నిశ్శబ్దానికి మరోవైపు

-కొల్లూరి సోమశంకర్

భోగాపురం! విజయనగరం జిల్లాలో మేజర్ పంచాయతి. ఆ ఊర్లో దాదాపు ఇరవై వేలమంది జనాభా ఉంటారు. ఐదవ నంబరు జాతీయ రహదారిపైన, విజయనగరానికి సుమారు 19 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ జిల్లా కేంద్ర గ్రంథాలయసంస్థ వారి శాఖా గ్రంథాలయం ఉంది. మన కథానాయకుడు మోహన్ ఇక్కడే లైబ్రేరియన్‌గా పనిచేస్తున్నాడు.

బదులుగా ఒక చోట కట్టలు కట్టి ఉన్న పుస్తకాలను చూపించాడు మోహన్.

“వాటిని బైండింగ్ చేయించాలి. యండమూరి నవలలు వాటిల్లో కొన్ని ఉన్నాయి. నీకు కావాల్సిన పుస్తకాన్ని తీసుకు వెళ్ళి చదివి, తర్వాత బైండింగ్ చేయించి ఇస్తానంటే, పట్టుకెళ్ళు”

“అదేంటి సార్, నేనెందుకు బైండింగ్ చేయించాలి?”

ఉదయం ఎనిమిది గంటలు దాటుతోంది. అయినా లైబ్రరీని ఇంకా తెరవలేదు. మోహన్ విజయనగరం నుంచి రావాలి. దినపత్రికల కోసం వచ్చే ముసలివాళ్ళు అసహనంగా ఉన్నారు. ఇంతలో హడావుడి పడుతూ మోహన్‌ రానే వచ్చాడు. గబగబా తాళాలు తీసి, కిటికీ లోంచి లోపలికి పడేసిన పేపర్లను సర్దుకుని, ప్రతీ పేపరుని దారంతో కట్టి వాటి మీద ముద్ర వేసి బల్లల పైన పెట్టాడు. క్రిందటి రోజు పేపర్లన్నింటిని బల్లలపై నుంచి తీసేసి ఒక్కోదాన్ని స్టాండులో వరుసగా పెట్టాడు. వచ్చిన పాఠకులందరూ కుర్చీలకు అతుక్కుని వార్తాపత్రికలు చదవడంలో నిమగ్నమైపోయారు. మోహన్ కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. సమయం తొమ్మిది కావస్తోంది. ‘టీ’ తేచ్చే కుర్రాడు ఇంకా రాలేదు. ఆ సమయానికి టీ తాగకపోతే ఏదోలా ఉంటుంది మోహన్‌కి.

ఇంతలో ఓ కుర్రాడు వచ్చి, “సార్, యండమూరి నవలలు ఏమైనా ఉన్నాయా?” అని అడిగాడు.

“అక్కడ ‘తెలుగు నవలలు’ అనే అరలో చూడు బాబూ” అంటూ ఓ అరని చూపాడు మోహన్. ఆ అబ్బాయి కాసేపు వెదికి, తిరిగి మోహన్ దగ్గరికే వచ్చాడు.

“సార్, అవన్నీ బాగా పాతవి. ఈ మధ్య వచ్చిన పుస్తకాలు లేవా?”

బదులుగా ఒక చోట కట్టలు కట్టి ఉన్న పుస్తకాలను చూపించాడు మోహన్.

“వాటిని బైండింగ్ చేయించాలి. యండమూరి నవలలు వాటిల్లో కొన్ని ఉన్నాయి. నీకు కావాల్సిన పుస్తకాన్ని తీసుకు వెళ్ళి చదివి, తర్వాత బైండింగ్ చేయించి ఇస్తానంటే, పట్టుకెళ్ళు”

“అదేంటి సార్, నేనెందుకు బైండింగ్ చేయించాలి?”

ఏం చేయను? ఈ సారి బడ్జెట్‌లో బైండింగ్‌కి ప్రొవిజన్ ఇవ్వలేదు. సహృదయులైన పాఠకులనే భరించమంటున్నారు. మీరు మెచ్చిన, మీకు నచ్చిన పుస్తకాన్ని మీరు బైండింగ్ చేయిస్తే, మరికొంతమంది పాఠకులకు ఆ పుస్తకాన్ని చదివే వీలుంటుంది కదా…” వివరంగా చెప్పాడు మోహన్. ఆ అబ్బాయి మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు.

