ఏనాడైనా అనుకున్నానా కల్లో ఐనా

ప్రశాంతి ఉప్పలపాటి

-ప్రశాంతి ఉప్పలపాటి (http://tomakeadifference.net)

చిన్నప్పటి నుంచి సంఘసేవ చేయాలని, సమాజానికి మేలు కలిగించే మంచి పనులు చేయాలని ఉన్నా సంకోచాలు, అపోహల వల్ల ఏమీ చేయలేకపోయిన ఓ అమ్మాయి జీవితంలో ఓ మంచి మార్పు రావడానికి వెనుక గల కథా కమామీషు……ఏమిటో ఆమె మాటల్లోనే:

నాకు ప్రతి ఆదివారం ఓ అనాథాశ్రమానికో, వృద్ధాశ్రమానికో వెళ్ళాలని ఉండేది. ఏదైనా మంచి పని చేయాలని ఉండేది. ముందు నిలబడే చొరవ లేక ఎవరైనా ముందు నడుస్తుంటే వారి వెనుక నేను పని చేద్దాం అనుకునేదాన్ని. మొత్తానికి ఏమీ చేయకుండానే కాలం గడిచిపోయింది.

కార్గిల్ యుద్ధం అప్పుడు మాత్రం ఏదైనా చేయాలనే తపన నా భయాలనన్నిటినీ అధిగమించి డబ్బులు సేకరించి పంపేలా చేసింది. ఇంకోసారి పేపరులో స్రవంతి అనే అమ్మాయికి రక్తమార్పిడి కోసం డబ్బులు అవసరమని చదివి నెట్ స్నేహితులందరికీ మెయిల్స్ పంపితే తక్షణమే స్పందించి వారి సహాయాన్నందించారు. మంచి పని ఏదైనా సరే అనుకున్న వెంటనే అమల్లో పెట్టేయాలి, తోడ్పాటు దానంతటదే అందుతుందని అర్థమయ్యేలా చేసారు.
group-photo_2.jpg
అయినా నాలో పెద్ద మార్పు లేదు. ఎందుకంటే అవి అన్నీ తాత్కాలిక స్పందనలే. ఆ సమస్య పరిష్కారాం కాగానే, హమ్మయ్య ఓ మంచి పని చేయగలిగాననే ఆనందం తప్ప, ఇంకా ఏమి చేయగలనా అని ఆలోచించలేదు. అప్పట్లో ఉద్యోగరీత్యా నాకు మంచి బ్రేక్ రాలేదు. మానసికంగా కూడా నేను సరిగా లేను.

“నేను జీవితంలో ఇంకా నిలదొక్కుకోలేదు.”
“కొంత వెనకేసాక సేవ చేస్తాను.”
“నాకు అంతటి సామర్ధ్యం ఉందా?”
“నాకు సమయం చాలదు.”
“ఎవరైనా ముందు ఉంటే నేను చేస్తాను.”

ఇలాంటి పలాయనవాదంతో గడిపేదాన్ని. ఎప్పటికైనా చేస్తానులే, సేవ చేయాలంటే పక్కా ప్రణాళిక ఉండాలి అని నన్ను నేను సముదాయించుకునేదాన్ని.

అలాంటి సమయంలో నాలో మార్పు తెచ్చింది ఓ ప్రయత్నం. చేద్దాంలే, చూద్దాంలే, పక్కా ప్రణాళిక వేసుకుందాం ఇలా అనుకుంటే అసలు మొదలే కావు. ఏదో ఒకటి మనం చేయలేనంత మాత్రాన మిగతావేవీ చేయలేమని కాదు. ఫలానాదేదో చేశాక, సాధించాక ఇంకేదో చేయడం కాదు. అసలు మనం ఉన్న పరిస్థితుల్లో, మనకు ఉన్న వనరులను ఉపయోగించుకుని పని చేసేటట్టు ఉండాలి. ఏవో లేవు అనుకోకూడదు, అని నేర్పిందో సందర్భం.

అర్థరాత్రి …… అపురూప క్షణాలు

2005 ఫిబ్రవరి 4 రాత్రి, ఈనాడు హెల్ప్ లైన్ లో ‘పదకొండేళ్ళ బాలిక అస్మా కి కిడ్నీ ప్రాబ్లం ఉంది. ఆపరేషన్ కి సుమారు లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది’ అని చదివి మనసాగక తెలుగుపీపుల్ డాట్ కాం చర్చావేదికలో పోస్ట్ చేసాను. మనం అందరం కలిసి ఎంతో కొంత పంపుదాం అని. ఏదో పోస్ట్ చేసానే కానీ ఎంతమంది స్పందిస్తారు అనేదాని మీద నాకు ఎలాంటి ఆలోచన లేదు. నేను ఒక్కదాన్నే ఇవ్వగలిగే మొత్తం కంటే, ఏ కొంచెం ఎక్కువ అందచేయగలిగినా చాలు అనుకున్నాను.

