అలికిడి

దోసపండ్ల తోటకు అడ్డువేసిన కంపకంచెను ఎవరో తీస్తున్న అలికిడి అయ్యింది. నిద్రలో ఉన్న నాకు మెలుకువ వచ్చింది. నిజమే! కంచె దగ్గరే ఆ అలికిడి స్పష్టంగా వినిపిస్తోంది. దీనితో మగత నిద్ర నించి బాగా మెలుకువలోకొచ్చాను.

గుడారంలాంటి గుడిసె ముందు ఈతచాపపై మా నాన్న గురకలు పోతూ మంచి నిద్రలో ఉన్నాడు.

అంతా చిమ్మచీకటి. గుడిసెలో పై కప్పునించి వేలాడుతున్న లాంతరు వెలిగీవెలగనట్లుంది. ఆ లాంతరు దింపి వత్తి కొద్దిగా పైకెత్తాను.

ఏవో పురుగులు కిర్‌ర్ అంటూ గీపెట్తున్నాయి. దోస చెట్లకు కాయలు ఊరి రంగు తేల్తున్నట్లుంది. చల్లటి సుగంధం గాలిలో అలలు అలలుగా వీస్తోంది.

తిరిగి కంచె దగ్గరే అలికిడి ఎక్కువైంది. పక్కనే ఉన్న దుడ్డుకర్ర చేతిలోకి తీసుకున్నాను. ఇంకో చేత్తో టార్చి లైటును పట్టుకుని గుడిసె బయటికి వచ్చి

“నాయనా! ఓ నాయనా!!” అంటూ నిద్రలేపాను.

“ఏరా.. ఏమైంది?” కంగారుగా లేస్తూ అన్నాడు.

“ఎవరో కంచె తీస్తున్నారు నాయనా” అని, వేగంగా కంచె దగ్గరికి నడుస్తూ టార్చిలైటు వేశాను. టార్చి వెలుగు కంచెపై సూటిగా పడింది. ఆ వెలుగులో చారలు చారలున్న ‘దుమ్ములగొండి’ (హైనా) నోటికి దోసపండు ఇరికించుకొని – అది కళ్ళకు అడ్డురావడంతో – దిక్కుతెలియక కంపల్లో చిక్కుకొని గింజుకుంటోంది.

ఆ దృశ్యం చూసి నాకు నవ్వు వచ్చింది. ఈ చావు ఎవరు చావమన్నారు దీన్ని? దొంగతిండి తినబోతే ఇదే గతి.

దగ్గరగా పోయి – కట్టెతో దాని కళ్ళకు అడ్డుగా ఉన్న దోసపండును కదిలించాను. జారి కిందపడింది. అడ్డు తొలగిపోవడంతో – దోకుకుంటూ పారిపోయింది దుమ్ములగొండి.

“ఏందిరా.. ఎవర్రా అది?” రొప్పుకుంటూ వచ్చి అడిగాడు నాన్న. జరిగింది చెప్పాను.

“దీనెమ్మ ……. ఊరికే పోనిచ్చినావా.. దుడ్డుకర్రతో నాలుగు ఇడ్సి వుంటే చచ్చి ఊరుకుండేది కదా” దోసపండు తినిపోయిందనే అక్కసుతో అన్నాడు – వెనుదిరిగి వస్తున్న నన్ను అనుసరిస్తూ.

“పోన్లే నాయనా! ఈరోజు అది పడిన పాట్లకు – ఈ మధ్యలకు ఇంకెప్పుడూ రాదు.” అంటూ గుడిసె దగ్గరికి నడిచాను.

గుడిసె ముందు ఆరిపోయిన నెగళ్ళను విదిలించి – ఒకదానిపై ఇంకొకటి పేర్చి – వాటి కింద చిత్తుకాగితాలను ఉండగా చుట్టి పెట్టి, అగ్గిపుల్ల గీచి మంట పెట్టాడు నాన్న. చిన్నగా అవి రాజుకోసాగాయి. మంట కనిపిస్తే – ఆ దరిదాపులకు అడవిజంతువులు వచ్చే సాహసం చేయవు.

