జూన్ నెల బ్లాగుల విహంగ వీక్షణం

– వీవెన్, చదువరి

2008 జూన్
-తెలంగాణాలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాల పర్యవసానాలు చవిచూసిన నెల
-ఆంధ్రజ్యోతి, మంద కృష్ణ మాదిగల మధ్య తారాస్థాయి యుద్ధం – పర్యవసానంగా పాత్రికేయులను పోలీసులు నిర్బంధించిన నెల
-దేవేందర్ గౌడ్ తెదేపా నుండి బయటికి వచ్చిన నెల
-పెట్రోలు, డీజిలు, గ్యాసు ధరలు తారాజువ్వల్లాగా ఎగసిన నెల.
వెరసి టపాలకు మంచి విషయాలు దొరికిన నెల.

బ్లాగుల్లో సాధారణంగా స్వగతాలో, జ్ఞాపకాల నెమరువేతలో, సమకాలీన రాజకీయ, సామాజిక అంశాల గురించో, సినిమాల గురించో చర్చలుంటాయి, అభిప్రాయాలూంటూంటాయి. సాహితీ సమీక్షలుంటాయి. అరుదుగానైనా.., లోతైన విశ్లేషణలూ సూత్రీకరణలు కూడా ఉంటూంటాయి. చాన్నాళ్ళ కిందట పప్పు నాగరాజు కవిత్వ లక్షణాలను వివరిస్తూ, కవిత్వాన్ని ఎలా ఆస్వాదించాలో విశ్లేషిస్తూ వాక్యం రసాత్మకం కావ్యం అంటూ చక్కని విశ్లేషణాత్మక, విజ్ఞానదాయక వ్యాసాలు రాసారు. గుండెచప్పుడులో సామాజిక, ఆర్థికాంశాల మీద అలాంటి టపాలు వస్తూంటాయి. అటువంటి ప్రయత్నాలు అడపాదడపా జరుగుతూనే ఉన్నాయి. ఈనెల అలాంటి టపాలు కొన్నొచ్చాయి. అవి:

చర్చలు

హాస్యం/వ్యంగ్యం

సామాజికం/రాజకీయం

ఈ నెల ముఖ్యాంశాలు: ఉప ఎన్నికలలో తెరాసకి ఎదురుదెబ్బ, ఇందన ధరల పెంపు, నెల చివర్లో తెలుగుదేశం పార్టీ నుండి దేవేందర్ గౌడ్ రాజీనామా.

స్వగతాలు, స్వ గతాలు

సాహిత్యం

సినిమా

ఈ నెల విశేషం పాండురంగడు సినిమానే. ఆ తర్వాత దశావతారం.

ఇతరత్రా

కొత్త బ్లాగులు

ఈనెల బ్లాగు

ఆ బ్లాగు పుట్టి రెండే నెలలైంది. రెణ్ణెల్లలోనూ 40కి పైగా జాబులొచ్చాయి. ఎత్తిపోతల కార్యక్రమంలో ఎక్కడినుండో తెచ్చిపెట్టిన సరుకేం కాదది; బ్లాగరి మేధలోచి ఉద్భవించిన అసలు సిసలు ఆలోచనలే ఆ జాబులు. చాలా జాబులు ‘కత్తి‘లా ఉన్నాయని వ్యాఖ్యాతలు అన్నారు. పర్ణశాల ఆ బ్లాగు, కత్తి మహేశ్ కుమార్ ఆ బ్లాగరి. తన కాలేజీ కబుర్ల గురించి రాసినా, తెలుగు సినిమా గురించి రాసినా, మానవ సంబంధాల గురించి రాసినా ఆయన ఆలోచనలు ఆసక్తికరంగా ఉంటాయి. చదివింప జేస్తాయి. ఆయన భావాలు కొన్ని వైవిధ్యంగా ఉండి, కొంతమందికి ఆమోదయోగ్యంగా ఉండకపోవడం జరుగుతూ ఉంటుంది. విభేదించినవారితో అర్థవంతమైన చర్చకు ఈ బ్లాగరి సిద్ధంగా ఉంటారు.

తన బ్లాగులోనే కాక, ఇతర బ్లాగుల్లోనూ వ్యాఖ్యలరూపంలో మహేశ్ తరచూ కనిపిస్తూంటారు. జూన్ నెలలో వివిధ బ్లాగుల్లో జరిగిన చర్చల్లో వేడీ వాడీ కలిగిన వాటిలో మహేశ్ పాత్ర ప్రముఖంగానే ఉంది. నవతరంగంలో సినిమా విశ్లేషణలు కూడా రాస్తూంటారు.

—————

-వీవెన్, చదువరి పొద్దు సంపాదకవర్గ సభ్యులు

This entry was posted in జాలవీక్షణం and tagged , , , . Bookmark the permalink.