పొద్దున లేచి చూస్తును కదా, నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. చాలా మంది సహాయం చేయడానికి ముందుకొచ్చారు. డబ్బులు ఎలా పంపాలి అని అడిగారు. భాస్కర్ గారైతే అప్పటికే ఎమ్మార్వో గారికి డబ్బులు పంపేసారు. నాకు కొంచెం ఉత్సాహం వచ్చి, కొద్ది రోజుల వ్యవధి పెట్టుకుని ఎంత సేకరించగలిగితే అంత ఒక్కసారే పంపుదాం అని చెప్పాను. అలా మొదలైన ప్రయత్నం, ఇంకా బాగా సహాయం చేయగలమా అనే ఆలోచనతో మొదలై చివరికి మేమే బాధ్యత తీసుకునే స్థితికి వచ్చింది. ఎంతో అనుభవం ఈ మొదటి కేసులోనే. ఎలాగైతేనేమి ఆ పాపకి ప్రాణభయం లేదు, ఆపరేషను అవసరం లేదు, ఫిజియోథెరపీతోనే నయం చేయచ్చు అని విన్నాక ప్రాణం లేచొచ్చింది.

అస్మా విషయం విజయవంతంగా ఎప్పుడైతే పూర్తయిందో అప్పుడు నాలో చాలా అంతర్మథనం జరిగింది. ముందు నిలబడగలిగితే, కొంచెం బాధ్యత తీసుకుంటే మనకు చేయూతనిచ్చేవారు ఎంతమంది ఉన్నారు, ఇతరులకి సహాయపడడానికి ఎంతమంది ముందుకు వస్తున్నారు అని అనిపించింది. అందరూ ఒకలాగే ఆలోచిస్తారు. ఎవరో ముందు నడిస్తే తాము ఎంతటి పని చేయడానికైనా సిద్ధపడతారు. ఒకసారి మనం ముందు నిలబడితే చాలు, తరువాత ఇక నడవనవసరం కూడా లేదు, మన తోటి వారే మనల్ని ముందుకు తీసుకెళతారు. ఇది నా అనుభవం నాకు తెలిపిన నిజం.

ఐతే ఆ బాధ్యత తీసుకోవడానికి ముందు వ్యక్తిగతంగా నా లోటుపాట్లు ఏమిటి, నలుగురికీ ముందు నిలబడగలగడానికి నా అర్హత ఏమిటి అనేది నా పరంగా ఎలా ఉంది, నలుగురి దృష్టికోణంలో ఎలా ఉంది అని ఆలోచించాను. అంతమంది నన్ను నమ్ముతున్నప్పుడు, నా మాటకు విలువిచ్చి మంచి పనికి తోడుగా వస్తున్నందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బలంగా అనిపించింది. నన్ను పట్టి పీడించే అపోహలు, నా పట్ల, నా సమర్థత, అర్హతల పట్ల నాకు గల భావాలు అన్నిటినీ ఆ నాటి ఆ స్ఫూర్తి అధిగమించింది.

సరే. ఈ సాయాన్ని ఇలాగే కొనసాగించాలి, ఇలా ముందుకు వచ్చిన వారిని వెనక్కి పోనీయకుండా ఇంకా ముందుకు సాగాలి అనుకున్నంత వరకు బాగుంది. ఎలా సాగాలి, ఇది తదుపరి ప్రశ్న. ఇలాంటి పనులు చెయ్యాలనుకున్నప్పుడు మొదట ఎదురయ్యే పెద్ద సమస్య కమ్యూనికేషన్. అవసరమొచ్చినప్పుడల్లా ఒక్కొక్కరికి మెయిల్స్ పంపడం చాలా కష్టం. కొంతమందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. అలా కాకుండా ఒక మెయిలింగ్ గ్రూప్ ప్రారంభించినట్లైతే ఆ గ్రూప్ కు నేను మెయిల్స్ పంపుతూ ఉంటాను, ఇష్టమైన వాళ్ళే అందులో సభ్యులుగా చేరుతారులే అనుకున్నాను. గ్రూప్ ప్రారంభించాలి అని నిర్ణయించుకున్న తర్వాత ఆ గ్రూప్ కి పేరు ఏమి పెట్టాలి అనే ప్రశ్న ఎదురైంది.

పేరులో ఏముంది!!

నెల్లూరులో శ్రీ పెరుగు రామకృష్ణ దంపతులు, శ్రీమతి జయప్రద గారి ప్రోద్బలంతో, మిగతా కవులందరి ప్రోత్సాహంతో నేను రెండు మూడు కవి సమ్మేళనాల్లో పాల్గొనడం జరిగింది.