ఆ మంట ముందు కూర్చొని – బీడీ తీసి నోట్లో పెట్టుకొని, మండే నెగళ్లలోంచి ఒకటి తీసి ముట్టించుకున్నాడు నాన్న. దమ్ము గట్టిగా పీల్చి – “ఒరే శీనూ! ఆకలిగా ఉందిరా. కళింగర సార్లలోకి పోయి ఓ మంచి కాయ తెంపుకొని రా పోరా – తిందాం గానీ” అన్నాడు.

రాత్రి భోజనాలప్పుడు మా ఇద్దరికి తిండి సరిగా దిగలేదు. ఊరిబిండి…. అన్నం ఏదో కంగాళీగా తిన్నామనిపించాం. అందుకేనేమో నాన్నకు ఆకలేస్తోంది.

తోటలోకి పోయి – కళింగర (పుచ్చకాయ) సార్లపై టార్చి వేశాను. గజం పొడవునా రెండు జానల వెడల్పునా ఉండే కళింగర కాయలు సార్ల తిన్నెలపై కనిపించాయ్. ప్రతి సారెకు పదికి పైగా ఉన్నాయి. వాటిని చూస్తూంటే మూడేళ్లలోపు న్యాదర పిల్లోళ్ళు చెంప కింద చేతులు పెట్టుకొని నిద్రపోతున్నట్లు అనిపించింది.

తోటలోకి పోయి – కళింగర (పుచ్చకాయ) సార్లపై టార్చి వేశాను. గజం పొడవునా రెండు జానల వెడల్పునా ఉండే కళింగర కాయలు సార్ల తిన్నెలపై కనిపించాయ్. ప్రతి సారెకు పదికి పైగా ఉన్నాయి. వాటిని చూస్తూంటే మూడేళ్లలోపు న్యాదర పిల్లోళ్ళు చెంప కింద చేతులు పెట్టుకొని నిద్రపోతున్నట్లు అనిపించింది.

ఆ కళింగర కాయల్లోంచి ఒకటి, తొడిమ నుంచి విడతీస్తామనుకున్నాను. కానీ – ముందు కాయ లోపల మాగిందో లేదో చూద్దామనుకున్నాను. కాయపై గోటితో పై పెచ్చు గీరి చూశాను. పసుపు పచ్చగా కనిపించింది. అలా కనిపించిందంటే – చాలు, లోపల కచ్చితంగా ఎర్రగా మాగి ఉంటుంది.చేత్తో తొడిమ దగ్గర ‘అలా’ అన్నానో లేదో సులువుగా విడిపోయింది.

కళింగర కాయను భుజంపై పెట్టుకొని వచ్చి నాన్న దగ్గర పెట్తూ…

“కత్తి ఎక్కడ పెట్టినావు నాయనా!” అని అడిగాను.

“కత్తి దేనికిరా … మోకాలి చిప్పపై పెట్టి కొట్తే రెండు వొప్పులుగా విడిపోదూ… చూడు ఎట్లా విచ్చుకుంటుందో” అని కాయను మసాలా నూరే బండను ఎత్తినట్టు ఎత్తి తన మోకాలి చిప్పపై వొడుపుగా కొట్టాడు.

డుప్‌ప్ … అంటూ రెండుగా విడిపోయింది – కళింగరకాయ.

“ఒక వొప్పు నువ్వూ తీసుకో… నాకు సగం చాలు!” అన్నాడు.

మంట ముందు ఎదురెదురుగా కూర్చోని – చెరిసగం కాయను తింటున్నాం.

తిన్నకాడికి తిని – దోనె మాదిరి అయ్యాక గుజ్జును పిసికి వెలివేసి – రసం గుటగుట లాగించేశాడు నాన్న. ఇదేదో మంచివాటంలా గుందే అని నేనూ ఆ పనే చేశాను.

