Monthly Archives: August 2007

మృతజీవులు – 4

ప్రఖ్యాత రష్యన్‌ రచయత గొగోల్‌ (Nikolai Gogol)రాసిన డెడ్‌ సోల్స్‌ (Dead Souls) అనే నవలను కొడవటిగంటి కుటుంబరావుగారు “మృతజీవులు” అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. కుటుంబరావుగారి కథలూ, నవలలూ, నాటికలూ, వ్యాసాలూ సంకలనాలుగా వచ్చాయి కాని అనువాద రచనలేవీ మళ్ళీ పాఠకుల కంటబడలేదు. ఈ కోవకు చెందిన ఆయన సాహిత్యంలో సోవియట్‌ ప్రచురణలూ, సదరన్‌ లాంగ్వేజెస్‌ బుక్‌ ట్రస్ట్‌ వారి ఇతర దక్షిణ భారతీయ భాషల్లోని సైన్స్‌ పుస్తకాల అనువాదాలూ, 1948 ప్రాంతాల్లో చక్రపాణిగారు “ఆంధ్రజ్యోతి” నడిపిన రోజుల్లో అందులో పేరు లేకుండా ప్రచురితమైన ఆర్థర్‌ కోనన్‌ డాయల్‌ షెర్లాక్‌ హోమ్స్‌ నవలల అనువాదాలూ, యువ మాసపత్రిక కోసం చేసిన బెంగాలీ నవలల అనువాదాలూ మొదలైనవెన్నో ఉన్నాయి. ఆ లోటును పూర్తి చేసే ఉద్దేశంతో “మృతజీవులు” నవలను సీరియల్‌గా మీ ముందుకు తెస్తున్నాము. Continue reading

Posted in కథ | Tagged | Comments Off on మృతజీవులు – 4

ఆగస్టు గడిపై మీమాట

ఆగస్టు గడిపై మీ అభిప్రాయాలు ఇక్కడ రాయండి. పాత గడులు 1. జూలై గడి, సమాధానాలు 2. జూన్ గడి, సమాధానాలు 3. మే గడి, సమాధానాలు 4. ఏప్రిల్ గడి, సమాధానాలు 5. మార్చి గడి, సమాధానాలు

Posted in గడి | Tagged | 2 Comments

గతనెలలో తెలుగు వికీపీడియా

[రవి వైజాసత్య] –రవి వైఙాసత్య (http://saintpal.awardspace.com/) తెలుగు వికీపీడియాలో గ్రామాలు, సినిమాలు తప్ప ఇంకేమన్నా ఉన్నాయా అన్న పలు సద్విమర్శలు దృష్టిలో పెట్టుకొని, అవేకాదు, ప్రతి ఒక్కరికీ నచ్చేవి, ఉపయోగపడేవి ఇంకా చాలా ఉన్నాయని తెలియజెప్పేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు తెలుగు వికీపీడియన్లు. అందులో భాగమే ఈ శీర్షిక. ఇటీవల మొదటి పేజీలో ప్రదర్శించబడిన … Continue reading

Posted in జాలవీక్షణం | Tagged | 3 Comments

నిత్యాన్వేషణే జీవితం

–జాన్ హైడ్ కనుమూరి (http://johnhaidekanumuri.blogspot.com/) చూపులు వెతుకుతుంటాయి కుత కుత మంటూ గిన్నెలో వుడుకుతూనే వుంటుంది పైకి కనిపించేదంతా ఆవిరై అదృశ్యమౌతుంది చూపులు వెతుకుతుంటాయి నాల్గు రోడ్ల కూడలిలో నాట్యమాడుతున్న నియాన్ కాంతిలో జీవిత మాధుర్యమేదో జుర్రేయాలని ఇటూ అటూ చూస్తుంటాయి చూపులు వెతుకుతుంటాయి ప్రయాణ సమయాలలో ఎదురయ్యే అనేకానేక భంగిమల ఆకృతుల్లో సరికొత్త రసాన్వేషణ … Continue reading

Posted in కవిత్వం | 4 Comments

జూలై గడి సమాధానాలు

తప్పుల్లేకుండా పూరించినవారు:

బి. కామేశ్వరరావు, స్వాతికుమారి.