శ్రీమతి పెరుగు సుజనారామం గారి శ్రేయోభిలాషి ఒక రిటైర్డ్ అంకుల్ ఉండేవారు. సాహిత్యం అంటే తనకి ఎంతో ఇష్టం. ఆయనకు నా కవితలు నచ్చాయి. నన్ను రామకృష్ణ గారి ఇంటిలో కలిసారు. ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాము అందరమూను. ఆ తరువాత ఒకసారి ఆయన తను కొత్తగా చదివిన పుస్తకం గురించి చెప్తూ, తనకు బాగా నచ్చిన కథ చెప్పారు:

సముద్రంలోని ఆటుపోట్ల వల్ల ఎన్నో స్టార్ ఫిష్ లు ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి. కొన్ని కిలోమీటర్ల మేర పరుచుకున్న ఒడ్డంతా స్టార్ ఫిష్ లే ఉన్నాయి. ఒకతను ఒక్కొక్క స్టార్ ఫిష్ ను తీసుకుని సముద్రంలోకి విసరసాగాడు. ఓ బాటసారి అతన్ని చూసి దగ్గరకి వెళ్ళి ఇలా అడిగాడు:

‘చూడు ఒడ్డు ఎంత పొడవుగా ఉందో. ఎన్ని వేల స్టార్ ఫిష్ లు ఉన్నాయో. ఒక్కొక్క దాన్ని అలా విసరడం వల్ల ఈ సమస్య తీరుతుందా, పరిస్థితిలో మార్పు వస్తుందా! ఎందుకీ వృథా ప్రయాస!’.

అప్పుడు అతను ఇతనికేసి చూసి, మరలా ఇంకొక స్టార్ ఫిష్ ను చేతిలోకి తీసుకుని ‘దీని పరిస్థితిలో మార్పు వస్తుంది’ అంటూ సముద్రం లోకి విసిరేస్తాడు.

చాలా అద్భుతమైన కథ అనిపించింది. ఆ రోజు అంకుల్ చెప్పిన ఆ కథ నాకు మరలా గుర్తొచ్చింది. మనందరి మనస్తత్వానికి సరిపోయే కథ. సమస్య పెద్దదైనప్పుడు, మనం చేసే ఓ చిన్న ప్రయత్నం వల్ల ఏమి ప్రయోజనం అనే నిరాశావాదం, పలాయన ధోరణే ఎక్కువ ఉంటుంది సమాజంలో.

అంతే కానీ ఏ ఒక్క వ్యక్తికి మనం మేలు చేయగలిగినా అది గొప్ప విషయమే అని అనుకోం. ఏది చేయలేం అనేదాన్ని గురించే ఆలోచిస్తాం తప్ప, మార్పుకోసం ఏది చేయగలం అని ఎప్పుడూ ఆలోచించం. అందుకే ఆ ఆలోచన కలిగించడానికే గ్రూపు పేరు “మార్పుకోసం” (ఇంగ్లీషులో “To Make A Difference”) అని పెట్టాను. గ్రూపు URL ఇది: http://groups.yahoo.com/group/tomakeadifference
గ్రూపుకొచ్చే మెయిళ్ళను, గ్రూపులో జరిగే చర్చలను అక్కడ చూడవచ్చు.

స్ఫూర్తిదాయకం

గ్రూప్ పెట్టాలనుకోవడం, పేరు నిర్ణయించడం అయిపోయాక, ఇక ఆచరణలో పెట్టడమే మిగిలింది. అప్పుడే ఎప్పుడో చదివిన మరొక కథ గుర్తొచ్చింది:

ఒకతను ఏదో కారణం వల్ల జైలుకెళ్తాడు. వాళ్ళ నాన్న అతనికొక ఉత్తరం రాస్తాడు. ‘ఒరేయ్ బాబు! మేం ముసలివాళ్ళమైపోయాం. బయటిపనులు చేయలేం. మన పెరడులో పాదులేసుకుని, పండే కూరగాయలతో ఏదో బతుకుబండిని నెట్టుదామనుకుంటున్నాం. పెరడు చదును చేసే శక్తి లేదు. వేరే వాళ్ళ చేత చేయించడానికి డబ్బులు లేవు. నువ్వు ఇక్కడ ఉండి ఉంటే ఈ బాధ్యత నువ్వు తీసుకునేవాడివి కదా’ అంటూ. అది చదివి ఇతను ఆలోచనలో పడతాడు.

ఓ పదిహేను రోజుల తరువాత తండ్రి నుంచి మళ్ళీ ఓ ఉత్తరం వస్తుంది తనకి. ‘ఒరేయ్ బాబు! పోలీసులకు నువ్వు ఏమి చెప్పావు? వాళ్ళు వచ్చి పెరడు అంతా తవ్వి వెళ్ళారు. వాళ్ళకి ఏమీ దొరకలేదు. కానీ నాకైతే సంతోషంగా ఉంది. ఇక మొక్కలు వేసుకోవచ్చు’, అని. ఆ ఉత్తరం చదివి ఇతను తృప్తిగా నవ్వుకుంటాడు.

