Monthly Archives: August 2007

మృతజీవులు-5, కవిత

ఈ వారం మృతజీవులు ఐదో భాగం, తప్పుకో ఇక ఆడలేనని….. అనే కవిత లను ప్రచురిస్తున్నాం. ఆస్వాదించండి. ఈ నెల రచనలు: మన జాతీయ కళారూపాల సంరక్షణ (అతిథి) డిటో, డిటో (కవిత) కడప కథ (సమీక్ష) టైమ్ మెషిన్ (సరదా) నిత్యాన్వేషణే జీవితం (కవిత) గతనెలలో తెలుగువికీపీడియా (వికీ) గడి (గడి) జూలై గడి … Continue reading

Posted in ఇతరత్రా | Comments Off on మృతజీవులు-5, కవిత

తప్పుకో ఇక ఆడలేనని…..

ఎన్నాళ్ళిలా ఏడుపులు.. ఓదార్పులు తప్పుకో ఇక ఆడలేనని జీవన క్రీడ ఒప్పుకో ఇక సాగలేనని ఈ ముళ్ళ బాట అవ్వ బువ్వ తినలేదని తాత దగ్గు వినలేనని చూడలేని అమ్మ కళ్ళూ నడవలేని నాన్న కాళ్ళూ ఎన్నాళ్ళీ రోదన రాగం? ఎన్నాళ్ళీ వేదన రోగం? గంపెడంత బావ ఆశ తీర్చలేని అక్క గోస సమాజాల దుర్భిణిలో … Continue reading

Posted in కవిత్వం | 3 Comments

మృతజీవులు – 5

ప్రఖ్యాత రష్యన్‌ రచయత గొగోల్‌ (Nikolai Gogol)రాసిన డెడ్‌ సోల్స్‌ (Dead Souls) అనే నవలను కొడవటిగంటి కుటుంబరావుగారు “మృతజీవులు” అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. కుటుంబరావుగారి కథలూ, నవలలూ, నాటికలూ, వ్యాసాలూ సంకలనాలుగా వచ్చాయి కాని అనువాద రచనలేవీ మళ్ళీ పాఠకుల కంటబడలేదు. ఈ కోవకు చెందిన ఆయన సాహిత్యంలో సోవియట్‌ ప్రచురణలూ, సదరన్‌ లాంగ్వేజెస్‌ బుక్‌ ట్రస్ట్‌ వారి ఇతర దక్షిణ భారతీయ భాషల్లోని సైన్స్‌ పుస్తకాల అనువాదాలూ, 1948 ప్రాంతాల్లో చక్రపాణిగారు “ఆంధ్రజ్యోతి” నడిపిన రోజుల్లో అందులో పేరు లేకుండా ప్రచురితమైన ఆర్థర్‌ కోనన్‌ డాయల్‌ షెర్లాక్‌ హోమ్స్‌ నవలల అనువాదాలూ, యువ మాసపత్రిక కోసం చేసిన బెంగాలీ నవలల అనువాదాలూ మొదలైనవెన్నో ఉన్నాయి. ఆ లోటును పూర్తి చేసే ఉద్దేశంతో “మృతజీవులు” నవలను సీరియల్‌గా మీ ముందుకు తెస్తున్నాము. Continue reading

Posted in కథ | Tagged | Comments Off on మృతజీవులు – 5

కొ.కు. వర్ధంతి

[1950లలో కుటుంబరావు] “ప్రకృతి రహస్యాలను వివరించలేనిది శాస్త్రం కాదు; జీవితంలోని కష్టాల్ని తీర్చలేనిది ఆవిష్కరణా కాదు; జీవితంలోని ప్రతీ కోణాన్ని చూపించలేనిది సాహిత్యమే కాదు” అనే స్థిరాభిప్రాయంతో విరివిగా సాహితీసృజన చేసిన అభ్యుదయగామి కొడవటిగంటి కుటుంబరావు (28 అక్టోబర్ 1909 – 17 ఆగష్టు 1980) గారి వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆయన అభిరుచులు, … Continue reading

Posted in ఇతరత్రా | Comments Off on కొ.కు. వర్ధంతి

కుటుంబరావు కథలు – సాంఘిక, ఆర్థిక, రాజకీయ నేపథ్యం

-కోడూరి శ్రీరామమూర్తి “ఒక కథకుడికి రచనాసామర్థ్యం లేకపోయినా సరిచెయ్యవచ్చును గాని, జీవితం తెలియకపోతే సరిచెయ్యడం ఎవరివల్లా కాదు. శిల్పం, భాష, రచనకు ముఖ్యం కాదని కాదు. అవి చాలా ముఖ్యం. అవి కథారచనకు మూలపరికరాలు. ముడిపదార్థం జీవితం.” -ఈ వాక్యాలను రాసింది మానవజీవితాన్ని బహుముఖంగా పరిశీలించి ఆ ముడిపదార్థంతో ఎన్నో అద్భుతమైన కథలను, నవలలను, నాటికలను, … Continue reading