ఇంతలో టీ కుర్రాడు వచ్చి వేడి వేడిగా టీ ఇచ్చాడు. టీ తాగి తన పనిలో లీనమైపోయాడు మోహన్. ఆ రెండు గదుల్లోనూ నిశ్శబ్దం రాజ్యమేలసాగింది. సమయం పదకొండు గంటలు కావచ్చింది. ఆ పూటకి లైబ్రరీ కట్టేసే సమయం అయిందంటూ మోహన్ అలారం మ్రోగించాడు. పాఠకులందరూ చదువుతున్న పేపర్లు, పుస్తకాలు, నవలలు బల్లపైన పెట్టేసి ఒక్కొక్కరు బయటకి నడిచారు.

ఒక పెద్దాయన మాత్రం మోహన్ గదిలోకి వెళ్ళారు. ఆయన మోహన్‌కి దూరపు బంధువు. పేరు సీతారామయ్య. భోగాపురంలోనే హెడ్‌మాస్టారుగా పనిచేసి రిటైరయ్యారు.

“ఏం మోహనా, ఇక్కడ ఒక్కడివి కూర్చుని ఏం చేస్తావు? మా ఇంటికి వచ్చేయ్. కాసేపు చెస్ ఆడుకుందాం. సాయంత్రం నాలుగు గంటలకి లైబ్రరీకి రావచ్చు”

“వీలు కాదు బాబాయ్. చాలా పనులు ఉన్నాయి”

“అదేం, అందరూ వెళ్ళిపోయాక నీకింకేం పనులుంటాయి?”

“అసలు పనులు అప్పుడే మొదలవుతాయి బాబాయ్. స్టాక్ రిజిస్టర్‌ని, యాక్సెషన్ రిజిస్టర్‌ని, కాష్‌బుక్‌ని అప్ డేట్ చేసుకోవాలి. క్లాసిఫికేషన్, కాటలాగింగ్ చేయాలి. చదివేసి వదిలేసిన పేపర్లని, పుస్తకాలను వాటి స్థానంలో ఉంచాలి….. ఇలాంటి పనులెన్నో ఉంటాయి. నాకు రావడం కుదరదు బాబాయ్”

“సరే నీ ఇష్టం” అనేసి ఆయన వెళ్ళిపోయారు.

ఆ లైబ్రరీకి మోహన్ ఒక్కడే ఉద్యోగి కావడంతో, అతడికి చాలా కష్టంగా ఉంటోంది. చిన్నదైనా పెద్దదైనా ప్రతీ పనీ అతడే చేసుకోవాల్సివస్తోంది. ఒక సహాయకుడిని నియమించమంటే, నిధులు లేవంటూ ఏడాది నుంచి తిరస్కరిస్తున్నారు పై అధికారులు. చేసేదేమీ లేక, ఒక నెల క్రితం, ఆ ఊర్లోనే పదో తరగతి దాక చదువుకుని, చదువాపేసిన ఓ కుర్రాడిని సొంత పూచికత్తు పైన, తనకు అసిస్టెంట్‌గా పెట్టుకున్నాడు మోహన్. ఆ కుర్రాడు శ్రద్ధగా పనిచేస్తుండడంతో, దినపత్రికల గది తాళం అతనికే ఇచ్చి, లైబ్రరీని పొద్దున్నే ఆ కుర్రాడినే తెరవమనేవాడు. మోహన్ మాత్రం తొమ్మిదింటికి వచ్చి, నవలల సెక్షన్ తెరుస్తున్నాడు. గత మూడు రోజులగా ఆ కుర్రాడు ఊరు వెళ్ళడంతో, మోహన్‌కి పనిభారం ఎక్కువైంది.

