Monthly Archives: June 2007

జూన్ నెల పొద్దుపొడుపులు

చరిత్ర – విజ్ఞానశాస్త్రం (అతిథి: కొడవటిగంటి రోహిణీప్రసాద్) మృతజీవులు-1 (మృతజీవులు) న్యూవేవ్ సినిమా (సినిమా) నవతరంగం (సినిమా) గడి (గడి) పుస్తక సమీక్ష (వ్యాసం) ‘గ్యాస్’ సిలిండర్ (సరదా) అంకెలతో పద్య సంకెలలు (వ్యాసం) మరో వనాన్ని స్వప్నిస్తాను (కవిత)

Posted in ఇతరత్రా | Comments Off on జూన్ నెల పొద్దుపొడుపులు

మృతజీవులు, న్యూవేవ్ సినిమా

(గమనికః పొద్దులో ఈనెలలోను, కిందటి నెలలోను వచ్చిన రచనల కోసం పేజీ అడుగున చూడండిః) గతంలో మేము ప్రకటించినట్లుగానే కొడవటిగంటి కుటుంబరావు మృతజీవులు నవలను మొదలు పెడుతున్నాం. నికొలాయ్ గొగోల్ రాసిన “The Dead Souls” నవలను కొ.కు. గారు మృతజీవులు అనే పేరుతో అనువదించారు. అది 1960లో విశాలాంధ్ర ప్రచురణాలయం ద్వారా అచ్చయినప్పటికీ ప్రస్తుతం … Continue reading

Posted in ఇతరత్రా | Comments Off on మృతజీవులు, న్యూవేవ్ సినిమా

మృతజీవులు – 1

ప్రఖ్యాత రష్యన్‌ రచయత గొగోల్‌ (Nikolai Gogol)రాసిన డెడ్‌ సోల్స్‌ (Dead Souls) అనే నవలను కొడవటిగంటి కుటుంబరావుగారు “మృతజీవులు” అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. కుటుంబరావుగారి కథలూ, నవలలూ, నాటికలూ, వ్యాసాలూ సంకలనాలుగా వచ్చాయి కాని అనువాద రచనలేవీ మళ్ళీ పాఠకుల కంటబడలేదు. ఈ కోవకు చెందిన ఆయన సాహిత్యంలో సోవియట్‌ ప్రచురణలూ, సదరన్‌ లాంగ్వేజెస్‌ బుక్‌ ట్రస్ట్‌ వారి ఇతర దక్షిణ భారతీయ భాషల్లోని సైన్స్‌ పుస్తకాల అనువాదాలూ, 1948 ప్రాంతాల్లో చక్రపాణిగారు “ఆంధ్రజ్యోతి” నడిపిన రోజుల్లో అందులో పేరు లేకుండా ప్రచురితమైన ఆర్థర్‌ కోనన్‌ డాయల్‌ షెర్లాక్‌ హోమ్స్‌ నవలల అనువాదాలూ, యువ మాసపత్రిక కోసం చేసిన బెంగాలీ నవలల అనువాదాలూ మొదలైనవెన్నో ఉన్నాయి. ఆ లోటును పూర్తి చేసే ఉద్దేశంతో “మృతజీవులు” నవలను సీరియల్‌గా మీ ముందుకు తెస్తున్నాము. Continue reading

Posted in కథ | Tagged | 8 Comments

న్యూవేవ్ సినిమా

–వెంకట్ సిద్దారెడ్డి (http://24fps.co.in) ఉపోద్ఘాతం అనగనగా ఒక ఫ్రాన్సు దేశం. ఆ దేశంలో జనాలకి సినిమాల పిచ్చి. ఈ దేశంలో జీవన పరిస్థితులు మారుతున్నప్పటికీ సినిమాలు మాత్రం మారుతున్న సమాజాన్ని కొంచెమైనా దృష్టిలో పెట్టుకోకపోవడం చాలా మందికి నచ్చలేదు. నచ్చకపోతే ఏం చేస్తారు? చూడడం మానేస్తారు. సాధారణ ప్రేక్షకులైతే ఫర్వాలేదు. సినిమాలు వస్తే చూస్తారు. లేదంటే … Continue reading

Posted in వ్యాసం | Tagged | 2 Comments

కొ. కు. గారి అనువాద నవల “మృతజీవులు”

కొడవటిగంటి కుటుంబరావు గారి కాల్పనిక, కాల్పనికేతర రచనలన్నీ పుస్తకాలుగా వచ్చాయి. కానీ ఆయన చేసిన అనువాదాలు మాత్రం పాఠకులకు అందుబాటులో లేవు. యాకొవ్ పెరెల్మాన్ రాసిన “నిత్యజీవితంలో భౌతికశాస్త్రం” పుస్తకానికి ఆయన చేసిన అనువాదం తెలుగువారెందరికో సైన్స్ పట్ల అమితాసక్తిని కలిగించింది. అది (అప్పటి) సోవియెట్ రష్యాలో ప్రచురితమైన తొలి తెలుగు అనువాదం కూడా అని … Continue reading

Posted in సంపాదకీయం | 4 Comments

మరో వనాన్ని స్వప్నిస్తాను

–జాన్ హైడ్ కనుమూరి (http://johnhaidekanumuri.blogspot.com/) రోజంతా శ్రమించి కొంత స్థలాన్ని చదునుచేసి విత్తనాలు చల్లాను మొలకలకోసం నిరీక్షిస్తున్నా పొటమరిస్తున్న ఉనికిని స్వాగతించడానికి! స్నేహితుల్లారా! మిమ్మల్ని పిలవాలనివుంది మొలకలు వస్తూ వస్తూ సమయ సంకేతాన్నిచ్చి రావుకదా! వేచివుండాలి! ఏ అర్థరాత్రో అపరాత్రో వెన్నెల లేనప్పుడు వజ్రపుతునకల్లా బయటపడ్తే నిరీక్షిస్తూ నిరీక్షిస్తూ నిదుర కళ్ళతో జోగితే మొలుచుకొచ్చిన రంగేదీ … Continue reading

Posted in కవిత్వం | 10 Comments

అంకెలతో పద్య సంకెలలు

-వలబోజు జ్యోతి (http://vjyothi.wordpress.com) అంకెలతో సాహిత్యానికి చాలా సంబంధం ఉంది. (ఈ మహా సృష్టిని అంకెల ఆధారంతోనే గుర్తిస్తాము.) జ్ఞానానికి సంఖ్య ఆధారం. కాని అంకెకు ప్రత్యేక అస్థిత్వమంటూ లేదు. అసలు అంకెల ఆధారిత పేర్లు, పదబంధాలు ఎన్నో ఉన్నాయి. ఏకావ్రతుడు, త్రివిక్రముడు,చతుర్ముఖుడు, పాంచాలి, సప్తాశ్వుడు, అష్టావక్రుడు, నవనాధుడు, దశకంఠుడు మొదలైనవి. మన కవులు కవితలల్లడానికి … Continue reading

Posted in వ్యాసం | 5 Comments

అతిథి, సినిమా, గడి

తెలుగులో మొదటగా బ్లాగు సమీక్షలు రాయడం మొదలుపెట్టిన సి.బి.రావుగారు ఈసారి పుస్తక సమీక్షల గురించి రాయగా సరదా శీర్షికలో జ్యోతి గారు సరికొత్త ’గ్యాస్’ ఆఫర్ తో మీ ముందుకొచ్చారు. సిలిండర్ ఎవరు గెలుచుకుంటారో చూద్దాం. ఇక పొద్దులో ఈమాసపు విశిష్ట అతిథి డాక్టర్ కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు. సంగీతం, సాహిత్యం, సైన్సు – ఇలా … Continue reading

Posted in ఇతరత్రా | 4 Comments

పుస్తక సమీక్షలు

సి.బి.రావు! తెలుగులో బ్లాగుసమీక్షలు రాయడం మొదలుపెట్టిందాయన. బ్లాగరుల సమావేశాలకు పెద్ద. తెలుగులో సశేష బ్లాగులు అశేషంగా రచించి, ఇంకా రచిస్తూ వస్తున్న సీరియల్ బ్లాగరి. ఆయన రాసే సచిత్ర సమావేశ నివేదికలు చదవడం కోసం తెలుగు బ్లాగరులు దీప్తిధార (రావుగారి బ్లాగు) వద్ద కాపు వేసి ఉంటారు. ఇప్పటికి ఎన్నో బ్లాగులను సమీక్షించిన సి.బి.రావుగారు ఈ … Continue reading

Posted in వ్యాసం | 3 Comments

గ్యాస్ కొట్టండి

ఏక కాలంలో ఐదు బ్లాగులు రాస్తున్న జ్యోతిగారు అన్ని బ్లాగులూ కలిపి 500 పైచిలుకు జాబులు రాసి తెలుగు బ్లాగరుల్లోకెల్లా విశిష్టతను సంపాదించుకున్నారు. హాస్యం, వినోదం, వంటలు, పాటలు – ఇలా వివిధ అంశాలపై అమితమైన ఆసక్తిని చూపే జ్యోతిగారు పొద్దు పాఠకుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న సరదా శీర్షికలోని మరో అంకం ఇది. ————– … Continue reading

Posted in వ్యాసం | Tagged | 12 Comments