసుకొనుటయే సమస్త మత ధర్మముల, సమస్త వేదాంత యోగసూత్రముల, సమస్త జ్ఞాన యజ్ఞముల ఫలితం. నన్ను మరిచి ఎన్ని గ్రహించినా సర్వం అధోగతియే. నాతో ఈ సమస్తం ఆత్మ లో ఎరుక చైతన్యం ఏకీభవించి ఆత్మ లో ఎరుక చైతన్యం నాయందే లీనమైయున్నది నేనే సర్వమునకు మూలం. మనో జగత్తులకు తేడాలేదు. జగము మనోకల్పితము శరీరము భ్రమ – భ్రాంతి – అజ్ఞానంసంసారమనే భ్రమ కేవలం బుద్ధిభ్రాంతి మూలకమే కాని పరమార్థ సత్యం కాదు. శరీరం ఎన్నో అవయువాలు కలిగినది. కాని జనం ఈ రెండిటినీ ఒకటే అని భావిస్తారు. ఇంతకన్న అజ్ఞానం ఇంకొకటి ఉంటుందాధర్మమన్న వినరు తను నమ్మి

      దాన ధర్మాలు చెయ్యండి అంటే వినిపించుకోరు. ఎందుకంటే తమ దేహాలు శాశ్వతమనుకొని విర్రవీగుతారు. ఎవరు? భూలోకంలో జీవించే మనుష్యులు. మూర్ఖత్వం కాకపోతే అవసాన దశలో యమకింకరులు వచ్చి భయపెట్టి వెంటబడి తరుముతుంటే ఎక్కడికని పారిపోతారు? అప్పుడెవరు రక్షిస్తారు? అని ప్రశ్నిస్తున్నాడు వేమన.

      ధర్మం అంటే కల్పితమైన సర్వాన్ని ధరించేది అన్న పెద్ద అర్థం ఇక్కడ అక్కర్లేదు. సామాన్య ధర్మాలు, విశేష ధర్మాల ప్రసక్తి కూడా అవసరం లేదు. కనీస ధర్మం, అంటే పక్కవాడికి సాయపడితే చాలు. అదే నిన్ను రక్షిస్తుంది. నువ్వు పోయినా ఈ లోకంలో చిర యశస్సును కల్పిస్తుంది. ఇదంతా ఎవరు చెప్తారు? గురువులు. గురువుల మాట వింటే ఇంతదాకా ఎందుకొస్తుంది. యముడు అనే మాటకు సర్వాన్ని నియమించేవాడు అని అర్థముంది గాని ఇక్కడ నరక లోకపు రాజు అంటే చాలు.

      నువ్వు ధర్మాన్ని ఆచరించి ఉంటే యముడు నీ జోలికెందుకొస్తాడు? అన్నట్టు ఇంగ్లిష్ వారికి కూడా యముడున్నాడు. ప్లూటో అంటారతన్ని. యమభటులు వచ్చి హాయిగా పువ్వులా తీసుకుపోరు, భయపెడతారు, పాశం వేసి పట్టబోతారు, ప్రాణ భయానికి గురి చేస్తారు. ఎందుకొచ్చిన తిప్పలివన్ని, బుద్ధిగా మంచి పనులు చేస్తే పోదా అంటున్నాడు వేమన. తను-తనువు అంటే శరీరం, అడలు అంటే భయం. నను నిముసంబు గానకయున్న యూరెల్ల నరయు మజ్జనకుడెంతడలు నొక్కొ’ అని ప్రయోగం.

      జ్ఞానమే గురువు. జ్ఞానం లేని ఎరుకే అజ్ఞానం. జ్ఞానాజ్ఞానాల మధ్య మనసు చంచలమైన హృదయాన్ని తెలుసుకొని కట్టడి చేయగలిగితే జ్ఞానాజ్ఞానాలు ఒక్కటై మోక్షానికి దారి ఏర్పడుతుంది.

      జ్ఞానం అంటే తెలివి అని అనేకసార్లు చెప్పుకున్నాం. అది గురువుతో సమానం. ఇక అజ్ఞానం, అజ్ఞానం అంటే జ్ఞానం లేకపోవడం కాదు. నైసర్గికమైన అవిద్యాశక్తే అజ్ఞానం. అవిద్య అంటే జీవాత్మ పరమాత్మ ఒకటే అని తెలుసుకోలేని మూఢత్వం. దీని వల్లనే శరీరము.భ్రాంతి ఏర్పడుతుంది. అన్నాడు. అలాగే అజ్ఞానం అంటే బుద్ధి లేకపోవడం కాదు. బుద్ధి యొక్క జడాంశమే అజ్ఞానం. దీనికి స్వయం స్ఫూర్తి ఉండదు. అంటే తనంతట తాను తనను తెలుసుకోజాలనిది అని భావం.

      వెర్రితనం, మోహం, కామం, గర్వం, ఇవన్నీ శరీరములో భాగాలే. ఇక్కడ బుద్ధి అంటే భ్రాంతి అని అర్థం చేసుకోవాలి. ‘బ్రహ్మకైన పుట్టు బుద్ధి తెగులు’ అని అన్నాడు వేమన్నే మరోచోట. రిమ్మ తెగులు అంటే దుర్బుద్ధి. రేచునప్పుడు (రేచున్+అప్పుడు) అంటే లేపుతుంది, పురికొల్పుతుంది, అతిశయింపజేస్తుంది అని అర్థాలు. ‘వలపులు రేచి గోలయని వల్లభుడల్లన కేళి సల్పుచో’ అనేది ప్రయోగం.

      ఆత్మఅ0దే బుద్ధి అటూ ఇటూ పోనివ్వక చక్కగా అన్నింటికీ మూలమైనమనస్సును దేవుడి వైపుకి మళ్లించేవాడు ఉత్తముడవుతాడు. అట్లా దేవుడి పట్ల ఏకాగ్రత లేనట్టయితే ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితి లభించదు అని వేమన్న ఉవాచ.