దానికి తోడు నిన్న జిల్లా గ్రంథాలయంలో వేలంపాట జరిగింది. ఏడాదికి ఒకసారి పాత దిన, వార, మాస పత్రికలన్నింటినీ కలిపి వేలం వేస్తారు. ఎవరు ఎక్కువ పాడితే, వారికి జిల్లాలోని అన్ని గ్రంథాలయాల నుంచి పాత పుస్తకాలు, పేపర్లని ఇచ్చేస్తారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఏ శాఖా గ్రంథాలయంలో ఏ పుస్తకం ఉంటుంది, ఏయే దినపత్రికలు ఉంటాయి, వాటి బరువు తదితర వివరాలు ఉంటాయి. ఆ వివరాలన్నీ వేలం పాటలో గెలిచినవారికి అందజేసి, ‘ఫలానా గ్రంథాలయం నుంచి, మీకు ఇన్ని కిలోల పాత పత్రికలు వస్తాయి. మీరు ఇంత మొత్తం ఇవ్వాలి’ అనే ఒప్పందం కుదుర్చుకుంటారు. ఏదైనా శాఖా గ్రంథాలయంలో చెప్పినదానికంటే తక్కువ మొత్తం వసూలైతే, మిగతా మొత్తాన్ని ఆ లైబ్రేరియన్ భరించాల్సిందే. ముందే నిర్ణీతమైన మొత్తాన్ని ట్రెజరీలో జమ చేయాల్సిందే.

చాలా శాఖా గ్రంథాలయాల భవనాలు సరిగా ఉండవు. వర్షాలకు, చెదలకు, పుస్తకాలు పాడైపోతుంటాయి. కొంత మంది చదువరులు తమకు కావాల్సిన ప్రకటనల కోసం కొన్ని పేజీలు ఎత్తుకుపోతారు. మరికొంత మంది కథలను కత్తిరించి తీసుకుపోతారు. మరికొంత మంది సినిమా స్టార్ల బొమ్మలు కత్తిరించేస్తారు. దాంతో లైబ్రేరియన్లు తమ జేబులు ఖాళీ చేసుకోక తప్పదు. మోహన్‌కి కొంచెం ఆందోళనగా ఉంది. ఎందుకంటే గత రెండేళ్ళుగా అతను తన డబ్బును కడుతునే ఉన్నాడు. ‘ఈ ఏడాది ఏమవుతుందో? రేపు పోస్టు వస్తుంది’ అని అనుకుంటూ ఆలోచనలో మునిగిపోయాడు.

“సార్, ‘పట్నంలో చిలక’ నవల వచ్చిందా?” అని అడిగాడు.

“కల్పనా సాహిత్యం, ఉద్రేకం కలిగించేవి జిల్లా కేంద్ర గ్రంథాలయం కొనడం లేదు” చెప్పాడు మోహన్.

“ఓ సుప్రసిద్ధ వారపత్రికలో సీరియల్‌గా వచ్చి, ఎంతో మంది పాఠకులను ఉర్రూతలూగించిన నవల అది. అలాంటి పుస్తకాలు లేకపోతే ఎలాగ?”

“చూడు బాబు, 1993 నుంచి లైబ్రరీలలో నవలలు తెప్పించడం మానేసారు. కాంపిటీటివ్ పుస్తకాలు, ఇయర్ బుక్స్, రిఫరెన్స్ బుక్స్, కథా సంకలనాలు వంటివే తెప్పిస్తున్నారు. వాటిల్లో నీకు కావాల్సినవి ఏవైనా ఉంటే తీసుకుని చదువుకో”

సాయంత్రం నాలుగయ్యింది. మళ్ళీ చదువరులు రావడం ప్రారంభించారు.

ఓ కుర్రాడు వచ్చి , మోహన్ ఎదురు కుర్చీలో కూర్చుని, “సార్, ‘పట్నంలో చిలక’ నవల వచ్చిందా?” అని అడిగాడు.

“కల్పనా సాహిత్యం, ఉద్రేకం కలిగించేవి జిల్లా కేంద్ర గ్రంథాలయం కొనడం లేదు” చెప్పాడు మోహన్.

“ఓ సుప్రసిద్ధ వారపత్రికలో సీరియల్‌గా వచ్చి, ఎంతో మంది పాఠకులను ఉర్రూతలూగించిన నవల అది. అలాంటి పుస్తకాలు లేకపోతే ఎలాగ?”

