బ్లాగరుల నుండి బ్లాగరులకో లేఖ!

– కొల్లూరి సోమశంకర్

తెలుగు నేస్తమా,

బావున్నారా? చాలా రోజులయ్యింది మనం మాట్లాడుకుని కదూ! అందుకే ఈ తెలుగు లేఖ.

తియ్యని తెనుగులో కొత్తపాళీతో రాస్తున్నా! తెలుగులో కబుర్లు చెప్పాలని ఉంది.

వెన్నెలలో విశాఖ తీరాన విహరించి, తెలుగులో విశేషాలు చెప్పాలని ఉంది. వికటకవి రాసిన తేటగీతి మీరు చదివారా?

గోదావరితీరంలో వాగ్దేవి ఒడిలో ఓనమాలు దిద్దుకుని, అక్షరవనంలో కదలాడి ఆర్మూరు చేరి జాను తెనుగు సొగసులు ప్రదర్శిస్తున్న అభినయని అంతరంగం తెలిసిందా?

మనలోని మాట-మనసులోని మాట అంటూ గుండెచప్పుడు వినిపించే కళా స్పూర్తీ, పంచవటిలో పూలవాన కురిసిందట! జాబిల్లి సాక్షి గా పిచ్చుకలు గడ్డిపూలు ఏరుకుంటున్నాయట!

గోదావరి అంతర్వాహిని అయ్యేచోట కూర్చుని తెలుగు సాహిత్యం గురించి నా మాట చెప్పనా? . తెలుగుమాట-తేనె ఊట కదూ!
నేను ఏమనుకుంటున్నానంటే , మానసవీణ ని శృతి చేస్తూ, పడమటి గోదావరి రాగం పాడుతూ పాటల పల్లకి లో ఊరేగుదాం.
అప్పుడు ఏం జరిగిందంటే అంటూ సేకరించిన ఆలోచనలు-అందుకున్న అనుభూతులు పంచుకుందాం.

కొత్తబంగారు లోకం లో బొమ్మలాట ఆడుకుందామా లేక కంప్యూటర్ మాయాజాలం తిలకిద్దామా? పూతరేక్స్, రేగొడియాలు, మరమరాలు తింటూ సాలభంజికలు పాడే సరిగమలు విందాం. దీప్తిధారలా ప్రవహించే కల్హార కవితలు చదువుకుందాం. రెండు రెళ్ళు ఆరు అనుకునే విహారి కలం కలలు నీకు పరిచయమేనా?

ఇంకా ఏమిటి సంగతులు? నా మదిలో బోలెడు ఊసులు సుమా!

నా ప్రపంచంలో హరివిల్లు విరిసింది. నేను విన్నవి-కన్నవి చెబుతాను. ఏది నిజం అని అడగకు. తెలుగునేలలో ఖ్యాతి గాంచి
ఆంధ్రా నుంచి అమెరికావరకు పాకిన వీవెనుడి టెక్కునిక్కులు తెలుసా?

కాలాస్త్రిలో ఆణిముత్యాలు దొరుకుతున్నాయట! నేను సైతం తెలుగువాడిని అంటూ శ్రీకృష్ణదేవరాయలు చేసే, శోధన సత్య శోధన తెలుసుకుందాం. భువన విజయం సభలో నవ్వు నవ్వించు

చదువరి గారి సోది గురించి భాగ్యనగరంలో చర్చావేదికపై చర్చిద్దాం. రాతలు-కోతలు ఎప్పుడూ ఉండేవే కదా!

నా మనసు నీకు తెలుసు. నా స్వగతం మరల తెలుపనా?

పొద్దు పొడవగానే తెలుగుదనం ఉట్టిపడే మనిషి , నారాయణీయం పఠిస్తూ దీపారాధన చేసి నివేదన చేస్తే దేవుడు వరమీయడూ?

స్నేహమా, అవీ- ఇవీ అంటూ కథలు-కబుర్లు చెప్పుకుంటూ కడలితరగ కి పోదామా? తెరచాటు చందమామ సిరివెన్నెల కురిపించే సమయంలో నువ్వు అమృతవీణ మీటితే, నేను కాసేపు తెలుగు పద్యం చదువుకుంటాను.

