అక్టోబరు బ్లాగుల విశేషాలు

-చదువరి

తెలుగు బ్లాగుల్లో వ్యాఖ్యల విప్లవం వస్తున్నట్టుంది. “అబ్బో.. నలభై యాభై దాటి వ్యాఖ్యలు వచ్చేస్తున్నాయం”టూ మేం ఆశ్చర్యపడిపోయి నిండా రెణ్ణెల్లు కాలేదు, ఇప్పుడవి వందకు చేరాయి. మనసులోమాట సుజాత రాసిన మీ చదువులు మా చావులు టపాకు వ్యాఖ్యలు వందకు చేరిన సందర్భంగా తెలుగు బ్లాగులు ఒక మైలురాయిని చేరుకున్నాయి.

తెలుగు మాధ్యమాలు బ్లాగులపై దృష్టి సారించాయి. బ్లాగులంటే ఏమిటో, ఎలా రాయాలో చెప్పే వ్యాసాలతో పాటు, వారం వారం ఒక బ్లాగును పరిచయం చేసే వ్యాసాలూ వస్తున్నాయి. వీటి ప్రభావం కూడలిలోనూ, బ్లాగు పాఠకుల సంఖ్యలోనూ తెలుస్తోంది. బ్లాగులు నిదానంగా జాలజనజీవనస్రవంతి లోకి జొరబడుతున్న సూచనలు కనబడుతున్నాయి.

రాజకీయాలు, చర్చలు
అక్టోబరు రాజకీయ బ్లాగులు మతము, మతఘర్షణల చుట్టూ ఎక్కువగా తిరిగాయి. చర్చలు కూడా ఎక్కువగా రాజకీయ బ్లాగుల్లోనే జరిగాయి. ఒరిస్సాలో జరిగిన హింసాకాండ నేపథ్యంలో మతమార్పిడులను చదువరి రక్తపాత రహిత కుట్రగా వర్ణించారు. అక్కడ జరిగిన చర్చ మహేష్ పర్ణశాలలో రాసిన టపాలో కొనసాగింది. అసలు వీటికి మూలం నాగప్రసాద్ రాసిన మీరు దేవుణ్ణి తింటారా అనే టపా! ఈ లోగా వాసిలి సురేష్ ఒరిస్సాలో జరిగిన దాడులకు మూలాలను వెతికారు. ఇదిలా ఉండగా అబ్రకదబ్ర అభి-మతం అనే టపాలో తన అబిప్రాయం రాసారు. క్రైస్తవం గురించి జాన్ హైడ్ కొన్ని టపాలు వేసారు. రామాయణం మీద వస్తూ ఉన్న టపాల వరుసలో మరొక టపా దుర్గేశ్వర రాసారు. ఇతర టపాల లాగానే ఇది కూడా చర్చకు వేదికయింది.

జ్ఞానపీఠానికి తెలుగువారిలో అర్హులెవ్వరు అంటూ ఒక చర్చ జరిగిందీ నెల. పూలదండను పట్టుకుని చంద్రమోహన్ జ్ఞానపీఠార్హులెవరంటూ వెదకబోయారు. కొత్తపాళీ కూడా ఈ పీటముడిని విప్ప ప్రయత్నించారు. త్రివిక్రమ్ అందుకుని జ్ఞానపీఠపు మర్మాన్ని కనుగొన ప్రయత్నించారు.

