టైమ్ మెషిన్

-వలబోజు జ్యోతి (http://vjyothi.wordpress.com)

jyothi.bmp

ఈ కథ మొత్తం చదివి చివరలో అడిగిన ప్రశ్నకు జవాబివ్వగలరేమో ప్రయత్నించండి….

1975 జనవరి 1

ఉదయం ఐదు గంటలైంది. ఇంకా సూర్యుడు నిద్ర లేవలేదు. చీకటిగానే ఉంది.అది బాపూ అనాథాశ్రమం. దాని నిర్వాహకుడు ప్రకాశం అప్పుడే లేచి కాలకృత్యాలు తీర్చుకుని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఆ అనాథాశ్రమాన్ని ప్రారంభించి చాలా ఏళ్ళయింది. దానికి ప్రకాశమే వ్యవస్థాపక నిర్వాహకుడు. ఇంతలో బయటనుండి కలకలం వినిపించింది. ప్రకాశం ఏంటా అని బయటకెళ్ళి చూసాడు.

అనాథాశ్రమం మెట్లపైన చీరలో చుట్టిన ఒక పసిపాప. ఆడపిల్ల. అంతటి చలిలో రోజుల పాపను అలా వదిలేసి వెళ్ళిన వాళ్ళపై ప్రకాశంకు చాలా కోపం వచ్చింది. ముద్దులొలికే ఆ పసిపాపను తానే పెంచుకోవాలని నిర్ణయించుకున్నాడు.

17 ఏళ్ళ తరవాత..

ఆ పసిపాప (పద్మ) పెరిగి పెద్దదై ఇప్పుడు హాస్టల్లో ఉండి చదువుకుంటోంది. పద్మ వాళ్ళ క్లాస్‍మేట్ ఒకతనిని ప్రేమించింది. ఇద్దరొకటై గర్భవతైంది. అది తెలిసి హాస్టల్ నుండి గెంటేసారు. ప్రకాశం అది తెలుసుకుని వచ్చి పద్మను తిరిగి అనాథాశ్రమానికి తీసికెళ్తాడు. ఆమె ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది, కాని ఆ పాపను ఎవరో ఎత్తుకెళ్తారు. అది విని తట్టుకోలేక ప్రకాశం ఆత్మహత్య చేసుకుంటాడు.

ప్రసవ సమయంలో కలిగిన కొన్ని ఆరోగ్య సమస్యలవల్ల పద్మ డాక్టరును కలిసింది. అన్ని పరీక్షలు చేసిన తర్వాత ఆ డాక్టరు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాడు: ఆమెకు Adrenalo Sytosis అని, ఇది ఒక సీరియస్ జబ్బు .. దీనివల్ల శరీరంలో హార్మోనుల అవకతవకలు జరుగుతాయి. ఆపరేషన్ చేయాలి అని. కొద్ది రోజుల తర్వాత పద్మకు ఆపరేషన్ జరిగింది. ఆ ఆపరేషన్ ఫలితంగా ఆమె మగవాడిగా (ప్రభు) మారిపోయింది.

ప్రభు చాలా బాధపడుతూ ఉండేవాడు, తన కన్నబిడ్డను పోగొట్టుకున్నందుకు, తనను పెంచిన ప్రకాశంగారు చనిపోయినందుకు, తన ప్రేమికుడు మోసగించినందుకు, మగవాడిగా మారవలసి వచ్చినందుకు… ఇది తలుచుకుంటూ తాగుడుకు అలవాటు పడ్డాడు.

ఒకరోజు ప్రభు తమ కాలనీలో ఒక కొత్త బార్ తెరవడం చూసాడు. దాని పేరు “అమృతా బార్”. లోపలికి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద మనిషి కనపడ్డాడు. ఆ వ్యక్తి ప్రభును పిలిచి తాను కనుగొన్న “టైం మెషీన్” చూపించాడు. ప్రభు ఆ వ్యక్తిని బ్రతిమిలాడి అది ఇంటికి తెచ్చుకుని తాను గతం లోకి వెళ్ళాడు. 1992 సంవత్సరంలోకి….

