Monthly Archives: December 2008

మృతజీవులు – 23

ప్రఖ్యాత రష్యన్‌ రచయత గొగోల్‌ (Nikolai Gogol)రాసిన డెడ్‌ సోల్స్‌ (Dead Souls) అనే నవలను కొడవటిగంటి కుటుంబరావుగారు “మృతజీవులు” అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. కుటుంబరావుగారి కథలూ, నవలలూ, నాటికలూ, వ్యాసాలూ సంకలనాలుగా వచ్చాయి కాని అనువాద రచనలేవీ మళ్ళీ పాఠకుల కంటబడలేదు. ఈ కోవకు చెందిన ఆయన సాహిత్యంలో సోవియట్‌ ప్రచురణలూ, సదరన్‌ లాంగ్వేజెస్‌ బుక్‌ ట్రస్ట్‌ వారి ఇతర దక్షిణ భారతీయ భాషల్లోని సైన్స్‌ పుస్తకాల అనువాదాలూ, 1948 ప్రాంతాల్లో చక్రపాణిగారు “ఆంధ్రజ్యోతి” నడిపిన రోజుల్లో అందులో పేరు లేకుండా ప్రచురితమైన ఆర్థర్‌ కోనన్‌ డాయల్‌ షెర్లాక్‌ హోమ్స్‌ నవలల అనువాదాలూ, యువ మాసపత్రిక కోసం చేసిన బెంగాలీ నవలల అనువాదాలూ మొదలైనవెన్నో ఉన్నాయి. ఆ లోటును పూర్తి చేసే ఉద్దేశంతో “మృతజీవులు” నవలను సీరియల్‌గా మీ ముందుకు తెస్తున్నాము. Continue reading

Posted in కథ | Tagged , | 3 Comments

నవంబరు గడి సమాధానాలు

ఈనెల గడిని నింపి పంపినవారు వెన్నెల, స్వరూప్ కృష్ణమూర్తి , భాస్కరనాయుడు, శ్రీలు, ఆదిత్య, కృష్ణుడు, సుజాత (మనసులో మాట), లచ్చిమి, ఊకదంపుడు మరియు దైవానిక గార్లు. అందరూ 9 అడ్డం భట్రాజులు అని రాసే బదులు భట్రాజు అని రాసారు. కానీ దీనికి లంకె ఉన్న 11 నిలువు – సంగతులు సరిగా రాసినందున దీన్ని తప్పుగా భావించలేదు. అలాగే పొల్లు అక్షరాలు సరిగా రాయలేకపోవడం, పక్క అక్షరాలతో కలిసిపోవడాలని క్షమించరాని తప్పులుగా భావించలేదు. అందువల్ల, ఊకదంపుడుగారు అన్నీ సరియైన సమాధానాలతో ముందు నిలిచారు. రెండు తప్పులతో దైవానికగారు ఆయన వెనుకే నిలిచారు. ఇద్దరికీ అభినందనలు. – కొవ్వలి సత్యసాయి Continue reading

Posted in గడి | Tagged | 1 Comment

డిసెంబరు ’08 గడిపై మీమాట

నవంబరు గడి పై మీ అభిప్రాయాలు ఇక్కడ రాయండి. పాత గడులు 1. 2008 నవంబరు గడి, సమాధానాలు 2. 2008 అక్టోబరు గడి, సమాధానాలు 3. 2008 సెప్టెంబరు మెరుపు గడి, సమాధానాలు 4. 2008 ఆగస్టు గడి, సమాధానాలు 5. 2008 జూలై గడి, సమాధానాలు 6. 2008 జూన్ గడి, సమాధానాలు … Continue reading

Posted in గడి | Tagged | 16 Comments

చదరంగం

జీవితం చదరంగమైతే ఏ గడి లో ఏముంది, ఏ కిటికీ లో ఏ భావావేశం తొంగిచూస్తుంది, గతించే ఒక్కో రోజు మనిషి కి ఏమి మిగిల్చి వెళ్తుందో ..చావా కిరణ్ గారి చదరంగం కవితలో చదవండి. Continue reading

Posted in కవిత్వం | Tagged | 17 Comments

“నేర్చుకో” కథపై విశ్లేషణ

-స్వాతీ శ్రీపాద “సన్నపురెడ్డి అనగానే మనకి చనుబాలు, కొత్తదుప్పటి, కన్నీటి కత్తి, పాటల బండి, ప్రతిమల మంచం వంటి కొన్ని మైలురాళ్ళు గుర్తుకొస్తాయి. ఈ సంపుటి చదివాక అన్పించింది అతడి ప్రతి కథా ఒక మైలురాయేనని.” – వి.ప్రతిమ, ప్రముఖ స్త్రీవాద రచయిత్రి, కథాసాహిత్యంలో చేసిన కృషికి గాను కేతు కథాపురస్కారం -2006 గ్రహీత. కొత్తదుప్పటి … Continue reading

Posted in వ్యాసం | Tagged | 6 Comments

తోటరాముడితో ఇంటర్వ్యూ

“నేను దినకర్ గురించి రాసే విషయాలకు వాడు బాధపడడా అని అసంఖ్యాకమైన ఉత్తరాలు వచాయి నాకు (అసంఖ్యాకమైన=1). నేను రాసినవి అందరికన్నా ఎక్కువ ఆస్వాదించేది వాడే (వాడికి అర్థం కాకపోయినా)” రెండు రెళ్ళ ఆరు బ్లాగుకర్త తనదైన ప్రత్యేకమైన శైలిలో చెబుతున్నారు, పూర్ణిమకిచ్చిన ఈ ఇంటర్వ్యూలో Continue reading

Posted in జాలవీక్షణం | Tagged , , | 31 Comments

రెండ్రెళ్ళు ఓసారేసుకో, దినకర్ని ఆరేసుకో, విరగబూచిన నవ్వులు ఏరేసుకో

తెలుగు వాళ్ళకి అత్యంత ఇష్టమైన “హాస్యాన్ని”, చాలా వరకూ తెలుగుకి దూరమైపోయిన తెలుగోళ్ళు కూడా చదువుకోగలిగేలా ఉన్న “రెండు రెళ్ళ ఆరు” బ్లాగును సమీక్షిస్తున్నారు పూర్ణిమ Continue reading

Posted in జాలవీక్షణం | Tagged , | 21 Comments

కన్నులు

కన్నులున్నది రెండైనా అవి పలికే భావాలు అనంతం. మరి ఏ కన్నుల్లో ఏ వ్యక్తీకరణలున్నాయో.. Continue reading

Posted in కవిత్వం | Tagged | 4 Comments

కొత్తదుప్పటి – విశ్లేషణ

-స్వాతీ శ్రీపాద ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ ప్రస్తావన: సాధారణంగా ఏ కథాసంపుటిలో ఐనా చాలావరకు మంచి కథలు, కొన్ని సాదా సీదా కథలు, ఒకటో రెండో గొప్ప కథలు ఉంటాయి. కానీ కొత్త దుప్పటిలో మాత్రం అన్నీ గొప్ప కథలే. నా ఒక్కడికే ఇలా అనిపించిందా లేక నిజంగా ఇవన్నీ గొప్ప కథలేనా అని సందేహమొచ్చి ప్రతిమకు ఫోన్ … Continue reading

Posted in వ్యాసం | Tagged | 6 Comments

రథి

జీవితం స్వప్నమా సత్యమా..స్వప్నం లా అనిపించే ఈ వాస్తవ జీవిత రధానికి సారధి ఏమి తెలుసుకోవాలి? Continue reading

Posted in కవిత్వం | Tagged , | Comments Off on రథి