సాహిత్యం, సంగీతం

స్వగతాలు, స్వ గతాలు

సినిమా

హాస్యం, వ్యంగ్యం

ఇంద్రధనుస్సు

  • తిండి మీద దృష్టి సారించారు బ్లాగరులు. పప్పును మించిన పాకము కలదా అంటూ పప్పుసుద్ద శ్రేష్టత గురించి మాకినేని ప్రదీప్ రాస్తే, పప్పుల్లో మహాపప్పు కందిపప్పు అంటూ వ్యాఖ్యాతలు రాసారు.
  • వాసన పట్టేసిన భాస్కరరామరాజు ముద్దపప్పు గురించి ఓ టపా వేసారు. వివిధ రకాలైన పప్పులను తయారుచేసే ప్రోగ్రాములను అందరికీ అర్థమయ్యే రీతిలో రాసారు కూడా.
  • బాపు అనగానే రమణ గుర్తొచ్చినట్టు, పప్పనగానే ఆవకాయ గుర్తుకు రావడం ఆంధ్రుడి లక్షణం. తల్లక్షణ ఫలితమే విరజాజి పూయించిన ఆవకాయ పురాణం టపా!ఈ విధంగా పప్పావకాయతో అక్టోబరు బ్లాగులు రుచులూరిపోయాయి.
  • భోజనాలకి పిలిచి వేళకి భోజనం పెట్టకపోతే కలిగే బాధను తాడేపల్లి తన ఆఱు నూఱైనా…. లో వివరించారు.
  • గార్లపాటి ప్రవీణ్ ఓ సాయంత్రం – ఆఫీసు నుంచి ఇంటికి … అంటూ తన ఆలోచనాస్రవంతిని బ్లాగులో ప్రవహింపజేసాడు.
  • వివిధ బ్లాగులు, బ్లాగరుల పేర్లను స్పృశిస్తూ, గతంలో కొల్లూరి సోమశంకర్ పొద్దులో ఒక లేఖ రాసారు. ఇప్పుడు వివిధ బ్లాగరులను పలకరిస్తూ లీలామోహనంలో ఒక జాబు వచ్చింది. బ్లాగు పేర్లకు తగిన బొమ్మలు పెట్టడం ఈ టపా ప్రత్యేకత.
  • కురులను సంరక్షించుకోవటం ఎలా అనే విషయంపై శ్రీసత్య వరసగా టపాలు వేస్తున్నారు. వాటిలో ఈమధ్య వచ్చిన టపా ఇది.
  • నేను హార్లిక్సు తాగను, తింటాను అన్నట్టు, టీవీలో యాడ్లే చూస్తాను అంటూ చెబుతున్నారు పసిగుడ్డు.
  • శివుడాజ్ఞ అంటూ నిడదవోలు మాలతి ఒక కథ రాసారు. విశిష్టత ఏంటంటే.. రెండు ముగింపులను ఇచ్చి ఏది నచ్చిందో చెప్పండని పాఠకులను అడగడం.
  • భయం భయం అంటూ లచ్చిమి రాసిన టపా ఆకట్టుకుంది. తన అసలు పేరు రష్మి (చిన్నపిల్ల కావడంతో ర ను ‘ల’ గానూ, ‘ష్మి’ని ‘చ్చిమి’గానూ పలుకుతున్నదని అనిపిస్తోంది) అని ఎప్పటికి చెప్పగలుగుతుందో.
  • మహాత్ముడి పుట్టినరోజు మాటున మరుగునపడిపోయిన లాల్ బహదూర్ శాస్త్రి పుట్టినరోజును మననం చేసుకున్నారు సురేష్.
  • పొద్దులో ప్రచురింపబడి ప్రాచుర్యం పొందిన కైవల్యం కవితపై తన అభిప్రాయాన్ని రాసారు అరుణాంక్

కొత్త బ్లాగులు

ప్రత్యేక ప్రస్తావన
సుప్రసిద్ధులైన తెలుగువారి గురించి మనకు తెలీని ఎన్నో విషయాలను చెబుతూ సాగిపోయే బ్లాగు తెలుగురథం. మనకు పేరు ప్రతిష్ఠలు తెచ్చిన మహామహుల జీవితాల గురించి, ప్రసిద్ధ సంఘటనల గురించి, పండుగల గురించి ఈ బ్లాగులో టపాలు వస్తూంటాయి. సందర్భోచితంగా – మహానుభావుల జయంతి లేదా వర్ధంతి రోజునగానీ, పండుగల రోజునగానీ, సంఘటనల వార్షికానగానీ – వ్యాసాలను వెలువరించడం ఈ బ్లాగు ప్రత్యేకత. పాత వ్యాసాలను చదువుకునేందుకు వీలుగా నెలవారీగా టపాలకు లింకులు ఇస్తే బాగుంటుంది.

తెలుగురథం చోదకులు కొంపెల్ల శర్మకు అభినందనలు

————————————-

చదువరి పొద్దు సంపాదకవర్గ సభ్యుడు.

This entry was posted in జాలవీక్షణం and tagged , , . Bookmark the permalink.