      పొంకం అంటే పొంగు, గర్వం అని అర్థాలు. ఇక్కడ మంచిదైన అని. పోనీక అంటే బెదిరిపోనీక అని. సర్వేశుడంటే ఒక దేవుడని కాదు. అసలు సర్వం అంటే ఆత్మ సర్వం’, అంతా అని. అంతటా వ్యాపించి ఉంది ఆత్మ కాబట్టి విష్ణువని కాక బ్రహ్మం అనే అర్థం ఉన్నది ఒకే బ్రహ్మo లో. ఏ బేధం లేదు ఆత్మలో ఏ బేధం లేదు ని” అనుగ్రహించి తన నిజరూపంతో దర్శనమిచ్చి.. వారి అహంకారాన్ని మట్టికలిపినట్లు చెబుతున్నారు. బ్రహ్మo.సత్యాన్ని గ్రహించాలి.జీవన మార్గంలో సూక్ష్మసాధన ద్వారా “తత్వమసి” అనే సత్యాన్ని గ్రహించాలి. అనుభవించేవాడికి, అనుభవానికి భేదం లేదని సూక్ష్మసాధన ద్వారా తెలుస్తుంది. ఇలా బ్రహ్మ జ్ఞానాన్ని సూక్ష్మచైతన్య స్థితి దీనినే పరతత్వం, పరబ్రహ్మము అమరత్వము.అని కూడా అంటారు తెలిసికొన్నవారే జీవన్మిక్తులు, .
      మనస్సును జయించినవాడు శాంతిని పొంది యుండుటచే పరమాత్మను చేరినట్టివాడే యగును. అట్టి మనుజుడు సుఖదుఃఖములు, శీతోష్ణములు, మానవామానము లన్నియును సమానములే అయి యున్నవి. తాను పొందినటువంటి జ్ఞాన, విజ్ఞానములచే సంపూర్తిగా సంతృప్తి చెందినప్పుడు ఆత్మానుభవమునందు స్థితిని పొందినట్టి వాడై యోగి యనబడును. దివ్యస్థితియందునిలుచు అట్టి విజితాత్ముడు గులకరాయైనను, రాయైనను లేదా బంగారమైనను సర్వమును సమముగా గాంచును. తాను పొందినటువంటి జ్ఞాన, విజ్ఞానములచే సంపూర్తిగా సంతృప్తి చెందినప్పుడు ఆత్మానుభవమునందు స్థితిని పొందినట్టి వాడై యోగి యనబడును. దివ్యస్థితియందునిలుచు అట్టి విజితాత్ముడు గులకరాయైనను, రాయైనను లేదా బంగారమైనను సర్వమును సమముగా గాంచును. యోగి గురువు. ఉపదేశం .అజ్ఞానాంధకారాన్ని తొలగించే జ్ఞాన0 దర్శనమయ్యింది

      అజ్ఞానంతో అంధకారంలో పడి కొట్టు మిట్టాడే వారికి. అహంకారం అనే చక్రంలో పడి గిర గిరా తిరిగే వారికి. “అతితీర్శతామ్ తమోంధమ్” గాఢమైన చీకటిలో ఆత్మేమిటో పరమాత్మేమిటో ఎందుకు మనం ఇక్కడికి వచ్చామో కూడా తెలుసుకోకుండా ఇందులోనే పడి కొట్టుకునే వారిని కూడా తరింపజేయటానికి వచ్చినటువంటి గురువు. ఉపదేశం గ్రంథం ఇది. రుచి ఉండి శ్రద్ధ ఉండి, జ్ఞానులని ఆశ్రయించి ప్రార్థన చేస్తే పెద్దలు చేసే ఉపదేశం తప్పకుండా తరింపజేస్తుంది. అందులో సందేహం లేదు అజ్ఞానులని కూడా జ్ఞానులుగా, భగవంతుని పరికరాలుగా తీర్చి దిద్దే మహోపదేశాన్ని గురువు. మనకి ఉపదేశించారు. గురువును మించిన దైవం మరొక్కటి లేదని, … ఈ మోక్షాన్ని కలిగించే మార్గాన్ని అనుసరించమని చేసిన ఉపదేశం ఆత్మ విషయంలో కానీ పరమాత్మ విషయంలో కానీ మనం చీకటిలో ఉన్నాం. చీకటిలో ఉండటం అంటే ఏమిటంటే కన్ను ఉంటుంది, వస్తువు ఉంటుంది కానీ ఆకాన్ను వస్తువుని చూసే శక్తి చాలదు. మధ్యలో ఆవరించి ఉన్న చీకటిని తొలగించి కంటికి ఆ వస్తువుని కన్పింపజేసేట్టుగా మధ్యలో వెలుతురు కావాలి. వెలుతురునిచ్చే జ్ఞాన0 దీపం కావాలి. అనాదిగా అంటి పెట్టుకున్న కర్మ వాసనల దొంతరలు లెక్క లేనన్ని పేరుకొని ఉన్నాయి. మనలో జ్ఞానం సహజంగానే ఉంది కానీ , ఆ జ్ఞానాన్ని పైకి తెచ్చుకోవడానికి గురువులు తమ జ్ఞానాన్ని శక్తిని గురువులు ఉపదేశం ద్వారా ఇస్తారు. వారి ఉపదేశం లోనికి వెళ్ళి క్రమేమి కర్మ వాసనలు తొలగుతాయి. ” జ్ఞానం దీపమ్”, జ్ఞానం దీపం కొత్తగా వస్తువులని తెచ్చి చూపదు. వస్తువు అక్కడే ఉంటుంది కానీ జ్ఞానం దీపాన్ని వెలిగించి పెట్టుకుని ఉన్నంత వరకు ఆవస్తువుని కనిపించేట్టు చేస్తుంది. ఆత్మ స్వరూపాన్ని పరమాత్మ స్వరూప స్వభావాల్ని స్పష్ట పరిచే జ్ఞానం దీపాన్ని మహర్షి వెలిగించి పెట్టాడు, ఆధ్యాత్మిక జీవితం అత్యంత క్లిష్టమైనది.దారి పొడవునా ముళ్ళు గుచ్చుకుంటూ వుంటాయి. కదలక నిశ్చలంగా వుండిపోతే ప్రగతి అసాధ్యం. సమర్ధుడైన సద్గురువును త్రిమూర్తి స్వరూపంగా భావించి సర్వశ్య సరణాగతి చేసి సేవించాలి. అప్పుడు గురువే నీ చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తారు. నీ గురువు ఎంత చిన్నవాడైనా సరే ఆయననే అంటి పెట్టుకొని వుండడం అవశ్యం.భోగ భాగ్యాలు అశాశ్వతం. వాటిని ఏనాటికైనా దొంగలు దోచుకెళ్తారు. సద్గురువు ప్రసాదించే ఆధ్యాత్మిక సంపదే శాశ్వతం. ఆవి సాధించుకున్న వారికి శాశ్వతానందం ప్రాప్తం.
      సద్గురువు అనుగ్రహమే సూక్ష్మచైతన్య సాధనం
      మనిషి పతనానికి ఎన్నో విషయాలు ఉంటాయి, అందుకే మనిషి ఒక స్థాయిని చేరడానికి ఒక సాధన కావాలి, ఆసాధన దైవంతో సంబంధం ఏర్పర్చగలగాలి అప్పుడు దివ్యుడు కాలగడు. దైవానుగ్రహం అనేది సూర్యుడైతే మనం చేసే సాధన ఒక చిన్న మిణుగురు పురుగంత లెక్కకు రాదు. అందుకు విశ్వామిత్రుడు తను సాధించినదానికి దైవ అనుగ్రహం మూలం అని భావించాడు. ఇది గుర్తించి శ్రీరామచంద్రుడిని తన వెంటతెచ్చి తను సాధించిన బల అతిబల విధ్యలని రామచంద్రునికి అర్పించాడు. సూక్ష్మచైతన్య సాధనం చేసాడు. ఆతర్వాత విశ్వామిత్రుడు సీతమ్మతో రామచంద్రుడిని చేర్చి ఒక రహస్యం ఉంది సూక్ష్మ తత్వం సిద్దిని పొందాడు. ఆత్మ జ్ఞానం అనేది ఎంతటి అత్యున్నతి స్థితి సూక్ష్మచైతన్య సాధనల యొక్క అత్యున్నత లక్ష్యం ఆత్మ సాక్షాత్కారం తన్ను వీడి తాను నిలుచు సూక్ష్మతత్త్వమే నిత్యం. తానని గ్రహించటం సూక్ష్మ తత్వం అంతటా వ్యాపించి ఉన్న సూక్ష్మ తత్వం ఆత్మా సాక్షాత్కారం. గురువు.ఉపదేశం అన్న మాటకు అర్థం ఆత్మలో ఉండడం లేక ఆత్మగా ఉండడం. అతీతమైన సూక్ష్మచైతన్య స్థితి ఉండడం. క్షణంలోమనసు నిలిచి అమనస్కమైన .క్షణంలోగురువు ద్వారానే దర్శనం చేసుకోవాలి మట్టిచే తయారు చేయబడిన పాత్రలలో నామ రూప భేదమే కాని వాస్తవ భేద మెంత మాత్రము లేదు.
      ఉన్నది ఒకే బ్రహ్మo లో. ఏ బేధం లేదు ఆత్మలో ఏ బేధం లేదు ని” అనుగ్రహించి తన నిజరూపంతో దర్శనమిచ్చి.. వారి అహంకారాన్ని మట్టికలిపినట్లు చెబుతున్నారు. బ్రహ్మo.సత్యాన్ని గ్రహించాలి.జీవన మార్గంలో సూక్ష్మసాధన ద్వారా “తత్వమసి” అనే సత్యాన్ని గ్రహించాలి. అనుభవించేవాడికి, అనుభవానికి భేదం లేదని సద్గురువు ద్వారా తెలుస్తుంది. ఇలా బ్రహ్మ జ్ఞానాన్ని తెలిసికొన్నవారే జీవన్మిక్తులు, “అది” బ్రహ్మoవున్నది. సూక్ష్మచైతన్య స్థితి దీనినే పరతత్వం, పరబ్రహ్మము అమరత్వము.అని కూడా అంటారు