1992 సంవత్సరం…

ప్రభు తన టైం మెషీన్తో పాటు 1992 సంవత్సరంలోకి అడుగెడతాడు. అక్కడ ఒక అందమైన అమ్మాయిని చూస్తాడు( అదే మగవాడిగా మారక ముందు ఉన్న అమ్మాయి). ఆమెని ప్రేమించి, కలిసి తిరిగి, ఒకానొక గడియలో ఒకటవుతారు. ఆ అమ్మాయి గర్భవతైంది. ప్రభు ఆమెను పెళ్ళాడటానికి నిరాకరించి, ఆ ఊరినే వదిలి వెళ్ళి పోతాడు. అలా ఇంకో ఊరికెళ్ళి కొంత డబ్బు సంపాదించి తిరిగి తను ప్రేమించిన అమ్మాయి ఉన్న ఊరికొస్తాడు.

కాని తనను గుర్తుపట్టకుండా ఉండాలని బారెడు గడ్డం పెంచుకుంటాడు.ఒక బార్ మొదలెడతాడు. “అమృతా బార్ “అని. ఒక రోజు అతను బార్లో కూర్చుని ఉండగా ఒక వ్యక్తి వస్తాడు( అదే వ్యక్తి ఇంతకు ముందు అమ్మాయిగా ఉన్నవాడు). గడ్డపు వ్యక్తి తన దగ్గరున్న టైమ్ మెషిన్ను ఆ వ్యక్తికి ఇస్తాడు. ఆ వ్యక్తి దాని సాయంతో గతంలోకి వెళ్ళిపోతాడు. ఇంతలో ఒక ముసుగు దొంగ వచ్చి కత్తి చూపించి ఆ టైమ్ మెషిన్ తన దగ్గర్నుంచి లాక్కుని ఆ గడ్డపు వ్యక్తిని తీసుకుని గతంలోకి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళాక ఆ ముసుగు దొంగ ఆ మెషిన్ తిరిగిచ్చేసి గడ్డపు వ్యక్తిని వదిలేసి వెళ్ళిపోతాడు.

గడ్డపు వ్యక్తి అలా అలా తిరుగుతూ బాపూ అనాథాశ్రమానికి వస్తాడు. లోపలికెళ్ళి చూస్తే అక్కడొక అమ్మాయి (తర్వాత అబ్బాయిగా మారిన అమ్మాయే), పక్కన అప్పుడే పుట్టిన ఆడపిల్లను చూస్తాడు. ఆ పసిగుడ్డును తీసుకుని టైమ్ మెషిన్ మొదలెట్టి ఆ పాపతో సహా గతం (1975) లోకి వెళతాడు.

1975 జనవరి 1

ఉదయం సుమారు నాలుగున్నర అయింది. గడ్డపు వ్యక్తి ఆడపిల్లతో బాపూ అనాథాశ్రమానికి వస్తాడు. ఆ పాపను ఆశ్రమ గుమ్మంలో వదిలి వెళ్ళిపోతాడు. కాలేజీలో చేరి బాగా కష్టపడి చదివి డాక్టరవుతాడు. ఒక రోజు ఒక స్త్రీ అతని ఆసుపత్రికి వస్తుంది. ఆమెను పరీక్షించి, ఆమెకు Adrenalo Sytosis అనే ప్రమాదకరమైన జబ్బు ఉన్నట్టు కనుగొని ఆపరేషన్ చేసి ఆ స్త్రీని మగవాడుగా మారుస్తాడు. ఆ తర్వాత టైమ్ మెషిన్ సహాయంతో గతంలోకి వెళతాడు. ఆప్పుడు అతను జనాలు పడుతున్న కష్టాలు చూసి మనసు ద్రవించి ఒక అనాథాశ్రమాన్ని ప్రారంభిస్తాడు. దానికి బాపూ అనాథాశ్రమం అనే పేరు పెట్టి అనాథ పిల్లలకు ఆసరా ఇస్తాడు.

