Yearly Archives: 2007

తూర్పూ పడమర

      ………………….. ……….                 కొత్తపాళీ గారిని రానారె చేసిన ఇంటర్వ్యూను ప్రచురించిన తరువాత బ్లాగరులు ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచనను అమలు చేసాం. కొరియా కబుర్లతో నెజ్జనులను అలరించిన కొవ్వలి సత్యసాయి గారిని, కొత్తపాళీ గారిని కబుర్లు చెప్పుకోమన్నాం. గూగుల్ టాక్‌తో ప్రాక్పశ్చిమాలకు వారధి నిర్మించి వారిద్దరూ మాటలు కలిపారు. … Continue reading

Posted in వ్యాసం | Tagged | 2 Comments

ఎడిటింగ్ – ఒక ప్రస్తావన

–వెంకట్ సిద్దారెడ్డి (http://24fps.co.in) ఉపోద్ఘాతం సెకండుకి ఇరవై నాలుగు నిశ్చల చిత్రాలను తెరపై ప్రదర్శించి, ప్రేక్షకుల కళ్ళకు కదిలే బొమ్మలు చూస్తున్నట్టుగా భ్రమ కలిగించడమే సినిమా లేదా చలన చిత్రం అనే ప్రక్రియ అని ఈ రోజుల్లో దాదాపు అందరికీ తెలిసిన విషయమే. మొట్ట మొదట ఈ ప్రక్రియ కేవలం దైనందిన దృశ్యాలను కెమెరా ద్వారా … Continue reading

Posted in వ్యాసం | Tagged | 6 Comments

మహీధర నళినీమోహన్

-వి.బి.సౌమ్య (http://vbsowmya.wordpress.com) నాకు బాగా చిన్న వయసులో నసీరుద్దీన్ కథలతో పరిచయమై, తరువాత్తరువాత చిన్న చిన్న గణిత చిట్కాలు, పిల్లలతో ఆడించే ఆటలతోనూ పరిచయమై… ఆ తరువాత – “ఎందుకు?” అని నన్ను నేను ప్రశ్నించుకున్నప్పుడు చాలా ప్రశ్నలకి జవాబు చెప్పినప్పుడు, నాలో తెలుసుకోవాలి అన్న ఒక జిజ్ఞాసను కలిగినప్పుడు, కలుగుతున్నప్పుడు నేను ఎవరిని తలుచుకుంటాను … Continue reading

Posted in వ్యాసం | 10 Comments

సమీప దూరాలు

స్వాతికుమారిగారు ఈ సమీపదూరాలని మాకు పంపినప్పుడు – దీనిని ఏ శీర్షికలో ప్రచురించాలి అనే సమస్య వచ్చింది. కవిత శీర్షికలో వెయ్యాలంటే – ఇది కవితగాదు, వ్యాసంలో వెద్దామంటే ఇది వ్యాసమూ గాదు. అలాగని తిరస్కరించడానికీ మనసొప్పలేదు. అందుకని ఆవిడనే అడిగాం – ‘ఏ శీర్షికలో వెయ్యమన్నారు’ అని? దానికావిడ – “రసాత్మకమైన భావమేదైనా కవిత్వమే … Continue reading

Posted in కవిత్వం | 12 Comments

‎భరతనాట్యం – ఒక సంభాషణ

తెలుగు బ్లాగరుల్లో బహుముఖ ప్రతిభాశాలి కొత్తపాళీ. ఆయన చాలాకాలంగా అంతర్జాలంలో కథలు, కవితలు, పద్యాలు రాస్తున్నారు. ఇంకోవైపు తెలుగుకావ్యాలను ఆంగ్లంలోకి అనువదిస్తున్నారు. మరోవైపు సినిమాలు, లలితకళల పట్ల తరగని ఆసక్తిని, అభినివేశాన్ని కనబరుస్తున్నారు. అంతేకాదు, ఆయన దశాబ్దంపైగా భరతనాట్య సాధన చేస్తున్నారు. నాట్యశిక్షణకు సంబంధించి ఆయన తన స్మృతులు – అనుభూతులను పొద్దు సంపాదకుడు రానారెతో … Continue reading

Posted in వ్యాసం | Tagged | 3 Comments

మందిమన్నియమ్ -3

-తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం(http://www.tadepally.com/) “మందిమన్నియం” అంటే ప్రజారాజ్యం. ఈ విషయమై తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారు పుస్తకం రాస్తున్నారు. ఇందులో 700 సూత్రాలున్నాయి. ఈ పుస్తకం ఆరో అధ్యాయంలో ప్రజాస్వామ్యపు స్వభావం గురించి విహంగవీక్షణం చేసారు. ఇందులో చర్చించిన విషయాలను తాడేపల్లి వారు పొద్దు పాఠకులతో పంచుకుంటున్నారు. ఈ వ్యాసపు ఐదు భాగాల్లో ఇది మూడోది: సూత్రము … Continue reading