      మనసు నిలిపి నిశ్చల స్థితిని పొంది మనసు నిలిపి శరణాగతినే కోరుకుంటుంది జ్ఞాని మార్గ నిన్ను నీవు తెలుసుకో. నీ నిజస్ధితి, అఖండం.ము నీ పరిధిలో నీవు మనసు నిలిపి నిశ్చలుడవై నిలువనేర్చుకో శరీరంలో నేననునది ఏ భాగము. శరీరము నేనుకాదు. శరీర నిలుకడకు ఆధారముగ నేనున్నానని తెలుసుకో.

      మనసు నిలిపి భాసిల్లుచున్నది. ఇట్టి నేను పరిజ్ఞానమే పరలోక దైవరాజ్య ప్రవేశం. మీలో ఎందరు ఈ పరిజ్ఞాన మును కలిగియున్నారో పరీక్షించుకోండి. జీవాత్మ కు హృదయ మందిరమే సరియైన ఆలయం. ఈ లోకంలో నిర్మించిన దేవాలయములన్నియు ను బాహ్యవేడుకేలు మాత్రమే. సమస్త యాత్రలకు మూలం మనసు అని తెలుసుకో. నీవు లేకుండ, నేను పోకుండ ఏ యాత్రలు వర్ధిల్లనేరవు. నీతో సర్వం ఏకీభవించి యున్నదని రూఢిపరచుకో.

      మమాత్మా సర్వ భూతాంతరాత్మ. నా ఆత్మే సర్వ భూతములలో భాసిల్లుచున్నదని భావించి కేవలం ఆత్మౌపమ్య బ్రహ్మo నిష్ఠలో నిలచిన జ్ఞాని సర్వమును తనలో, సర్వములో తనను దర్శించ గలుగును. ఇట్టి అఖండాత్ముని దైవస్ధితిలో పూజించినను దోషంలేదు.

      జీవుడు దేవుడు మనసు దేవుడు ఎరుక దేవుడు ఆత్మ దేవుడు ఒక్కడే యను బ్రహ్మ రహస్యం ఎరింగిన వారందరూ సూక్ష్మతత్త్వమౌనదీక్షయే ఔచ్చుకొటారు. అది పరివక్వత చెందిన స్ధితి. తన్ను తాను తెలుసుకొనక బ్రహ్మాండమంతయు పరిశీలించినను వృధా శ్రమయే మిగులుతుంది. తన నిజస్ధితిలోనే అఖిలాండకోటి బ్రహ్మాండ ములు విలీనమై యున్నవి.

      అనంతాత్మాలయ, సర్వాకార, సర్వస్వరూప, సచ్చిదానంద నిలయ, బ్రహ్మవిద్వరిష్ఠా గరిష్ఠ, తురీయాతీతుడే సర్వేశ్వరుడు. ఆత్మ చంపుతుంది అని కానీ, చంప బడుతుంది అనికానీ, ఎవరనుకుంటారో వారు అందరూ ఎరుగని వారే. ఆత్మ చంపదు, చంపబడదు అతడు ఎన్నడూ పుట్టేవాడు, గిట్టేవాడూ కాదు. నిన్న ఉండి రేపు లేనివాడూ కాదు. పుట్టుకలేని వాడు, నిత్యమైన వాడు, మార్పులేని వాడు, అతడు పురాతన మైన వాడు, సూక్ష్మచైతన్య స్థితి ఇది వ్యక్తం కానిది, యోచించడానికి వీలు లేనిది, వికారాలు లేనిది అని చెప్పబడుతుంది. దీనిని నీవు అర్ధం చేసుకుని విచారంచడం ఆత్మ జ్ఞానం అనేది ఎంతటి అత్యున్నతి స్థితి సూక్ష్మచైతన్య సాధనల యొక్క అత్యున్నత లక్ష్యం ఆత్మ )సాక్షాత్కారం తన్ను వీడి తాను నిలుచు సూక్ష్మతత్త్వమే నిత్యం ఆత్మకు పాపపుణ్యాలతో సంబంధం లేదు. కాని అజ్ఞానం వలన ఆ భ్రాంతి కలుగుతోంది. ఆత్మజ్ఞానం ప్రాప్తి కలిగినవారికి అజ్ఞానం నశించి పరమాత్మ దర్శనం కలుగుతుంది. బ్రహ్మజ్ఞాన ఆసక్తిపరులు తమ బుద్దినీ, మనుసునీ పరమాత్మ యందు నిలిపి మోక్షాన్ని పొందుతారు. విద్యా వినయాలుగల బ్రహ్మజ్ఞాని బ్రాహ్మణుని యందు, చండాలుని యందు, ఆవు, కుక్క, ఏనుగు అన్నిటి యందు ఒకే సూక్ష్మదృష్టి కలిగి ఉంటాడు. అతడు ఈ జన్మలోనే పరబ్రహ్మను చేరుతాడు.