నువ్వు ఎంత దూరంలో ఉన్నావు, ఎక్కడ ఉన్నావు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు అన్నదాంతో సంబంధం లేకుండా, మనస్ఫూర్తిగా ఏమైనా చేయాలనుకుంటే ఎలాగైనా చేయగలవు అనేదే నీతి ఈ కథలో.

యాడ్ వాల్యూ టు యువర్ మనీ – ఇది టాగ్ లైను. డబ్బుకి విలువ జోడించడమంటే, ఆ డబ్బు ద్వారా కలిగే ప్రయోజనంతో పోల్చడం. మనం ఇచ్చిన 100 రూపాయలు లేక 500 రూపాయలు, ఒక సహాయానికి ఉపయోగపడతాయి. ఉదాహరణకు ఒక ఆపరేషను నిమిత్తం మనం ఇచ్చే డబ్బు, అందరి చేతులు కలిసే సరికి పది వేలో, ఇరవై వేలో, లేదా ఓ లక్షో అవుతుంది. ఇక్కడ 100 విలువ ఆ లక్షతో సమానం. ఓ మనిషికి దక్కిన ఆరోగ్యంతో, నిలబెట్టిన ప్రాణంతో సమానం, వెరసి ఓ జీవితం, ఊపిరి పీల్చుకున్న కుటుంబం. ప్రపంచంలోని ఏ బాంక్ అయినా, ఏ షేర్, స్టాక్ లేదా మ్యూచ్యువల్ ఫండ్ అయినా మన డబ్బుని అన్ని రెట్లు చేయగలదా, ఇంత తక్కువ సమయంలో. ఈ సత్యమే ఆ టాగ్ లైనుకి అర్థం.

ఇక గ్రూప్ పేజీలో ఉన్న ఫోటో గురించి కూడా చెప్పాలి. గూగుల్ లో గాలించి రెండు, మూడు ఇమేజులను కలిపి ప్రస్తుతం ఉన్న ఫోటో ని సృష్టించాను. “మిమ్మల్ని మీరు గ్రూప్ కి పరిచయం చేసుకోండి”. అందరికీ మన గురించి తెలియచేయడానికి సూర్యకిరణాలు సంకేతం. పరిచయం చేసుకున్నాక అందరితోను మన భావాలు, అనుభవాలు, సలహాలు పంచుకోవాలి. అప్పుడు ఒకరికొకరం బాగా అర్థమవుతాం. మార్గం చాలా పెద్దది. ఆశయం ఉదాత్తమైనది. కలిసి పని చేస్తే ముందుకు వెళ్ళగలుగుతాం.

ప్రత్యేకతలు:

ఎన్నో సంస్థలు సంఘసేవలో రకరకాల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తుంటే, ఓ కొత్త గ్రూపు పెట్టాల్సిన అవసరం ఏముంది! దీని ప్రత్యేకత ఏమిటి?

1. ఏ ఒక్క నిబంధనకో బందీ కాకపోవడం:

సాధారణంగా సంస్థలకు కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి. వాటికి లోబడే అవి పనిచేయాలి. ఎంత డబ్బున్నా సరే, అవసరం ఎంత న్యాయమైనదైనా సరే వారి పరిథిలోకి రాకపోతే వారు ఎలాంటి సహాయం చేయరు. ఇది ఎవరి తప్పు కాదు. ఒక సంస్థ ప్రణాళికాబధ్ధంగా నడవాలంటే నిబంధనలకు అనుగుణంగానే పని చేయాలి.

ఈ గ్రూపు అలా ఉండకూడదు, ఏ ఒక్క నిబంధనో ఓ మంచి పని చేయడానికి అడ్డు రాకూడదు అనేదే ముఖ్యోద్దేశ్యం. ఇవే చేయాలి, ఇలాగే చేయాలి అనే థంబ్ రూల్స్ ఏవీ లేవు. ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడమే. ఒక కేస్ మా దృష్టికి వచ్చినప్పుడు, అది సరైనదేనా, ఫలాన వారికి సహాయం చేయాలా, వద్దా, చేయదలుచుకుంటే ఎలా చేయాలి అనేది నిజానిజాలు తేల్చుకుని, అందరూ కలిసి నిర్ణయిస్తాము.
ముఖ్యంగా ఎవరూ, ఏ సంస్థ సహాయం చేయని కేసులని మేము తీసుకుంటాము. అవసరం నిజమైందా కాదా అని మాత్రమే చూస్తాము. మానవతా దృక్పథమే మా నిర్ణయాలకు ప్రాతిపదిక.

