Monthly Archives: January 2007

బ్లాగు సమీక్ష – తెలుగు జాతీయవాది

మా రెండో బ్లాగు సమీక్ష మీ ముందుకు తెచ్చాం. తెలుగు బ్లాగుల్లో తెలుగు జాతీయవాది విలక్షణమైన భావాలతో ప్రసిద్ధి చెందింది. ఈ సమీక్షపై పాఠకుల అభిప్రాయాలకై ఎదురు చూస్తాం. -పొద్దు

Posted in ఇతరత్రా | 2 Comments

తెలుగు జాతీయవాది – అంబానాథ్

రిపబ్లిక్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ను అన్యాయంగా ఆక్రమించుకుని హిందీ దేశం అధికారం చెలాయిస్తోంది. తమదో ప్రత్యేక జాతి అని కూడా తెలుసుకోలేక తెలుగువారు హిందీ దేశానికి సామంతులుగా బతుకుతున్నారు. తెలుగువారు మేలుకుని తమ జాతీయతను గుర్తించి హిందీ దేశం నుండి విడివడి స్వతంత్ర ప్రతిపత్తితో జీవించాలి. కొత్తగా ఉంది కదా? తెలుగుజాతీయవాది (http://telugujaatheeyavaadi2.blogspot.com/) బ్లాగు … Continue reading

Posted in జాలవీక్షణం | Tagged , | 5 Comments

సుధీర్ కవిత

నిన్న ప్రకటించినట్లే ఈరోజు సుధీర్ రాసిన ‘నరుడు’ కవితను వెలువరిస్తున్నాం. ఈ వారంలో వాతావరణం చలిచలిగా ఉన్నా పొద్దు మాత్రం చురుగ్గానే ఉంది. మొన్న కబుర్లు, నిన్న సినిమా వ్యాసం, ఈరోజు కవిత… రేపు బ్లాగుసమీక్షతో మీ ముందుంటాం. తర్వాత…మరిన్ని వెలుగులు పంచబోతోంది మీ –పొద్దు

Posted in ఇతరత్రా | Comments Off on సుధీర్ కవిత

నరుడు

యునిక్ స్పెక్ (Unique Speck) పేరుతో సుధీర్ రాసే తెలు’గోడు’ బ్లాగు తెలుగు బ్లాగులోకానికి సుపరిచితం. ఆయన కలానికి బహుపార్శ్వాలున్నాయి. అది ఒకవైపు సున్నితమైన భావాలనూ పలికించగలదు, మరోవైపు చేదునిజాలను విప్పిచెప్పనూగలదు. ఆయన కవితల్లో ఒదగని భావాలు అరుదు. రచనల్లో వాసి తగ్గకుండా విరివిగా రాయగలగడం ఆయన ప్రత్యేకత. సుధీర్ రాసిన ‘నరుడు’ కవితను పొద్దు … Continue reading

Posted in కవిత్వం | 1 Comment

సినిమా వ్యాసం రెండో భాగం

ముందుగా ప్రకటించినట్లే ఈరోజు సుగాత్రి రాసిన సినిమా వ్యాసం రెండో భాగం వెలువరిస్తున్నాం. గత నెలలో సినిమాల గురించి సుగాత్రి రాసిన పరిచయ వ్యాసం పొద్దు పాఠకులకు గుర్తుండే ఉంటుంది. ఈ వ్యాసం దానికి కొనసాగింపు. గతవారం పుస్తక సమీక్ష వెలువరించిన తర్వాత ఈ వారాంతంలో కొత్తగా పోగుపడిన “కబుర్లు” వెలుగుచూశాయి. ఈ రెండు శీర్షికల … Continue reading