చేతులు కళింగర కాయ జిడ్డుతో జిగటగా మారాయి. మంచి కళింగర కాయ కండ నూక నూకగా వుండి – రసం జిగురుగా ఉండటం సహజమే!

గుడిసెలోకి పోయి – కడవలోంచి గ్లాసుతో నీళ్ళు నాన్నకిచ్చి – నేనూ కడుక్కున్నాను.

కడుపులో చల్లగా – తేపు వచ్చినప్పుడంతా తియ్యగా ఉంది. కాసేపటికి ఆవులింతలు ఎక్కువైనాయి. కనురెప్పలు బరువై నిద్రపోక తప్పింది కాదు.

నాకంటే ముందే నాన్న గురకలు పోతూ నిద్రలోకి జారిపోయాడు.

గంట….. గంటన్నర నిద్రపోయానో లేదో మళ్ళీ ఏదో అలికిడి నా చెవులకు తాకడంతో మెలుకువ వచ్చేసింది. అవసరానికి మించి నా చెవులకు వినికిడి శక్తి వుందేమో – అల్లంత దూరంలో చిన్నపాటి శబ్దమైనా ఇట్టే వినిపించేస్తుంది నాకు.

“నీవి పాము చెవుల్రా” అనేవాడు నాన్న. నిజమేనేమో. ఈతచాపలోంచి … ఏదో ఎక్కడో జరజరా… జరజరా అనే జారుతున్న అలికిడే అది. ఈత చాపకు చెవి ఆనించి – శ్రద్ధగా విన్నాను. ఔను. ఏదో బరువు వస్తువు ఇసుకలో జరుగుతున్న ధ్వని అది. ఇసుకలో ఉండే గమ్మత్తు ఏమిటంటే – తన గర్భంలో కానీ, తనపై కానీ ఏదైనా జరిగితే దాని ప్రకంపనలు ప్రసారం చేస్తుంది. అయితే దాన్ని వినగలిగే నేర్పు మనలో ఉండాలి – అంతే.

“నీవి పాము చెవుల్రా” అనేవాడు నాన్న. నిజమేనేమో. ఇంతకూ ఇప్పుడు ఈ అలికిడి ఎక్కడి నించి, ఇటు తిరిగి పడుకుంటూ చెవులు రిక్కించాను.

ఈతచాపలోంచి … ఏదో ఎక్కడో జరజరా… జరజరా అనే జారుతున్న అలికిడే అది. ఈత చాపకు చెవి ఆనించి – శ్రద్ధగా విన్నాను. ఔను. ఏదో బరువు వస్తువు ఇసుకలో జరుగుతున్న ధ్వని అది. ఇసుకలో ఉండే గమ్మత్తు ఏమిటంటే – తన గర్భంలో కానీ, తనపై కానీ ఏదైనా జరిగితే దాని ప్రకంపనలు ప్రసారం చేస్తుంది. అయితే దాన్ని వినగలిగే నేర్పు మనలో ఉండాలి – అంతే.

కంప కంచె దగ్గరే మళ్ళీ అలికిడినేమో అనుకొన్నాను. కానీ నెగళ్ల మంట మండుతున్నంత వరకు అడవి జంతువులు ఆ సాహసం చేయవు. మంటను చూస్తే – వాటికి చచ్చేంత భయం.

అడవి జంతువులు కాకపోతే – ఈ పని ఇంకెవరిదై వుంటుంది? అడవి జంతువుల కంటే భయంకరమైన మానవ మృగాలదేమో … ఆ ఆలోచన రాగానే ఓ రకమైన భయం ప్రవేశించింది నాలో.

నా చెవికి వినిపిస్తున్న ఆ జరజరా అలికిడి – మేం తాత్కాలికంగా లేపిన ఈ గుడిసె దగ్గర్నుంచి అరఫర్లాంగు దూరంలోంచి వస్తోందనిపించింది. రాత్రి…. పైగా నిర్మానుష్యం కావడంచేత ఆ అలికిడి స్పష్టంగా వినిపిస్తోంది.