సంగతులూ-సందర్భాలు ఇంకోసారా? నువ్వు మా ఇంటికి వచ్చి కలగూరగంప లోంచి ఏరిన కూరలతో నీకోసం వండే షడ్రుచులు తినాలి మరి!

ఏంటీ ఈ జగన్నాటకం అంటున్నావా?

అయితే ఓకె, తొందర్లోనే నేను, కూడలి లో బ్లాగాడిస్తా!

ఇట్లు
ఎల్లవేళలా నీ

పదహారణాల తెలుగబ్బాయి

—————

కొల్లూరి సోమశంకర్

అనువాద రచయితగా కొల్లూరి సోమశంకర్ సుపరిచితులే! 52 అనువాద రచనలు, 30 దాకా స్వంత రచనలూ (10 పిల్లల కథలతో సహా) చేసిన అనుభవం ఆయనది. 2004 లో మిత్రులతో కలసి 4 x 5 అనే కథా సంకలనం వెలువరించారు. 2006 లో, మనీ ప్లాంట్ అనే అనువాద కథా సంకలనం వెలువరించారు.

ఇతర భాషల కథలను తెలుగులోకి తేవడంతో పాటు, ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని మంచి తెలుగు కథలని హిందీలోకి అనువదిస్తున్నారు.

సోమశంకర్ రచనల పూర్తి జాబితా కోసం ఆయన బ్లాగు చూడవచ్చు

About కొల్లూరి సోమశంకర్

కొల్లూరి సోమ శంకర్ కృష్ణా జిల్లా గుడివాడలో జన్మించారు. హైదరాబాదు, గుంటూరు, నిమ్మకూరు, నాగార్జున సాగర్‌లలో చదువుకున్నారు. బి.ఎ. పూర్తయ్యాక, హ్యుమన్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్‌లో పిజి డిప్లొమా చేసారు. 2001 నుంచి కథలు రాస్తున్నారు. సొంతంగా రాయడమే కాకుండా, మంచి కథలు ఎక్కడ చదివినా, వాటిని తెలుగులోకి అనువదిస్తుంటారు. ఇతర భాషల కథలను తెలుగులోకి తేవడంతో పాటు, ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిన కొన్ని మంచి కథలు హిందీలోకి అనువదించారు. కొన్ని దిన పత్రికలలో శీర్షికలు నిర్వహించారు, వ్యాసాలు రాసారు. ఈయన కథలు అనువాదాలు అన్ని ప్రముఖ పత్రికలలోను, వెబ్‌జైన్లలోను ప్రచురితమయ్యాయి.

2006లో ”మనీప్లాంట్” అనే అనువాద కథా సంకలనాన్ని, 2004లో ”4X5” అనే కథా సంకలనాన్ని వెలువరించారు.

వివిధ ప్రచురణ సంస్థల కోసం ఇంగ్లీషు, హిందీ పుస్తకాలను తెలుగులోకి అనువదిస్తున్నారు. Carlo Collodi రాసిన, ’ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలని, అమార్త్య సేన్ రచన ”ది ఇడియా ఆఫ్ జస్టిస్”ని, ఎన్.సి.పండా రాసిన ”యోగనిద్ర”ని, Tejguru Sirshree Parkhi రాసిన ” ది మాజిక్ ఆఫ్ అవేకెనింగ్”ని తెలుగులోకి అనువదించారు.

సోమ శంకర్ కథలు, అనువాదాల కోసం www.kollurisomasankar.wordpress.com అనే బ్లాగు చూడచ్చు.
వెబ్‌సైట్: http://www.teluguanuvaadam.com

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

25 Responses to బ్లాగరుల నుండి బ్లాగరులకో లేఖ!

  1. teresa says:

    what a neat & creative idea!!
    I like it!

  2. radhika says:

    చదవడానికి చాలా సింపుల్ గా ఉన్నా రాయడానికి ఎంత కష్టపడి ఉంటారో అర్ధమవుతూనే వుంది.సోమశంకర్ గారికి అభినందనలు.

  3. cbrao says:

    బాగుంది.