23 Responses to అక్టోబరు బ్లాగుల విశేషాలు

  1. రవి says:

    గత నెల సింహావలోకనం మిస్ అయినా, ఈ నెల ఆ లోటు తీరుస్తూ,చక్కటి సింహావలోకనాన్ని ప్రచురించారు. చదువరి గారు, ధన్యవాదాలు. బ్లాగ్లోకంలో చర్చలు ఎక్కువవ్వడం మంచి పరిణామమే అయినా, కొన్ని అనవసర పోకడలు కూడా బయలుదేరుతున్నాయి. ఇది కాఫీ కప్పులో తుఫాను గా భావించి ముందుకు సాగుదాం.

    దీపావళి మాసం కాబట్టి, ఈ టపా పటాసులతో ముడిపెట్టి రాసుంటే? అన్న ఆలోచన వచ్చింది నాకు మొన్న. అంటే : ప్రమిదల ప్రమదావనాలు, దీపం ఆర్పమంటూ(బత్తీ బంద్) మరిన్ని దీపాలు వెలిగించే కొత్తపాళీలు, చిరునవ్వుల చిచ్చుబుడ్లూ, చర్చలు, విమర్శల తారాజువ్వలూ, చెణుకుల కాకరపూలు, కబుర్ల భూచక్రాలు …ఇలా…

  2. లచ్చిమి says:

    నేను లచ్చిమి నే
    పదహారణాల తెలుగింటమ్మాయినే
    నా పేలు రష్మి కాదు
    పొద్దు వారికి ధన్యవాదాలు నా బ్లాగ్ ని కూడా గుర్తించినందుకు

    ఇక పొతే బ్లాగుల సింహావలోకనం చాల బాగుంది
    మంచి మంచి టపాలు మిస్ అయితే అన్నీ ఇక్కడ చూసేయ్యోచ్చు
    భలే భలే

  3. Virajaaji says:

    చాలా సంతోషమండీ.. నా ఆవకాయ పురాణానికి మీ అక్టోబరు బ్లాగు విశేషాల్లో ఉండే అదృష్టం కలుగుతుందని అనుకోలేదు. నా బ్లాగుని చాలా మంది ఇలా అయినా చదువుతారు.

  4. లచ్చిమి says:

    అన్నట్టు అక్టోబర్ లో ప్రమదలందరూ రాసిన బ్లాగు ప్రయాణం ని ఈ సింహావలోకనం లో చేర్చినట్టు గా లేదే ????

  5. అనామిక says:

    ఇదో దిక్కుమాలిన సమీక్ష! దీన్ని సమీక్ష అనేకంటే మాకు నచ్చేసిన బ్లాగుల టపాలు అంటే బాగుంటుంది. ఇదో పక్షపాత దృష్టి బ్లాగు ..బ్లాకు ..బాకు!

  6. laxmi says:

    పొద్దు సమీక్షలో నా బ్లాగ్ ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు

  7. రవి says:

    1100 బ్లాగులు బ్లాగ్లోకంలో ఉన్నప్పుడు, ఒక్కో సారి కొన్ని మిస్ అవడం జరగొచ్చు. అయినా మంచి టపాలు రాసేప్పుడు ప్రోత్సహించే వాళ్ళు ఉండనే ఉంటారు ఎప్పుడైనా. ఆగస్టు లో కూడా ఇలాంటి వ్యాఖ్య ఎవరో రాసినట్టు గుర్తు. పొద్దు సంపాదకులు ఇలాంటి వ్యాఖ్యలకు కాక, ఈ శీర్షికను అభిమానించే వాళ్ళను, వాళ్ళ సంఖ్యను దృష్టిలో పెట్టుకుని, కంటిన్యూ చేయాలని విఙ్ఞప్తి.

  8. durgeswara says:

    పొద్దులో మనమెలా కనపడాలా అని ఆలోచనతో ,అభ్యర్థనతో ఎదురుచూస్తున్న నాకు పొద్దులో కూడా పేరు కనపడటము సంతోషమయినది. మరింతమంది మిత్రులకు పరిచయం చేసినందుకు ధన్యవాదములు.

