స్వేచ్ఛా విహంగాలు (Stray birds)

— విశ్వకవి రవీంద్రుని ‘Stray birds’కు స్వేచ్ఛానువాదం: రవి

భగవంతుడి శక్తి మలయమారుతానిది.
ఝంఝామారుతానిది కాదు.

విశ్వం బాధతో నా ఆత్మను చుంబించి,
సాంత్వన కోసం నా గానాన్ని కోరింది.

ఓ స్త్రీ! నీ నవ్వులో జీవితమనే జలధారలోని సంగీతం ఉంది.

జీవితపు ఆనందం గ్రీష్మంలో పూచే పూలలోనూ,
శిశిరం లో రాలే ఆకులలోనూ ప్రక్షిప్తం.

నీకు ఆకలి లేదని, భోజనాన్ని నిందించకు.

నువ్వు చిరునవ్వు నవ్వి శూన్యం గురించి మాట్లాడేవు.
అందుకోసమేనేమో నా నిరీక్షణ అని నాకనిపించింది.

తర్కపూరిత చిత్తం కత్తితో సమానం.
ఉపయోగించే చేతికది చేస్తుంది గాయం.

మనం ప్రపంచాన్ని వక్ర దృష్టి తో చూసి,
ప్రపంచం మనను మోసపుచ్చిందనుకుంటాం.

కడలి తరంగాలు, పక్షుల కలయికలా మనం దగ్గరౌతాం.
పక్షులు నింగికెగసి పోతాయి.
కడలి తరంగాలు వెనక్కు మళ్ళుతాయి.
మనమూ అలానే దూరమవుతాం.

——————
కడప జిల్లా ప్రొద్దుటూరులో జన్మించిన రవి, ప్రస్తుతం ఉద్యోగరీత్యా బెంగళూరులో నివాసముంటున్నారు. 2007 సెప్టెంబరు నుండి బ్లాగాడిస్తూ ఉన్నారు.
గతంలో ఇతర వెబ్‌సైట్లలో సమీక్షలు పేరడీలూ రాసేవారు.

తెలుగు మీద మమకారంతో పాటు, వీరికి సంస్కృత భాషతో పరిచయమూ ఉంది.

This entry was posted in కవిత్వం and tagged , . Bookmark the permalink.

11 Responses to స్వేచ్ఛా విహంగాలు (Stray birds)

  1. bollojubaba says:

    excellent
    bollojubaba

  2. Sowmya says:

    Nice translation!

  3. Sowmya says:

    కానీ, మరో సారి అదే కంప్లైంట్… stray birds అన్నది ఒక సంకలనం లాగా కదా… మీరు అందులో ఏవేవి అనువాదం చేస్తున్నారో నంబర్ రాస్తే బాగుంటుంది… మేము అసలువి కూడా చదువుకోవచ్చు.
    ఉదా: http://www.readbookonline.net/readOnLine/1007/
    -ఇక్కడ Stray birds ఉంది. అందులో మీ చివరి అనువాదం 54వ పద్యం.

  4. రవి says:

    సౌమ్య గారూ,

    నెనర్లు. ఇదివరకు అనువాదం, ఈ అనువాదం నేను పొద్దు సంపాదకులకు కలిపి పంపాను. వారు గతనెల నెలవంక, ఈ నెల స్వేచ్చా విహంగాలు ప్రచురించారు. ఆ కారణం చేతనే వీటికీ సూచిక లేదు.

  5. Sowmya says:

    @Ravi:
    Crescent Moon and Stray birds are different collections. 🙂
    My suggestion was to write the names of original poems in ur translations. Since in “Stray birds” there are no names and only numbers, I suggested keeping the numbers as they are.

  6. జాన్ హైడ్ కనుమూరి says:

    మనం ప్రపంచాన్ని వక్ర దృష్టి తో చూసి,
    ప్రపంచం మనను మోసపుచ్చిందనుకుంటాం.
    నచ్చాయి

    అభినందనలు రవిగారూ
    అలాగే పొద్దు సంపాదకవర్గానికి

  7. maha says:

    excellent
    ravindaragari githangali kuda telugulo prachurinchagalaru.