      కర్మత్యాగం, నిష్కామ కర్మ రెండూ శ్రేష్టమే ఐనా నిష్కామకర్మ ఉత్తమం. రాగద్వేషాది ద్వంద్వాభావాలు లేనివాడే నిజమైన సన్యాసి మరియు అలాంటివారు మాత్రమే కర్మబంధాల నుండి తరిస్తారు. జ్ఞానయోగం, కర్మయోగాలలో ఏది అవలంబించినా సరే ఒకటే ఫలితం ఉంటుంది. రెండూ ఒకటే అనే బ్రహ్మాంభావం కలిగిఉండాలి. యోగియై మనసు నిలిపి సన్యసించినవాడే బ్రహ్మజ్ఞానాన్ని పొందగలడు. మనసు నిలిపి నిష్కాముడు, శుద్ద మనస్కుడు, ఇంద్రియ నిగ్రహి అన్ని ప్రాణులను తనవలనే చూస్కునేవాడిని ఎలాంటి కర్మలు బంధించలేవు. కర్మయోగి చూసినా, వినినా, తాకినా, వాసన చూసినా, నిద్రించినా, శ్వాసించినా, మాట్లాడుతున్నా ఆయా ఇంద్రియాలే వాటి విషయాల పని చేస్తున్నయనుకుంటాడు కాని తానేమీ చేయడం లేదనే అనుభవం కలిగిఉంటాడు. ఫలితంపైన ఆశ లేక, ఈశ్వరార్పణంగా చేయుకర్మల వలన తామరాకుపై నీటిబొట్టు వలె పాపాలంటవు.

      మనసు నిలిపి యోగులు అహంకారం లేక చిత్తశుద్ది కొరకు మాత్రమే కర్మలు చేస్తారు. ఫలాపేక్ష కలవారు కర్మలచే సంసారంలో బంధించబడతారు. ఆత్మనిష్ఠుడు కర్మసంకల్పం చేయక, ఇతరులచే చేయింపక నవద్వారాలు గల ఈ శరీరంలో సుఖంగా ఉంటాడు. మనసు నిలిపి సుఖాలకు పొంగక, దుఃఖాలకు క్రుంగని మనసు నిలిపి నిశ్చల స్థితిని పొంది బుద్ది కలవాడే నిజమైన బ్రాహ్మణుడు మరియు బ్రహ్మజ్ఞాని. అతడు బ్రహ్మాన్ని ఆత్మలోనే దర్శించి ఆత్మనిత్యమైన బ్రహ్మానందాన్ని పొందుతాడు. తాత్కాలికాలైన, దుఃఖకారకాలైన ఇంద్రియ సుఖాలను బ్రహ్మజ్ఞాని కోరడు. ఎవరైతే ఈ జన్మలోనే కామక్రోధాలను జయిస్తారో వారు ఆత్మజ్ఞానం పొందుతారు. ఎవరైతే స్వతంత్రుడై ఆత్మ యందే సుఖిస్తూ, ఆడుకుంటూ, ప్రకాశిస్తుంటారో, పాపపుణ్యాలను నశింపచేసుకొని జితేంద్రియుడై నిస్సందేహంగా ఉంటారో ఎల్లప్పుడూ అన్ని జీవుల సుఖం కోరువానికి మాత్రమే బ్రహ్మత్వం, బ్రహ్మానందం లభిస్తుంది. మనసు, నిలిపి బుద్ది, ఇంద్రియాలను స్వాధీనం చేస్కొని కోరిక, కోపం, భయం మొదలగువాటిని విడిచిన జ్ఞాని ముక్తుడవుతాడు. తపస్సులకు,యాగాలకు నేనే భోక్తను. సూక్ష్మతత్త్వనేనే సర్వలోకాలకు అధిపతిని, దైవాన్ని, సర్వభూతహితుడను. నన్ను తెలుసుకున్న యోగి క్షేమాన్ని పొందుతాడు మనసు నిలిపి నిశ్చలభక్తి తో సేవించేవాడు,త్రిగుణాలను అతిక్రమించి బ్రహ్మత్వానికి అర్హుడవుతాడు. పరమాత్మకు,మోక్షధర్మాలకు,సచ్చిదానందానికీ,నిరాకార బ్రహ్మానికి నేనే మూలము. ఆత్మనిత్యమైన బ్రహ్మానందాన్ని పొందుతాడు

      మనిషికూడా దశల్లో పరమాత్మను తెలుసుకొనే అవకాశం కల్గినా, తనలోని అజ్ఞానం వల్ల, అతనిని తెలుసుకోలేక, ముందుకు సాగిపోతుంటాడు జ్ఞానం వలన (మనిషి) తానే పరబ్రహ్మమని తెలుసుకుంటాడు.) జీవితంలోబ్రహ్మం సత్యం అంటే ఏమిటో అన్వేషిస్తున్నారా?బ్రహ్మం సత్యం అనేది ఎక్కడో దూరంగా ఉండే విషయం కాదు,అది ఇక్కడే ,ఇప్పుడే అందుబాటులో ఉంది.. , సత్యం మన చుట్టు ఆవరించుకుని ఉంది. అతను మనకు అతి సమీపంలో,మనల్ని పర్యవేక్షించి ఉన్నాడు.సూక్ష్మచైతన్యం సత్యం,దేవుడు సమీపంలో ఉందనడం కూడా సరికాదు.అది మీరే కనుక.సత్యం,దేవుడు మీరై ఉండి మీలోపల,బయట కూడా సూక్ష్మచైతన్యం పర్యవేక్షించి ఉన్నాడు. బ్రహ్మం సత్యమే ఉంది అనేది మొదటి సత్యం