  9. vijayamohan says:

    నన్ను గుర్తించినందుకు ‘లీలామోహనం’గా కృతజ్ఞతలు

  10. అనామికగారూ ! మీతో ఏకీభవించలేకపోతున్నందుకు మన్నించండి. పొద్దులో ఉన్న ఈ శీర్షిక మీకు నచ్చినా, నచ్చకపోయినా మీ భావవ్యక్తీకరణల్ని దయచేసి మీరే కొంచెం సంయమించుకోవాలి (Self-moderation).

    సమీక్షలు రాసేవారు కూడా మనలాంటి మనుషులే. ఇవి రాసినందుకు వారికి జీతం బత్తెం ఏమీ ఉండవని గమనించగలరు. వారి వ్యక్తిగత ఆసక్తి కొద్దీ రాస్తున్నారు. పదకొండు వందలకి పైగా ఉన్న తెలుగు బ్లాగులన్నింటినీ ప్రతినెలా సమీక్షించడం నాకు తెలిసి సాధ్యపడదు. ఒకవేళ మీ బ్లాగుని సమీక్షకులు ఇక్కడ పేర్కొనకపోతే మీకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం తప్ప మఱింకేమీ చెయ్యలేను.

  11. ఆగిందనుకున్న బ్లాగుల రౌండప్ మళ్ళీ కొనసాగించడం ఆనందకరం.
    కొత్త బ్లాగర్లు చక్కగా రాస్తున్నారు. అందరికీ అభినందనలు.

  12. cbrao says:

    అసంఖ్యాకంగా వస్తున్న ఇన్ని బ్లాగులను చదివి,సమీక్షించటడం సులువైన పని కాదు. ఇన్ని వందల బ్లాగులు వస్తుండగా,అన్నింటిని గుర్తించి, సమీక్షించటం సాధ్యమయ్యే పని కాదని అనామిక గ్రహించాలి. అనామిక, ఈ సమీక్షలో వదిలిన మంచి టపాలను తను పరిచయం చేస్తే బాగుండగలదు.

    -cbrao,
    San Jose, CA.

  13. పైన సీబీరావుగారూ, తాడేపల్లి గారూ వెల్లడించిన అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తాను. సమీక్షలు, వ్యాఖ్యలూ ఎప్పుడూ వైయక్తికమే. రావుగారు చెప్పినట్టు మరొక బ్లాగరు కానీ పత్రిక గానీ మరో సమీక్ష రాస్తే లాభమే కానీ నష్టం లేదు కదా. మరొక దృక్కోణం వ్యక్తం కాగలదు.
    పోతే పొద్దువారికి నాకథ గుర్తించినందుకు ధన్యవాదాలు.

  14. అదీ గాక బ్లాగుల ప్రాచుర్యం సమీక్షల మీద ఆధారపడి ఉండదు. ఒక మూణ్ణాలుగు చెత్తటపాలు వరుసగా వస్తే చాలు, జనం సదరు బ్లాగు మీద శీతకన్ను వెయ్యడానికి ! ఎంతగా ఎంతమందిచేత సమీక్షించబడినా బ్లాగు ఎప్పటికప్పుడు నవనవోన్మేషంగా ఉంటేనే గానీ నిలబడ్డం కష్టం.

  15. సమీక్ష బాగుంది . ఈ సమీక్ష కోసం ఎదురుచూసే వాల్లలో నేనూ ఒకడిని .

  16. narmadaa says:

    blog lokam naaku kotha. ikkada telugulo raayadam raaledu. lekhinito ikkada ela raayadam, blogs pai mee sameeksha bahu baagu.

  17. This is an excellent service you’re providing to the blog reading public.
    ప్రమదావనపు ప్రభంజనాన్ని మరువడం సాహసమే. దయచేసి ఈ పొరబాటుని సవరించండి.

  18. విశ్వామిత్ర says:

    ఐతే ఆనంద్ విజయం గురించి ఎవరూ రయలేదన్నట్టేనా?

  19. మంచి మంచి బ్లాగుల గురించి తెలుసుకున్నాను
    నా బ్లాగు ఎప్పుడు కనిపిస్తుందో ఇక్కడ.. హుమ్మ్..
    ప్రయత్నిస్తా.

  20. కొత్తపాళీ: ఆ ప్రభంజనం ఇక్కడ లేకపోవడానికి ప్రత్యేకంగా కారణమేమీ లేదండి. దాన్ని కూడా చేర్చి ఉంటే బావుండేది.
    విశ్వామిత్ర: వచ్చినట్టుగా లేదండి. నేను వెతికి చూడలేదు.