ఇంతకు ఈ జరజర జారే ఆ బరువు వస్తువు ఏమై ఉంటుందో ఆలోచనకు దొరకడం లేదు. అరఫర్లాంగు దూరంలో ఏముందబ్బా! మా దోస తోటకు హద్దుగా కంప కంచె – ఆ కంచెకు ఆవల రెండు మూడు అడుగుల లోతులో ప్రవహిస్తున్న ‘పెన్నమ్మ’ ఉంది.

ఇంకొంచెంగా నా ఆలోచన వడిగా సాగింది. ఆ ధ్వని వస్తున్న ప్రాంతంలో చిరోంజి, షరబత్, అనార్, బతాసా, హింగన్, బొప్పాయి రకం దోస చెట్లు ఉన్నాయనే విషయం గుర్తుకొచ్చింది. దీనితో నా గుండె వేగంగా కొట్టుకుంది.

“అనుమానం దేనికిరా! దోసచెట్లలో దొంగతనాలు యిట్లే జరుగుతాయి. పారా అబ్బీ! పా…. నాయనా!! అవతల ఆ దొంగనాకొడుకులు ఎంతగా కొంపముంచారో చూద్దాం” ఆందోళనగా ముందుకు అడుగులేస్తూ అన్నాడు నాన్న.

దొంగలు, గోనె సంచుల్లో దోస పండ్లు నింపి – ఇసుకలో ఈడ్చుకొంటూ పోతున్నారా – ఏమిటి!?

ఆ ఆలోచన రావడంతోనే – బయట గురకలు పోతూ నిద్రపోతున్న నాన్నను లేపి విషయం చెప్పాను.

“అనుమానం దేనికిరా! దోసచెట్లలో దొంగతనాలు యిట్లే జరుగుతాయి. పారా అబ్బీ! పా…. నాయనా!! అవతల ఆ దొంగనాకొడుకులు ఎంతగా కొంపముంచారో చూద్దాం” ఆందోళనగా ముందుకు అడుగులేస్తూ అన్నాడు నాన్న.

దుడ్డుకర్ర, టార్చిలైటుతో నేనూ వడివడిగా బయలుదేరాను. ఇసుకలో అడుగులు ఎంత వేగంగా వేసినా… అనుకున్నంత వేగంగా ముందుకు పోలేకపోతున్నాం.

కోపం, ఆవేశం… పైగా ఇసుకలో వడివడిగా నడుస్తుండడంతో నాన్నకు శ్వాస పీల్చడం కష్టంగా వున్నట్లుంది – రొప్పుతున్నాడు.

గత డెబ్బయ్ రోజులుగా చిన్న పిల్లల్ని సాకినట్లుగా – ఈ దోసచెట్లను సాక్కుంటున్నాం. ఆ చెట్ల కోసం ఇంట్లో మిగిలిన చివరి సొత్తు అమ్మ చెవులకున్న కమ్మలు కూడా తెగనమ్మితే కానీ, ఎరువులకు, పురుగుమందులకు సరిపోలేదు.

వరదల పేరుతో ఆ మైలవరం డ్యాం నుండి ఈ సారైనా నీళ్ళు వదలకపోతే ఈ దోసచెట్లలో లాభం కళ్ల చూసే వీలుంటుంది. మేం ఊహించినట్లుగా ఈ మారు దోసపండ్ల ధరలు మంచి రేటు పలుకుతున్నాయి. అన్నీ కలిసి వస్తే ఈ దోసపండ్ల సీజన్ తరువాత చెల్లెలు వెంకటలక్ష్మిని ఓ అయ్య చేతిలో పెట్టవచ్చనుకొన్నాం.

