జీవితం

– స్వాతి శ్రీపాద

వెన్నెల జలపాతం ఒడిలో
నగ్నంగా స్నానాలాడుతూ
నర్తిస్తున్న రాత్రి
ఒళ్ళు మరచి పరవశిస్తూ…
క్షణక్షణానికీ మధు పాత్ర నింపుతున్నట్టు
చుక్కలు రాలి వెలుగులను వంపుతుంటే
ఒంటరిగా ఒక్కక్షణం
ఉనికిని కోల్పోయిన ఊహలా
అదృశ్యమయి పోదామనిపిస్తుంది

కలల తివాచీకి రంగులద్ది
సుఖాల పల్లకిలో ఊరేగుదామనిపిస్తుంది
అంతలోనే
మేకప్ చెరిపేసుకున్న నర్తకి మొహంలా
జిడ్డోడుతున్న వాస్తవం
సగం కరగి పోయిన కృత్రిమతా
చేతులు కలుపు కుంటూ
జీవితాన్ని పరిచయం చేస్తాయి
పెదవుల మీద తొణకని స్వప్నం
కనురెప్పలవెనుక నీటి చుక్కై
అదృశ్య సునామీలను అదిమిపెడుతూ
చూపు సారిస్తుంది

————————–

స్వాతీ శ్రీపాదఅసంఖ్యాకంగా కవితలు, వందకు పైగా కథలు, ఐదు నవలలు రాసిన స్వాతీ శ్రీపాద అనువాదాల ద్వారా తెలుగు సాహిత్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చారు. స్త్రీ ఎల్లప్పుడూ అభ్యుదయపథంలో సాగాలనేదే ఆమె ఆకాంక్ష. తెలుగు, ఆంగ్లాల్లో పోస్ట్ గ్రాడ్యుయేటైన స్వాతీ శ్రీపాద ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయంలో అధ్యాపకురాలుగా, హైదరాబాద్ ఆలిండియా రేడియో ప్యానెల్ అనువాదకురాలిగా పనిచేస్తున్నారు. వార్త దినపత్రికలో వారం వారం చెలి పేజీలో మానస సంచరరే శీర్షిక నిర్వహించారు.

About స్వాతీ శ్రీపాద

అసంఖ్యాకంగా కవితలు, వందకు పైగా కథలు, ఐదు నవలలు రాసిన స్వాతీ శ్రీపాద అనువాదాల ద్వారా తెలుగు సాహిత్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చారు. స్త్రీ ఎల్లప్పుడూ అభ్యుదయపథంలో సాగాలనేదే ఆమె ఆకాంక్ష. తెలుగు, ఆంగ్లాల్లో పోస్ట్ గ్రాడ్యుయేటైన స్వాతీ శ్రీపాద ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయంలో అధ్యాపకురాలుగా, హైదరాబాద్ ఆలిండియా రేడియో ప్యానెల్ అనువాదకురాలిగా పనిచేస్తున్నారు. వార్త దినపత్రికలో వారం వారం చెలి పేజీలో 'మానస సంచరరే' శీర్షిక నిర్వహించారు.
This entry was posted in కవిత్వం. Bookmark the permalink.

10 Responses to జీవితం

  1. జాన్ హైడ్ కనుమూరి says:

    నవలంత నిడివివున్న విషయాన్ని కవిత ఎలా చేసారా అని ఒకటికి రెండు సార్లు చదివాను.

    అభినందనలు

  2. swatee sripada says:

    thanks john and kiran

  3. radhika says:

    ఈ కవిత ఎన్ని లోతుల్ని తాకుతుందో.ఎన్ని ఆలోచనలను లేపుతుందో.

    “ఒంటరిగా ఒక్కక్షణం
    ఉనికిని కోల్పోయిన ఊహలా
    అదృశ్యమయి పోదామనిపిస్తుంది”… చాలా బాగుందండి.