      మనస్సే ప్రతిబంధకం మనస్సే. మిమ్మల్ని మాయాతెరలాగ చుట్టుముట్టి భౌతిక ప్రపంచ అందాలకు మిమ్మల్ని పరవశ్యులను చేస్తుంది.ఆ మనస్సు మాయలో లీనమైపోయి బ్రహ్మం సత్యాన్ని మర్చిపోతున్నారు. నిరంతరం కలలు గనేది, కల్పనలు,ఆశలు,ఆశయాలు,కోరికలే ఆలోచించేదే మనస్సు. నిజానికి లేనిదల్లా మనస్సే.కాబట్టి ఆత్మ తెలుసుకోనివ్వకుండా ప్రతిబంధకం అంతా మనస్సే. చిత్తం లేదా బుద్ద చైతన్యం అంటే మనస్సును ఖాళిగా ఉంచడం.అంటే ఆలోచనలు ఏమిలేని మనస్సు అని అర్థం.అన్ని మతాల సారాంశం అంతా ఈ స్థితికోసమే. ఈ స్థితి సాధించడమే ఆత్మ తెలుసుకునే మహాద్వారం. ప్రపంచంలోని సర్వస్వం కూడా కలలవంటివే అనుకోండి. మనోస్వప్నాలు మానసికంగా ఉండే రూపాలు, అనుభవాలు అన్ని కూడా కలలే అనుకోండి.ఎందుకంటే చూడబడేవాడిగా ఉన్నంత కాలం కలలే అని తలపోయండి.నిరంతరం చూసేదంతా కలే అనే చింతనతోని మీరున్నప్పుడు మీకు హఠాత్తుగా ఒక సత్యం అనుభూతమవుతుంది.చూసే దృశ్యమంతా కలే ఐతే చూడబడే వాడు కూడా కలే అవ్వాలి తప్ప నిజం కాదుగదా? అలాగే సాధన చేస్తూ పోండి ….కనపడేదంతా కలే అనే విచారణతో మీరు ఉండగా మీరేదో ఒక రోజు బ్రహ్మం సత్యకల్గుతుంది. నిద్ర ఎరుక లేని ధ్యానం. సూక్ష్మతత్త్వమే .నిద్ర. సూక్ష్మతత్త్వమే లీనమైయున్నది నిద్రలో మరిమిత సూక్ష్మతత్త్వమే శక్తిని లీనమైయున్నది. ఇది మన అతీంద్రియ సూక్ష్మతత్త్వమే పోందడానికి ఏకైక మార్గం ప్రభావితం చేస్తుంది. దైనందిక జీవితంలో కూడా అత్యున్నత స్థానాన్ని పోందడానికి ధ్యానం ఎంతో దోహదం చేస్తుంది.

      ధ్యానం అంటె మరేమి కాదు. సూక్ష్మతత్త్వమే మనలోకి మనం చేసె ప్రయాణం. ధ్యానంలొ మన సూక్ష్మ చైతన్య పదార్తము శరీరం నుంచి మనసుకు, మనసునించి బుద్ధికి, బుద్ధినించి ఆత్మకు ఎరుక చైతన్యంతోసూక్ష్మ చైతన్య ప్రయాణం చేస్తుంది.
      మనసునిలిపి అంటే సూక్ష్మతత్త్వమేఇదే ధ్యాన స్థితి. లోపలగానీ బైటగాని ఇదే నిర్మల స్థితి ఇదే ఆలోచనారహిత స్థితి. ఈ స్థితిలో ఆలోచనలు వుండవు. కూడా , చుడటాన్ని, మాట్లాడటాన్ని, ఆలోచించడాన్ని నిలుపివెయ్యాలిముఖ్యమైనదిస్థిరమైన, సుఖమైన ఏదైన ఇదే నిర్మల స్థితి సూక్ష్మతత్త్వసహజమైన గమనిస్తూ ఉండాలి సూక్ష్మసాధనల యొక్క అత్యున్నత లక్ష్యం దైవ సాక్షాత్కారం కేవలం చూపులతో ఆత్మ సాక్షాత్కారం కలిగించిన”సూక్ష్మతత్త్వ సాక్షాత్కారం పొందిన వ్యక్తి అన్ని విషయాల్లో నిర్భయంగా ఉంటాడు. సర్వ ప్రాణులని పోషించేది ఆ పరమాత్మే అనే విశ్వాసం కలిగి ఉంటాడు.
      గురువుని అధికుడిగా భావిస్తారు. శివుడు, విష్ణువు వేరుకాదనీ, అంతా బ్రహ్మమేననీ బోధిస్తారు. తను తాను తెలుసుకోవడమే . జ్ఞానం మానవుడు ముందుగా గురువు సంపాదించాలి. గురువును మించిన దైవం, తపస్సు లేదు. గురు ధ్యానకన్నామిన్నయైన ధ్యానం లేదు గురువు యొక్క సహాయం, సూచనలు చాలా అవసరం. ఏ విషయంలోనైనా శిక్షణనిచ్చే గురువుపాత్రఉన్నతమైనది.గురువు సహాయం లేకుండా ఏ జీవి మనుగడ సాధించలేదు ఆత్మజ్ఞానంతో, ఆనందాన్ని పొందటానికి ప్రతినిత్యం సాధనచేసి, … మానవుడు రాత్రి స్వప్నాన్ని అనుభవించిన తర్వాత లేచి అదంతా మాయేనని, భ్రమేనని ఎట్లా . ఋషులూ తెలుసుకున్నారు

      మూడవ కన్నున్నది. అది. ఆత్మ.జ్ఞాననేత్రం. దాన్ని తెరచి స్వరూపాన్ని గుర్తించు అని.గురువు బోధించటం.అన్నారు. దానికి కావలసిన సూక్ష్మంలో మోక్షం’ ఉంది సాధన నేర్పి, బ్రహ్మోపదేశం చేసి, జోలె కట్టి, భిక్షమెత్తమంటారు. మాతృభిక్షే ప్రథమభిక్ష. తండ్రి బ్రహ్మోపదేశం చేస్తే, తల్లి మూడు పిడికెళ్ల బియ్యం భిక్ష పెడుతుంది. అంటే తండ్రి చేసిన ఉపదేశం మననం చేసే నిమిత్తం భిక్షాటన వల్ల కుక్షి నింపుకుని, గురుకులవాసం చేసి, జ్ఞాననేత్రం తెరచి ఆత్మానుభూతిని పొందాలనేది ఉపనయనం యొక్క తాత్పర్యం. ప్రస్తుతం ఆ విషయం మరచి ప్రాణాయామమంటే వేళ్లతో ముక్కుమూసి అభినయించుటగాను, బ్రహ్మోపదేశమంటే కొత్త ధోవతి ముసుగుకప్పి, చెవులో గుసగుసలాడటంగాను, భిక్షంటే రూకలతో జోలె నింపటంగాను పరిణమించింది. అసలు ఉపనయన తత్త్వం గురించి ఉపదేశం చేసే తండ్రికి, చేయించే పురోహితునికి తెలియనప్పుడు బిడ్డలకేం చెప్తారని కూడా ప్రశ్నిస్తారు.