వరదల పేరుతో ఆ మైలవరం డ్యాం నుండి ఈ సారైనా నీళ్ళు వదలకపోతే ఈ దోసచెట్లలో లాభం కళ్ల చూసే వీలుంటుంది. మేం ఊహించినట్లుగా ఈ మారు దోసపండ్ల ధరలు మంచి రేటు పలుకుతున్నాయి. అన్నీ కలిసి వస్తే ఈ దోసపండ్ల సీజన్ తరువాత చెల్లెలు వెంకటలక్ష్మిని ఓ అయ్య చేతిలో పెట్టవచ్చనుకొన్నాం.

గబగబా అడుగులేస్తూనే, ఆలోచిస్తూనే – టార్చిలైటు ఫోకసింగ్‌ని దోసతోటపై అటూ ఇటూ వేస్తున్నాను. ఆరు సెల్లుల టార్చిలోంచి వెలుతురు కర్రలా వెలుగు, చెట్లపై తిరుగాడుతోంది.

టార్చి వెలుగులో దూరాన గోనె సంచి కనబడింది. మళ్ళీ గమనిస్తే – ఆ గోనె సంచి తనంతకు తానుగా ప్రాణం పోసుకొని ముందుకు పోతున్నట్లనిపించింది. దోసపండ్లతో ఉన్న ఆ సంచి – ఏదో మంత్రశక్తితో జరజరా సాగి పోతుందా……. మనిషి మాత్రం అగుపించడం లేదు. మాయాబజార్ సినిమాలోలా ఉంది.

నా చిన్నప్పుడు మా అవ్వ – పెన్నగట్టున ఉండే రుద్రమంటపం దగ్గర రాత్రుళ్ళు కొరివి దయ్యాలు గాల్లో తేలాడుతుంటాయని – తాను చూశానని చెప్పిన సంగతి గుర్తుకొస్తోంది.

మరి – కొరివి దయ్యాలే అయితే – మండే కొరివి ఒకటైనా కనిపించాలి కదా!? అటువంటి జాడ ఏం లేదే! ఇంటర్మీడియట్ వరకు చదువుకొన్న నాకు, దయ్యాల, భూతాల ఆలోచనలు రావడమే విచిత్రంగా అనిపించింది.

దోసపండ్ల గోనె సంచిపై టార్చి వెలుగు నిలకడగా వేస్తూ – “నాయనా! అదో గోనె సంచి! మనిషి మాత్రం కనిపించడం లేదే!?” కంగారుగా అన్నాను.

“ఎవర్రా అది… రేయ్! దొంగ నాకొడకల్లారా! మీరు దోచుకోడానికి మా తోటే దొరికిందేంరా..లం.. కొడుకల్లారా!” నోటికి ఎలా వస్తే అలా బూతులు పెట్టాడు నాన్న. మళ్ళీ తనే,

“రేయ్! శీనిగా! ఆ కనిపిస్తా వుందే సంచి – దానికి కొంచెం పైన వెయ్ లైటు” రొప్పుతూ అన్నాడు.

టార్చి ఫోకసింగ్ ని వెడల్పుగా పడేట్లు సరిచేసి – లైట్ వేశాను. నిజమే! ఎవరో బాగా బలంగా ఉన్నాడు. నల్లటి డ్రాయరు తప్ప – శరీరంపై ఇక ఏ బట్టా లేదు. అందుకే చీకట్లో కనిపించడం లేదు.

దోసపండ్ల సంచిని ఈడ్చుకొంటూ పోతున్న ఆ ఆకారాన్ని నాన్న కూడా గమనించాడు.

ఇందులో ఏదో మర్మం ఉంది. నాన్న ఎందుకో తెలిసి దాస్తున్నాడనిపించింది. గుడిసె ముందు ఆరిపోతున్న నెగళ్ళను – మరికొన్ని చేర్చి మంట పెట్టాడు. బీడి మీద బీడి కాలుస్తూ ఆలోచనల్లో గొంతు కూర్చున్నాడు. అప్పుడప్పుడు పైతువాలతో కళ్లలో ఉబికి వస్తున్న కన్నీళ్ళను తుడుచుకోసాగాడు.

“రేయ్! శీను ఆ దుడ్డు కర్ర ఇటివ్వు” అని తీసుకున్నాడు. కర్రసాములో నాన్నకు మంచి అనుభవం ఉంది.