  4. సగటు జీవి says:

    ఇది ఇక్కడ ప్రస్తావించడం మంచిదో కాదో గానీ
    జనాలు ఇక్కడ ఇంత మంచి కవితలు రాస్తోంటే అదేదో ఆవకాయ సైటు లో ఒకాయన ఇలా అంటున్నారు (వాళ్ళ సైట్ లో ప్రచురించిన ఒక కవిత లాంటి దాని గురించి)
    “ఇది కవిత్వమా?? తిట్లా? ప్రజాకళలోనో, ప్రాణహితలోనో, లేదంటే, బ్లాగుల్లోనూ చూసే కవిత్వం ఆవకాయలో వచ్చిందా?”
    అంటే ఏంటండీ బ్లాగుల్లో కవిత్వం అసలు బాగోలేదా?
    (లింకును తీసేసాం-సం.)
    పై లింకులో కామెంట్లు చూసి ఎవరయ్యా పై మాటలు అన్నది అని చూసి ఆయన రాసిన కవితే ఒకటి చూస్తే వ్యాసంలా రాయాలసినదాన్ని లైన్లు లైన్లు గా విడదీసి కవిత్వం అంటున్నారనిపిస్తుంది. ఆయనకి మిగతావాళ్ళని విమర్శించే హక్కు ఉన్నా, అర్హత వుందా అని ఆయన ఆయన్ను ప్రశ్నించుకోవాలేమో….
    (లింకును తీసేసాం-సం.)
    ఈ విషయం గురించి అల్రెడీ డిస్కసన్ అయిపోయి వుంటే సరే….లేదంటే డిస్కసన్ జరగాల్సిందే…

  5. swatee sripada says:

    sagatu jeevi garu
    naa kavitha gurinchi cheppandi. we don’t bother about others
    inthaki nannu thittara mechukunnara
    swatee

  6. kishore says:

    మీ కవిత చాల చేదుగా ఉందండి. ఆణువణువునా నిజాన్ని నింపుకోవడంవల్ల నిజం, సహజంగా చేదుగా ఉండడం వల్లనేమొ! జీవితం అంటె హిమ శిఖరాల నడుమన విరబూసిన నందన వనం లా సదరు తెలుగు సినిమాలలొ హెరొయిన్ introduction scene లా అందంగా ఉంటుందని ఆశించడం మానవ సహజం… అచ్చం మీ కవితలొ చెప్పినట్టు ఉంటుందని కనువిప్పు కలిగించడం ప్రకృతి నైజం. మీ కవిత అక్షరాల కలబోత కాదు అనుభవాల వడపోత…
    అభినందనలతొ….
    కిషొర్..

  7. swatee sripada says:

    radhika garu, kishore garu

    thank you

  8. ఉష says:

    ఆప్తమిత్రురాలు బద్దశత్రువు రెండూ ఇదే జీవితం. ఓసారి కవ్వించి తేనెల తియ్యందనాలు, ఓసారి ఉసూరుమనిపిమ్చి కన్నీటి ఉప్పు వెగటులు.. బాగా వ్యక్తం చేసారు కల ఆశ చివరికి వాస్తవానికి చిక్కిన జీవితం.. ఇలా అప్పుడప్పుడు రాసుకున్న ముక్కలు..కవితలో వచనాలో పదబంధనలు. ఒక్కోసారి స్పందన అభినందనతో ఆగదు, కనుకా..

    కాలాన్ని తవ్వితే కలల ఇంధనం,
    కాలాల నడుమ బ్రతుక్కి ఆలంబనం.

    వాస్తవం నన్ను కలలో కూడా వదలదు. బహుశా తెలియని అనిశ్చితి కలలోని స్వేఛ్ఛని అదిమేస్తుంది కాబోలు. కనుక కల నిజం కాకూడదని [పేరాశ] ఆశ పడతాను. అడియాస/నిరాశ శాతం ఇంతని తెలియదు కానీ తీసిపాడేసేది కాదు. అలా ఓ కల-నిరాశ నడుమ మరో జ్ఞాపకం చిగురు తొడుగుతుంది. మనసు గొంగళి అది మేసి, నెమరేసుకుంటూ మరో చివురాకు కొరకు కల కంటుంది. ఎప్పటికైనా సీతాకోకచిలుకగా మారనా అని కూడా ఓ కల నేపథ్య సంగీతంలా సాగుతుంటుంది.

    పొద్దు ద్వారాగా మీ గురించి, మీ రచనల్లోకి తొంగిచూడటం సంతోషం.

  9. ramnarsimha says:

    Mee..Kavitha

    Chaala..Bagundandi..

    Dhanyavadalu..

Comments are closed.