నవంబరు గడి సమాధానాలు

– కొవ్వలి సత్యసాయి

1 ము

న్నా

2 భాయ్

**

**

3 అ

లు

4 పై

5 వే

6 ల్లో

బా

**

థె

**

7 క

న్నా

**

**

న్ను

**

పి

రక్

**

8 రి

బా

సా

**

9 భ

10 ట్రా

జు

11 లు

**

12 ఒ

13 రి

స్సా

**

**

హెబ్

**

14 ద్రం

డి

సం

**

15 బా

**

16

**

17 దా

నం

**

**

**

18

తుం

19 మా

**

20 వా

బో

**

21 ము

22

23

తు

**

**

**

24 మే

**

ల్కర్

**

25

ము

**

26

**

27

లు

**

28 రం

నా

29

మ్మ

30

**

31 రి

**

32 ది

**

**

**

**

డీ

**

**

33 కా

34 నం

**

35

36ము

37 ద్రా

**

38 గం

39 మా

40 మూ

లు

**

41

42

రీ

క్ష

**

43 ర్మ

44 లు

డో

**

45

ని

లు

**

46

రా

నవంబరు 08 – గడి ఫలితాలు, వివరణలు.
ఈనెల గడిని నింపి పంపినవారు వెన్నెల, స్వరూప్ కృష్ణమూర్తి , భాస్కరనాయుడు, శ్రీలు, ఆదిత్య, కృష్ణుడు, సుజాత (మనసులో మాట), లచ్చిమి, ఊకదంపుడు మరియు దైవానిక గార్లు. అందరూ 9 అడ్డం భట్రాజులు అని రాసే బదులు భట్రాజు అని రాసారు. కానీ దీనికి లంకె ఉన్న 11 నిలువు – సంగతులు సరిగా రాసినందున దీన్ని తప్పుగా భావించలేదు. అలాగే పొల్లు అక్షరాలు సరిగా రాయలేకపోవడం, పక్క అక్షరాలతో కలిసిపోవడాలని క్షమించరాని తప్పులుగా భావించలేదు. అందువల్ల, ఊకదంపుడుగారు అన్నీ సరియైన సమాధానాలతో ముందు నిలిచారు. రెండు తప్పులతో దైవానికగారు ఆయన వెనుకే నిలిచారు. ఇద్దరికీ అభినందనలు.

అడ్డం

1 మున్నాభాయ్. లగేరహో మున్నాభాయ్ తెలిసినదే కదా.
3 అలుపైనవేళల్లో. ఆకటి వేళల అలుపైన వేళలను తేకువ హరినామమే దిక్కు మరి లేదు అని కదా తాళ్లపాక అన్నమయ్య పాడింది.
7 కన్నా. అలప్పాయుదే కన్నా అని పాట.
8 రిబాటసా. సారీ. రోడ్డు – బాట – మధ్యగా తిన్నగానే ఉంది. దానిమీద పోయేవాడే రివర్సులో వస్తున్నాడు కాబట్టి సారి అటూనిటూ రాయాలి.
9 భట్రాజులు. రాజులు వేరేవాళ్ళని పొగుడ్తారా? – ఆస్థానాల్లో పొగడ్డానికి భట్రాజులుండేవారు. ఇప్పుడెక్కడ పడితే అక్కడే కనిపిస్తున్నారు J)
12 ఒరిస్సా. కాంధమల్ ఉన్న రాష్ట్రం.
14 ద్రంనడిసం. సాగరమధ్యాన్ని నడిసంద్రం అంటాం కదా. మధ్యన నిశ్చలంగానే ఉంది, సముద్రమే అటూ ఇటూ అయిపోయంది అంటే నడి సరిగ్గానే ఉంది సంద్రం తిరగేసి రాయాలి.
15 బావ. వీడిని పెళ్ళిచేసుకుంటే మేనరికం అంటారు (23 నిలువే)
17 దానం. ఈవి అంటే దానమే కదా.
18 గతుం. తుంగ చాప అంటాం కదా. ఎటొచ్చీ తిరగేసి తుంగ అని రాయాలి.
19 మాట. ఇది లేక మౌనమే కదా.
20 వానబో. ఇంద్ర ధనుస్సుని రెయిన్ బో అంటాం. ఇందులో మొదటి సగం తెలుగులో వాన.
21 ముగరతు. వెనక్కి పరిగెట్టినా అన్నాం కాబట్టి తిరగేసి రాసాం.
24 మేక, ఏడకెళ్తివి? రాణిగారి తోటలోన మేత కెళ్తిని – చిన్నప్పుడు పాడుకున్న తెలుగు రైమ్ లో ఓలైను.
25 నమము. మేలని భావం. కానీ పెద్దసున్నా బదులు చిన్న సున్నా రాసేసరికి అక్షరంమారి నమస్కారంలా అనిపిస్తుంది. నయం అని రాయాలి కి కి తే డా సున్నాయే కదా.
27 పనసలు. వేదాల్లో ఇవుంటాయి.
28 రంగనాయకమ్మ. “మనం వాడుకభాషే రాస్తున్నామా” అని ఈవిడ రాసినపుస్తకం పేరు.
31 రిక. ఏనుగుని దానం పుచ్చుకుంటే కుబేరుడు కుచేలుడవడా.
32 ది. 38 నిలువుకి ముందు పెడితే దిగంబరా, 46 అడ్డానికీ ముందు పెడితే దినకరా అవుతాయి..
33 కాననం. అంటే అడవి అని, బ్రహ్మముఖం అని అర్ధాలున్నాయి..
35 సముద్రాల. రాఘవాచార్య ఇంటిపేరు.
39 మామూలు. దసరాలలో ఇది కామనే.
41 వశపరీక్ష. పోస్టు మార్టం అంటే శవపరీక్ష. కొన్ని అవకతవకలున్నాయి కాబట్టి వశపరీక్ష అని రాసాం..
43 ర్మబ. వడ్రంగి బెజ్జాలు బరమా అనే పని ముట్టుతో పెడతాడు. ఆధారాన్ని బట్టి ర, మా లు కలిపేసి తిరగేసాం.
44 లుడో. సన్నాయికి పక్కవాయిద్యం డోలు కదా.
45 పదనిసలు. ప్రయాణంలో పదనిసలు అంటాం కదా
46 నకరా. హైదరాబాదులో నకరాల్జేస్తున్నవ్ బే.

