‘మే’లిమి బ్లాగులు జాబులూ

-చదువరి

బ్లాగులో జాబు వేసేసాక, దానిపై వచ్చే వ్యాఖ్యలకు సమాధానాలివ్వడంలో బ్లాగరి ఎంత చురుగ్గా ఉండాలి? కొందరు బ్లాగరులు అసలు వ్యాఖ్యలకు సమాధానాలే ఇవ్వరు. ఎప్పుడైనా ప్రశ్న అడిగితే మాత్రం స్పందించేవారు కొందరు. మొత్తం వ్యాఖ్యాతలందరికీ కలిపి ఒక నమస్కారం పారేసేవారు ఇంకొందరు. వచ్చిన ప్రతీ వ్యాఖకీ సమాధానలిస్తూ పోయేవారు మరి కొందరు.మీరైతే ఏంచేస్తారు? ఇక్కడ వోటెయ్యండి.

[poll id=”4″]

విశిష్టాంశాలు:
ఇబ్బడిముబ్బడిగా జాబులు రాసేస్తూ, బ్లాగును, చదువరులను బిజీగా ఉంచేవారిని చూస్తూంటాం. నెలనెలా వందల కొద్దీ జాబులు రాసే బ్లాగును చూసారా? టాలీవుడ్ ఫోటో ప్రొఫైల్స్ బ్లాగులో డా.శేషగిరిరావు అలా రాస్తున్నారు.

సాధారణంగా మన బ్లాగులకు వ్యాఖ్యలు ఐదూ పదీ మధ్య వస్తూంటాయి. ఎక్కువగా వస్తే ఇరవై, పాతిక మధ్య ఉంటూంటాయి. బాగా ఎక్కువగా వస్తే ఓ నలభై యాభై దాకా ఉండొచ్చు. సుగాత్రి తమ గడువెళ్ళీ పోతోందిరా జాబు ద్వారా వ్యాఖ్యల రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు ఈ జాబుకు 74 వ్యాఖ్యలు వచ్చాయి. పొద్దు గడిని సాధించేందుకు గైడుగా పనికొచ్చే ఈ బ్లాగుకు ఇన్ని వ్యాఖ్యలు రావడం గడిపై బ్లాగరుల ఆసక్తిని (ఆసక్తిగల బ్లాగరుల సంఖ్యను కూడా తెలుపుతుందనుకోండి), సాధకుల అనురక్తినీ, పనిలో పనిగా గడి కూర్పరుల శక్తినీ చాటుతోంది. గడి సాధకులకు, సుగాత్రికీ, గడి కూర్పరులకూ సెబాసులు.

చర్చలు:
ఈ నెల కొన్ని బ్లాగుల్లో సీరియస్ చర్చలు జరిగాయి. మచ్చుకు కొన్ని:

 1. మొదటగా, శంఖారావంలో లోక్‌సత్తాపై సరస్వతీకుమార్ రాసిన జాబు కలకలమే కలిగించింది. వ్యాఖ్యలకు బదులుగా ఆయన కొత్త జాబులు రాస్తూ పోవడం – ఇలా వరసగా మొత్తం నాలుగు జాబులు వచ్చాయి. ఈ జాబులు చక్కటి భాషతో, విషయతీవ్రతతో ఉన్నాయి. వ్యాఖ్యాతల వ్యాఖ్యలు కూడా ఆలోచింపజేసేవిగా ఉన్నాయి.
 2. రాతలు కోతల్లో కస్తూరి మురళీ కృష్ణ తెలుగు రచయితల సంఘం ఏర్పాటు గురించి ఒక జాబు రాసారు. సమాచారాన్ని తెలియజేసే జాబు అది. దానికి వచ్చిన స్పందనలు మాత్రం నిదానంగా వేడెక్కుతూ పోయాయి. అక్కడక్కడా వ్యక్తిగతంగా చిన్నబుచ్చే ధోరణి సరిహద్దు దాకా వెళ్ళాయి. ఒక విశేషం ఏంటంటే బ్లాగరి ఎంతో ఓపిగ్గా వ్యాఖ్యలకు సమాధానాలిస్తూ పోవడం.
 3. అమెరికాలో అర్చకుల స్థితిగతులపై వికటకవి రాసిన జాబుపై కూడా చర్చ బాగానే జరిగింది.