2. నగదు చేతికి ఇవ్వకుండా ఉండడం:

విద్యా పరమైన సహాయమైనా, ఆరోగ్య పరమైన సహాయమైనా, ఇక ఏ రకమైనా సాధ్యమైనంతవరకు మేము డబ్బులు అవసరార్థులకు ఇవ్వము. పాఠశాల లేదా కళాశాల యాజమాన్యానికి కడతాము. టెక్స్టు మరియు నోటు పుస్తకాలు, సంచీలు, పెన్సిల్స్, పెన్ లు వగైరా అన్నీ మేమే కొంటాము. అలాగే హాస్పిటల్ కు రోగి తరపున డబ్బులు కడతాము. మందులు మేము కొనడం కానీ లేదా రోగి కొనుక్కుంటే డబ్బులు ఇవ్వడం కానీ చేస్తాము.

3. పాలనపరమైన ఖర్చులు లేకపోవడం:

మేం ఏ పని మీద వెళ్ళినా ఖర్చులు వలంటీర్లే భరిస్తాం. కన్వేయన్స్ చార్జులు, ఫోను బిల్లులు ఇలాంటి ఖర్చులు ఏవీ ఉండవు. ఎవరు ఎంత పంపినా సరే, మొత్తం ఆయా కేసుల పరంగా ఖర్చు అవుతుందే తప్ప, వాలంటీర్ల ఖర్చులంటూ ఏవీ ఉండవు. ఎవరికి వారు వ్యక్తిగతంగా ఆయా ఖర్చులు భరిస్తాం.

4. కుటుంబం లాగా ఉండడం:

సాధారణంగా సంస్థలు సంస్థల్లాగే ఉంటాయి, సభ్యులు సదస్యులలాగే ఉంటారు. కానీ మేం ఈ గ్రూప్ ని ఓ కుటుంబంలా భావిస్తాం. ఒకే రకమైన అభిప్రాయాలు లేకపోయినా, ఆలోచనా విధానాలు, ఆశయాలు ఒకటే. మా వ్యవహార శైలి అంతా ఆత్మీయంగా ఉంటుంది. ఓ సభ్యుల సమూహంగా కాక, స్నేహితుల కూటమిగానే దీన్ని మేం పరిగణిస్తాం. అలాగే వ్యవహరిస్తాం.

సేవ, ఇతరులకేనా?

నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. అస్మాకు నేను సహాయం చేసానా, అస్మా నాకు సహాయం చేసిందా అని!!

1. నా సమయాన్ని నేను చాలా సద్వినియోగం చేసుకుంటున్నాను. ఒకప్పుడు చాలా వృథాగా గడిపేదాన్ని.

2. ఓ కవిత రాస్తేనో, ఓ పుస్తకం చదివితేనో, ఓ పాట వింటేనో, ఓ సినిమాకెళ్తేనో కలగని ఆనందం నాకు ఈ పనులు చేయడం వల్ల కలుగుతోంది.

3. ఎంతో మంది మంచివారితో నాకు పరిచయం కలిగింది. ఒక్కొక్కరిదీ ఒక్కో తరహా. ఒక్కొక్కరిలో ఒక్కో ప్రత్యేకత. అన్ని వయసుల వారిలోనూ ఉత్సాహం. ఏదో చేయాలనే తపన.
allgroups_1.jpg
4. ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. అనుభవాలు పాఠాలు నేర్పాయి.

5. నాకు నా బ్లడ్ గ్రూపు ఏదో కొన్ని నెలల క్రితం వరకు తెలీదు. భయం. డాక్టర్లన్నా, ఇంజెక్షను అన్నా చాలా భయం. అలాంటిది నేను థలస్సీమియా వ్యాధి గురించి తెలుసుకున్నాక నా బ్లడ్ గ్రూపు చెక్ చేయించుకున్నాను. నేను ఎలాంటి సేవ అయినా చేస్తాను కానీ రక్తదానం మాత్రం చేయను అనుకునేదాన్ని. ఇంజెక్షను అంటేనే భయం. ఇక రక్తదానం అంటే అమ్మో!! కానీ త్వరలో అది కూడా చేయబోతున్నాను.

6. నాకు చిన్నప్పటి నుంచి షిర్డీ బాబాతో మంచి అనుబంధం. ఎప్పుడూ ఏదో ఒకటి తగువులాడుతూ ఉంటాను. అలాంటిది లోకంలో ఉండే బాధలు కొంచెం దగ్గరగా చూడడం మొదలెట్టాక, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. భగవంతుడు మనకు అన్నీ ఇచ్చినందుకు మనం ఎంతగా వినమ్రులమై ఉండాలో, అందుకు ప్రతిగా మన తోటివారికి ఎంతగా సేవ చేయాలో కదా అనిపిస్తుంది.