  4. రాఘవులు says:

    తెరెసా గారన్నట్లు మంచి ఆలోచన.రాధిక గారితో పాటు మీరు పడ్డ శ్రమను నేనూ గుర్తించా శంకర్ గారు అభినందనలు.

  5. వావ్… చాలా బాగా రాసారు.

  6. Naveen Garla says:

    ఇది చదువుతూంటే జంధ్యాల గారు గుర్తొచ్చారు.

  7. @తెరెసా గారు, @రాధిక గారు,@సి.బి.రావు గారు, @రాఘవులు గారు, @ నవీన్ గారు,
    ఈ ప్రయోగం మీకు నచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. నెనరులు

  8. @నాగరాజా గారు,
    నెనరులు

  9. చక్కని ప్రయోగం. దీని వెనుక ఎంతో కృషి ఉన్నదని అర్థమవుతోంది. తెలుగు బ్లాగులను పాఠకులకు మరింత దగ్గర చేస్తాయి ఇటువంటి రచనలు.

  10. చక్కని ప్రయోగం. దీని వెనుక ఎంతో కృషి ఉన్నదని అర్థమవుతోంది. తెలుగు బ్లాగులను పాఠకులకు మరింత దగ్గర చేస్తాయి ఇటువంటి రచనలు.

  11. వాసు.బొజ్జ says:

    చాల తమాషాగా వుంది.
    నెనర్లు.
    మంచి బ్లాగులని పలకరిస్తూ ఒక లేఖ లాగ వ్రాయటం అదీ ఎంతొ అందంగా…
    వావ్ !!!

  12. బ్లాగాడేసేరుగా! ఇంతకు ముందు తెలుగు సినిమా పేర్లన్నిటినీ కలిపి ఒక పాట లాగ పాడిన పాటల్ని విన్నాం. ఇప్పుడు బ్లాగుపేర్లతో ప్రయోగం బాగుంది.

  13. @కొత్తపాళీ గారు,@ దిలీప్ గారు,@ వాసు.బొజ్జ గారు,@ చక్స్ గారు
    నెనరులు.
    నేను ఇంతకు ముందు 108 తెలుగు సినిమా పేర్లన్నిటినీ కలిపి ఒక ఉత్తరంగా రాసాను. అది అప్పట్లో ఆంధ్ర జ్యోతి వీక్లీలో ప్రచురితమైంది.ఆ అనుభవం ఇప్పుడు ఇక్కడ ఉపయోగపడింది.

  14. వావ్!! చాలా బావుంది సోమశేఖర్ గారూ!! ఇలాంటివి రాయడం చాలా కష్టం.. అసలు ఎక్కడా పదాలు అతికించినట్లు లేకుండా ఫ్లో చాలా బాగా కుదిరింది!

  15. కొల్లూరి సోమ శంకర్ says:

    naa pEru sOma Sankar anDi

  16. I am SO SORRY Soma Sankar garu 🙁

  17. రమ్య says:

    వెరైటీ ప్రయోగం తమాషా గా అనిపించింది.భలే చక్కాగా రాశారు.

  18. శ్రీ says:

    భలే రాసారండీ సోమ శేఖర్ గారు! ఇదేదో బ్లాగావధానం లాగుంది.

  19. శ్రీ says:

    క్షమించాలి సోమ శంకర్ గారు, పేరు తప్పుగా రాసాను.

  20. కొల్లూరి సోమ శంకర్ says:

    @Nishigandha gaaru, @Ramya gaaru, @Sree gaaru,
    thank you all for your appreciation.

  21. vihaari(kbl) says:

    Chala baga rasaru

  22. తెలుగు అభిమాని says:

    సృజన ’అను’ సృజన బాగుంది.

  23. లాస్య says:

    అద్భుతమండీ.తెలుగు బ్లాగులన్నిటినీ ఔపోసన పడదామని తంటాలు పడుతున్న నాకు మీ కవిత ద్వారా చుక్కాని చూపించారు.

  24. @vihaari(kbl) గారు,@ తెలుగు అభిమాని గారు,@ లాస్య గారు
    నెనరులు.

Comments are closed.