ఒక రోజు అతని ఆశ్రమం ముందు ఎవరో ఒక పసికందును వదిలి వెళతారు. అతను ఆ బిడ్డను తన కన్న బిడ్డలా పెంచి పెద్ద చేస్తాడు. ఆ పాప పెరిగి పెద్దదై చదువుకుంటూ ఒక హాస్టల్లో ఉంటుంది. ఒకరోజు అతనికి ఒక విషయం తెలుస్తుంది: ఆ ఆడపిల్ల ఒక వ్యక్తి వల్ల మోసపోయి గర్భవతైందని, హాస్టల్ వాళ్ళు గెంటేసారని. జాలితో ఆ అమ్మాయిని తమ ఆశ్రమానికి తీసుకొస్తాడు. ఆ అమ్మాయి ఒక ఆడపిల్లని కంటుంది.

ఆ వ్యక్తి…అదే ప్రకాశం భవిష్యత్తులోకి వెళ్ళాలని అనుకుంటాడు. ముసుగు ధరించి, ఒక తుపాకి తీసుకుని టైమ్ మెషిన్ తీసుకుని అమృతా బార్ కి వెళతాడు. బార్ లోపలికి వెళ్ళి ఆ గడ్డపు వ్యక్తిని బెదిరించి తనతో పాటూ గతంలోకి తీసికెళ్తాడు. కాని గతంలోకి వెళ్ళాక పశ్చాత్తాప పడి ఆ గడ్డపు వ్యక్తికి టైమ్ మెషిన్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అలా తిరిగి మళ్ళీ తన ఆశ్రమానికి వచ్చాక తెలిసిందేమంటే పుట్టిన పసిబిడ్డను ఎవరో ఎత్తుకెళ్ళారని. అది విని తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకుంటాడు.

ఇంతకూ ఆ పసిబిడ్డను ఎత్తుకెళ్ళింది ఎవరూ????

-వలబోజు జ్యోతి (http://vjyothi.wordpress.com)

(ఏక కాలంలో ఐదు బ్లాగులు రాస్తున్న జ్యోతిగారు అన్ని బ్లాగులూ కలిపి 1000 పైచిలుకు టపాలు రాసి తెలుగు బ్లాగరుల్లోకెల్లా విశిష్టతను సంపాదించుకున్నారు. హాస్యం, వినోదం, వంటలు, పాటలు – ఇలా వివిధ అంశాలపై అమితమైన ఆసక్తిని చూపే జ్యోతిగారు పొద్దు పాఠకుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న సరదా శీర్షికలోని మరో అంకం ఇది.)

About వలబోజు జ్యోతి

అచ్చమైన తెలుగింటి గృహిణి ని.. కాలక్షేపానికి అంతర్జాలానికి వచ్చి బ్లాగులు మొదలెట్టాను. నేర్చుకోవాలనే తపనతో మొదలైన ఈ పయనం ఇప్పుడు తెలుగులో మొదటి వంటల వెబ్సైట్ దగ్గర ఆగి ఉంది. అప్పుడప్పుడు పత్రికలలో రచనలు చేస్తుంటాను. నాకు తెలిసిన ప్రతి విషయం నాకిష్టమైన తెలుగులో చూడాలి, రాయాలి అనుకునే భాషాభిమానిని.

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

35 Responses to టైమ్ మెషిన్

  1. ఇది సరదా శీర్షిక! నా టైం బాగోలేక ఇది చదవడానికి వచ్చినట్టున్నా.

  2. పసిబిడ్డ సంగతి దేఁవుడెరుగు, నా మతినెత్తుకెళ్ళింది (పోగొట్టినది) మాత్రం మీకథే.