7. పాశ్చాత్య దేశాల్లో మనం ఎవరి ఇంటికైనా వెళ్ళాలంటే ముందుగా వారి అనుమతి తీసుకోవాలి అని చదివి తెగ విమర్శించుకునేదాన్ని. కానీ ఆ మాటకర్థం నాకు ఇప్పుడు బాగా తెలుస్తోంది. ఎప్పుడూ ఎవరో ఒకరు మా ఇంటికి రావడం, నా పనులు నిలిచిపోవడం, లేదా చేయాలనుకున్నవి చేయలేకపోవడంతో విలువ తెలిసొస్తోంది. ఎవరినీ విమర్శించకూడదు. ఆయా పరిస్థితులు మనకు అనుభవంలోకి వస్తే కానీ అలానే ఎందుకు ప్రవర్తిస్తారో మనకు అర్థం కాదు.

8. మనసుంటే మార్గముంటుంది. అలాగే మనం తీవ్రంగా దేనికోసమైనా తపిస్తే తప్పక దాన్ని మనం సాధించగలం. పరిస్థితులు వాటంతట అవే ఎదురవుతాయి మనం ఏ ప్రయత్నం చేయకపోయినా. ది అల్కెమిస్ట్ లోని ‘వెన్ యు వాంట్ సంథింగ్, ఆల్ ద యూనివర్స్ కన్స్పైర్స్ ఇన్ హెల్పింగ్ యూ టు అచీవ్ ఇట్’. ఇది చాలా నిజం. సమాజానికి ఏదో చేయాలి అనే తపన నాకు చిన్నప్పటి నుంచీ ఉండేది. అనుకోకుండా నేను మొదలెట్టాను. అనుకున్నట్టుగా చేయగలుగుతున్నాను. ఇంకా బాగా చేయాలనే ఉత్సాహాన్ని పొందుతున్నాను.

9. సహజంగా నేను చాలా మూడీ. అలాంటిది ఓ కొత్త వ్యక్తి గ్రూపు గురించి మెయిల్ చేసినా, ఫలానా విధంగా పని చేద్దాం అని చెప్పినా, ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. అన్నీ మరిచిపోయి ఇంకా ఇంకా శ్రమించాలని ఉత్తేజం కలుగుతుంది.

10. అన్నిటికీ మించి వెలకట్టలేనిది, వర్ణించలేనిది, మన సహాయం అందుకున్న వారి మొహంలోని సంతోషం, కృతజ్ఞతాభావం.
allgroups_2.jpg

ఇప్పుడు చెప్పండి. మనం ఇతరులకు సహాయం చేస్తున్నామా, మనకు మనమే సహాయం చేసుకుంటున్నామా?

వెనుకబాటుతనం – లోపం ఎక్కడుంది?

ఎంతో మంది ఎన్నో రకాలుగా ఎన్నో సామాజికాంశాల మీద తరాల తరబడి కృషి చేస్తున్నా ఆశించదగ్గ స్థాయిలో పరిస్థితుల్లో మార్పు ఎందుకు రావడం లేదు?

ఈ ప్రశ్నకు, ప్రత్యేకతే నిబంధనగా పెట్టుకున్న ఈ గ్రూపు సభ్యుల సమాధానమేమిటి, వారు ఏమేమి చేసారు, చేద్దామనుకుంటున్నారు, చేయలేకపోయినవేంటి… ఇవన్నీ ……… వచ్చే వారం తెలుసుకుందాం.

-ప్రశాంతి ఉప్పలపాటి (http://tomakeadifference.net)

“When you want something, all the universe conspires in helping you to achieve it.” అని బలంగా నమ్మే ఉప్పలపాటి ప్రశాంతి To Make A Difference గ్రూపు వ్యవస్థాపకురాలు. ప్రశాంతి తల్లిదండ్రులు విజయలక్ష్మీ, రాం ప్రసాద్. తమ్ముడు శాంతారామ రాధాకృష్ణ. స్వస్థలం నెల్లూరు. ఉద్యోగరీత్యా హైదరాబాదులో నివాసం. ఇన్నోమైండ్స్ సాఫ్ట్ వేర్ లో టెక్నికల్ రైటర్ . మనసు స్పందించినప్పుడు తనకు కలిగే భావాలను రాసుకోవడమన్నా,ఒంటరిగా గడపడమన్నా చాలా ఇష్టం. నెల్లూరంటే మరీ అభిమానం.

ఎం. ఎస్ . సి. కంప్యూటర్ సైన్స్, ఎం . ఏ . ఇంగ్లీషు చదివిన ప్రశాంతి (లేఖిని వాడి) యూనికోడ్ తెలుగులో చేసిన మొట్టమొదటి రచన ఇది. ఇక మీదట తన బ్లాగును (http://prasanthi.wordpress.com/) తరచు అప్ డేట్ చేస్తానంటున్నారు.