అసంపూర్తిగా:

శ్రీరామ్.

ప్రయత్నించినవారందరికీ అభినందనలు!!

Continue reading

Posted in గడి | Tagged | 1 Comment

అతిథి, కవిత, సమీక్ష

ఈ నెల అతిథి ప్రముఖ బ్లాగరి తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం గారు మన జాతీయ కళారూపాల సంరక్షణ గురించి రాస్తున్నారు. దాంతోబాటే ప్రముఖ కవయిత్రి లలితా ముఖర్జీ గారి కవిత “డిటో, డిటో”, ఇటీవలే విడుదలైన “కడప కథ” కథాసంకలనంపై సమీక్ష అందిస్తున్నాం. ఇక జ్యోతిగారు మిమ్మల్ని టైమ్ మెషీన్ ఎక్కించి ’కళ్ళు తిరిగేదాకా’ తిప్పాలని “సరదా” … Continue reading

Posted in ఇతరత్రా | Comments Off on అతిథి, కవిత, సమీక్ష

డిటో, డిటో

-లలితా ముఖర్జీ (http://roudrisms.blogspot.com/) మన చిన్నపుడు మనల్ని రాక్షసులు చెర పట్టారు చేతులు కడిగీ మూతులు తుడిచీ తలంటి స్నానాలు చేయించీ హింసలు పెట్టేరు రాత్రిళ్ళు వెన్నెట్లో వెలిసిన కొమ్మల వెర్రి నాట్యాలు చూసి జడుసుకొమ్మని వదిలేసారు గడియారాల టిక్కుటిక్కుల్లో భూమి సంతానాన్ని నమిలి మింగే చప్పుళ్ళు మెలుకువొచ్చిన పీడకలల్లో వినమని శాసించారు పగటి వేళల్లో … Continue reading

Posted in కవిత్వం | 1 Comment

టైమ్ మెషిన్

-వలబోజు జ్యోతి (http://vjyothi.wordpress.com) ఈ కథ మొత్తం చదివి చివరలో అడిగిన ప్రశ్నకు జవాబివ్వగలరేమో ప్రయత్నించండి…. 1975 జనవరి 1 ఉదయం ఐదు గంటలైంది. ఇంకా సూర్యుడు నిద్ర లేవలేదు. చీకటిగానే ఉంది.అది బాపూ అనాథాశ్రమం. దాని నిర్వాహకుడు ప్రకాశం అప్పుడే లేచి కాలకృత్యాలు తీర్చుకుని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఆ అనాథాశ్రమాన్ని ప్రారంభించి చాలా … Continue reading

Posted in వ్యాసం | Tagged | 35 Comments

కడప కథ

– త్రివిక్రమ్ కడప జిల్లాలో మొట్టమొదటి కథారచయిత భారతం నాదమునిరాజు. ఆయన 1956 లో రాసిన నీలవేణి నుంచి 2006 వరకు యాభయ్యేళ్ళ కాలంలో 55 కు మించిన కథారచయితలు రాసిన కథల్లోనుంచి ఎంపిక చేసిన 46 కథల సంకలనం కడప కథ. కడప జిల్లాలో కథాసాహిత్యం గురించి 1992లో కేతు విశ్వనాథరెడ్డి రాసిన విశ్లేషణాత్మక … Continue reading

Posted in వ్యాసం | Tagged | 2 Comments

మన జాతీయ కళారూపాల సంరక్షణ

-తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం(http://kalagooragampa.blogspot.com/) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఎయిర్ ఇండియాతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం ముంబాయి నుంచి న్యూయార్క్ వెళ్ళే విమానం మీద Andhra Pradesh అని రాస్తారు. విమానం లోపల కూడా మన రాష్ట్రానికి చెందిన ప్రముఖ పర్యాటక స్థలాల ఛాయాచిత్రాలూ సమాచార పొత్తాలూ (booklets) లభ్యమౌతాయి. మన రాష్ట్రాన్ని సందర్శించడానికి విదేశీయులు … Continue reading

Posted in వ్యాసం | Tagged | 7 Comments