“చూడు బాబు, 1993 నుంచి లైబ్రరీలలో నవలలు తెప్పించడం మానేసారు. కాంపిటీటివ్ పుస్తకాలు, ఇయర్ బుక్స్, రిఫరెన్స్ బుక్స్, కథా సంకలనాలు వంటివే తెప్పిస్తున్నారు. వాటిల్లో నీకు కావాల్సినవి ఏవైనా ఉంటే తీసుకుని చదువుకో”

“అదేంటండి, మేము ఇంటి పన్ను కడుతున్నాం, అందులో లైబ్రరీ సెస్ కూడ ఉంటుంది. మా డబ్బులు తీసుకుంటూ, మేము అడిగిన పుస్తకాలు లేవనడం ఏం మర్యాద?” అంటూ ఆ కుర్రాడు గదమాయించాడు.

ఆ అబ్బాయికి సర్ది చెప్పి పంపేసరికి, తల ప్రాణం తోకకొచ్చింది మోహన్‌కి. అప్పుడప్పుడు ఇలా దురుసుగా ప్రవర్తించే పాఠకులు తటస్థపడుతుంటారు. వాళ్ళతో సంయమనంగా వ్యవహరించక పోతే గ్రామ సర్పంచికి, జిల్లా కేంద్ర గ్రంథాలయాధికారికి ఫిర్యాదు చేస్తూంటారు.

ఆరు యాభై దాక ఓపికగా కూర్చున్న మోహన్ ని నిస్త్రాణ ఆవరించింది. టైం ఆవుతోందంటూ అలారం మోగించాడు. మెల్లగా ఒక్కొక్కరు వెళ్ళాక, పేపర్లని సర్దుకొని, గదులకు తాళాలేసి, బయటి తాళం వేసుకుని ఇంటి ముఖం పట్టాడు. కాస్త ఖాళీగా ఉన్న బస్సు పట్టుకుని ఇల్లు చేరేససరికి ఎనిమిది గంటలైంది.

మోహన్ భార్య శ్రావణి సంగీతం టీచరు. వాళ్ళకి ఇద్దరు పిల్లలు. కూతురు సరోజ ఐదో తరగతి, కొడుకు శ్రీరామ్ మూడో తరగతి చదువుతున్నారు. మోహన్ తల్లిదండ్రులు శ్రీకాకుళంలో, వాళ్ళ పెద్దబ్బాయి దగ్గర ఉంటారు. భర్త ఇంటికి చేరేసరికి కమ్మటి కాఫీ కలిపి సిధ్ధంగా ఉంచుతుంది శ్రావణి. కాఫీ తాగుతూ పిల్లల కబుర్లు వింటాడు మోహన్. నాన్నతో కబుర్లు చెప్పుకోవడం కోసం, పిల్లలు తమ హోంవర్కుని గబగబా పూర్తి చేసుకుని, చదవాల్సిన పాఠాలు చదివేసుకుని, భోంచేసి తయారుగా ఉంటారు. తొమ్మిది తొమ్మిదిన్నర మధ్యలో స్నానానికి లేస్తాడు మోహన్. పిల్లలని నిద్రపుచ్చి, అన్నం వడ్డిస్తుంది శ్రావణి. ఇద్దరూ భోజనాలు చేసాక, కాసేపు అన్నమయ్య కీర్తనలు, త్యాగరాజు కృతులు పాడుతుంది శ్రావణి. ఆ రోజు శ్రమని మరుస్తూ, నిద్రలోకి జారుకుంటారు ఇద్దరూ. ఆర్ధికంగా వెలితి ఉన్నా, కలత లేని సంసారం వాళ్ళది.

***

తెల్లారింది. ఆ రోజు గురువారం. తర్వాతి రెండు రోజులు శుక్రవారం, రెండో శనివారం కావడంతో లైబ్రరీ హడావుడిగా ఉంటుంది. “ఈ ఒక్కరోజు వెడితే, రెండు రోజులు సెలవు” అని అనుకుంటూ గబగబా తయారయ్యాడు మోహన్.