Posted in వ్యాసం | 2 Comments

కొడవటిగంటి కుటుంబరావు – జీవితపు వరవళ్ళు

మాధవపెద్ది గోఖలే కుటుంబరావు కక్కయ్య మనకు, సాహిత్యలోకానికి భౌతికంగా అందకుండా దూరమైపోయినాడు. కాని మనలోను, సాహిత్యలోకంలోను, సమాజంలోనూ శాశ్వతంగా వుండిపోయింది ఆయన ప్రతిపాదించిన సాహిత్య శాస్త్రవిజ్ఞానం. ఆయన మన ఊహకందని ఒక నూతన పంథా మహారచయితగా తను బతికుండగానే అయినాడు. కనుక గతించినాక ఆయనకు ముట్టచెప్పవలసిందేం వుండదు. మా అమ్మకు మేనత్త కొడుకు అవటంవల్ల ఆయన … Continue reading

Posted in వ్యాసం | 3 Comments

శ్రోత, గాయకుడు – కుటుంబరావు

-వైణిక విద్వాన్ చిట్టిబాబు మద్రాసులో నా కచేరీ ఎక్కడ జరిగినా కొడవటిగంటి కుటుంబరావు, ఆయన సతీమణి శ్రీమతి వరూధిని, వారి అమ్మాయి, అబ్బాయి తప్పక వచ్చేవారు. నాకు ఆయనతో బాగా పరిచయం అయ్యేక, ఆయన్ని, ప్రేక్షకులలో వెనకాల ఎక్కడో కూర్చుని వుండటం (నా కచేరీలోనే) చూసాను ఒకసారి. కచేరీ అయాక, నన్ను ఆయన వేదిక దగ్గరకు … Continue reading

Posted in వ్యాసం | 5 Comments

ఆంధ్రలో స్వాతంత్ర్యోద్యమ ఘట్టాలు

పొద్దు పాఠకులందరికీ స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు!! అరవైయవ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా జరిగిన కొన్ని ఘట్టాలను మీ ముందుకు తెస్తున్నాం. 1930లలో జరిగిన సంఘటనలకు సంబంధించి ఈ వ్యాసంలో ఉన్న సమాచారం హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో PhD చేస్తున్న వుల్లి ధనరాజ్ గారు సమర్పించిన ఎమ్.ఫిల్. పరిశోధనాపత్రం (dissertation) లో నుంచి తీసుకోవడం … Continue reading

Posted in ఇతరత్రా | Comments Off on ఆంధ్రలో స్వాతంత్ర్యోద్యమ ఘట్టాలు

ఆంధ్రలో స్వాతంత్ర్యోద్యమంలో కొన్ని ఘట్టాలు

ఆంధ్ర ప్రదేశ్ లో స్వాతంత్ర్యపోరాటంలో భాగంగా 1930లలో జరిగిన సంఘటనలకు సంబంధించి ఈ వ్యాసంలో ఉన్న సమాచారం హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో PhD చేస్తున్న వుల్లి ధనరాజ్ గారు సమర్పించిన ఎమ్.ఫిల్. పరిశోధనాపత్రం (dissertation) లో నుంచి తీసుకోవడం జరిగింది. అందుకు తన అంగీకారం తెలిపిన శ్రీ ధనరాజ్ గారికి పొద్దు సంపాదకమండలి తరపున కృతజ్ఞతలు … Continue reading

Posted in వ్యాసం | 3 Comments

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

పాఠకులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ఈ సందర్భంగా స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రలో జరిగిన కొన్ని సంఘటనలను మీ ముందుకు తెస్తున్నాం. ఆగస్టు 15 న ఈ వ్యాసాన్ని సమర్పిస్తున్నాం. ఈ లోగా మృతజీవులు నాలుగో భాగాన్ని ఆస్వాదించండి. ఈ నెల రచనలు: మన జాతీయ కళారూపాల సంరక్షణ (అతిథి) డిటో, డిటో (కవిత) కడప కథ (సమీక్ష) … Continue reading

Posted in ఇతరత్రా | 1 Comment