Monthly Archives: May 2008

అలికిడి

“నీవి పాము చెవుల్రా” అనేవాడు నాన్న. నిజమేనేమో. ఇంతకూ ఇప్పుడు ఈ అలికిడి ఎక్కడి నించి, ఇటు తిరిగి పడుకుంటూ చెవులు రిక్కించాను.

ఈతచాపలోంచి … ఏదో ఎక్కడో జరజరా… జరజరా అనే జారుతున్న అలికిడే అది. ఈత చాపకు చెవి ఆనించి – శ్రద్ధగా విన్నాను. ఔను. ఏదో బరువు వస్తువు ఇసుకలో జరుగుతున్న ధ్వని అది. ఇసుకలో ఉండే గమ్మత్తు ఏమిటంటే – తన గర్భంలో కానీ, తనపై కానీ ఏదైనా జరిగితే దాని ప్రకంపనలు ప్రసారం చేస్తుంది. అయితే దాన్ని వినగలిగే నేర్పు మనలో ఉండాలి – అంతే.

Continue reading

Posted in కథ | Tagged , , | 9 Comments

సామాన్య జీవితాలను అసామాన్యంగా చిత్రించిన “దహేజ్”

-త్రివిక్రమ్ కథలకు, ఆ మాటకొస్తే సాహిత్యానికి, ముడిసరుకు జీవితమే. జీవితాన్ని ఎంత నిశితంగా పరిశీలిస్తే అంత గొప్ప కథావస్తువులు దొరుకుతాయి. ఆ కథాంశాలకు చక్కటి కథారూపమివ్వాలంటే రచయితకు గొప్ప శిల్పదృష్టి, రాతపై అదుపు ఉండడం అత్యవసరం. తాము నిత్యం గమనించే జీవితాలు, పరిస్థితుల నుంచి విలక్షణమైన మంచి కథాంశాలను ఏరుకోగలిగే నేర్పు కొందరికే ఉంటుంది. అలా … Continue reading

Posted in వ్యాసం | Tagged | 6 Comments

|| ఇస్రో విశ్వస్య రాజతీ ||

ఎర్రటి బాణం ఆకాశానికి గురిపెట్టి ఉంటుంది. అది ఆ సంస్థ చిహ్నం. అచ్చు ఆ బాణంలాగే లక్ష్యమ్మీదే దృష్టి కేంద్రీకరించి వారి రాకెట్ నిలబడి ఉంటుంది. అది ఎక్కుపెట్టిన రామబాణం. శ్రీహరికోటలోని లాంచ్‌ప్యాడే కోదండం. ధనుర్విముక్తశరం లాగా నభోమండలాన్ని చీల్చుకుంటూ అది దూసుకుపోతుంటే ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. మంత్రించిన బ్రహ్మాస్త్రం అది. చెప్పిన … Continue reading

Posted in సంపాదకీయం | 9 Comments

ఏటి ఒడ్డున కొన్ని మాటలు – మూలా సుబ్రహ్మణ్యంతో స్వాతి కుమారి కబుర్లు

-స్వాతి కుమారి కవిత్వమంటే ఏమిటి, అది నిర్వచనాలకు, సమీకరణాలకు కట్టుబడి ఉండేదేనా? పద్యమైనా వచనమైనా, అందులో ఎన్ని మార్పులు, కొత్త పద్ధతులూ వచ్చి చేరినా.. మూల పదార్ధాలైన రసమూ, ధ్వనీ – మరోలా చెప్పాలంటే భావమూ, భాష – వీటి ప్రాముఖ్యత ఎంత వరకూ నిలబడి ఉంది? కొద్దో గొప్పో కవిత్వం రాయటం మొదలెట్టిన వాళ్ళకి … Continue reading

Posted in వ్యాసం | Tagged , | 8 Comments

అంతర్జాలంలో వ్యాపారీకరణ

వెబ్‌సైటులు, బ్లాగులతో డబ్బులు సంపాదించడం ఎలా అనే అంశంపై ఒక దృష్టి Continue reading

Posted in వ్యాసం | Tagged , | 10 Comments

2008 మే గడిపై మీమాట

మే గడి పై మీ అభిప్రాయాలు ఇక్కడ రాయండి. పాత గడులు 1. 2008 ఏప్రిల్ గడి, సమాధానాలు 2. 2008 మార్చి గడి, సమాధానాలు 3. 2008 ఫిబ్రవరి గడి, సమాధానాలు 4. 2007 డిసెంబరు గడి, సమాధానాలు 5. 2007 నవంబరు గడి, సమాధానాలు 6. 2007 అక్టోబరు గడి, సమాధానాలు 7. … Continue reading

Posted in గడి | Tagged | 8 Comments

2008 ఏప్రిల్ గడి సమాధానాలు, వివరణలు

ఏప్రిల్ గడికి జవాబులు పంపినవారు మొత్తం ఆరుగురు. అంతా సరిగా నింపినవారు ఎవరూ లేరు.
జవాబులు పంపినవారు: కొత్తపాళీ, సుజాత శ్రీనివాస్, దైవానిక, జ్యోతి వలబోజు, మరోమాటచెప్పు, వికటకవి
1 నిలువు “సిక్కా” అన్నది సరైన సమాధానమైనా, “సిక్కు” కూడా సరైనదిగానే పరిగణించబడింది.
ఒకే ఒక తప్పుతో (“యాజ్ఞసేని”కి బదులు “యాజ్ఞసేన” అని) పంపినవారు “మరో మాట చెప్పు” అన్న మారుపేరుతో ఎవరో. ఎక్కువమంది “ఉగాదిపచ్చడి”లోనూ “చైతన్యస్రవం”లోనూ తప్పులో కాలేసారు! Continue reading

Posted in గడి | Tagged | Comments Off on 2008 ఏప్రిల్ గడి సమాధానాలు, వివరణలు

ఈ చిరునామా వెతికి పెట్టండి

మానవ జాతి చరిత్ర మొదలైన నాటి నుండీ నేటి వరకూ ఎన్నో అమానుషాలూ, అకృత్యాలు ప్రపంచం లో ప్రతి చోటా జరుగుతునే ఉన్నాయి. ఈ క్రమం లో దొరక్కుండా పోయిన ఒక చిరునామా కోసం వెతుకులాట స్వరూప్ కృష్ణ గారి ఈ కవిత లో కనిపిస్తుంది. Continue reading

Posted in కవిత్వం | 8 Comments

బ్లాగరుల నుండి బ్లాగరులకో లేఖ!

బ్లాగు పేర్లతో కూర్చి బ్లాగరులకు ఒక బ్లాగరి రాసిన లేఖ! Continue reading

Posted in వ్యాసం | Tagged | 25 Comments

ప్రపంచీకరణ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధికరంగం

ప్రపంచీకరణ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై ఒక మునుజూపు Continue reading

Posted in వ్యాసం | Tagged , , | 20 Comments