దూరం

పింగళి శశిధర్

ఆలోచనా తరంగిణి కా
ఒడ్డులో నీవు – ఈ
ఒడ్డులో నేను –
అలల అలజడిలో
వెనుకడుగే ఇద్దరిదీ !

కానీ –

కాళ్ళ క్రింది ఇసుకొకటే
కాలంలా కరిగిపోతూ
కలిపే ప్రయత్నం చేస్తోంది
ఇద్దర్నీ !?

About పింగళి శశిధర్

హైదరాబాదులో నివసిస్తున్న పింగళి శశిధర్ గారు ప్రైవేటు కంపెనీలో ఐటీ విభాగంలో పనిచేస్తున్నారు.
This entry was posted in కవిత్వం and tagged . Bookmark the permalink.

10 Responses to దూరం

  1. Subrahmanyam Mula says:

    చాలా బావుంది. ఈమాటలో ప్రచురితమైన నా కవిత “రెండు తీరాలు” గుర్తొచ్చింది.

  2. చావా కిరణ్ కుమూర్ says:

    బాగుంది.
    కవి మరీ పిసినారిలా ఉన్నాడు 🙂 మరీ నాలుగు లైన్లేనా, ఇలాగే ఇంకొంచెం కవిత్వాన్ని మాకు వడ్డించవచ్చు కదా.
    ఆంగ్ల సినిమా ట్రైలర్ లా క్లుప్తంగా, చక్కగా ఉంది.
    సినిమా కూడా రిలీజ్ చేస్తే చక్కగా చూసేస్తాం.

  3. sudhakar korrapati says:

    duram kavita chaala baagundi

  4. swapna says:

    duram kavita chaala baagundi..

  5. bphanibabu says:

    తరవాత చేసుకొవచ్హు కదా అని కొంత చేసి సేవ్ చేసాను.మర్నాటికి అది మాయం అయిపోయింది.మళ్ళే మొదలుపెట్టాలి.

  6. చాలా బగుంది గాని క్లుప్తంగా లేదూ?

  7. రాఘవ says:

    క్షమించాలి, నాకు ఈ కవిత అర్థమైందో అర్థమవ్వలేదో తెలియలేదు కాని అర్థమైనట్టుగా విశ్లేషిస్తే…

    ఆలోచనలనే తరంగాలతో కూడిన నదికి రెండు వైపులా ఇద్దరూ ఉన్నారు. మనకు కావలసినన్ని ఆలోచనలని ‘ఏరు’కోవచ్చు… బావుంది. కానీ ఆ ఆలోచనలనే అలల అలజడి చూసి ఆలోచించడంలో వెనుకడుగు వేస్తున్నారు. అంటే ఆలోచించడానికి జంకుతున్నారు, సరే. ఇక్కడ ఆలోచనలనే తరంగాలు పారేది మన హృదయంలో, మన మనస్సులో. కాబట్టి ఇసుక కరిగిపోతూ కలిపే ప్రయత్నం చేస్తోంది అంటే ఇద్దరి మనస్సులూ ఆ ఆలోచనలలో కరిగిపోతూ దగ్గరవ్వడానికి చూస్తున్నాయి. అంటే వాళ్ల ఆలోచనలు దగ్గరవ్వడానికి వెనుకడుగు వేస్తున్నా మనసులు పెనవేసుకోవడానికే చూస్తున్నాయని! ఇందులో ఆభాస ధ్వనిస్తోందా?

  8. jyothi says:

    పొద్దు లో చూసి బరహ లోడు చేసుకున్నాను పొద్దు పత్రికకు ధన్యవాదాలు నాకు బ్లాగు లేదు,నేను వ్యాఖ్యలు,వ్యాసాలు పొద్దు కి,ఇతర బ్లాగులకి వ్యాఖ్యలు ప౦పి౦చాల౦టె ఏమి చేయాలో దయచేసి తెలుపగలరు

  9. radhika says:

    చాలా బావుంది

Comments are closed.