Monthly Archives: March 2008

కలంకలల ఘలం ఘలలు

స్థాలీపులాక న్యాయం అనే మాట వినే ఉంటారు. అన్నమంతా చూడకుండా ఒక మెతుకును పట్టి చూసినా సరిపోతుందనే సిద్ధాంతమది. మన పుస్తక సమీక్షకులు చాలా ఎక్కువగా వాడే మాట, ఆచరించే పద్ధతి అది. విమర్శకులు మాత్రం అలాక్కాదు.., చాలా కూలంకషంగా ప్రతి మెతుకునూ పట్టిపట్టి మరీ పరిశీలిస్తారు.

కలం కలలు అనే బ్లాగును చూపించి, దాన్ని సమీక్షించండి అని సాలభంజికలు నాగరాజు గారిని కోరాం. ఆయన ఆ బ్లాగును శీర్షం నుండి పాదం దాకా గాలించి, బ్లాగరి శైలిని, రచనా దృక్పథాన్ని, తాత్వికతను ఒడిసి పట్టారు. ఈ ఎస్సెన్సునంతా ఆ బ్లాగరి ఫోటోతో జోడించి ఒక సమీక్ష (విమర్శ) వ్యాసం రాసిపెట్టారు. ఫణీంద్ర గొడవ గురించి తెలిసికొనేందుకు కలంకలలు చూడాలి. ఫణీంద్ర గురించి తెలిసికొనేందుకు నాగరాజు గారి ఘలం ఘలలు చూడండి. Continue reading

Posted in జాలవీక్షణం | Tagged , | 13 Comments

పరివ్యాప్త (కవితా సంకలనం)

–జాన్ హైడ్ కనుమూరి పరివ్యాప్త, స్త్రీ సమస్యలను ఒకచోట కూర్చిన కవిత్వ ప్రయత్న సంకలనం. ఇందులో అనేక స్త్రీ సమస్యలు వున్నాయి. భ్రూణ హత్యలు, వరకట్న సమస్యలు, వంధ్యత్వ సమస్యలు, మానసిక క్షోభ – వీటన్నిటిపై స్పందించిన 100 మంది కవులు, కవయిత్రులు వున్నారు. వీరిలో లబ్ద ప్రతిష్టుల నుండి విద్యార్థుల వరకూ వున్నారు. కొత్త, … Continue reading

Posted in వ్యాసం | Tagged , | 5 Comments

ఫోటో చెప్పే కథలు – అలా-ఇ-మీనార్

అలా-ఇ-మీనార్ ఈ ఫోటోలో ఉన్న కట్టడం పేరు అలా-ఇ-మీనార్. భారతదేశాన్ని ఏలిన ముస్లిం పాలకుల్లో అక్బర్, షేర్షాల తర్వాత అంతగొప్పవాడిగా అలాఉద్దీన్ ఖిల్జీని చరిత్రకారులు పేర్కొంటారు. అతడి సైనిక విజయాలే కాకుండా అతడు చేపట్టిన పరిపాలనా, సైనిక, ఆర్థిక సంస్కరణలు అతడికి ఆ స్థాయిని తెచ్చిపెట్టాయి. ఐతే అతడికి తాను సాధించిన విజయాలతో తలచుకున్నదేదైనా చేసెయ్యగలననే … Continue reading

Posted in కథ | Tagged | 4 Comments

మౌఖిక సాహిత్యం, లిపుల ఆవిర్భావం

కొడవటిగంటి రోహిణీప్రసాదుగారు కాలంలో వెనక్కివెళ్ళి లిపి ఎలా పుట్టింది అనే సంగతిని వివరిస్తున్నారు. ఆశ్చర్యపరచే విషయమేంటంటే.. ఆ ప్రాచీన లిపులను నేరుగా రాసెయ్యొచ్చట, మన ఇన్‌స్క్రిప్టు లాగా! ముందు ఇంగ్లీషులో (రోమను లిపిలో) రాసి ఆపైన లిప్యంతరీకరణ చెయ్యనక్కరలేదు. మీరూ అవాక్కయ్యారా? కామూ మరి! ప్చ్, అవున్లెండి, పురాతన లిపులు కదా.. అంతగా అభివృద్ధి చెందినట్టు లేవు. Continue reading

Posted in వ్యాసం | Tagged | 1 Comment

మృతజీవులు – 16

ప్రఖ్యాత రష్యన్‌ రచయత గొగోల్‌ (Nikolai Gogol)రాసిన డెడ్‌ సోల్స్‌ (Dead Souls) అనే నవలను కొడవటిగంటి కుటుంబరావుగారు “మృతజీవులు” అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. కుటుంబరావుగారి కథలూ, నవలలూ, నాటికలూ, వ్యాసాలూ సంకలనాలుగా వచ్చాయి కాని అనువాద రచనలేవీ అంతగా పాఠకుల కంటబడలేదు. ఈ కోవకు చెందిన ఆయన సాహిత్యంలో సోవియట్‌ ప్రచురణలూ, సదరన్‌ లాంగ్వేజెస్‌ బుక్‌ ట్రస్ట్‌ వారి ఇతర దక్షిణ భారతీయ భాషల్లోని సైన్స్‌ పుస్తకాల అనువాదాలూ, 1948 ప్రాంతాల్లో చక్రపాణిగారు “ఆంధ్రజ్యోతి” నడిపిన రోజుల్లో అందులో పేరు లేకుండా ప్రచురితమైన ఆర్థర్‌ కోనన్‌ డాయల్‌ షెర్లాక్‌ హోమ్స్‌ నవలల అనువాదాలూ, యువ మాసపత్రిక కోసం చేసిన బెంగాలీ నవలల అనువాదాలూ మొదలైనవెన్నో ఉన్నాయి. ఆ లోటును పూర్తి చేసే ఉద్దేశంతో “మృతజీవులు” నవలను సీరియల్‌గా మీ ముందుకు తెస్తున్నాము. Continue reading

Posted in కథ | Tagged , | Comments Off on మృతజీవులు – 16

ఇంటర్నెట్లో తెలుగు కవిత్వం

జుట్టు ఊడుతోంది.. జుట్టు ఊడుతోంది
నా జుట్టు ఊడుతోంది, నీ జుట్టూ ఊడుతోంది
మన జుట్లు ఊడిపోతున్నాయ్!
ఐనా.. జుట్టు ఊడందెవరికి!!