“నీయబ్బ! ఉండు నీ కథ చెప్తా” అంటూ కర్రను గాలిలో గిరగిరా తిప్పి విసురుగా గురి చూసి వదిలాడు.

అంతే ఆ కర్ర సరిగ్గా ఆ దొంగకు తగిలింది. దెబ్బ ఎక్కడ తగిలిందో ఏమో గానీ “ఓయమ్మా” అంటూ పెద్దగా బొబ్బ పెట్టాడా దొంగ.

పండ్ల గోనె సంచిని దార్లోనే వదిలేసినాడు. అది కదలకుండా ఉంది. ఇక నేను పరుగెత్తుకొని పోయి – దొంగను పట్టుకోబోయాను.

“ఓ నర్సయ్యా! నేనే లేరా.. నేనే లేరా…” అంటూ ఆ దొంగ కంచె దాటి – ఏటి నీళ్ళలోపడి చావు బతుకులుగా పారిపోతున్నాడు. తన పేరు….. ఆ గొంతుకను విన్నాడు నాన్న.

పారిపోతున్న ఆ దొంగను ఎలాగైనా పట్టుకొని కట్టెయాలన్న ఆవేశంతో ముందుకు దూసుకుపోతున్న నన్ను వారించాడు నాన్న.

“ఒరే అబ్బీ! కొంచెం ఉండరా!” నాన్న గొంతుకలో ఏదో మార్పు వినిపించింది.

“ఏం నాయనా! ఎందుకు నన్ను ఆపేసినావు?” అర్థం కాక ప్రశ్నించాను.

“అక్కర లేదులేరా! ఆ దొంగ ఎవరో నాకు తెలుసు” వెనుదిరిగి గుడిసె వైపు నడుస్తూ అన్నాడు నాన్న.

“ఏంది నాయనా! నూ ఏమంటున్నావో నాకేం అర్థం కావడం లేదు. చేతికి దొరకపోయినవాడ్ని పట్టుకోకుండా ఎందుకు వదిలేయమంటున్నావ్” అసహనంగా అన్నాను.

“ష్… అబ్బ! నీకు తెలియదు లేరా! పా… గుడిసె కాడికి పొదాం పాబ్బీ!” అన్నాడు.

ఇందులో ఏదో మర్మం ఉంది. నాన్న ఎందుకో తెలిసి దాస్తున్నాడనిపించింది. గుడిసె ముందు ఆరిపోతున్న నెగళ్ళను – మరికొన్ని చేర్చి మంట పెట్టాడు. బీడి మీద బీడి కాలుస్తూ ఆలోచనల్లో గొంతు కూర్చున్నాడు. అప్పుడప్పుడు పైతువాలతో కళ్లలో ఉబికి వస్తున్న కన్నీళ్ళను తుడుచుకోసాగాడు.

అనుకోకుండా మా మధ్య వాతావరణం బరువైంది. దీనికి కారణమైన ఆ దొంగను గురించే నాన్న – ఈ విధంగా బాధపడుతున్నాడనేది స్పష్టమైంది.

ఇంతకూ ఆ దొంగ ఎవరో…… నాన్నకు బాగా తెలుసు.

“ఏంది నాయనా! ఎందుకు బాధపడుతున్నావ్. ఇంతకూ ఆ దొంగ ఎవరు” అనునయంగానే నిజం రాబట్టాలని అడిగాను.

“ఎవరో అయితే నేను ఎందుకు బాధపడుతాన్రా అబ్బీ! ఎవరో కాదురా, మన ఆసామి నేకనాపురం రామయ్య కొడుకు కిష్టప్ప!” రహస్యం విడదీస్తూ చెప్పాడు.

నెత్తి మీద పిడుగు పడినట్లయింది నాకు.