సాహిత్యం

 1. భైరవభట్ల “అటజనిగాంచె..” పద్యాన్ని చక్కగా వివరించారు
 2. కొల్లూరి సోమశంకర్ గతంలో ప్రచురితమైన తన కథ – పల్లీ..సార్..పల్లీ ని బ్లాగులో పెట్టారు.
 3. పొలి కవితా సంకలనాన్ని సమీక్షించారు, దుప్పల రవి

క్రికెట్: (అనగా ఐపీయెల్)

 1. ఐపీయెల్ హంగామా గురించి రాకేశ్వరరావు తనదైన శైలిలో రాసారు. చాన్నాళ్ళ తరవాత బ్లాగు దాహం (క్రికెట్‌లో పరుగుల దాహం లాగా) తీర్చుకుంటూ పెద్ద జాబు రాసారు. చీర గరలుసు గురించిన పేరాగ్రాఫు మూడు సార్లు ప్రచురించారు, ఎంచేతో!
 2. ఐపీయెల్‌పై మరో జాబు, కస్తూరి మురళీ కృష్ణ రాసినది.

హాస్యం, వ్యంగ్యం:

 1. చాలా కాలం తరవాత రెండు రెళ్ళు ఆరులో నవ్వులు విరబూసాయి. ఒకే జాబులో అనేకమందికి చురకలు వేస్తూ ఈ హాస్య వ్యంగ్య రచన ఆకాశవీధిలో ఆకుపచ్చ కన్నీరు చదవండి.
 2. బరువు బాధ్యతలపై సుజాత మనసులోమాట విని నవ్వుకోండి.
 3. కిరణ్ గాడి పెళ్ళి చూపులు ఎలా జరిగాయో చదవండి జంబలకిడిపంబలో
 4. ఆ మధ్య బ్లాగు వీలునామాలంటూ ఒక పథకం వచ్చింది. ఇప్పుడు మీరు కోరిన విధంగా మీ తద్దినాలు పెట్టించుకోండంటూ వారణాసి వెంకట రమణ కొత్త పథకం పెట్టారు చూడండి.

సినిమా:

 1. కంత్రీ చూడటానికి కారణమైన తన దురదృష్టాన్ని నిందించుకుంటున్నారు కొత్తచిగురు భరత్
 2. తెలుగు సినిమాలపై నాగమురళి చేసిన ఈ విమర్శ మంచి చర్చనే జరిపించింది.

రాజకీయాలు, సామాజికం:

 1. సమాజసేవ అవసరాన్ని గుర్తించి, తమకు తోచినంతలో సేవ చేస్తున్నవారున్నారు. సహాయం అవసరమైన వారిపట్ల ఆర్తితో వారిని ఆదుకునేవారున్నారు. కానీ సహాయం అవసరం వారికెందుకొచ్చింది? మీ సహాయం పొందాల్సిన స్థితిలో సమాజం ఉండటానికి కారణాలేమిటి? కారణాలేవైనా పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత, లేక అసలు అలాంటి పరిస్థితి తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిది? అంటూ ఆలోచనలు రేకెత్తింపజేసారు శివ
 2. మా ఊరి శివారులో జరుగుతున్న యుద్ధం అని దిల్ చెబుతున్న యుద్ధగాథ వినండి.
 3. మహిళా రిజర్వేషన్ల వ్యవహారంలో మరోకోణం తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారి కలగూరగంపలో చూడండి.
 4. బడుగువర్గాల నేతలపై ఆంధ్రజ్యోతిలో వచ్చిన వ్యాసం, దానికి స్పందనగా ఆ పత్రికపై జరిగిన దాడి విషయంలో బ్లాగరులు స్పందించారు.
  1. నెటిజెన్ ఈ విషయమై రెండు మూడు జాబులు రాసారు
  2. తెలుగు లేఖ చక్స్ దృష్టి ఇది.
  3. తెలుగు నేస్తమాలో వాసిలి సురేశ్ స్పందన మాత్రం విభిన్నంగా ఉంది. ఈ ఉదంతాన్ని మరో కోణం నుండి చూసారు.