  3. నేనే ఎత్తుకెల్లినట్లున్నాను. సరిగ్గా గుర్తు లేదు.

  4. మరే! ఈ మధ్య వస్తున్న సినిమాలు, టి.వి సీరియల్లు చూస్తుంటే తిక్క రేగి అదే స్టైల్‍లో రాసా…ఇది రాసేటప్పుడు నాకు మతి పోయింది. తలనొప్పి రెండు రోజులు తగ్గలా. మరి ఆ రచయితలు ఎలా రాస్తారో ఎమో?? చూసేవాళ్ళు రెప్పలార్పకుండా చూస్తారు కూడా.

  5. chowdary says:

    yevari mindanna povalante nenu ee tapa chadamantanu ,,,

  6. kittu says:

    valloo meelaanti vaare ayi undaali

  7. నా కైతే ఏమీ అర్దం కాలేదు.

  8. అధ్బుతమండీ, మీ కధ అంత త్వరగా మీకే అర్దమ్ కాలేదేమో, ఇది ఎలా ఉందంటే, అప్పుడెప్పుడో తెనాలి రామలింగడు చెప్పిన
    “మెకతోకకుమెకతోకకు” గుర్తుకు వచ్చింది.
    ఒక వేళ మీ ప్రశ్నకు సరి అయిన జవాబు కావాలంటే ఒక సారి న్యుటన్ మహాశయుడి థియరీ ఆఫ్ రిలేటివిటీ చదవాలి, అంత ఓపిక లేకపోతే Steven spielburg’s Back to the future movie చూడాలి
    అంతిమంగా నా జవాబు ఏమిటి అంటే కధలో ఉన్నది ఇద్దరు వ్యక్తులు, నమ్మకం లేకపోతే ఒక flow chart గీయండి
    గీతను ఆధారంగా చేసుకుంటే, ఆత్మకు మరణమ్ లేదు, శరీరమే మారేది
    కాబట్టి ఈ ప్రశ్నకు నా సమాధానం “ఆ ప్రకాశం అన్న వ్యక్తే”

    ఇంక చివరగా నేటి సినిమాలు చూసి తిక్క రేగి రాశాను అన్నారు, నిజమే కానీ విమర్శ చెయ్య్డడం తేలిక పరిష్కరించడం కష్టం
    మీరు మంచివి రాయచ్చు కదా!! మీరు కూడా అదే బాటలో పయనించాలా!!!

    I don’t mind if you don’t accept my comment, but I feel it’s worthy

  9. venkat says:

    చాలా ఇంట్రస్టింగ్ గా మొదలయ్యింది మీ సరదా శిర్షిక. ఒక విధంగా మీరు రాసిన విషయం సరదా కోసమైనా బాగా ఆలోచిస్తే చాలా వుంది ఎందులో ఆలోచించడానికి. కానీ కొంచెం ఎక్కువగానే confuse చేసారు. ఒక క్యారెక్టర్ గతంలోకి వెళ్ళడం వరకూ బావుంది, తిరిగిరావడమూ బావుంది కానీ అన్ని సార్లు వెళ్ళడం రావడంతో తికమక పడిపోయాను.

  10. క్షమించాలి, నిన్న Newton అని రాశా, కానీ ఆ సిద్దాంతం Einstien ది. మీ కధ చదివేసరికి మరచిపోయా

  11. radhika says:

    అర్దం కాలేదండి.

  12. మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ గారు, ఇది చదివాక కూడా మీ పేరు మరచిపోకుండా సరిగా గుర్తుపెట్టుకొని రాయగలిగారంటే నమ్మశక్యంగా లేదు. అది మీదేనా లేక నాలుగైదు పేర్లు కలిపి కషాయం పెట్టేశారా? 😉

  13. నమస్తే రానారె గారు ,
    నా పేరు దేముంది, ఇది చూడండి
    మిరియాల శ్రీ వెంకట సత్య సూర్య కృష్ణ ప్రసన్న దిలీప్ (మా అన్నయ్య)
    చిన్నప్పటి నుంచి గుర్తు పెట్టుకోవడం వల్ల మర్చిపోలేదు,
    ఇంక కషాయం సంగతి అంటారా, చాలా తమాషా అది
    శ్రీ – మాములుగా వచ్చింది
    సత్య – ఎప్పుడూ నిజమ్ చెప్పాలని పెట్టారు (మరీ 1౦౦% కాకపోయినా ఒక 8౦% వరకు సరే)
    మా నానమ్మ పేరు భ్రమరాంబిక ఇంక నా జన్మసమయం బట్టి అర్జున్ అని రావాలి అలా రెండూ కలిసి “భ్రమరార్జున”

    నేను పుట్టింది నాగ పంచమి నాడు అలా ఫణి చేరింది
    ఇంక నేను దేదీప్యమానంగా ఎదగాలని ప్రదీప్ అని పెట్టారు

    మీ దయ వల్ల నా పేరు చరిత్రను PC లోకి ఎక్కించా
    Thanks

  14. Shilpa says:

    oh devuda idi rasina vaallakku entha talent vundho nenu artham chesukunnanu. Masth rashinavu. Asalu meku ye thought ella vocchndi. Asalu naku meru dorikite interview thesukuntannu. Idi ma friends mundhu petti valla brain guda tintanu me rupom lo.

  15. gopal says:

    i forgot my name after reading this story

  16. sridevi says:

    first time oka blog chusanu,
    ee sarada katha, mundu saradagane chadivanu,
    taruvata realize ayanu, idi sarada gaa kadu
    durada ani, burra gokkuntu sagam lone aapesanu.

  17. lucky says:

    సరదా శీర్షిక వేరే ఎవరితోనైనా వ్రాయిస్తే సరదాగా, బాగుంటుందేమో ?

  18. jyothi says:

    అవునా ! మరి ఎందుకో కూడా చెప్పండి lucky గారు. మార్చేద్దాం…

  19. Mahitha says:

    me story bagunndhi kani answer guda cheppandi..Me story ke pedda kevvvvvvvvvvvvvvvvvvvvu kekkaaaaaaaaaaaaa.

  20. ఆహా ఏమి నా భాగ్యము.

    ఇంద్ర తరువాత అందరి వాడు.సిం హాద్రి తరువాత ఆంధ్ర వాలా రావడం అంటే ఇదే నేమో 🙂

    ఇందులో కొంచెం కన్ ఫ్యూషన్ పాళ్ళు ఎక్కువయినట్టుంది.

    — విహారి

  21. jyothi says:

    ఇందులో కంఫ్యూజన్ అంటూ ఏమీ లేదు.. అసలు స్టార్ ప్లస్ లో వచ్చే సీరియల్సు చూస్తే ఇది చాలా తక్కువ. అందులో హీరోయిను పార్వతి మనవళ్ళు మనవరాళ్ళ పెళ్ళిళ్ళు కూడా అయిపోయి ఉంటాయి. కాని ఈవిడ మాత్రం పాతికేళ్ళ దానిలా ఉంటుంది.ఇంక అందులో ఒక మామ్మగారు ..ఆవిడ మనవళ్ళకు మనవళ్ళ పెళ్ళిళ్ళు అయ్యాక కూడా బ్రతికి ఉంటుంది. ఇవన్నీ సాధ్యమేనా. చూసేవాళ్ళు వెర్రోళ్ళా?