రానురాను వాళ్ల పరిస్థితి వరుస కరువు దెబ్బలతో అధ్వాన్నంగా మారింది. వాళ్ల పరిస్థితి దిగజారినా – నలుగురిలో నామోషీగా ఉంటుందని కూలికి పోలేక…… భూముల్లేని పేదోళ్ళ ఏటి సేద్యం అయిన ఈ దోసచెట్లేసుకొనే జోలికి రాలేక… వాళ్ల కుటుంబం ఆర్థికంగా ‘ఫైసలై’పోయింది.

పదేళ్ళ క్రితం వరకు నాన్న ఆయప్ప అంచున భూములు చేసుకొనే సేద్యగానిగా ఉండేవాడు. రానురాను వాళ్ల పరిస్థితి వరుస కరువు దెబ్బలతో అధ్వాన్నంగా మారింది. నాన్నను సేద్యగానిగా పెట్టుకోవడం వాళ్ల పాలికి అదనపు బరువు అయ్యింది. ఆ విషయం చెప్పలేక – వాళ్లు వెనకా ముందు అవుతుంటే – ఆరోగ్యం సరిగా ఉండటం లేదని నాయనే అబద్ధం చెప్పి పని మానుకొన్నాడు.

రెక్కల కష్టం చేసి బతికేవాళ్ళం. మా పరిస్థితి అప్పుడూ – ఇప్పుడూ రెక్కల మీద ఆధారపడింది కావడంతో మా కుటుంబం తలక్రిందులు అయ్యిందేమీ లేదు.

నిజం చెప్పాలంటే ఈ పదేళ్ళ నుండి వట్టిపోయిన పెన్నేట్లో స్వంతంగా దోసచెట్లు వేసుకోవడంతో… మా కుటుంబం కొంచెం ఊపిరి పోసుకుంటోంది.

కాకపోతే – రామయ్యప్ప వాళ్ల పరిస్థితి దిగజారినా – నలుగురిలో నామోషీగా ఉంటుందని కూలికి పోలేక…… భూముల్లేని పేదోళ్ళ ఏటి సేద్యం అయిన ఈ దోసచెట్లేసుకొనే జోలికి రాలేక… వాళ్ల కుటుంబం ఆర్థికంగా ‘ఫైసలై’పోయింది.

నలుగురికి సాయం చేసే స్థితిలో బతికి – ఇప్పుడు చెడిన రామయప్ప గానీ…. ఆయన కొడుకు ఈ కిష్టప్ప గానీ నాయనను గనుక ఒక్క మాట అడిగి ఉంటే చాలు. ఓ వెయ్యి దోస పండ్లు బండ్లకెత్తించి పంపేవాడు. నాన్నకు తన ఆసామి గారి కుటుంబం మీద అంత గౌరవం ఉందని తెలుసు నాకు. కానీ, తమ దగ్గర సేద్యగానిగా పనిచేసిన వ్యక్తి దగ్గర చెయ్యి సాచడం చిన్నతనం అనుకొన్నాడేమో!

ఆ రాత్రి ఆలోచనలతో, ఎప్పుడు నిద్రపోయామో గుర్తు లేదు. తెల్లవారింది. దోసతోటలు గుత్తకు తీసుకున్న ఆసామి కూలోళ్ళతో గట్టిగా ఏదో మాట్లాడుతున్నాడు. కాయలు కోస్తున్న కూలోళ్ళు… లారీకి గంపలనెత్తిస్తూ అనుకొంటున్నారు.

కిష్టప్ప పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడని – ఎగువపేట మిట్ట మింద శవం పడి ఉంటే – పొద్దున్నే ఎనమలను తోలుకపోయిన వాళ్ళు చూసి – ఊర్లో చెప్పారని.. ఏదేదో అంటున్నారు. ఒక గోనెసంచెడు దోసకాయలు వాళ్ళ ఇంటికి పంపుదామనుకున్న నాకు కూలోళ్ళు అనుకొంటున్న మాటలకు గుండెల్లో ఎక్కడో ఎదో ‘అలికిడి’ అయ్యింది.