      ఆత్మజ్ఞానంతో, ఆనందాన్ని పొందటానికి ప్రతినిత్యం సాధనచేసి, … మానవుడు రాత్రి స్వప్నాన్ని అనుభవించిన తర్వాత లేచి అదంతా మాయేనని, భ్రమేనని ఎట్లా . ఋషులూ తెలుసుకున్నారు
      మానవ జీవితాన్ని మన పెద్దలు బ్రహ్మచర్యం, గార్హస్త్యం, వానప్రస్థం, సన్యాసంగా వివరించారు. ఐదేళ్లు నిండిన బాలుడిని ఊరికి దూరంగా ఉన్న గురుకులానికి జ్ఞానార్జన కోసం పంపేవారు. అక్కడ దాదాపు ఇరవై సంవత్సరాలు గడిపాక స్వగృహానికి వచ్చేవాడు. కొన్నాళ్ల తరవాత కాశీయాత్రకు బయలు దేరేవాడు. కొందరు వచ్చి మా కూతురునిచ్చి పాణిగ్రహణం చేస్తాం రమ్మని ఆహ్వానించేవారు. అతడు విరాగియైతే కాశీకి వెళ్లిపోయేవాడు, నచ్చితే వచ్చి కన్యాదానం గ్రహించి గృహస్థాశ్రమంలోకి ప్రవేశించి, పిల్లలను కని, పెంచి పోషిస్తూ, తల్లిదండ్రులకు సంఘానికి సేవ చేస్తూ దాదాపు యాభై సంవత్సరాల వయసు వచ్చేవరకు గృహస్థుగా గడిపి ఆ తరవాత తన భార్య తోడురాగా వానప్రస్థాశ్రమంలోకి ప్రవేశించి, చివరగా సన్యసించేవాడు. ఇప్పుడు అవన్నీ మరచిపోయారు. అర్థవంతమైన జీవితాన్ని మన భావితరాలవారికి అందించాలి. మన వ్యవస్థలు, ఆచారవ్యవహారాలు యావత్ప్రపంచానికి ఆదర్శం కావాలి.
      పరమాత్ముడిని స్థూల నేత్రాలతో చూడలేం. జ్ఞాననేత్రం ద్వారా తెలుసుకొనగలం. పురాణాల్లో పరమాత్ముని జ్ఞానాన్ని, శక్తులను దేవతల రూపంలో చూపించారు. … మనో నిగ్రహ లక్షణాంతాః వ్యాసభగవానుడు అన్నాడు. అంటే సర్వ వ్యవస్థలయందును, సర్వకాలముల యందును మనస్సు’ను నిగ్రహించుకొనుట అనే లక్షణం ఉత్తమమైనది. ఆధ్యాత్మిక సాధనకు మనస్సు నిర్మలంగా, నిశ్చలంగా ఉండడం అత్యంతవసరం

      మనస్సు,నిలిపి తానున్న చోటనే ఆత్మ తత్త్వం దర్శించాలి. ఆత్మనిష్ఠ చిక్కిన వానికి వేరే యాత్రలతో పనిలేదు. అన్ని యాత్రలు వారిలోనే దర్శించ గలరు. దైవ భావంతో గాంచినపుడు విగ్రహముగాని, మరెట్టి ప్రతిమగాని పరమాత్మ స్వరూపంగ భాసిల్లుతుంది. దేవుని రాతిగ మార్చుటకన్న, రాతిని దేవునిగ చేయుట మిన్న. ఇదియే విగ్రహారాధనలోని రహస్యము. మనసు ఊరికే ఉండ విగ్రహమును సజీవమూర్తియైన మనసునిలుపుకొని ఇదియే ఆత్మ విశ్వాసములోని బలము. వరములనిచ్చే బయటలేడు. మానవుని హృదయాంతరంగమున గలడు. అందులకే హృదయశుద్ధిగలవారు ధన్యులు. ఆత్మ.సత్యము. ఊరికే ఉండకుండ అనుభవసిద్ధికై, నేత్రానంద పరవశమునకై యాత్రలు చేయాలి. అందువల్ల దోషంలేదుగాని అంతటితో మా బాధ్యత తీరిందని భ్రమపడరాదు. నిజంగా ఆలోచిస్తే నిన్ను మించిన యాత్రలేదు. అట్టి నీవనగ ఎవరో ఉన్నది ఉన్నట్లుగ తెలుసుకో. సమస్త నా ఆత్మ స్వరూపులేయనెటి ఈ అతీత భావనిష్ఠను పొందిననాడు అనంతవిశ్వం నీదిగ భాసిల్లుతుంది. అందులకే క్షుధ్ర వ్యక్తిత్వ హద్దులనుమీరి ఆత్మ అఖండ సమాధి నిమగ్నులు కావాలి. దర్శనాంతర్ధానములు సముద్రము మీది తరంగముల వంటివి. ఆత్మ వినాశం లేదు.సూక్ష్మా.శక్తి పూరించబడునది తగ్గేది కాదు. సూక్ష్మా.శక్తి నశించదు,ఆత్మ చావదు. ఆత్మ హెచ్చు తగ్గులు లేవు. ఆత్మ సాక్షాత్కారం వైపు పయనిస్తున్నంత సేపు అమృతం వైపు వెళతాడని చెప్పి యున్నారు ఆత్మ .నిండా గ్రహించగలరు. ప్రతివారు ఈ ఆత్మ స్ధితికి ఎదగాలి. ఆత్మ ఏకత్వము .ఆత్మ ప్రేమభావంతో ఆత్మయొక్క సత్య స్వరూపాన్ని దర్శించి విపులీకరించ వీలున్నది. మనము ఎవరిని ప్రేమించినప్పటికి వారిలో దర్శించేది ఉన్నత స్ధాయిలో మన ఆత్మయే. ఆత్మ మూలముననే సర్వం విశ్వాసపరిధిలో వర్ధిల్లుచున్నదని తెలియాలి. నీ ఆత్మయే గనుక మమాత్మా సర్వ భూతాంత ఆత్మ.అంతర్దృష్టి.ని.ఆత్మసౌందర్యమే నిండుకుంటుంది. నిజముగ ఇతరులతో మనం ఐక్యత పొందటంలోనే మనస్సు,నిలిపి పరిపూర్ణమైన ఆనందం గలదు. ఆత్మను తెలుసుకొనుట యే అమరత్వమునకు దారి. మానవుని నిరంతర కృషికి ఇదియే చేస్తుంది. ఆత్మ యొక్క సహాయంలేకుండ గమ్యాన్ని చేరుకోవడం అసాధ్యం. ఆత్మ తల్లిగర్భంలో ఉన్నపుడు తల్లి ప్రాణంతో ప్రాణాన్ని జోడించి జీవించునట్లు జీవాత్మ, పరమాత్మల సంబంధం అంతేనని తెలియాలి.మానవుని ఆత్మ పరమాత్మతో ఏకత్వమును సాధించినపుడే మానవుడు పరి పూర్ణుడు ఔతాడు. ఇట్టి ఆత్మ పరిజ్ఞానమే ఆతనిని అనంతస్ధితి వైపు నడిపిస్తుందిసమస్త సాధనల సారం ఇదియే. సర్వం ఆత్మే ఐనపుడు ఇక ఆత్మకు తావేది. నేను ఎక్కడ పుడుతుందో చూడటమే ఆత్మ విచారణ. ఆత్మకు శరీరంలో తావు హృదయం. ఆత్మ హృదయంలో ఉన్నదనుటకన్న హృదయమే ఆత్మయని, మనోనిగ్రహం గ్రహించవలసి యున్నది. హృదయం ప్రకాశిస్తుంది. హృదయమ్నుండి వస్తుంది. హృదయశుద్ధి గలవారు ధన్యులు. ఆంతర్యం గ్రహించండి. ఇది ఆత్మ దర్శనమునకు సూటి దారి ఆత్మ చైతన్యం ఒక్కటే క్షణం మార్గదర్శనం అవుతుంది.ఆత్మ విషయంలో అంచనాలు పనికి రావు. అనుభవం ముఖ్యం, అనుభూతి ప్రధానం. మనో మూలమైన ఆత్మను కున్నామా మనస్సు దానంతటదే అదృశ్య మౌతుంది.ఆత్మను కనుగొన్న తరువాత నిగ్రహించటానికి మనస్సే ఉండదు. జ్ఞానిలో మనస్సు పనిచేయ వచ్చు. చేయకపోవచ్చు. అతని సూక్ష్మం దృష్టిలో మోక్షం’ ఆత్మ ఒక్కటే ఉంది. గురువు