గ్రంథాలయానికి చేరేసరికి, ఇద్దరు ముగ్గురు ఆతడి కోసమే ఎదురుచూస్తున్నారు. తాళాలు తీసి గదుల కిటికీలు పూర్తిగా తెరచి, పేపర్లపై ముద్రలు వేసి బల్లలపై పెట్టాడు మోహన్.

కాసేపయ్యాక ఓ అమ్మాయి వచ్చి, “సార్ , మీతో కాస్త మాట్లాడాలి. మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటారో చెబితే, అప్పుడు వచ్చి కలుస్తాను” అంది నమ్రతగా.

“నేనిప్పుడు ఫ్రీగానే ఉన్నాను. చెప్పండి, దేని గురించి మాట్లాడాలి?”

“నేను డి.ఎస్సీ పరీక్షలకి ప్రిపేరవుతున్నాను సార్! నాకు కొన్ని రిఫరెన్స్ బుక్స్ కావాలి. అవి విజయనగరం జిల్లా గ్రంథాలయంలో దొరుకుతాయి. ఈసారి మీరు విజయనగరం నుంచి వచ్చేటప్పుడు వాటిని మీ ఎకౌంటులో తీసుకుని నా కిస్తే, నాకు చాలా సహాయం చేసినవారవుతారు. నేను అంత ఖరీదు పెట్టి కొనలేను…..” చెప్పిందా అమ్మాయి.

“మీ పేరేమిటి? ఇల్లెక్కడ?”

“నా పేరు కావ్య. మాది సర్పంచ్ గారి ఎదురిల్లు”

“చూడమ్మా, ఈ మధ్య జిల్లా కేంద్ర గ్రంథాలయం వాళ్ళు పాఠకులకి ఓ ప్రతిపాదన చేసారు. మీకు కావలసిన పుస్తకాల పేర్లు రాసిస్తే, వాటిల్లో ఉత్తమమైన వాటిని కొని, అన్ని శాఖా గ్రంథాలయాలకి పంపుతారు. పోటీ పరీక్షలకి హజరయ్యే మీ లాంటివాళ్ళకి కావలసిన పుస్తకాలను నువ్వు రాసిస్తే, నేను మన గ్రంథాలయం తరపున విజయనగరం పంపిస్తాను”

“తప్పకుండా రాసిస్తాను సార్,” అంటూ సంతోషంగా వెళ్ళింది కావ్య. ఇలాంటి వాళ్ళని చూస్తే మోహన్‌కి ముచ్చటేస్తుంది. ఎదగాలనే తపన ఉన్న వారిని ప్రోత్సహించాలనే మనస్తత్వం మోహన్‌ది. ఓ ఐదు నిమిషాల తర్వాత కావ్య వచ్చి రెండు కాగితాలు ఇచ్చింది. ఒకటి గ్రంథాలయంలో ఉంచాల్సిన పుస్తకాల పట్టీ, రెండోది ఆమెకి కావాల్సిన పుస్తకాలు.

రెండవపేజీ>>

About కొల్లూరి సోమశంకర్

కొల్లూరి సోమ శంకర్ కృష్ణా జిల్లా గుడివాడలో జన్మించారు. హైదరాబాదు, గుంటూరు, నిమ్మకూరు, నాగార్జున సాగర్‌లలో చదువుకున్నారు. బి.ఎ. పూర్తయ్యాక, హ్యుమన్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్‌లో పిజి డిప్లొమా చేసారు. 2001 నుంచి కథలు రాస్తున్నారు. సొంతంగా రాయడమే కాకుండా, మంచి కథలు ఎక్కడ చదివినా, వాటిని తెలుగులోకి అనువదిస్తుంటారు. ఇతర భాషల కథలను తెలుగులోకి తేవడంతో పాటు, ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిన కొన్ని మంచి కథలు హిందీలోకి అనువదించారు. కొన్ని దిన పత్రికలలో శీర్షికలు నిర్వహించారు, వ్యాసాలు రాసారు. ఈయన కథలు అనువాదాలు అన్ని ప్రముఖ పత్రికలలోను, వెబ్‌జైన్లలోను ప్రచురితమయ్యాయి.