  21. vasilisuresh says:

    పొద్దుకి ప్రత్యేక కృతఙ్ఞతలు ఎందుకంటే నా బ్లాగును గుర్తించినందుకు…..

  22. gandhi says:

    good evening…its good blog..keep it up sir

  23. Noorbasha Rahamthulla says:

    తెలుగు ప్రజల మాటల్లో ఎన్నో సంస్కృత, ఆంగ్ల, ఉర్దూ పార్శీ భాషల పదాలు దర్శనమిస్తుంటటాయి. ఈ అన్య దేశ్య పదాలను తెలుగు తనలో దాదాపు పూర్తిగా కలుపుకొని సుసంపన్నమయ్యింది. పరభాషా దురభిమానము,మొండితనములేని సరళమైన భాష తెలుగు. తెలుగువారి కున్నంత పరభాషా సహనం, ఈ దేశంలో మరెవరికీలేదంటే అతిశయోక్తి కాదేమో. ఈ సహనం వలనే అనేక పరభాషా పదాలు తెలుగులోకివచ్చి స్థిరపడి దాని స్వంతమే అన్నట్లయిపోయాయి. సంస్కృత, ఆంగ్ల పదాలు మన అనుదిన జీవితంలో ఎన్నోవాడుతున్నాము. అవి మనకు తెలిసినవే. అయితే మనం రోజూ మాట్లాడే తెలుగులో దొర్లే కొన్ని పదాలు ఉర్దూ పదాలని మనకు తెలియదు. తెలుగు ఇంగ్లీషు నిఘంటువులో సి.పి.బ్రౌన్‌ పేర్కొన్న ఈ క్రింది హిందూస్థానీ పదాలను గమనించండి:- అంగరకా, అంగరేకు, అంగిక, అంగీ, అంగుస్తాను, అంగూరు, అంరు, అండ, అందాజు, అందేషా, అంబారము, అంబారి, అకరం, అకస్వారీ, అకీకత్‌, అక్కసరి, అక్కసు, అక్షాయి, అగాదు, ఆగావు, అజా, అజమాయిషీ, ఆటకాయించు, ఆఠావణీబంట్రోతు, అఠ్వాడ, అడతి, అడితి, అడిసాటా, అతలషు, అత్తరు, అదాపరచు, అదాలతు, అదావత్‌, అనీం అపరంజి, అబ్వాబు, అభిని, అమలు, అమాంతము, అమాదినుసు, అమానతు, అమానీ, అమానుదస్తు, అమీనా, అమ్రాయి, అయబు, అయిటవేజు, అర్జీ, అర్జు, అలంగము, అలకీహిసాబు, అలగా, అలాదా, అలాహిదా, అలామతు కర్ర , అల్కీ, అల్జి, అల్మార, అలమారు, అల్లీసకర్ర, ఆవాజా,అవుతు, అవుతుఖానా, అవ్వల్‌, అవ్వాయిచువ్వలు, అసలు, అస్తరు, అహలెకారులు, అహషాంబంట్రోతులు. ఆఖరు, ఆజుబాజు, ఆజమాయిషీ, ఆబాదు, ఆబాలు, ఆబ్కారీ, ఆమిషము, ఆమీను, ఆరిందా, ఆలుగ్డ, ఆవర్జా, అసరా, ఆసామీ, ఆసాయము, ఆసోదా, ఇక్తియారు, ఇజారా, ఇజారు, ఇనాము, ఇరుసాలు, ఇర్సాలు ఇలాకా, ఇస్తిమిరారి, ఇస్తిరి, ఇస్తిహారు, ఉజాడ, ఉజయబోడ, ఉఠావుఠి ఉడయించు, ఉద్దారి, ఉపరిరయితు, ఉమేదు (ఉమేజు), ఉల్టా, ఏకరారు, ఓకు, కంకర, కంగాళీ, కంగోరీ, కచేరీ, కచ్చా, కజ్జా, కదపా, కదము, కదీము, కబాతుకోడి, కబాయీ, కబురు, కబేలా, కమాను, కమామిషు, కమ్మీచేయ, కరారు, కరుబూజుపండు, కలాలు