ఇది ఇంటర్నెట్లో వచ్చిన తెలుగు కవిత. దీనిపై వచ్చిన వ్యాఖ్యలు కూడా ఇంతే భావస్ఫోరకంగా ఉన్నాయి.

వ్యాఖ్య 1. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.. ఇటీవలి కాలంలో ఇంత మంచి కవితను చదవలేదు.
వ్యాఖ్య 2. ఇంతకీ కవితేదీ? కవిత ప్రచురించబోయి ఈ బట్టతలవాడి గొడవేదో రాసేసారు.
వ్యాఖ్య 3. రేయ్, నోరు మూసుకోరా కుళ్ళు వెధవా! కవితా హృదయం లేని వాడికిది బట్టతల గొడవగానే ఉంటుందిరా!
వ్యాఖ్య 4. ర్రేయ్ …

-ఇంటర్నెట్టులో కొన్ని కవితలు, వాటిపై కొన్ని విమర్శలూ ఇలా ఉంటాయి!
ఇది కాదు కవిత, ఇలాక్కాదు విమర్శ ఉండవలసింది. కవిత ఎలా ఉండాలో చదవండి. విమర్శ ఎలా ఉండాలో భైరవభట్ల కామేశ్వరరావు చెబుతున్నారు, చూడండి. Continue reading

Posted in వ్యాసం | 8 Comments

OpenID: సర్వాంతర్యామి

“మీ ముక్కూ మొహమెరుగని ఏ సైటుకైనా వెళ్ళి, అక్కడ ఖాతాలాంటిదేమీ లేకుండానే దర్జాగా లాగినై, కుర్చీ వేసుక్కూచ్చుని కబుర్లు చెప్పొచ్చ”ట – కాకపోతే ఆ సైటు ఓపెన్ఐడీని అనుమతిస్తే చాలట!

ఓపెనైడీ అనేది ఒహ లైసెన్సు బిళ్ళన్నమాట! దాన్నుచ్చుకుని ఏ సైటుకైనా వెళ్ళొచ్చు, లాగినవొచ్చు. అక్కడ రిజిస్టరు కానక్కరలేదు. ఎలాగో చూడండి.

మీరూ ఓ ఓపెనైడీ తెచ్చుకోండి, ఓ మోపెడ్…. Continue reading

Posted in జాలవీక్షణం | Tagged , , | 9 Comments

భూమాత పరి’తాపం’

గ్రీన్‌హౌస్ వాయువులు లేందే మనం భూమ్మీద బతకలేమట. సూర్యుడి నుండి వేడి వచ్చినట్టే వచ్చి తిరిగి వెనక్కి రోదశిలోకి పోతుంది. ఈ గ్రీన్‌హౌసు వాయువులు ఆ శక్తిని పట్టుకుని ఆపి, తిరిగి భూమికి పంపి, వేడిని నిలబెడతాయి. బానే ఉంది.., అయితే ఇప్పుడేఁవిటీ?

అతి సర్వత్ర వర్జయేత్.

ఆ వాయువులు ఎక్కువైపోతున్నాయట. ఎక్కువైపోయి ఉండాల్సిన దానికంటే భూమి వేడెక్కిపోతోందట. లోకఁవంతా గోలెడుతోంది. పొద్దూ గొంతు కలిపింది. పొద్దు సంపాదకుడు త్రివిక్రమ్ రాసిన సంపాదకీయంలో భూమాత తాపం పెరిగిపోతున్న వైనం చెప్పి, దానికి విరుగుడుగా మనమేం చెయ్యాలో కూడా చెప్పారు. చూడండి. Continue reading

Posted in సంపాదకీయం | 4 Comments

తెల్ల కాగితం

డి. ఇ. ఓ గారు బడికి ఇన్‌స్పెక్షన్ కి వస్తున్నారని తెలిసినా ఒక తెల్లకాగితం తెచ్చుకోలేని విద్యార్థికి ఒకేసారి రెండు వందల పేజీల తెల్ల కాగితాల ఆరు లాంగ్ నోట్ బుక్స్ సొంతమైన వైనం చదవండి. Continue reading

Posted in కథ | Tagged | 29 Comments

మార్చి గడిపై మీమాట

మార్చి గడి పై మీ అభిప్రాయాలు ఇక్కడ రాయండి. పాత గడులు 1. 2008 ఫిబ్రవరి గడి, సమాధానాలు 2. 2007 డిసెంబరు గడి, సమాధానాలు 3. 2007 నవంబరు గడి, సమాధానాలు 4. 2007 అక్టోబరు గడి, సమాధానాలు 5. 2007 ఆగష్టు గడి, సమాధానాలు 6. 2007 జూలై గడి, సమాధానాలు 7. … Continue reading

Posted in గడి | Tagged | 1 Comment