  10. Rohiniprasad says:

    మరొకసారి చెపుతాను. ‘చూచుట, చూడకపోవడం’ మొదలైనవన్నీ మనుషులకూ, ఇతర ప్రాణులకూ జీవపరిణామక్రమంలో అలవడిన శక్తులు. ఆటుపోట్లకు తట్టుకుంటూ, మనుగడ కొనసాగించడానికి పనికొచ్చే విద్యలు. నాడీమండలం ఎదిగిన ప్రాణుల్లోనూ, ఎదగని ప్రాణుల్లోనూ స్పందనలు ఒకేలా ఉండవు. ఆత్మ వగైరాలను గురించి తెలియకుండా మాట్లాడకూడదు. దేన్నీ assume చేసుకోకుండా ప్రకృతిని గురించి ఆలోచింఛగలిగినప్పుడే స్పష్టత ఏర్పడుతుంది. ఎప్పుడో చనిపోయిన శంకరుణ్ణో, డార్విన్‌నో పట్టుకుని వేళ్ళాడవలసిన అవసరం లేదు. ఈ నాటి విజ్ఞానం ఏం చెపుతోందో ముందు గమనించండి.

    ఉదాహరణలు ఎన్నైనా ఉన్నాయి. కిందికి జారడం అనేది నీచమనీ, పైకి లేవడమనేది గొప్ప అనీ అనుకుంటాం. అందుకు కారణం మనం గురుత్వాకర్షణకు లోబడి జీవించడమేనని మరిచిపోవద్దు. భారరహితస్థితిలో పెరిగిన జీవాలకు ఇటువంటి భావనలు ఉండకపోవచ్చు. పాతకాలపు విశ్వాసాలని నమ్మాలనే కాంక్ష ఎంత బలంగా ఉన్నప్పటికీ వాటిని విడిచిపెట్టాలి.

  11. హరి దోర్నాల says:

    విజ్ఞానం నిరంతరం అభివృద్ధి చెందుతుంది. అంత మాత్రాన ప్రతీ సారీ అది ఇంతకు ముందు రుజువైన విషయాలకు వ్యతిరేక దిశను తీసుకోదు. సూర్యోదయాన్నే చూద్దాం. భూమిని రఫరెన్సు గా తీసుకుంటే సూర్యుడు తూర్పు నుండి పశ్చిమానికి ప్రయాణిచడం సత్యమే. అలాగే పాలపుంత గెలాక్సీని రిఫరెన్సుగా తీసుకుంటే భూమీ సూర్యుడూ కూడా పాలపుంత కేంద్రకం చుట్టూ తిరుగుతున్నాయి. గమనిస్తే, ఇప్పటికీ కూడా సూర్యుడు తూర్పున ఉదయిస్తాడనే అందరూ భావిస్తారు తప్ప, పశ్చిమానో మరోచోటో ఉదయిస్తాడని ఎవరూ అభిప్రాయాన్ని మార్చుకో లేదు.

    ఇంటర్నెట్లో పికాసా అల్బం చూసిన వారు గమనించి వుంటారు. వెనువెంటనే డవున్లోడ్ అయిన సమాచారంతో అస్పష్టమైన చిత్రం కనపడుతుంది. ఆ తర్వాత సమాచారం మరింత డవున్లోడ్ అయిన కొద్దీ చిత్రానికి మరింత స్పష్టత వస్తుంది. అలాగే విజ్ఞానం కూడా. అభివృద్ధి చెందిన కొద్దీ మరింత స్పష్టంగా మారుతుందే తప్ప పూర్తి వ్యతిరేకమైన అభిప్రాయాలకు రాదు.

    అలాగే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడని ప్రతి ఒక్కరు చూడగలుగుత్న్నారు. కాబట్టి అది వాస్తవం. కాని దేవుడు, ఆత్మలు కనపడ్డాయని మాత్రం కొంత మందే చెపుతున్నారు. కాబట్టి అది కేవలం వారి భ్రమ మాత్రమే. వాస్తవం కావటానికి అవకాశం లేదు.

    అన్ని మతాల లోనూ దేవుడిని కనుగొనడానికి దేవుడి మీద పూర్తి విశ్వాసాన్ని కాలిగి వుండడం ఆద్యావశ్యకత గా చెప్తారు. గుడ్డిగా నమ్మిన తర్వాత కనపడ్డట్టుగా భ్రమించడంలో అశ్చర్యం లేదు. అలా ఇతరులు కూడా భ్రమించడానికి ప్రయత్నించ నవసరం లేదు.

    దేవుడిని నమ్మ దలిచిన వాళ్ళు యదేఛ్ఛగా నమ్మ వచ్చు. దానికి అభ్యంతరం లేదు. కాని దేవునికి సైన్సుతో లంకె వేయాలని చూస్తేనే ఇబ్బంది.