Posted in ఇతరత్రా | Comments Off on సినిమా వ్యాసం రెండో భాగం

సినిమాలెలా తీస్తారు?-1

చిత్రనిర్మాణంలో ముఖ్యంగా మూడు దశలున్నాయి. అవి: ప్రి-ప్రొడక్షన్ ప్రొడక్షన్ పోస్ట్-ప్రొడక్షన్ షూటింగుకు అవసరమయ్యే సన్నాహకాలన్నీ జరిగేది ప్రి-ప్రొడక్షన్ దశలో. చిత్రనిర్మాణంలో ఇది అత్యంత కీలకమైన దశ. అసలు దీంట్లోనే చిత్రనిర్మాణానికి సంబంధించిన తొంభై శాతం పని పూర్తవుతుంది. కథ నిర్ణయం, బడ్జెట్ తయారీ, కథాచర్చలు, స్క్రిప్టు, స్క్రీన్‌ప్లేల ఖరారు, క్యాస్టింగు, ఇతర సిబ్బంది, షూటింగు లొకేషన్ల … Continue reading

Posted in వ్యాసం | Tagged | 3 Comments

పుస్తక సమీక్ష

తాజా విశేషం: కబుర్లు ముందుగా ప్రకటించినట్లే పొద్దు పాఠకుల కోసం ఒక మంచి పుస్తకం (మహమ్మద్ ఖదీర్ బాబు రాసిన దర్గా మిట్ట కథలు) పై ఒక మంచి పాఠకుడు (సుధాకర్) రాసిన సమీక్షను అందిస్తున్నాం. వారం, వర్జ్యం చూసుకోకుండా వచ్చిన ఆలోచనను వచ్చినట్లు రాసేసే “బ్లాగు మనస్తత్వం” వల్ల పొద్దులో సిద్ధమైన రచనలను వెంటనే … Continue reading

Posted in ఇతరత్రా | 1 Comment

కబుర్లు

Wesley Autrey అసలైన హీరో! “నిజానికిందులో విశేషమేమీ లేదు. ఆపదలో వున్నప్పుడు ఏ మనిషైనా చేయాల్సిందిదే!” అని అతి సామాన్యంగా చెప్తున్నాడీ అసమాన్యుడు. వేగంగా వస్తున్న రైలు బారినుండి పట్టాల మీద అపస్మారకంగా పడ్డ యువకున్ని తన ప్రాణాలకు తెగించి కాపాడాడు. రెండు పట్టాల మధ్యా ఆ యువకున్ని ఒడిసిపట్టుకుని పడుకుండిపోయాడు. రైలు డ్రైవరు ఆఖరి … Continue reading

Posted in వ్యాసం | Tagged | 3 Comments

దర్గా మిట్ట కతలు

సుధాకర్ – ఒక ప్రముఖ తెలుగు నెజ్జనుడు. ఆయన రాసే తెలుగు బ్లాగు శోధన 2005వ సంవత్సరానికి భాషా ఇండియా వారు నిర్వహించిన పోటీల్లో అత్యుత్తమ తెలుగు బ్లాగుగా ఎంపికైంది. ఆయనదే మరో బ్లాగు Savvybytes ఆంగ్లంలో అత్యధికులు చదివే బ్లాగు. వీటిలో శోధనలో ఆయన ఆలోచనల్లోని పదును తెలుస్తుంది. Savvybytes సాంకేతికోపకరణాలు, సాంకేతికాంశాలకు సంబంధించినది. … Continue reading

Posted in వ్యాసం | Tagged | 24 Comments

కవితావిభాగానికి పొద్దుపొడుపు

ఈ రోజు పొద్దులో కవితావిభాగానికి పొద్దుపొడుపు అని తెలుపడానికి సంతోషిస్తున్నాం. తెలుగు బ్లాగులు చదివేవారికి రాధిక గారి కవితలను ప్రత్యేకంగా పరిచయం చెయ్యవలసిన పనిలేదు. స్పందించే హృదయం గల రాధిక గారు వ్యాఖ్యలు రాయని బ్లాగూ ఉండదు. చరసాల బ్లాగులో ఉత్తరాల టపాను చదివి ఉత్తరాల మీద ఆమె రెండు కవితలు రాశారు. పొద్దులో తొలికవిత … Continue reading

Posted in ఇతరత్రా | Comments Off on కవితావిభాగానికి పొద్దుపొడుపు