About ఉప్పలపాటి ప్రశాంతి

“When you want something, all the universe conspires in helping you to achieve it.” అని బలంగా నమ్మే ఉప్పలపాటి ప్రశాంతి To Make A Difference గ్రూపు వ్యవస్థాపకురాలు. ప్రశాంతి తల్లిదండ్రులు విజయలక్ష్మీ, రాం ప్రసాద్. తమ్ముడు శాంతారామ రాధాకృష్ణ. స్వస్థలం నెల్లూరు. ఉద్యోగరీత్యా హైదరాబాదులో నివాసం. ఇన్నోమైండ్స్ సాఫ్ట్ వేర్ లో టెక్నికల్ రైటర్ . మనసు స్పందించినప్పుడు తనకు కలిగే భావాలను రాసుకోవడమన్నా,ఒంటరిగా గడపడమన్నా చాలా ఇష్టం. నెల్లూరంటే మరీ అభిమానం. ఎం. ఎస్ . సి. కంప్యూటర్ సైన్స్, ఎం.ఏ ఇంగ్లీషు చదివిన ప్రశాంతి, లేఖిని వాడి యూనికోడ్ తెలుగులో చేసిన మొట్టమొదటి రచన ఇది. ఇక మీదట తన బ్లాగును (http://prasanthi.wordpress.com/) తరచు అప్ డేట్ చేస్తానంటున్నారు.
This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

19 Responses to ఏనాడైనా అనుకున్నానా కల్లో ఐనా

  1. Sowmya says:

    Nice article on TMAD.
    ammo! naa photo kudaa unde! janaalu chusi apaartham chesukuntaaru nenedo pani chesestunnaa ani! 🙂
    “journey down the memory lane” – this phrase aptly describes this article.

  2. K.Virabhadra Sastri says:

    In 2003 I first met Prasanthi through net in telugupeople.com. From that day onwards she is one of our lovely grand daughters. I admire her enthusiasm and dedication to serve the needy. Her approach for any kind of help to persons either in serious ailment or helplessness touches our heart and thus we cannot say nay.
    Her articles of any nature make us read till end and thought provoking.
    I wish her brilliant future and nerve and strength to serve the society
    God bless her
    -Thatha garu-

  3. kasyap says:

    పోద్దు వారికి TMAD తరుపున అబినందనలు,
    ప్రశాంతి గారు మన బ్లాగులో చాలా మందికి పరిచయమే!
    వచ్చే వారం కోసం ఎదురు చూస్తూ

  4. చాలా రోజుల క్రితమే మేక్ ఏ డిఫరెన్స్ యాహూ గుంపు చూసినా..చాలా స్వఛ్ఛంద సేవా సంస్థలతో ఉన్న దగ్గరి అనుబంధముతో ఇదీ మరో సంస్థ అనుకున్నా. మీ ఆశయం, ఆలోచన, ఆచరణ బాగున్నాయి..మేక్ ఏ డిఫరెన్స్ బృందానికి, వారిని పరిచయం చేసిన పొద్దు సంపాదకులకు కృతజ్ఞతాభినందనలు.

  5. lalitha says:

    ప్రశాంతి,
    Best wishes to you and to TMAD.

    TMAD కి ప్రాంతీయంగా వాలంటీర్ల అవసరం చాలా ఉంది. ఈ వ్యాసం చదివి స్ఫూర్తి పొందిన వారు వీరితో చేయి కలిపి వారానికో, రెండు వారాలకో రెండు గంటల చొప్పున వీరు చేసే పనులలో స్వయంగా పాలు పంచుకుని ఈ సదాశయానికి చేయూతనివ్వ గలిగితే వీరు / మీరు ఎంతో సాధించగలరు.

  6. prasanthi says:

    సౌమ్య, నువ్వు అవకాశం ఉన్నప్పుడు చేస్తూనే ఉన్నావు కదా. మేడ్ గ్రూపు తరఫునైతే ఏంటి, వ్యక్తిగతంగా ఐతే ఏంటి. చేయాలనే కోరిక, చేసే ఉత్సాహం ఉంటే చాలు.

    తాతగారికి, కశ్యప్ కి, రవి గారికి కృతజ్ణ్జతలు.

    నిజమండి లలిత గారు. వాలంటీర్ల ఆవశ్యకత ఎంతైనా ఉంది. నిజానికి ఈ దిశగా కృషి చేస్తూనే ఉన్నాము. వెబ్ సైటు ఉప్ డేట్ చేయడానికి కానీ, బ్లాగ్ రాయడానికి కానీ కుదరడం లేదు. మేము ఏమి చేయాలనుకుంటున్నాము, ఎలా చేయాలనుకుంటున్నాము వివరంగా తెలిపితే ఇంకా ఎక్కువమంది మాతో చేతులు కలిపే అవకాశం ఉంది. ఇన్ని నెలలు కొన్ని కారణాల వల్ల ఉద్దేశ్యపూర్వకంగానే పబ్లిసైజ్ చేయలేదు.

  7. Sowjanya says:

    Hi Prashanthi,

    This Sowjanya. Hope it’s difficult to remember me. Well, as a quick reference i can tell that i’d given you some inputs on Technical Writing. Did you get me now?
    Anyway, no issues if you don’t still.