ఖానా, కళాయి, కళాసి, కవాతు, కసరతు, కసాయి, కసుబా, కాగితము, కాజీ, కాతా, కామందు, కాయము, కాయిలా, కారాేనా, కాళీ, కాసా, కితాబు, కిఫాయతు, కిమ్మత్తు, కిరాయి, కిస్తీ, కిస్తు, కుంజడ, కుంజరి, కుందా, కుంబీ, కుడతా, కుడితినీ, కుమ్మకు, కురింజ, కురిచీ, కుల్లాయి, కుశాలు కుస్తీ, కుషీ, (ఖుషీ) కూజా, కూనీ (ఖూనీ) కేపు, కైదీ (ఖైదీ), కైఫియ్యతు, కైరి, కైలు, కొజ్జా, కొఠీ, కొత్వాలు, కొర్నా (కొర్నాసిగండు), కౌలు (కవులు) ఖజానా, ఖరాగా, ఖరారా (ఖరారు), ఖరీదు, ఖర్చు, ఖసిచేయు, ఖామందు, ఖాయము, ఖాయిదా, ఖాళీ (కాళీ), ఖాసా, ఖిల్లా, ఖుద్దున, ఖులాసా (కులసా) గప్చిప్పు, గప్పాలు, గమ్మత్తు, గయాళీ, గలబ, గల్లా, గల్లీ, గస్లీ, గాగరా, గాడు, గాబరా, గిరాకీ, గుంజాయిషీ, గుజరానీ, గుజరాయించు, గుజర, గుజిలి, గుజస్తీ, గుబారు, గుమాస్తా, గులాబి, గులాము, గైరు, గైరుహాజరు, గోడ, గోండు, గోరీ, గోలీ, గోషా, గోష్వారా, చలాకి, చలానా, చలామణీ చాందినీ, చాకిరీ, చాకు, చిరునామా, చెలామణి, చందా, చందుకా, చోపుదారు, చౌరాస్తా, ఛాపా, ఛావు, జంజీరు, జంపఖానా, జంబుఖానా, జనాభా, జనానా, జమాదారుడు, జరిమానా, జవాబు, జవాహిరి, జాగ, జాగీరు, జాటి, జారీ, జాస్తి, జిరాయితీ, జిల్లా, జిల్లేదారుడు, జెండ, జేబు, జేరుబందు, జట్టీ, జప్తీ, జమ, జమీను, జమీందారు, జముజాలి, జరబాజు, జరీ, జరూరు, జాబితా, జామీను, జుబ్బా, జుమలా, జుల్మానా, జోడ, జోడు, జోరు, టపా, టలాయించు, టటాకీ, రాణా, డలాయతు, డల్లీ, డవాలీ, డులా, డోలి, తండేలు, తకరారు, తగాదా, తనఖా, తనిఖీ, తప్సీలు, తబ్దీలు, తరందారీ, తరద్దూదు, తరహా, తరీఖు, తర్జుమా, తవాయి, తస్రపు (తసరబు), తహశ్శీలు, తాకీదు, తాజా, తారీఖు, తాలూకా, తాలూకు, తాళాబందు, తివాసీ, తీరువ, తీరువజాస్తి, తుపాను, తైనాతీ, తోపరా, దంగా, దగా, దగుల్బాజీ, దఫా, దబాయించు, దబేనా, దమదమా, దమ్మిడు, దరఖాస్తు, దరిమిలాసు, దరియాప్తు, దరుజు, దరోబస్తు, దర్జా, దర్జీ, దర్బారు, దలాలీ, దవుడు (దౌడు) దాణా, దామాషా, దారోగా, దాల్చిని, దాళా, దావా, దినుసు, దిమాకు, దిటవాణము, దివాలా, దివాలాకోరు, దుకాణము, దుప్పటి, దుబారా, దుబాసీ, దురాయీ, దుర్భిణి, దేవిడు, దౌలత్తు, ధూకళి, నంజ (నంజి), నకలు, నకషా, నకీబు, నక్కీ, సఖరా, నగదు, నగారా, నగీషీ, నజరానా, నఫరు, నఫరు జామీను, నఫా (సభా), నమూదు (నమోదు), నమూనా (నమోనా), నమ్మకు, నవరసు, నవారు, నవుకరీ (నౌకరీ), నవుకరు, నాగా, నాజరు, నాకు, నాడ, నాదూరు, నామోషి, నారింజ, నిఘా, నిరుకు, నిలీను, నిశాని, నిషా, నిషిందా, నిసబు, నెజా, నౌబత్తు, పంఖా, పంచాయితీ, పకాళి, పకోడి, పచారు, పజీతి, పటాకి, పట్కా, పట్టా, పట్టీ, పత్తాపరంజు,పరకాళా గుడ్డ, పరగణా, ఫర్మానా, పరవా, పరారీ, పలాన, పల్టీ, పసందు, పస్తాయించు, పాంజేబు, పాజీ, పాపాచి, పాపోసు, పాయకట్టు. పాయకారీ, పాయమాలీ, పాయిఖానా, పారా, పారీఖత్తు, పాలకి (పల్లకి) పావు, పావులా, పిచాడు, పిచ్చికారు, పితూరీ, ఫిరాయించు, ఫిర్యాదు, పీరు, పిరుసుడి, పుంజనేల, పుకారు, పులావు, పుసలాయించు, పూచీ, పూరా, పేరస్తు, పేషిగీ, పేష్కషు, పేష్కారు, పైజారు, పైమాయిషీ, పైలుమాను, ఫైసలా, పోరంబోకు, పోచాయించు, పోంచావణి, పోస్తకాయ, పళిలిజు, ఫకీరు, ఫక్తు, ఫయిసలా, ఫర్మానా, ఫలానా, ఫసలీ, షాయిదా, ఫిరాయించు, ఫిర్యాదు, బంగి (భంగి) బంజారి, బంజరు బందోబస్తు, బకాయి, బజంత్రీ (భజంత్రీ), బట్టువాసంచి, బట్వాడ, బడ, బడయి, బత్తీస, బత్తెము (భత్తెము). బనాతు (బణాతు), బసాయించు,బయాన, బర్తరపు, బరమా, బరాబరి, బరాబరిక, బస్తా బస్తీ, బహద్ధర్‌ (బహద్దూర్‌), బాకా, బాకీ, బాకూ, బాజా, బాజారు, బాజు, బాజుబందు,బాతాఖానీ, బాతు, బాదము, బాపతు, బారా, బాలీసు, బావుటా, బావుడోరు, బిచానా, బిడయించు, బినామీ, బిబ్చీ, బిల్మక్తా, బిసాతు, బస్తీ, బీమా, బుంగ, బురకా, బురుజు, బులాకీ, బూబు, బూర్నీసు, బేగి, బేజరూరు, బేజారు, బేపరాకు, బేబాకి, బేమరమ్మతు, బేరీజు, బేవారసు, బేషకు, బేషు (బేషు), బేసరి, బోణి, బోనాంపెట్టె, బోషాణం, బరవాసా, భర్తీ, బాట (బాట), భేటీ, భోగట్టా, మంరు, మండు, మకాము, మక్తా, మఖమలు, మగ్దూరు, మజిలీ, మజ్కారు, మజుబూతు, మజుమూను, మరి, మ్దరు, మజా, మజాకా, మతలబు, మతాబు, మతించు, మద్ధతు, మిన్నా. మన్న, మరమ్మతు, మర్తబు, మలాము (టమొలాము), టమొహమల్‌, మల్పూవు, మషాకత్తు, మషాలు, మషాల్జీ, మసాలా, మసీదు, మహజరు, మహస్సూలు, (మసూలు), మాజీ, మాపుచేయు, మామూలు, మారీఫత్తు, మాలీసు, మింజుమల, మిజాజు (మీజాదు), మిఠాయి, మినహా, మిరాసీ, ముక్తసరు, ముక్త్యారు, ముగ్దరు, ముచ్చివాడు, ముచ్చలికా, ముఠా, ముదరా, (ముజరా), ముద్దతు, ముద్దాయి, మునసబు, మునిషీ, ముభావము, మురబ్బా, ముల్కీ, ముసద్దీ, ముసనాబు, ముసల్మాను, ముస్తాబు, ముస్తీదు, మెహదా, మెహనతు. యకాయకి (ఎకాయెకి), యదాస్తు యునాని, రకము, రజా, రద్దు రప్పు, రయితు (రైతు), రవాణా, రవేసు (రవీసు), రస్తా, రస్తు, రహదారీ (రాదారి), రాజీనామా, రాయితీ, రివాజు, రుజువు, రుమాలు, రుసుము, రేవల్చిని, రొట్టె, రోజు, రోదా, లంగరు, లగాము, లగాయతు, లడయి, లడి, లమిడి (లమ్డి), లస్కరు, లాచారు, లాడము, లాయఖు, లాలు, లాలూచీ, లిఫాఫా, లుంగీ, లుగుసాను, లుచ్ఛా, లూటీ, లేవిడి, లోటా, లోటు, వకాలతు, వకీలు, వగైరా, వజా, వజీరు, వర్దీ, వసూలు, వస్తాదు, వహవ్వా, వాకబు, వాజివీ, వాపసు, వాయిదా, వారసుడు, వారీ, వారీనామా, విలియా, వేరియా, వేలము (వేలాము), వేలంపాట, శాబాసు (సెబాసు), శాయి, శాయిరు (సాయిరు), శాలువ, శకస్తు శికా, శిస్తు, విస్సాల, శెటమ్మె (సెటమ్మె), శేరు (సేరు), షరతు, షరా, షరాబు, షహా, షికారీ, షికారు, షుమారు, సంజాయిషీ, సందుగు, సకాలాతు, సక్తుచేయు, సగటు, సగతు, సగలాతు, సజావు, సజ్జనకోల, సదరు (సదరహీ), సన్‌వారు, సన్నదు, సన్నాయి, సన్నీ, సఫేదా, సబబు, నబరు, నబురు, సబ్జా, నబ్నివీను, సముద్దారుడు, సరంగు, సరంజామ, సరదా, సర్దారు, సరకు, సరేసు, సర్కారు, సలహా, సలాము, సలిగ, సవాలు, సాంబా, సాకీన్‌, సాబా, సాదరు, సాదర్వారీ, సాదా, సాపు (సాపు), సాబకు, హుకుం, సామాను, సాలస్త్రీ, సాలు, సాలాబాదుగా, సాలీనా, సాలు బస్సాలు, సాళవా,దాళవా, సాహెబు, సిద్దీ, సిపాయి, సిరా, సిబ్బంది, సిలువ, సిసలు, సిస్తు, సిస్సాల, సీదా, సీసా, సుకారి, సుక్కాను (చుక్కాని), సునామణి (సుణామణీ), సున్నతి, సుమారు, సురమా, సుల్తాను, సుసారము, సుస్తీ, సెల్లా, సోదా, హంగామి, హండ, హంసాయి, హకీకత్తు, హక్కసు, హక్కు, హజారము, (అజారము), హద్దు, హటమేషా, హయాము, హరామి, హర్కారా, హల్కా (అల్కి), హటవేలి, హాజరు, హమీతకావి, హాలు, హాలుసాలు, హశ్శీలు (హసీలు), హిజారు (ఇజారు), హుండు, హుకుము, హుజారు, హురుమంజి, హురుమత్తు, హాషారు (ఉషారు), హేజీబు, హైరానా (హైరాను), హోదా, హోదా (హవుదా), హవుసు, హవుసుకాడు, హసుతోట. వేలకొలదిగా ఉన్న ఈ హిందుస్తానీ మాటలు నిత్యవ్యవహరములో ఆంధ్ర భారతి శరీరములోని అంగములయినవి.ఆంధ్రనామ సంగ్రహము మొదలగు నిఘంటువులలో ఉర్దూ మాటలు తెలుగునకు పర్యాయపదాలుగా పూర్వులే చేర్చినారు. గిడుగువారు తెలుగులో మిళితమైపోయిన ఉర్దూ పదాలను పండితులు పుస్తకాల్లోంచి ఏరి పారవేయవచ్చు గాని జనం నోళ్ళలోంచి తీయలేరు అన్నారు.. తెలుగుపై ఉర్దూ పారశీకముల ప్రభావము అనే పుస్తకంలో గోపాల కృష్ణారావుగారు ఉరుదూ పారశీకములందు అరబీ భాష నుండి పెక్కు పదములు ప్రవేశించినవి. కనుక పరోక్షముగా అరబీ పదములు కూడ తెలుగులో చేరినవనుట నిశ్చయము అన్నారు.

Comments are closed.