13 Responses to జూన్ నెల బ్లాగుల విహంగ వీక్షణం

  1. పొద్దువారు నాబ్లాగుని మరోసారి గుర్తించినందుకు కృతజ్ఞతలు. మంచిమాట ఎప్పుడు ఎక్కడ విన్నా సంతోషమే.
    అలాగే మరొకటి కూడా ఇక్కడ మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నా (అనువాదాల)తూలికగురించి ఇప్పుడే ఆక్స్ ఫర్డ్, మాంచెస్ఠర్ యూనివర్సిటీల సైటులో చూసాను.
    http://www.intute.ac.uk/artsandhumanities/cgi-bin/fullrecord.pl?handle=20080619-1110542.
    నాతూలిక నాదే అయినా తెలుగువారందరికోసం చేసింది కనక మీరు కూడా ఆనందిస్తారనీ …మరో చిన్న కుట్ర ఏమిటంటే నాసైటు మొహం గురించి వారన్నమాట చూసి మీరేదైనా చేస్తారేమోనని … 🙂

  2. జూన్ నెలలో రవి గారు కాళిదాసు గురించి రాసిన చక్కని వ్యాసాన్ని గురించి మీ సమీక్షలో రాయకపోవడం నన్ను నిరాశకి గురిచేసింది.
    http://blaagadistaa.blogspot.com/2008/06/blog-post_14.html

    ఈ బ్లాగులో జూన్ నెల టపాలు అన్నీ చాలా బాగున్నాయి.

  3. chavakiran says:

    July blogs rocks!

    They are too lively!!

  4. కె.మహేష్ కుమార్ says:

    అరే! ‘ఈ నెల బ్లాగు’ నాదే!!
    ఆశ్చర్యంతో పాటూ, చాలా ఆనందంగా కూడా ఉంది.
    ఏదో నా ఆలోచనల్ని పంచుకుందామనుకున్నానే గానీ, ఇంత స్పందన ఉంటుందని తెలీదు.
    అందరికీ నెనర్లు.

  5. సంపాదకీయం, ప్రత్యేక వ్యాసం సంగతి దేవుడెరుగు!
    కనీసం, మన యోధుడు “సాం” మనెక్‌షా ని గురించి ప్రస్థావించి ఉంటే బాగుండేది.

  6. chavakiran says:

    I know it is not possible to cover everything!

    Yet,

    There was some discussion about Telugu medium Vs English Medium in this month!

  7. నా మూడు టపాలని గుర్తించారా! బోలెడన్ని నెనర్లు.

  8. జూన్ నెల బ్లాగుల విహంగ వీక్షణంలో’భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!’ అనే శీర్షికతో రాస్తున్న నా వ్యాసాలను ప్రత్యేకంగా ప్రస్తావించినందుకు పొద్దు సంపాదకవర్గ సభ్యులైన వీవెన్,చదువరి గార్లకు కృతజ్ఞతలు.

  9. సూరిమణి says:

    ఇంటర్నెట్టు,
    టీవీ ఛానెళ్లూ వచ్చాక…
    ఎవరికీ ఓపికా,తీరికా వుండటం లేదు.
    అందుకే పుస్తకాలు చదవడం అనేది
    రోజురోజుకీ బాగా తగ్గిపోతోంది.
    అసలు, మొదటినుంచీ పుస్తకాలను కొని చదవే అ లవాటు
    తెలుగువాళ్లలో చాలా తక్కువనే చెప్పాలి.
    పుస్తక ప్రచురణలూ తక్కువే. ఇక
    ఇప్పుడు కొత్త పుస్తకాలు ప్రచురించి చేతులు కాల్చుకునేందుకు
    ప్రచురణ కర్తలు ఇంకా భయపడుతున్నారు.
    అయినా అనేక కష్ట నష్టాలు భరిస్తూ తెలుగులో మంచి పుస్తకాల
    ప్రచురణని కొనసాగిస్తున్న ఏకైక సంస్థ
    హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌.
    వాళ్లు ఇప్పుడు ఒక బ్లాగును కూడా ప్రారంభించారు.
    అది చాలా ఆసక్తికరంగా, అద్భుతంగా వుంది.
    దానిని మీరు ప్రస్తావించకపోవడం వెలితిగా అనిపించింది.
    హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ బ్లాగ్‌ యుఆర్‌ఎల్‌ ఇది:
    ఇప్పటికైనా సందర్శించండి:
    hyderabadbooktrust.blogspot.com

  10. sujata says:

    నా పుస్తక పరిచయాన్ని గురించి రాసినందుకు థాంక్స్. అంత కన్నా.. ఇప్పుడు ఏమీ చెప్పలేను. ఎందుకంటే, ఈ పుస్తకం, పెద్దగా ఆదరణ పొందలేదు. అలానే, నా పరిచయం కూడా !

  11. vensy says:

    వీవెన్ గారు,
    నా మొదటి బ్లాగ్, ప్రమదావనం ని కూడలిలో ఉంచినందుకు ధన్యవాదాలు. మొదటి టపాకి తమ వ్యాఖ్యలు పంపించిన మహా బ్లాగరులందరికీ నా కృతజ్ఞతలు.మీరిచ్చిన ఈ ప్రోత్సాహంతో మరిన్ని టపాలు చేర్చే ఉత్సాహం ఉరకలు వేస్తోంది. మరొకసారి కృతజ్ఞతాభినందనలు…

  12. anandpotluri says:

    bit is very useful to us

Comments are closed.