2006లో ”మనీప్లాంట్” అనే అనువాద కథా సంకలనాన్ని, 2004లో ”4X5” అనే కథా సంకలనాన్ని వెలువరించారు.

వివిధ ప్రచురణ సంస్థల కోసం ఇంగ్లీషు, హిందీ పుస్తకాలను తెలుగులోకి అనువదిస్తున్నారు. Carlo Collodi రాసిన, ’ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలని, అమార్త్య సేన్ రచన ”ది ఇడియా ఆఫ్ జస్టిస్”ని, ఎన్.సి.పండా రాసిన ”యోగనిద్ర”ని, Tejguru Sirshree Parkhi రాసిన ” ది మాజిక్ ఆఫ్ అవేకెనింగ్”ని తెలుగులోకి అనువదించారు.

సోమ శంకర్ కథలు, అనువాదాల కోసం www.kollurisomasankar.wordpress.com అనే బ్లాగు చూడచ్చు.
వెబ్‌సైట్: http://www.teluguanuvaadam.com

This entry was posted in కథ and tagged . Bookmark the permalink.

14 Responses to నిశ్శబ్దానికి మరోవైపు

  1. అన్వేషి says:

    లైబ్రరీ లను మనం/మన ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామన్న ప్రస్తుత పరిస్థితికి మీ కథ అద్దం పడుతుంది. లైబ్రరీలు మన జీవితాల్ని ఎంతో ప్రభావితం చేస్తాయన్నది అక్షర సత్యం. మొన్నీ మధ్య హైదరాబాదులో ఒక నెల రోజుల పాటు వున్నప్పుడు స్టేట్ సెంట్రల్ లైబ్రరీ అఫ్జల్ గంజ్ లో చాలా సమయం గడిపాను. అద్భుత మైన కలెక్షన్ అక్కడ వుంది. అసలు అక్కడ లేని పుస్తకం ఏదైనా ఉందా అని వెతికితే దాదాపు ప్రతీ పుస్తకం దొరికింది నాకు. కానీ పుస్తకాలు వెతుక్కోడానికి నా మొబైల్ ఫోన్ ని ఒక టార్చ్ లైట్ లా ఉపయోగించాల్సి రావడం మన లైబ్రరీల దయనీయ పరిస్థితిని సూచిస్తుంది.
    పక్కనే ఉన్న టాయిలెట్ నుంచి వీస్తున్న సువాసనలు భరించలేక ఒక చేత్తో ముక్కు పట్టుకుని, అందని ఎత్తులో చీకట్లో వున్న పుస్తాకాలను చేరలేక అష్టకష్టాలు పడ్డా కూడా కావలసి పుస్తకం ఇంకా ఎక్కడో దగ్గర దొరుకుతుందనే ధైర్యం నన్ను చాలా రోజులు ఆ లైబ్రరీలో అతిధిగా ఉండనిచ్చింది కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థుతుల్లో ఆ పుస్తకాలు ఇంకా ఎన్నాళ్ళు ఉంటాయో అన్న అనుమానం ఇంకా వేధిస్తూనే వుంది.
    ప్రజల్లో చైతన్యం తేవడానికి పుస్తకాలు ఎంతో అవసరం, ఆ పుస్తకాల నిలయమైన లైబ్రరీలు మనకిప్పుడూ అత్యవసరం. కానీ మరి కొన్నేళ్ళలో ఈ లైబ్రరీలు మూతబడకపోయినా ఇంకా ఘోరంగా దిగజారే పరిస్థితి కనిపిస్తున్నా ప్రభుత్వం ఏ మాత్రం చర్యలు చేపట్టకపోవడం ఎంతో ఆశ్చర్యకరంగా వుంది.
    పురాతన భవంతి లో ఉన్న మన స్టేట్ సెంట్రల్ లైబ్రరీ లో ఉక్కపోత, దుమ్ముకొట్టుకుపోయిన పుస్తకాలు, ఈ ఎలక్ట్రానిక్ యుగంలో కూడా ఒక కంప్యూటరైజ్డ్ కాటలాగ్ లేని పరిస్థుతులు ఇలాగే కొనసాగకుండా ఎవరైనా ఏదైనా చేయాలి.
    ఒక విధంగా స్టేట్ సెంట్రల్ లైబ్రరీ కంటే చిక్కడపల్లి లో ఉన్న సిటీ సెంట్రల్ లైబ్రరీ కొంచెం మేలు. అక్కడ కొన్ని గదులు ఎయిర్ కండిషన్డ్ కాబట్టి జనాలు బాగానే వస్తూంటారు. చాలా మంది నిద్రపోవడానికే అనేది వేరే సంగతి.
    ఇక్కడ పూర్తిగా పనిచేయని ఒక కంప్యూటరైజ్డ్ కాటలాగ్ కూడా వుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థుతుల్లో చాలా కొద్ది రోజుల్లోనే ఎన్నో విలువైన పుస్తకాలు మనకు అందకుండా పోతాయనడానికి అక్కడ ఎన్నో సాక్ష్యాలున్నాయి.
    కనీసం పాత పుస్తకాలను సేల్ పెట్టి నా కూడా ఎక్కడో దగ్గర ఆ పుస్తకాలు ఉంటాయి. కానీ అలాంటి ప్రయత్నాలు కూడా ఏం జరగటం లేదు.
    మనందరం ఈ విషయం పై చర్చింది ప్రభుత్వానికి విన్నవించుకోవడమో లేదా అక్కడి పుస్తకాలన్నింటినీ డిజిటల్ గా మార్చి రక్షించుకోవడమో ఏదో చెయ్యకపోతే కష్టమే.