జ్ఞాపకాలు, స్వ గతాలు:

 1. ఓ యాభై అరవై యేళ్ళ నాటి కబుర్లు మన పెద్దవాళ్ళు చెబుతూంటే వినడానికి ఎంతో బావుంటుంది. అమ్మమ్మలు, నాయనమ్మలూ చెబుతూంటే మరీ ముఖ్యంగా! జ్ఞాన ప్రసూన గారు చెబుతున్న సంగతులు సురుచిలో వినండి. ఎవరికి ఎప్పుడు ఏమి నచ్చుతాయో చిత్రంగా ఉంటుందంటూ చెప్పిన ఈ కబుర్లు వినండి మచ్చుకు.అలాగే, ఆమె సీగానపెసూనాంబగా ఉండగా జరిగిన ఈ రేడియో కబుర్లు కూడా!
 2. నేను తెలుగు పుస్తకాలెందుకు చదువుతున్నాను, తెలుగులో ఎందుకు రాస్తున్నాను అంటూ నిడదవోలు మాలతి చెబుతున్నారు. ఇది ఆమె హృదయఘోష.
 3. చిన్ననాటి జ్ఞాపకాలను పోగు చేస్తున్న రానారె మరో పేజీ తిప్పారు, మ్ర్యావ్‌తో

ఇంకా..

 1. భార్యా బాధితుల గురించి చక్స్ రాసారు.
 2. నీటిచుక్క విలువెంతో జి.ఎస్.నవీన్ చెబుతున్నారు.
 3. కొత్తగా వస్తున్న జాబులను ఏరి కూర్చుతూ దీప్తిధారలో సీబీరావు తన బ్లాగ్వీక్షణాన్ని కొనసాగిస్తున్నారు.
 4. ఈటీవీ సుమన్ బ్లాగరుల అభిమాన దెబ్బలబ్బాయి. రాజకీయేతరుల్లో సుమన్ని విమర్శించినంతగా మరెవరినీ బ్లాగరులు విమర్శించరేమో! ఈ విమర్శల్లో కోపం కంటే ఎగతాళి, విసుగు, మందలింపు, కొండొకచో అభిమాన పూర్వక ఎత్తిపొడుపులూ ఉంటూంటాయి. అతడికి కర్ణుడిలాంటి ప్రభాకరుపై చేసే విమర్శల్లో మాత్రం ఎగతాళే ఎక్కువ! అలాంటిది వాళ్ళిద్దరూ ఈటీవీ నుండి బయటికి వెళ్ళిపోయారంటే అది బ్లాగరులకు పెద్దవార్తే. దానిపై వచ్చిన స్పందనలు:
  1. వార్త ఇక్కడ వెలువడింది. జల్లెడలో దీనికి సహజంగానే 5 మార్కులు పడ్డాయి.
  2. తెలుగువాడిని
  3. రామోజీరావుకు సన్‌స్ట్రోక్ అంటూ కశ్యప్ రాసారు
 5. సాహితీపరులతో సరసాలు బ్లాగులో “అంబేద్కరును ఎలా అర్థం చేసుకోవాలి” అనే జాబును ప్రచురించారు. విషయం ఆసక్తికరంగాను, ఆలోచింపజేసేదిగాను ఉంది. పుస్తకసమీక్ష అని పేర్కొన్నారు కాబట్టి, సదరు పుస్తకం (సంపుటాల) గురించి కొంత రాసి ఉంటే బాగుండేదని అనిపించింది.
 6. గార్లపాటి ప్రవీణ్ హిమాలయాల్లో తన ట్రెక్కింగు అనుభవాలను రాస్తున్నారు.
 7. పండంటి బ్లాగులకు పదకొండు సూత్రాలంటూ విహారి కొత్త బ్లాగరులకు ఇచ్చిన సలహాలు