  8. bollojubaba says:

    రవి గారికి
    మీ అనువాదాన్ని నేను ముందేచూసాను.
    ఒక గొప్ప వాక్యాన్ని ఒక భాషలోంచి మరొక భాషలోకి అనువదించేపుడు, అనువాదకుని ముద్ర తప్పనిసరిగా దానిపై పడుతుందనటానికి స్ట్రే బర్డ్స్ కి మీరు నేను చేసిన అనువాదాలు ఈ బ్లాగులోకంలో ఒక ఉదాహరణగా ఉండాలని ఇలా పోస్ట్ చేస్తున్నాను. అన్యధా భావించరనే ఆశిస్తున్నాను.

    అసలు వాటిని అలా అనువదించాలి అన్న నిప్పు రగిల్చటం ఆయా రచనల గొప్పదనం.

    అలా చేసిన అనువాదాలలో ఏది ఎక్కువ ఏది తక్కువ అన్న చర్చ కూడా అనవసరం. మీ దైనా నాదైనా ఆయా వాక్యాల ఒకటి రెండు పార్శ్వాలను మాత్రమే ఆవిష్కరిస్తున్నాయన్న విషయం మీకూ తెలుసూ నాకూ తెలుసు.(పాఠకులకు ఇంకా బాగా తెలుసు) కనుక ఆ చర్చ అనవసరం అని నా అభిప్రాయం.

    నా ఉద్దేశ్యం ఇది ఒక ఉదాహరణగా ఉండగలదనే…..

    సౌమ్యగారు కోరినట్లు నంబర్లు, ఇంగ్లీషు వెర్షను కూడా ఇస్తున్నాను.
    151
    God’s great power is in the gentle breeze, not in the storm.
    మహాబలుని శక్తి
    పిల్లతెమ్మెరలో ఉంది.
    తుఫానులో కాదు.

    167
    The world has kissed my soul with its pain, asking for its return in songs.
    ప్రపంచం తన వేదనతో
    నా హృదయాన్ని ముద్దాడి
    బదులుగా గీతాల్ని కోరింది. 

    192
    Woman, in your laughter you have the music of the fountain of life.
    మగువా! నీ నవ్వులో
    జీవిత జలసూత్రపు సంగీతముంది

    Let life be beautiful like summer flowers and death like autumn leaves.
    ఈ జీవితాన్ని అందమైన వేసవి కుసుమాల్లా
    మృత్యువుని శిశిర పత్రాల్లాను కరుణించు ప్రభూ!

    40
    Do not blame your food because you have no appetite.
    నీకు ఆకలి లేని కారణానికి
    ఆహారాన్ని నిందించకు.

    42
    You smiled and talked to me of nothing and I felt that for this I had been waiting long.
    నీవు నవ్వి, నాతో ఎమీ మాట్లాడ లేదు.
    నేను దీనికోసమే చాలా కాలంగా
    ఎదురు చూస్తున్నాననిపించింది.

    193
    A mind all logic is like a knife all blade.
    It makes the hand bleed that uses it.
    తర్కంతో కూడిన మనసంటే
    అన్ని వైపులా పదునున్న కత్తివంటిది.
    దాన్నుపయోగించే చేయి
    నిత్యం రక్తమోడుతూంటుంది.

    75
    We read the world wrong and say that it deceives us.
    మనం ప్రపంచాన్ని తప్పుగా చదువుకొని
    అది మనలను వంచిస్తుందని అంటాం.

    54
    Like the meeting of the seagulls and the waves we meet and come near.  The seagulls fly off, the waves roll away and we depart.
    సముద్రపు కొంగలు, కడలి తరంగాల వలె
    మనం కలుసుకొని దగ్గరవుతాం.
    కొంగలెగిరి పోతాయి.
    కెరటాలు వెనక్కు మరలుతాయి.
    మనమూ విడిపోతాం.

    భవదీయుడు
    బొల్లోజు బాబా

  9. NARAYANASWAMY.S says:

    If you think you can or think can’t you are right.

  10. ramnarsimha says:

    LAST 4 LINES

    ARE VERY INTERESTING..

    THANQ..

    PUTLURIR@YAHOO.COM

  11. Ramnarsimha says:

    కడలి తరంగాలు, పక్షుల కలయికలా మనం దగ్గరౌతాం.
    పక్షులు నింగికెగసిపోతాయి.
    కడలి తరంగాలు వెనక్కి మళ్ళుతాయి.
    మనమూ అలానే దూరమౌతాం!

    అనే పంక్తులు చాలా బాగున్నాయి.
    ధన్యవాదాలు..

Comments are closed.