  2. జాన్ హైడ్ కనుమూరి says:

    గ్రంధాలయాల గురించిన టపాలతో సంకలనం చెయ్యాలనుకున్న నాకు ఆశ్చర్యానికి గురిచేసింది.

  3. chavakiran says:

    ప్రస్తుతం కూడా పరిస్తితులు ఇలాగే ఉన్నాయి.

    ఏదో ఒకటి చెయ్యాలి.

    ముందు బిల్డింగులు కట్టించాలి

    తరువాత ఫర్నిచర్

    తరువాత పుస్తకాలు

  4. ఈ కథ చదవడం ద్వారా నాకు అర్థమైందేమిటంటే వాటికంటే ముందు మనం –

    మనకు దగ్గరలో ఉన్న గ్రంథాలయానికి వారానికి ఒకసారైనా వెళ్ళడం, అక్కడ మనకు పనికొచ్చే పుస్తకాలు ఒకటి రెండున్నాసరే సభ్యులుగా చేరడం అత్యవసరం అని.

    1993 నుంచి లైబ్రరీలలో నవలలు తెప్పించడం మానేసారు. కాంపిటీటివ్ పుస్తకాలు, ఇయర్ బుక్స్, రిఫరెన్స్ బుక్స్, కథా సంకలనాలు వంటివే తెప్పిస్తున్నారు.

    అని ఈ కథలో ఉన్నప్పటికీ 2007 నుంచి లైబ్రరీలలో కథాసంకలనాలతో సహా సాహిత్యపుస్తకాలను తెప్పించడం పూర్తిగా మానేశారు. ఇలా ఒక్కొక్కటే తగ్గించుకుంటూ అసలు గ్రంథాలయాలనే పూర్తిగా ఎత్తేస్తారేమో అని భయమేస్తోంది.

  5. అవును, కథలాగా లేదు కానీ సాధక బాధకాలన్నీ బాగా చర్చించారు. మీ రచన శైలి సరళంగా ఉండి హాయిగా చదివిస్తుంది. అసలు కథకీ, వార్తా కథనానికి మధ్య ఇంకో వర్గాన్ని సృష్టించవచ్చునేమో ఇటువంటి కథనాలతో. వెస్టులో ఇలాంటి పుస్తకాలు అమ్ముతుంటారు .. “A fictionalized account fo a real even” అని

  6. సగటు దేశీయుని “స్వార్ధపూరిత” స్వలాభేపేక్ష అనే చదపురుగు, ఒక్క గ్రంధాలయాల్లో ముక్కి మూలుగుతున్న పుస్తకాలకే కాదు,

    కార్యాలయాల బల్లలకు, దేవాలయాల భూములకు,
    శౌచాలయాల సొంపులకు, విద్యాలయాల విలువలకు
    రాజకీయాల విశ్వసనీయతకు, చివరకు మన మనుగడకే పట్టిన ….

