Monthly Archives: January 2008

మరో ప్రపంచం కోసం

-గార్ల సురేంద్ర నవీన్ . పరిగెడుతున్నాను….. కష్టాల కొండలు ఎక్కుతూ నిరాశా నదులు దాటుతూ చిమ్మ చీకటికి దూరంగా వెలుతురు కోసం ఆశగా పరిగెడుతున్నాను…… ఆవేదనతో కొట్టుకుంటున్న గుండెతోనూ అలసిపోయి రొప్పుతున్న రొమ్ములతోనూ చెంపల దాహాన్ని తీరుస్తున్న కన్నీళ్ళతోనూ ఎగిసిపడుతున్న బాధను అదిమి పెట్టి దహిస్తున్న ఆలోచనల్ని తొక్కిపట్టి ఇంకా కనిపించని గమ్యం కోసం పరిగెడుతున్నాను…… … Continue reading

Posted in కవిత్వం | 31 Comments

అంజి, నేను at అమ్‌స్టర్‌డామ్

-ప్రసాదం (http://prasadm.wordpress.com/) గతంలో నేను ఉద్యోగం వెలగబెట్టిన ఒకానొక సంస్థలో నిప్పు అప్పలసామి లాంటి మా ప్రాజెక్టు మేనేజర్ నుండి తప్పించుకునే ప్రయత్నంలో నేను కూడా ప్రాజెక్ట్ మేనేజర్ అవడంతో నా పరిస్థితి తంతే గారెల బుట్టలో పడ్డట్టుగా కనిపించినా, నేను పడింది పాముల పుట్టలో అని నాకు తొందరగానే అర్థమైంది. క్లయంట్ దగ్గర నుండి … Continue reading

Posted in వ్యాసం | 24 Comments

మృతజీవులు – 14

ప్రఖ్యాత రష్యన్‌ రచయత గొగోల్‌ (Nikolai Gogol)రాసిన డెడ్‌ సోల్స్‌ (Dead Souls) అనే నవలను కొడవటిగంటి కుటుంబరావుగారు “మృతజీవులు” అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. కుటుంబరావుగారి కథలూ, నవలలూ, నాటికలూ, వ్యాసాలూ సంకలనాలుగా వచ్చాయి కాని అనువాద రచనలేవీ మళ్ళీ పాఠకుల కంటబడలేదు. ఈ కోవకు చెందిన ఆయన సాహిత్యంలో సోవియట్‌ ప్రచురణలూ, సదరన్‌ లాంగ్వేజెస్‌ బుక్‌ ట్రస్ట్‌ వారి ఇతర దక్షిణ భారతీయ భాషల్లోని సైన్స్‌ పుస్తకాల అనువాదాలూ, 1948 ప్రాంతాల్లో చక్రపాణిగారు “ఆంధ్రజ్యోతి” నడిపిన రోజుల్లో అందులో పేరు లేకుండా ప్రచురితమైన ఆర్థర్‌ కోనన్‌ డాయల్‌ షెర్లాక్‌ హోమ్స్‌ నవలల అనువాదాలూ, యువ మాసపత్రిక కోసం చేసిన బెంగాలీ నవలల అనువాదాలూ మొదలైనవెన్నో ఉన్నాయి. ఆ లోటును పూర్తి చేసే ఉద్దేశంతో “మృతజీవులు” నవలను సీరియల్‌గా మీ ముందుకు తెస్తున్నాము. Continue reading

Posted in కథ | Tagged , | 1 Comment

ఊహాతీతం

-కొత్త ఝాన్సీలక్ష్మి . ఓ ఊహ నిజమైతే.. మౌనరాగాలు మధురగానాలు ఆహ్లాదభరితాలు ఆమని సంకేతాలు విరిసిన పారిజాతాలు అమృతాభిషేకాల ఆనందవర్ధనాలు ఓ నిజం తారుమారైతే.. ఈ మౌనరూపాలు మనసంతా గాయాలు శోకసంతప్తాలు సంవేదనాభరితాలు చిట్లిన నరాలు పెట్లిన గాజుపలకలు గుండె గుబుళ్లు బ్రతుకు నెగళ్లు ఎగసిన గాలికి సాగే రాలిన ఆకుల వలయాలు అవినీతి అక్షయ … Continue reading

Posted in కవిత్వం | 8 Comments

అహమ్!