నేను, నాయన చివరి చూపులకు పాసి మొహంతోనే ఊర్లోకి బయల్దేరినాం.

—————————

శశిశ్రీశశిశ్రీ అసలు పేరు షేక్ బేపారి రహంతుల్లా. జన్మస్థలం సిద్ధవటం, కార్యక్షేత్రం కడప. ఆశుకవిగా, జీవితాన్ని దృశ్యీకరించే రచయితగా, సీనియర్ జర్నలిస్టుగా, చక్కటి వాగ్ధాటి గల వక్తగా మంచిపేరున్నవారు. 1975 – 1980 లో మనోరంజని లిఖిత మాసపత్రికను నడిపారు. 1995 నుంచి సాహిత్యనేత్రం పత్రికను నడుపుతున్నారు. వంద కథలు రెండు వందల సాహిత్యవ్యాసాలు, 60 వరకు పాటలు, 50 వరకు సాహిత్యపరమైన ఇంటర్వ్యూలు, చాలా కవిత్వం రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారభాషాసంఘం వారిచే రెండు పర్యాయాలు భాషాపురస్కారాలు పొందారు. పల్లవి, శబ్దానికి స్వాగతం, జేబులో సూర్యుడు (2006) వీరి వచనకావ్యాలు. సీమగీతం పద్యకావ్యం. జేబులో సూర్యుడు ఉర్దూలో జేబ్ మే సూరజ్ పేరిట వెలువడింది. దహేజ్ వీరి కథాసంపుటి.
అక్టోబర్ 1998లో ప్రజాసాహితిలో ప్రచురించబడిన అలికిడి కథ వీరి దహేజ్ కథాసంపుటిలోనిది. ఈ కథను పొద్దులో ప్రచురించడానికి అనుమతించిన రచయితకు కృతజ్ఞతలు.

This entry was posted in కథ and tagged , , . Bookmark the permalink.

9 Responses to అలికిడి

  1. చాలా చక్కటి కథ. ఇటువంటి కథలను మరిన్ని ప్రచురించండి.

  2. sairam kolasani says:

    బహుశా ఓడలు బళ్ళు అవడమంటే ఇదే కావచ్చు.

  3. సీనుగాడు says:

    కథ చాలా బావుంది. కథనం ఇంకా బావుంది.
    మీరు రిలీజ్ చేసిన కథాసంపుటి “దహేజ్” తప్పకుండా చదువుతాను.
    మిమ్మల్ని పరిచయం చేసిన ప్రొద్దు వారికి అభినందనలు.

  4. aakaasaraamanna says:

    మళ్ళీ చాన్నాళ్ళ తర్వాత ఓ మంచి కథ చూశాను.
    నిజంగా చూసినట్టే వుంది.. మేము మాట్లాడుకున్నట్టే వుంది. కథలో నేను కలిసిపోయాను. ఆసామి నేకనాపురం రామయ్య కొడుకు కిష్టప్ప చనిపోయినపుడు-కళ్ళెంట నీళ్ళు గిర్రున తిరిగాయి.

  5. Dr.Kodi.Rama says:

    ఆణి ముత్యాలు యేరి ప్రచురిస్తున్న మీరు నిజంగా అభినందనీయులు. —Dr.Kodi.Rama,UAE

  6. కడప says:

    ఈ కథను చూస్తే శశిశ్రీ సేద్యం చేసిన మనిషి మాదిరిగా వున్నాడే! కడప రేడియోలో ‘జిల్లాసమాచార లేఖ’ అందించే విలేకరి ఈ శశిశ్రీయేనా?

  7. @ కడప: అవునండీ, ఆయనే ఈయన. కడపలో ఆకాశవాణి, దూరదర్శన్ ల విలేకరి.

  8. వంశీ says:

    ఈ కథ చాలా బాగుంది.
    మనసును ఒక్క సారిగా తడిమింది..
    ఇలాంటి మరిన్నికదలు ప్రచురించ గలరు…

  9. Katha chalaa baagundi

Comments are closed.