    పోనీ గ్రంధాలయాలకు ప్రత్యామ్నాయలను వెతుకుదామంటే,

    “ఏమున్నవి ఏ పొత్తము చదువనెరింగిన, విషాక్షర బీజములు తప్ప,
    ఏమున్నవి ఏ చిత్తము చదువనెరింగిన, అపనమ్మకపు అంకురములు తప్ప”

  7. radhika says:

    civaidaakaa cadivimcimdamDi.kadha modalu saadaagaa praarambhamainaa civariki vacheasariki mamci feel ni ichindi.

  8. @అన్వేషి గారూ, @చావా కిరణ్ గారూ, @ సుగాత్రి గారూ: గ్రంథాలయాలను ఎలా కాపాడుకోవాలనే అంశం పై చర్చను ప్రారంబించి, సూచనలు చేసినందుకు నెనరులు.
    @జాన్ హైడ్ గారూ, పొద్దు వారికి అభ్యంతరం లేకపోతే ఈ కథని బ్లాగరులు గ్రంథాలయాలపై రాసిన టపాలతో మీరు కూర్చదలచిన సంకలనంలో చేర్చండి.
    @కొత్తపాళీ గారూ, @ రాధిక గారూ,
    నెనరులు.

  9. krishna says:

    I remember going to the competetions held for this in my school age and were not happy about the prize books they gave me when I won.I was expecting some good autobiographys like ghandhi and nehru etc,but they used to give books like “jeevam ela puttindi?” Now I know the otherside.

    This story is truly an eye opener.

  10. కొల్లూరి సోమ శంకర్ says:

    @అసంఖ్య ధవళ గారూ, @ krishnaగారూ,
    నెనరులు.

  11. రాజేంద్రకుమార్ says:

    చాలా ఆలస్యంగా స్పందిస్తున్నాను,మన్నించాలి.ఇప్ప్టటివరకూ నాజీవితములో కనీసం పావు భాగానికిపైగా గ్రంధాలయాల్లో గడిపినవాడిని,ఒక చదువరిగా.లైబ్రరీలు లేని ఊర్లకు చిన్నప్పుడు అసలు వెళ్ళెవాడిని కాదు.

    ప్రభుత్వాల నిర్వహణలోని గ్రంధాలయాల తీరు నానాటికీ తీసికట్టు నాగంభొట్లు అన్నది,అందరికీ తెలిసిందీ,పాతసామెత.కానీ ప్రత్యేకబాధ్యతలతో,ప్రత్యేక నిధులతో నడిచే చాలా విశ్వవిద్యాలయాల గ్రంధాలయాలు ఇంకా కనాకష్టం గా బతుకీడుస్తున్నాయి.
    సుగాత్రి గారన్నట్లు మనమంతా ఏదో ఒక గ్రంధాలయములో సభ్యత్వం తీసుకోవటం వల్ల కాస్త ప్రయోజనం ఉండొచ్చు.ఆ నమ్మికతోనే నేను కొన్ని నెలలక్రితం విశాఖపట్నం పౌరగ్రంధాలయం లో శాశ్వతసభ్యత్వం తీసుకున్నా.

  12. hema says:

    manchi kadha

  13. కొల్లూరి సోమ శంకర్ says:

    @రాజేంద్రకుమార్ గారూ, @hema గారూ,
    నెనరులు.

  14. గ్రంధాలయాధికారి విధి నిర్వహణ లో ఇన్ని ముళ్లున్నాయా? కధ మాటెలావున్నా, కధనం ఆసక్తికరంగా వుంది. కధలోని వివరణ, చివర్లో ఏదైన ఓ సంఘటనకు నాందియేమోననుకున్నాను. అతడు ఉత్తమ గ్రంధాలాధికారి పురస్కారాన్నందుకున్నాడని, ఒక్క ముక్కలో తేల్చేసినట్లనిపించింది. మొత్తమ్మీద అభినందించదగ్గ ప్రయోగం.

Comments are closed.