-ఆదినారాయణరెడ్డి మనపెద్దలు మనకు పూజలు, సేవలు, జపాలు, వ్రతాలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు, తపస్సులు, యోగాలు, ధ్యానాలు మొదలైన వెన్నో భగవత్ ప్రీత్యర్థం ఉపదేశించారు. కానీ భగవంతుడు ఏమిటి? ఆయనను ప్రసన్నం చేసుకునే మనం–అంటే వాటిని నిర్వహించే “నేను” అనుకొనే ఎవరికి వారైన మనమంతా ఏమిటి? అంటే మన సిసలైన ప్రామాణిక స్వరూపం ఏమిటి? ఈ”నేను”ను … Continue reading

Posted in వ్యాసం | Tagged | 18 Comments

అక్షరాస్యత

-డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ అక్షరం అంటే నశించనిది అని అర్థం. ఒకసారి ఏదైనా రాసి ఉంచితే అది శాశ్వతంగా నిలిచిపోతుందని ప్రాచీనులు భావించారు. రాతి మీద చెక్కినవైతే నిజంగా శిలాక్షరాలే. ఈ రోజుల్లో రాయడం, చదవడం అవసరమా, కాదా అనే ప్రశ్నే తలెత్తదు. ప్రస్తుతం మన జీవితాలు గడిచే పద్ధతిని బట్టి అక్షరాస్యత ఎంతో సహజమైనదిగా … Continue reading

Posted in వ్యాసం | 3 Comments

తెలుగు వికీపీడియా ప్రగతి – 2007

-రవి వైజాసత్య కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ముందుగా తెలుగు వికీపీడియన్లకు, తెలుగు బ్లాగర్లకు, శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలతో క్రితం నెల 9వ తేదీన నాలుగవ పుట్టిన రోజు పండగ జరుపుకున్న తెలుగు వికీ గత సంవత్సర కాలంలో సాధించిన ప్రగతి గురించి ఒకసారి నెమరు వేసుకొని కొత్త సంవత్సర లక్ష్యాల గురించి తెలుసుకుందాం. … Continue reading

Posted in జాలవీక్షణం | Tagged | 5 Comments

మంది మన్నియమ్ – 5

-తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం(http://www.tadepally.com/) “మందిమన్నియం” అంటే ప్రజారాజ్యం. ఈ విషయమై తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారు పుస్తకం రాస్తున్నారు. ఇందులో 700 సూత్రాలున్నాయి. ఈ పుస్తకం ఆరో అధ్యాయంలో ప్రజాస్వామ్యపు స్వభావం గురించి విహంగవీక్షణం చేసారు. ఇందులో చర్చించిన విషయాలను తాడేపల్లి వారు పొద్దు పాఠకులతో పంచుకుంటున్నారు. ఈ వ్యాసపు ఐదు భాగాల్లో ఇది చివరిది: ——— … Continue reading

Posted in వ్యాసం | Tagged | Comments Off on మంది మన్నియమ్ – 5

లెట్ ఇట్ గో

అనిపించే తీరికలేని ఆధునిక జీవనంలో జన్మ దుఃఖం జరా దుఃఖం అని ఆలోచించే ఒక స్త్రీ సందిగ్ధావస్థ. Continue reading

Posted in కథ | Tagged , | 20 Comments

‘సినిమా’లో విధ్వంసమవుతున్న సీమ సంస్కృతి:

(రచనాకాలం: 2003 వ్యాసకర్త: పాలగిరి విశ్వప్రసాద్) ఈ సమస్యపై కనీసం ‘సహానుభూతి’ కూడా లేని వాళ్లందరూ సీమ గ్రామపార్టీల కథలను రాసుకుని ఈ ప్రాంత సంస్కృతిని వక్రీకరించి సినిమాలు తీసి ఆంధ్రదేశమంతటా వెదజల్లడం సీమవాసులు చేసుకున్న దురదృష్టం… చిత్రసీమ ప్రముఖులు సీమకు చేస్తున్న తీరని ద్రోహం… నేరం…! తెలుగు చిత్రసీమ కీర్తిబావుటాను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి … Continue reading

Posted in వ్యాసం | 13 Comments