నిలువు

1 ముబారక్ ఒబామా. ముబారక్ అంటే కంగ్రాట్స్. ఇటీవలి విజేత బారక్ ఒబామా
2 భాయ్ థెరిస్సా. మగ థెరెస్సా ని మాతా (మదర్) అనలేంగా మరి.
3 అన్నాసాహెబ్ దాబోల్కర్. హేమాద్పంత్ పేరుతో ప్రసిధ్ధుడైన ఈయన సాయి చరిత్ర వ్రాసారు
4 పైటభద్రం. .. పైట పదిలం అమ్మడూ, నీ మాట పదిలం అమ్మడు అని ఓ పాట లైను. పదిలాన్ భద్రం అని కూడా అంటాం కదా.
5 వేన్నుజుడి. మధ్యలో పాడై పోతుంది అంటే వేడిజున్నులో మధ్య అక్షరాలు తిరగేయమని..
6 ల్లోపి. పిల్లో అంటే దిండని, అమ్మాయిని పిలిచే తీరని చెప్పుకోవచ్చు. బోల్తా కొట్టిస్తున్నాడు కాబట్టి తిరగేసాం.
7 కట. కటకట + ఆలు (పెళ్ళాం) కటకటాలు (గ్రిల్).
10 ట్రాన. నగా నట్రా అంటాం కాదా.
11 లుసంగతు. పల్లవిని రకరకాలుగా పాడడాన్ని సంగతులంటాం. విశేషాలని కూడా సంగతులనే అంటాం. ముందూ వెనకా ఎలాచేయాలో తెలుసుగా.
13 రివట. సన్నగా పొడుగ్గా ఉంటే వట వృక్షం ఉన్నా ఇలాగే వర్ణిస్తారు.
16 కవాకసకన. కా భాష తెలుగైనా సరే స్మెల్లు భరించలేం.
21 మునగ. బాగా పొగిడి ఈచెట్టెక్కించచ్చు.
22 గమనా. గజ గమనా అంటాం కదా. 31 అడ్డం లో కరి తిరగేసి ఉంది. దాన్నిసరిచేసి గమనా కలపండి
23 రముయ. రయము – తత్తరపాటు అన్నాం కాబట్టి ఇలా రాసాం..
24 మేనరికాలు. ఇవి కూడనివి కదా.
26 అమ్మ. అన్నది ఒక కమ్మని మాట. కనుమూరి గారి అమ్మ సంకలనం గుర్తుకురాలేదూ.
29 కడీ. మజ్జిగ పులుసు. నార్తిండియన్ పేరంతే.
30 ఓనమాలు. తెలుగు విద్యార్ధి చదువుమొదలెట్టేది వీటితోనే కదా.
34 నంవద. దవనం – దీని సువాసన గురించి చెప్పాలా.
35 సపస. సంగీతంలో సపస-సపస అని మొదటా చివరా పాడిస్తారు. దీన్ని మూర్చనంటారు.
36 మురీలు. మరమరాలని మురీలని కూడా అంటారు.
37 ద్రాక్ష. ద్రాక్షారామం.
38 గంబరా. 32 లో ది తో కలిపితే బట్టలులేనివాడే (దిగంబరుడు)..
40 మూడో. ఒకటో, రెండో, ….తర్వాత వచ్చేదిదే కదా.
42 శని. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పదంటాం కదా..
43 ర్మక. ఎవరు చేసిన కర్మ వారనుభవించక తప్పదు అంటారు కదా. చేసినది ని తిరగేసి దినసిచే అని రాయడంవల్ల కర్మని కూడా తిరగేయాలి.

This entry was posted in గడి and tagged . Bookmark the permalink.

One Response to నవంబరు గడి సమాధానాలు

  1. చంద్ర మోహన్ says:

    నేను కూడా ఒక్కటి(38 నిలువు)తప్ప అన్నీ సరిగ్గా వ్రాసినట్లున్నానే!

Comments are closed.