    • Manohar says:

      meeru science to sambandham lekundane, bhagavantudini chusinavaaridi bhrama antunnaru. deeniki aadhaaram emiti?
      andaru chudalenanta maatraana vaastavam kaavadaaniki avakaasam ledani elaa antaaru?

  12. rathnamsjcc says:

    భూమి మీద మనం జన్మించడానికి ఒక మార్గం కావాలి. పూర్వజన్మ పాపపుణ్యాల్ని అనుభవించి, తిరిగి వచ్చినచోటేక చేరుకుంటాం. అలా మనకి సాయపడుతున్న జన్మకారకులు తల్లిదండ్రులు. మనతోపాటు మరికొన్న జీవాలు ఋణానుబంధాలననుసరించి అదే గర్భవాసాన జన్మిస్తూవుంటారు. వారే మనకు సోెదరులు అవుతారు. ఫలానా వారు మనకి సోెదరిగా జన్మిస్తుందనిగానీ, సెదరుడుగా పుడతాడని గానీ మనకు ముందుగా తెలియదు. అదే జన్మరహస్యం.
    ఇలా జన్మించిన మనకి తల్లి, తండ్రి, అక్కా, అన్నా, చెల్లెలు, తమ్ముడు అనే బంధాలు ఏర్పడతాయి. తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు వీరెవరూ మనతోపాటు రారు. అలాగే మనం మరణించేటప్పుడు తిరిగి ఈ తల్లి గర్భానికి చేరం. తల్లిదం డ్రులూ మనతో రారు. జన్మించడానికి, మరణించడానికి మధ్య నున్న వ్యవధిలో మనకి ఎన్నో ఆశలు, ఆశయాలు, కోరికలు బుద్దిపూర్వకంగా పుడుతూవుంటాయి. పెళ్ళి, పిల్లలు, సంసారం అనే సడిగుండంలో చిక్కుకుని, జీవితకాలంలో మనం కూడబె ట్టుకున్నది ఉన్నవారికి వదిలి తిరుగు ప్రయాణం అవుతాం. అప్పుడు మన సంసారంలో భార్యగానీ, పిల్లలుగానీ మనతో పాటు రారు. అందుకే వీటిమీద వ్యామోహాన్ని పెంచుకోకూ డదు. ఈ సంసార సాగరంలో పడితే పుడుతూ, మరిన్ని పాపకర్మలు చేస్తూ మరణిస్తూ తిరిగి వాటిని అనుభవించడానికి మరో గర్భాన జన్మిస్తూ ఇలా అంతులేని భవసాగరాన్ని జననమరణాలతో ఈదులాడుతూనే ఉండాలి.
    అందుకే పెద్దలు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోమంటారు. మంచి జన్మ లభించినందుకు ఈ జన్మలోనే పాప పరిహారం చేసు కుని, సకల బంధాలనూ విడనాడి, ఆ పరమేశ్వరుని పాదాలచెంత శాశ్వత స్థానాన్ని సంపాదించుకోవడా నికి అహర్నిశలూ కృషిచేయాలి. ధర్మ పథంలో పయనిస్తూ, ఆ పరమపథాన్ని చేరుకోవడానికి భగవన్నామాన్ని జీవిత నౌకగా చేసుకుని నవవిధ భక్తిమార్గాలలో ఈ భవ సాగరాన్ని దాటాలి.
    మరి మనకి తోడుగా, నీడగా ఉండేది ఏదీ..? అనే సంశయా నికి సమాధానంగానే శంకరులవారు ప్రబోధించారు. ఈ పరిస్థితిని అధిగమించడానికి పరమేశ్వరుని శరణాగతి ఒక్కటే మార్గం అని. అన్ని జన్మల్లోనూ ఉత్కృష్టమైనది మానవ జన్మ. జన్మరాహిత్యాన్ని పొందడానికి ఇదే చక్కని చుక్కాని. పుట్టుక వల్ల ఏర్పడిన భవబంధాల మీద అనురక్తిని పెంచుకోకుండా, భగవంతుని అన్వేషించి పట్టుకుంటే ఈ జననమరణ చక్రంలో పడి కొట్టుకుపోకుండా ఆ పరమేశ్వరుడే మనల్ని ఒడ్డుకి చేరుస్తాడు. ఎవరూ మనతో రాకపోయినప్పటికీ, నీడలా మనని అంటిపెట్టుకు వచ్చేవి పాపపుణ్యాలు మాత్రమే అన్న విషయం విజ్ఞులందరికీ తెలిసినదే.

    పుణ్యచరణ వలన ఉత్తమగతులు కలుగుతాయన్నదే వేదవాక్కు. అందుకు ఈశ్వరుడు అనుగ్రిహంచిన ఈ జన్మని, తిరిగి పరమేశ్వరార్పణమే చేయాలి. బ్రహ్మాండం నుంచి పుట్టిన అణువులు, పరమాణువులు మళ్ళీ బ్రహ్మాండంలోనే విలీనం కావాలి. అదే ప్రకృతి. దానిననుసరించి వర్తించడమే మానవ ధర్మం. అందుకు తగిన సాధన ప్రతి మానవుడు చేయాలి. అప్పుడే జన్మరాహిత్యం కలుగుతుంది. మనసా, వాచా, కర్మణా భగవంతుని సాన్నిధ్యాన్ని కోరుకునే ప్రతీ మానవుడు ఆయనలోనే లీనమవుతాడు. ఆయనే జన్మాంతరాన మనతో పాటు నడిచే, నడిపించే బాంధవుడు. మనం మమకారం పెంచుకున్నవారెవ్వరూ మనతో ఉండరు, రారు. అందుకే పెద్దలు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోమంటారు. మంచి జన్మ లభించినందుకు ఈ జన్మలోనే పాప పరిహారం చేసుకుని, సకల బంధాలనూ విడనాడి, ఆ పరమేశ్వరుని పాదాలచెంత శాశ్వత స్థానాన్ని సంపాదించుకోవడానికి అహర్నిశలూ కృషిచేయాలి. ధర్మ పథంలో పయనిస్తూ, ఆ పరమపథాన్ని చేరుకోవడానికి భగవన్నామాన్ని జీవిత నౌకగా చేసుకుని నవవిధ భక్తిమార్గాలలో ఈ భవ సాగరాన్ని దాటాలి.

  13. sir,
    your articulation is excellent. your view on invisible power is some what injurious to humanity. are we not cheating our children during childhood to tame them disciplined?
    if we have to live in harmony, we need to create god, law is not adequate to maintain peace. let us forge about heaven, but we must find suitable coercive forces to maintain our planet.

Comments are closed.