కొంగేదీ?

-మూలా సుబ్రహ్మణ్యం

శీతాకాలపు సాయంత్రం
ఆలయ ప్రాంగణంలోని
పచ్చగడ్డిలో కూచున్నాం

అల్లంత దూరంలో వాలిన
తెల్ల కొంగని చూడగానే
ఒక్కసారిగా పాప మనసు
రెక్కలు తొడుక్కుంది

పట్టరాని సంతోషంతో
పరవళ్ళు తొక్కుతుంటే
పచ్చగడ్డిలో పసిపాదాల
ముచ్చటైన సవ్వడి

చెంగున దూకుతున్న పాపని చూసి
కొంగ చటుక్కున ఎగిరిపోగానే
నింగిలో విహరిస్తున్న పాప మనసు
తిరిగి నేలమీద వాలిపోయింది!

————–

This entry was posted in కవిత్వం. Bookmark the permalink.

8 Responses to కొంగేదీ?

  1. కె.మహేష్ కుమార్ says:

    పదచిత్రణ బాగుంది.

  2. ముచ్చటైన సన్నివేశం! శీర్షిక కవితకి మరింత అందాన్ని తెచ్చింది.
    కాకపోతే కవిత ఇంకాస్త చిత్రికపట్టి ఉండాల్సిందనిపించింది. ఉదాహరణకి:
    “ఆలయప్రాంగణంలోని పచ్చగడ్డిలో” – “ఆలయప్రాంగణంలో పచ్చగడ్డిపై(/మిద)” ?
    “కొంగ చటుక్కున ఎగిరిపోగానే” – “కొంగ చటుక్కున ఎగిరిపోయింది”

    కాస్త యతి ప్రాసలపై మనసుపోయినట్టుంది:-)
    కోరుండి ఈ కవితలో ఎక్కువ వచనత్వం చొప్పించారా?

  3. Subrahmanyam Mula says:

    మహేష్ గారు ధన్యవాదాలు.

    కామేశ్వరరావు గారు, మీ సూచనలు చాలా బావున్నాయి.
    మీరన్నట్టు ఈ కవితలో కాస్త వచనత్వం ఉన్నమాట వాస్తవమే!
    భావంలోని కాంట్రాస్ట్‌ను చెప్పేందుకు రెండు, నాలుగు ఖండికలు
    సరిపోతాయి. కానీ పరిపూర్ణ దృశ్యం ఆవిష్కరించాలంటే మిగతా రెండు ఖండికలు
    కూడా అవసరమే అనిపించింది. వాటిని తొలగించడం నా వల్ల కాలేదు.

    ఇక యతిప్రాసలకీ, ఛందస్సులకీ నేను వ్యతిరేకిని కాను.
    శబ్దాడంబరంలో కవిత సన్నని గొంతు వినిపించదేమో అని కాస్త
    భయం అంతే 🙂

  4. కొంగ ఎగిరిపోయినపుడు మీ పాపకు ఎంత బాధ వేసిందో పద్యం అయిపోయినపుడు నాకూ అంతే బాధ వేసింది. కొంగ ఎగిరిపోయినందుకు కొంత, పద్యం అయిపోయనందుకు మరి కొంత.
    నా హృదయాన్ని పాప హృదయంతో తదేకం(?) చేయగలిగిన మీ ప్రజ్ఞకు జోహార్లు
    రాకేశ్వర

  5. nagendra says:

    konga yegiripoina taruvatha mee ru padda bada chusi maaku chala baadesindhi. yedemina mee kavitha chala bagundhi. inka manchi kavithalanu meeru rastarani aasistu.. mee abhimaalulu usa memphis nundi.

  6. Falling Angel says:

    రాకేశ్వరా, మమేకం అనుకుంటా !!
    Am I sounding like master of the obvious 😛

  7. Raja says:

    శీర్షిక చూడగానే సుబ్రహ్మణ్యంగారు “కొంగు ఏదీ” అనే రొమాంటిక్ కవిత రాశారేమో అనుకున్నా, Utter disappointment.

  8. bollojubaba says:

    కవిత బాగుంది. మీ ఇతర కవితలలో ఉండే భావుకత పుష్కలంగా ఉంది.

    రాజా గారి అభియోగమే నాదీనీ

Comments are closed.