Posted in వ్యాసం | Tagged | Comments Off on మందిమన్నియమ్ -3

మృతజీవులు – 12

ప్రఖ్యాత రష్యన్‌ రచయత గొగోల్‌ (Nikolai Gogol)రాసిన డెడ్‌ సోల్స్‌ (Dead Souls) అనే నవలను కొడవటిగంటి కుటుంబరావుగారు “మృతజీవులు” అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. కుటుంబరావుగారి కథలూ, నవలలూ, నాటికలూ, వ్యాసాలూ సంకలనాలుగా వచ్చాయి కాని అనువాద రచనలేవీ మళ్ళీ పాఠకుల కంటబడలేదు. ఈ కోవకు చెందిన ఆయన సాహిత్యంలో సోవియట్‌ ప్రచురణలూ, సదరన్‌ లాంగ్వేజెస్‌ బుక్‌ ట్రస్ట్‌ వారి ఇతర దక్షిణ భారతీయ భాషల్లోని సైన్స్‌ పుస్తకాల అనువాదాలూ, 1948 ప్రాంతాల్లో చక్రపాణిగారు “ఆంధ్రజ్యోతి” నడిపిన రోజుల్లో అందులో పేరు లేకుండా ప్రచురితమైన ఆర్థర్‌ కోనన్‌ డాయల్‌ షెర్లాక్‌ హోమ్స్‌ నవలల అనువాదాలూ, యువ మాసపత్రిక కోసం చేసిన బెంగాలీ నవలల అనువాదాలూ మొదలైనవెన్నో ఉన్నాయి. ఆ లోటును పూర్తి చేసే ఉద్దేశంతో “మృతజీవులు” నవలను సీరియల్‌గా మీ ముందుకు తెస్తున్నాము. Continue reading

Posted in కథ | Tagged | Comments Off on మృతజీవులు – 12

మనుషులూ, మాటలూ

డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ తక్కిన ప్రాణులను “నోరులేని జీవాలుగా” పరిగణించడం మనకు అలవాటు. భౌభౌలూ, కావుకావులూ మన వాక్పటిమకు సాటిరావు. కుక్కలనూ, పిల్లులనూ పెంచుతున్నవారు వాటితో మాట్లాడతారుగాని ఆ సంభాషణ అంతా ఏకపక్షమే. అందుకే తమకున్న రోగ లక్షలాణెటువంటివో వివరించలేనివారు పశువుల డాక్టర్‌వద్దకు వెళ్ళాలనేది ఒక జోక్‌. చిలక పలుకులు నిజమైన మాటలు కావు. మాటలంటే … Continue reading

Posted in వ్యాసం | Tagged | Comments Off on మనుషులూ, మాటలూ

వార్షికోత్సవ వేళ..

గత సంవత్సరం డిసెంబరు నెల మొదటివారంలో ప్రారంభమైన పొద్దుకు ఏడాది నిండి, రెండో యేట అడుగు పెడుతున్న సందర్భంగా ఈ సంవత్సరకాలంలో పొద్దు సాధించిన ప్రగతి, అలాగే ఈ పత్రికను పెట్టినప్పుడు మాకు మేం నిర్దేశించుకున్న లక్ష్యాలు, వాటిని మేం ఎంతవరకు అందుకోగలిగాం అనే అంశాలను స్పృశిస్తూ ఒక సింహావలోకనం: పొద్దు ఎందుకు పెట్టాం? బ్లాగరులలో … Continue reading

Posted in సంపాదకీయం | 12 Comments

మృతజీవులు – 11

ప్రఖ్యాత రష్యన్‌ రచయత గొగోల్‌ (Nikolai Gogol)రాసిన డెడ్‌ సోల్స్‌ (Dead Souls) అనే నవలను కొడవటిగంటి కుటుంబరావుగారు “మృతజీవులు” అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. కుటుంబరావుగారి కథలూ, నవలలూ, నాటికలూ, వ్యాసాలూ సంకలనాలుగా వచ్చాయి కాని అనువాద రచనలేవీ మళ్ళీ పాఠకుల కంటబడలేదు. ఈ కోవకు చెందిన ఆయన సాహిత్యంలో సోవియట్‌ ప్రచురణలూ, సదరన్‌ లాంగ్వేజెస్‌ బుక్‌ ట్రస్ట్‌ వారి ఇతర దక్షిణ భారతీయ భాషల్లోని సైన్స్‌ పుస్తకాల అనువాదాలూ, 1948 ప్రాంతాల్లో చక్రపాణిగారు “ఆంధ్రజ్యోతి” నడిపిన రోజుల్లో అందులో పేరు లేకుండా ప్రచురితమైన ఆర్థర్‌ కోనన్‌ డాయల్‌ షెర్లాక్‌ హోమ్స్‌ నవలల అనువాదాలూ, యువ మాసపత్రిక కోసం చేసిన బెంగాలీ నవలల అనువాదాలూ మొదలైనవెన్నో ఉన్నాయి. ఆ లోటును పూర్తి చేసే ఉద్దేశంతో “మృతజీవులు” నవలను సీరియల్‌గా మీ ముందుకు తెస్తున్నాము. Continue reading

Posted in కథ | Tagged | Comments Off on మృతజీవులు – 11