  22. జనాలెందుకు అంత బెంబేలు పడిపోతున్నారో నాకు అర్థం కావట్లా – నాకైతే ఇది చాలా నచ్చింది. ఈ టీవీలో ఆయనెవడో తనే కథ మాటలు రాసి, సంగీతం కూడ సమకూర్చి తనే ప్రొడ్యూస్ చేసి ప్రస్తుతానికి ఒకటో రెండొ పాత్రలు ంఆత్రం తను వేస్తున్నాట్ట – ఈ కథ స్ఫూర్తితో అన్ని పాత్రలూ తనే వేసే శుభదినం త్వరలోనే వస్తుందని ఆశిద్దాం 🙂

  23. ప్రతి ఒక కథ చివర ఒక ప్రశ్న అడిగే బేతాళుడు 24వ సారి విక్రమార్కుడు సమాధానం చెప్పలేని కథ చెబుతాడు. దానికి బాబులా ఉందీ కథ.

  24. srilatha says:

    katha vichitranga undi, indulo unnadi okka manishe…

  25. Shilpa says:

    Jyothi garu correct ga chepparu serials lo plastic surgery ani roopam marchukoni vosthunnaru. Enta plastic surgery chesina voice maradu kada. Ee Ekta kapoor serials chusthe meru cheppenattey edhi challa takkuva.

  26. బ్లాగ్మహామహులే తలబాదుకున్నారంటే..నెత్తికి హెల్మెట్ పెట్టుకోని వచ్చి చదువుతా (మా బామ్మ పక్క వాడి అనుభవం చూసి నేర్చుకున్నవాడే ధన్యుడు సుమతీ అన్నది మరి)

  27. వింజమూరి విజయకుమార్ says:

    నేను పాతిక భాగం చదివా! విషయం సూచాయిగా అర్ధమయింది. నాకు కొన్ని పన్లున్నాయి. కొన్ని కథలు పూర్తి చేయాలి. ఇంకా కొన్ని అప్పగింతలూ, వీలునామాలూ, గట్రా. . . అన్నీ అయాక మళ్ళీ వచ్చి చదువుతా! ఏదేమయినా 16 & 17 కామెంట్లు ఈ కథకి బాగా నప్పాయి. ఉంటానండీ జ్యోతిగారూ. . అయినా నేనే దొరికానండీ మీకు? దానేమ్మాబడవా. . . సకల చరాచర సృష్టిలో యింతమందుండగా…?

  28. Aruna says:

    Evaru ethukellaledu.
    Aina pasibiDDa itanu okaTe aite, malla pasi biDDA ga mare logice ekkaDanunDi vachindi. koncham confuse chesi wrong ga rasaru. antena..[:)]

  29. వూణ్ణ సుధీర్ says:

    ఎవరి టపా చదివితే దిమ్మ దిరిగి mind బ్లాక్ అయిపొతుందో వారే జ్యొతి గారు అనిపిస్తుంది

  30. abhiram says:

    idi comedy ani comments chusaka telisindi. Kaani okati matram nijam.

  31. pujitha says:

    emandi janalani endukandi ila mee rachanalatho champutharu.vallevaro TV serials teesi janalaki pichekkisthunanrani meeru kudaaa ade chestara???

  32. Anil says:

    Mind block ikkada..eqami cheyyalo teliyatla

  33. sridevi says:

    Hello MadamJyothigaru,

    Kasta confusion,Kasta Paityam(sorry for saying like this)….no………
    intaki nenavaru,meerevaru, a pasi biddani ettukellindi evaru???
    ayya baboi…….
    may be Prabhu.

  34. hello jyothi garu,

    adbhutham andi chala baaga rasaru kani chivarlo aa prashana vesaru choodani adi meeku meere veskoni maaku jawabu chepthe bagundedi

    poni memu chepali antee meeru maaku oka time machine kanipetti ivandi memu mee kathaloki velli aa pathralne adigi kanukuntamu.

    sarelendi katha mathram bagundi andi.

    aaku ikkada kallu thiruguthunnayi inka nenu veltha andi amrutha bar ki???

    hahahahaha

  35. jyothigaru,

    ee katha chadivaka naaku okati artham ayindi

    meeru saamanyuralu kadandi anduke inta adbhutamaina katharasaru
    bagundi kani naa mathi chedipoindi anduke mimmali poguduthunnaaaaa

Comments are closed.