    I’ve read this blog for the first time. I really appreciate your desire and hardwork to help the people in need. Keep going and get in touch, if you need my helping hand too.

    Regards,
    Sowjanya Mohan
    Bangalore.

  8. prasanthi says:

    Hi Sowjanya,

    Great to see your comment. How can I forget you, after all? You are instrumental in my decision to take Technical Writing as my career.

    I will mail you.

    Thank you.

    with regards,
    Prasanthi.

  9. Phani Kumar says:

    Hi Prashanthi,

    It’s really wonderful to come to know about “TMAD” through this blog. As of today i know prashanthi as a team member who works in my project. But after reading this blog, i come to know that; prashanthi mobilized great team for “TMAD” who really helps the poor people. My hearty congratulations to “TMAD” people and wish them good luck for future. Prashanti, please keep the same spirit forever. Now i would like to become a team member of “TMAD” :).

  10. radhika says:

    ప్రశాంతి గారూ! మిమ్మల్ని ఇక్కడ చూడడం చాలా ఆనందం గా వుంది. ముందు గా మేడ్ లాంటి సంస్థ గురించి అందరికీ పరిచయం చెయ్యాలని అనుకున్న పొద్దు వారికి అభినందనలు.ఇంతకు ముందు వరకు నేనెవరికన్నా వేరే ఎవరి ద్వారా అన్నా సాయం అందిస్తే అది అసలయిన వాళ్ళకి చేరుతుందా లేదా అన్న ఆలోచన వుండేది. అలా కొద్ది సంశయం తోనే చాలా సంస్థల ద్వారా సహాయం అందించాను. కానీ ప్రసాద్ గారి బ్లాగులో మేడ్ గురించి తెలుసుకున్న తరువాత చాలా నమ్మకం కుదిరింది. ఎందుకు అంటే కారణాలు చాలా వున్నాయి. అందరూ యువకులే. విద్యావంతులే. చాలా మంది వుద్యోగస్తులు. ఏదో చెయ్యాలన్న తపన తప్పించి మరే వుద్దేశం లేనివాళ్ళు. వీరి గురించి తెలుసుకున్నాకా నాకు కూడా చాలా ఉత్సాహం వచ్చింది. నా ఫ్రెండ్స్ కి, తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి ఇలా ఎంత మందికి దీని గురించి చెప్పానో నాకే తెలీదు. ఇప్పుడు నాకు చాలా తృప్తి గా వుంటుంది నేను పంపే రూపాయి అయినా కూడా సరిగా ఖర్చుపెట్టబడుతుందని.

  11. ప్రశాంతి పరిచయం నాకు వీవెన్ ద్వారా కలిగింది.
    ఇందుకు వీవెన్‌కు ఎంతైనా కృతజ్ఞుణ్ణి.
    ఎంతోమందిలా నేనూ ఏదైనా చేద్దామనే తపనే గానీ తీరా చేసిందీ చేసేదీ ఏమీ లేదు. ప్రతి రోజునూ సాధారణంగా గడిపేయడమే. ఒక్క TMAD లో సభ్యుణ్ణయ్యాక ఇతరులకు సహాయపడాలి, సమాజానికి సేవ చేయాలి అన్న ప్రశాంతి తపన చూశాక నిజమైన తపన అంటే అదీ అనిపించింది.

    –ప్రసాద్
    http://blog.charasala.com

  12. ప్రశాంతి గారు,
    మీకు మీ మాడ్ సంస్థకు అభినందనలు. మీరు చేసే కృషి ఎంతో బాగుంది. ఇలాగే కొనసాగి ఎంతో మందికి చేయూతనివ్వాలని కోరుకుంటున్నా.

  13. satyam.g says:

    to day im very happy to know this

  14. nagaraja says:

    వందనాలు.

  15. Chinni says:

    Hi Prasanthi,

    I am very happy to know all these.Great job… I wish you all the best and keep going..we are all there for you.

    Regards
    Chinni

  16. Madhavi Alapaty says:

    Hello Prasanthi garu,
    I felt very happy to see this site today and especially your article. I felt the same way about sending money to people and always wondered whether it will reach to the right people. Now i know that there is a group out there who is working towards this and felt very happy about it. I would like to participate in this journey as much as i can. So please let me know in what way i can help.
    Thanks and have best wishes !!
    Madhavi

  17. Prasanthi says:

    My sincere thanks to Kasyap and Trivikram garu for asking me to write the article. My regards to everyone for your kind comments.

    Madhavi garu,
    Please mail to me: prasanthi.uppalapati@gmail.com

    I will let you know.

    Thank you.

  18. mohanraokotari says:

    very happy to appreciate workship of prasanthi

  19. Srinivasu Neti says:

    Hello Prashanthi garu.,

    మీరు చేస్తున్న ప్రయత్నం చాలా అభినందనీయం.

    Thanks & Best wishes.,

Comments are closed.