ప్రయోజనాత్మక బ్లాగులు: ఒక ప్రత్యేక ప్రయోజనాన్ని ఆశించి మొదలెట్టిన బ్లాగులు ఈ జాబితాలో ఉంటాయి

 1. బత్తీబందు: హిందీ పేరు పెట్టుకున్నారు గానీ రాసేది తెలుగులోనే. విశేషమేంటంటే వివిధ బ్లాగరులు ఈ బ్లాగులో రాస్తూంటారు. ఉప్పలపాటి ప్రశాంతి, కొత్తపాళీ ఈ బ్లాగు చోదకులు.
 2. పోలేపల్లి సెజ్ బాధితులు ప్రభుత్వ దమననీతికి నిరసనగా మొన్న జరిగిన ఎన్నికల్లో పోటీ చేసారు. ఈ విషయమై వచ్చిన బ్లాగు పోలేపల్లి సెజ్ దుర్మార్గం.

కొత్త బ్లాగులు:

 1. మేలో పుట్టి శరవేగంతో దూసుకుపోతున్న బ్లాగు పర్ణశాల. మహేష్ తన కాలేజీ జీవితపు కబుర్లను కూర్చి రాస్తున్న జాబులు చదువరుల అభిమానాన్ని చూరగొంటున్నాయి.
 2. మేలోనే పుట్టి మంచి మంచి జాబులతో అలరిస్తున్నాడు పక్కింటబ్బాయి. హాస్యం, వ్యంగ్యం మాత్రమే రాస్తారనుకుంటే ఒక పూలూ పడగలనే చిన్న కథను కూడా అందించారు.
 3. ఆడుతూ పాడుతూ బ్లాగేస్తున్నారు మాడభూషి బాలాజీ. ఈ బ్లాగులోని సాఫ్టువేరు ఇంజనీరు కవిత చూడండి.
 4. ఆరోగ్య రక్షణకు సహజ మార్గాలను తెలియజేసే ఆయుష్మాన్‌భవ

చివరగా..
జాబు వితౌట్ బ్లాగు లాగా పూరీ వితౌటాయిలంట.. చూసారా?

——————
-చదువరి, పొద్దు సంపాదకవర్గ సభ్యుడు.

This entry was posted in జాలవీక్షణం and tagged , . Bookmark the permalink.

5 Responses to ‘మే’లిమి బ్లాగులు జాబులూ

 1. సినిమా విభాగంలో ఇచ్చిన నాగమురళి గారి టపా లంకె తప్పుగా ప్రచురితమయింది.
  అలాగే రాజకీయాలు విభాగంలో “ఆలోచనలు రేకెత్తించారు” అని ఉండాలి.

  సరిచెయ్యగలరు.

 2. ప్రవీణ్, సరిచేసాం. తెలిపినందుకు నెనర్లు.

 3. గుర్తించినందుకు సంతోషం.
  ఘోష? నేను తపన అనో ఆర్తి అనో అనుకున్నాను.

 4. bharat says:

  నా పోస్టులు రెండు సార్లు ఈ పై వ్యాసంలో వచ్చాయి , చాలా చాలా తాంకులు అండి

 5. vasilisuresh says:

  నా బ్లాగు గురించి ప్రస్తావించినందుకు చాల చాలా థ్యాంక్స్ అండీ..వాసిలిసురేష్ తెలుగునేస్తమా నుంచి ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *