Monthly Archives: October 2008

మృతజీవులు – 22

ప్రఖ్యాత రష్యన్‌ రచయత గొగోల్‌ (Nikolai Gogol)రాసిన డెడ్‌ సోల్స్‌ (Dead Souls) అనే నవలను కొడవటిగంటి కుటుంబరావుగారు “మృతజీవులు” అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. కుటుంబరావుగారి కథలూ, నవలలూ, నాటికలూ, వ్యాసాలూ సంకలనాలుగా వచ్చాయి కాని అనువాద రచనలేవీ అంతగా పాఠకుల కంటబడలేదు. ఈ కోవకు చెందిన ఆయన సాహిత్యంలో సోవియట్‌ ప్రచురణలూ, సదరన్‌ లాంగ్వేజెస్‌ బుక్‌ ట్రస్ట్‌ వారి ఇతర దక్షిణ భారతీయ భాషల్లోని సైన్స్‌ పుస్తకాల అనువాదాలూ, 1948 ప్రాంతాల్లో చక్రపాణిగారు “ఆంధ్రజ్యోతి” నడిపిన రోజుల్లో అందులో పేరు లేకుండా ప్రచురితమైన ఆర్థర్‌ కోనన్‌ డాయల్‌ షెర్లాక్‌ హోమ్స్‌ నవలల అనువాదాలూ, యువ మాసపత్రిక కోసం చేసిన బెంగాలీ నవలల అనువాదాలూ మొదలైనవెన్నో ఉన్నాయి. ఆ లోటును పూర్తి చేసే ఉద్దేశంతో “మృతజీవులు” నవలను సీరియల్‌గా మీ ముందుకు తెస్తున్నాము. Continue reading

Posted in కథ | Tagged , | Comments Off on మృతజీవులు – 22

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డితో ఇంటర్వ్యూ – 3

–ఇంటర్వ్యూ చేసినవారు: రానారె, త్రివిక్రమ్, చదువరి రాయలసీమ లోని గ్రామ పార్టీల గురించి ‘పాండవబీడు‘, కనుమరుగైపోతున్న సాంప్రదాయక కళల గురించి ‘తోలుబొమ్మలాట‘, గ్రామీణ జీవితాల్లో వ్యవసాయరంగంలో వస్తోన్న మార్పుల గురించి ‘కాడి‘, మగ విద్వేషానికి బలయిన చారిత్రక వీరవనిత గురించి ‘పాలెగత్తె‘, శ్రమైక జీవన సౌందర్యాన్ని గురించి ‘చినుకుల సవ్వడి‘ నవలలు రాసారు. తదుపరి ప్రణాళిక … Continue reading

Posted in వ్యాసం | Tagged | 5 Comments

అనుభూతి

మనిషి జీవితం లో లెక్క లేనన్ని అనుభూతులు. మరి జీవితం తర్వాత? మృత్యువు లోని ఆఖరి అనుభూతిని గమ్భీరమైన భావాలతో అక్షరబద్ధం చేశారు కొండూరు ఆత్రేయ. Continue reading

Posted in కవిత్వం | 4 Comments

సెప్టెంబరు మెరుపు గడి సమాధానాలు

సెప్టెంబరు మెరుపు గడికి సమాధానాలు -కొవ్వలి సత్యసాయి Continue reading

Posted in గడి | Tagged | Comments Off on సెప్టెంబరు మెరుపు గడి సమాధానాలు

అక్టోబరు గడిపై మీ అభిప్రాయాలు

అక్టోబరు గడి పై మీ అభిప్రాయాలు ఇక్కడ రాయండి. పాత గడులు 1. 2008 సెప్టెంబరు మెరుపు గడి, సమాధానాలు 2. 2008 ఆగస్టు గడి, సమాధానాలు 3. 2008 జూలై గడి, సమాధానాలు 4. 2008 జూన్ గడి, సమాధానాలు 5. 2008 మే గడి, సమాధానాలు 6. 2008 ఏప్రిల్ గడి, సమాధానాలు … Continue reading

Posted in గడి | Tagged | 6 Comments

విజయదశమి పద్యకవితా సమ్మేళనం – చివరిభాగం

– రానారె [గతభాగం] {రాయలు}: భట్టుమూర్తీ, మీకో చక్కని చిక్కని సన్నివేశం చెబుతా {భట్టుమూర్తి} చెప్పండి ప్రభూ {రాయలు}: ఒక అయిదేళ్ళ పిల్లవాడు. వాళ్ళింటి పెరట్లో చెట్టు మీద పక్షి ఒకటి గూడు పెట్టింది. ఒకరోజు వీడు నిద్ర లేచేప్పటికి ఆ గూట్లోంచి రాత్రి పొదిగి బయటికొచ్చిన పిల్లల కీచు గొంతులు వినిపిస్తున్నై. ఆ సన్నివేశాన్ని … Continue reading

Posted in కవిత్వం | Tagged | Comments Off on విజయదశమి పద్యకవితా సమ్మేళనం – చివరిభాగం

విజయదశమి పద్య కవితా సమ్మేళనం – రెండవ భాగం

[మొదటిభాగం] {రాయలు}: పెద్దన కవీంద్రా, అలనాడు వరూధిని ప్రేమ నివేదనని ఛాందసుడైన ప్రవరుడు నిరాకరించినట్లు చిత్రించారు. {పెద్దన} చెప్పండి రాయా! {రమణి}: ఆనతివ్వండి అనాలి పెద్దనగారూ. {పెద్దన} రమణిగారు, కవులు నిరంకుశులండీ! {రమణి}: పెద్దన గారు: హ హ నిజమే {రాయలు}: మా కోరిక చిత్తగించండి … వెండి కొండమీద శివుడు ధ్యానమగ్నుడై యున్నాడు. ఎదుట … Continue reading

Posted in వ్యాసం | Tagged , , , , | 10 Comments

అభినవ భువనవిజయ దశమి

గడచిన ఉగాది సందర్భంగా నిర్వహించిన కవి సమ్మేళనానికి రసజ్ఞులు మాకందించిన ప్రోత్సాహంతో ఈ విజయదశమి నాడు మరో రసవత్తరమైన కవిసమ్మేళన అంతర్జాలసభా విశేషాలను విజయవంతంగా మీకు సమర్పిచ గలుగుతున్నందుకు మిక్కిలి సంతోషిస్తున్నాం. Continue reading

Posted in కవిత్వం | Tagged | 8 Comments

ఉపజాతి పద్యాలు – ౩

సీసము –ముక్కు శ్రీరాఘవకిరణ్ సీసపద్యం ఉపజాతులో దొడ్డది, ముఖ్యమైనది, అందమైనది, గంభీరమైనది. శతకాలని ప్రక్కన పెడితే అసలు అసంఖ్యాకంగా సీసపద్యాల్లేని కావ్యమే లేదంటే అతిశయోక్తి కాదేమో.       మందార మకరంద మాధుర్యమునఁ దేలు మధుపంబు వోవునే మదనములకు       కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ       ఇంద్రనీలచ్ఛాయ లీను నెమ్మేనిపైఁ గనకాంబర ప్రభఁ గ్రందుకొనఁగఁ … Continue reading

Posted in వ్యాసం | Tagged | 4 Comments

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డితో ఇంటర్వ్యూ – 2

–ఇంటర్వ్యూ చేసినవారు: రానారె, త్రివిక్రమ్, చదువరి (ఇంటర్వ్యూ మొదటి భాగం) మీ రచనల్లో నాకు తెలిసిన వాటిలో ‘నేను-తను’ కథగానూ, కవితగానూ రెండు రూపాల్లో వుంది. వాటిల్లో మీరు ముందు కథ రాశారా? లేక కవితా? ఇంకే కథనైనా కవితగా గానీ, కవితను కథగా గానీ రాశారా? ఆ ఉద్దేశ్యమేమైనా ఉందా? కవితగా రాసినప్పుడే దాన్ని … Continue reading

Posted in వ్యాసం | Tagged | 1 Comment